గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 28 January 2015

‪#‎నీకిది‬ తెలుసా...? భారతదేశం మన మాతుృభూమి.మనకే కాదండోయ్ ఈ భూమి సాక్షాత్తు భూమిని పుట్టించిన భగవంతుడికి కూడా మాతుృభూమి అయ్యింది,ఈ దేశమంటే భారతీయులకే కాదు భగవంతునికి కూడా ఇష్టమే.

‪#‎నీకిది‬ తెలుసా...?
భారతదేశం మన మాతుృభూమి.మనకే కాదండోయ్ ఈ భూమి సాక్షాత్తు భూమిని పుట్టించిన భగవంతుడికి కూడా మాతుృభూమి అయ్యింది,ఈ దేశమంటే భారతీయులకే కాదు భగవంతునికి కూడా ఇష్టమే. అందుకే ఆయన ఈ భూమి పైనే జన్మ తీసుకున్నాడు. అంతేనా, కొన్ని లక్షలమంది మహానుభావుల్ని, మేధావుల్ని ఈ దేశంలో పుట్టించాడు.
మరి అందరూ మహానుభావులు ఈ దేశంలో పుడితే భగవంతుడు ప్రపంచానికంతా ఏం చేశాడు..? అని అంటారా,? చేశాడు, ఆయన రేఖా గణితంలో పిల్లలు కేంద్రం ఒక చోట వుంచి కోణమానితో వృత్తం గీసినట్లు భారతదేశాన్ని కేంద్రంగా చేసి,ఆధ్యాత్మికతను,విజ్ఞానాన్ని,అందించా

డు. మీరు భలేవారండి..! ప్రపంచానికంతా అంటారేంటి, బ్రిటీష్ వాడువచ్చేవరకు బ్రిటన్ తెలియదు, అమెరిగో విస్పూచి కనిపెట్టేంతవరకు అమెరికా తెలియదు అంటారా.! అయితే మీరు పప్పులో కాలేసినట్లే. క్రింది శ్లోకం చదవండి.
‪#‎మేరోర్హరేశ్చద్వేవర్షే‬ వర్షం హైమవతం తతః
క్రమేణైవ సమాగమ్య భారతం వర్ష మాసదత్,
సదృష్ట్యావివిధాన్ దేశాన్ చీన హుణనిషేవితాన్.(మహాభారతం,శాంతిపర్వ,మోక్షధర్మం)
‪#‎పైశ్లోకంలో‬:: ఒకప్పుడు వ్యాసుడు తన పుత్రుడు శుకుడితో,శిష్యులతో పాతాళమున(అమెరికా)నివసించుచుండిరి.అప్పుడు శుకాచార్యుడు తన తండ్రిని "తండ్రి"! ఆత్మ విద్య ఇంతేనా,ఇంకనూ ఉన్నదా!" .అని అడిగెను. వ్యాసుడు ఆప్రశ్నకు సమాధానమీయలేదు. ఎందుకంటే అంతకముందే ఆయన చెప్పి ఉండెను.ఓ కుమారా.! నీవు మిథిలాపురానికి వెళ్ళి ఈ ప్రశ్ననే "జనకుడి"నడుగుము.అని చెప్పెని. తండ్రి మాటను విని శుకుడు పాతాళము(అమెరికా) నుండి బయలుదేరెను.(మేరువుకు) హిమాలయమునకు ఈశాన్య,ఉత్తర, వాయువ్య దిశలందున్న దేశాలకు హరివర్షమని పేరుండెను.అవి నేడు "యూరప్" అని పిలవపడుచున్నవి.శుకుడు ఆదేశములు జూచుచూ (హుణ,) "చైనా" యాహుదు దేశములను కూడా దాటి మిథిలాపురి చేరెను.
ఇంకాచూడండి పాండురాజు పత్ని మాద్రి "ఈరాన్" దేశరాకుమారి. గాంధారి "కాందహార్" ఆఫ్ఘనిస్తాన్ కు చెందినది.ధర్మరాజు చేసిన రాజ సూయ యాగమునకు చైనా దేశపు 'రాజు భగదత్తుడు,అమెరికారాజు బభ్రువాహనుడు,'ఐరోపా' దేశపు రాజు బిడలాక్షుడు,'గ్రీకు' దేశపురాజు యవనుడు,ఈరాన్ కు చెందిన శల్యుడు వచ్చిరి. అంటే నేటికి సుమారు 5,000 సంవత్సరాల క్రితమే అమెరికా,యూరోపు ,సౌత్ఆఫ్రికా (శంఖద్వీపం)వంటి అన్ని ఖండాలలో హిందూ (భారతీయ) సంస్కృతి ఉండేదని మనకు అర్థం అవుతోంది. (ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ సంస్కృతి గురించి మరిన్ని వివరాల కోసం "విశ్వమంతా వ్యాపించిన భారతీయ సంస్కృతి" అన్న శ్రీరాం సాఠే గారి పుస్తకం చూడండి.). ఇలా భారతదేశం నుంచీ ఆధ్యాత్మికత విశ్వవ్యాప్తం అయ్యింది. ఈ క్రమంలో భారతదేశంతో 'యేసు'కు ఉన్న ఆధ్యాత్మికత సంబంధం కూడా చాలా అధ్బుతమైనది. యేసుకు పూర్వం పశ్చిమాసియా అంతటా భారతీయ సాంప్రదాయాలు ఉండేవి. నూతన సం|| మార్చి ఏప్రిల్ లలో మొదలయ్యేదని, బైబిల్ పాతనిబంధనలోని "ఎజ్రా పుస్తకం ద్వారా తెలుస్తుంది. అలాగే 'యేసు' పెరిగి తన 13 సం|| వయసులో భారతదేశం వచ్చాడనీ కాశ్మీర్ లో యోగుల వద్ద యోగ విధ్య అభ్యసించాడనీ, గౌతమ బుద్దుడి భోదనలపట్ల ,శ్రీ కృష్ణుడు చెప్పిన "భగవద్గీత" పట్ల అమితంగా ఆకర్షితుడయ్యాడనీ ,భారతదేశంలోని పలు పుణ్యక్షేత్రాలు దర్శించాడని,అమెరికాకు చెందిన "బార్బరా థియరింగ్" తన ' జీసస్ ది మ్యాన్ ' అన్న పరిశోధాత్మక గ్రంధంలో తెలిపింది. ఈ పరిశోధనకు మెచ్చి అమెరికన్ ప్రభుత్వం ఆమెకు డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఇదే విషయాన్ని"ది హిడెన్ లైఫ్ ఆఫ్ జీసస్" గ్రంధంలో రష్యాకు చెందిన అలగ్జాండర్ నోటోవిచ్ కూడా 1890 లలోనే పేర్కొన్నాడు. అలా భారతదేశంలో ఆధ్యాత్మిక విధ్య ను అభ్యసించిన 'యేసు' తిరిగి తన దేశంకు పయనమయ్యాడు. అక్కడ తన దేశంలో ఈ ఆధ్యాత్మిక విధ్యను వారికర్థమయ్యేలా ఉపమానాలతో భోధించడం మొదలుపెట్టాడు.ఆయన భోధించడం మొదలు పెట్టే నాటికి ఆయన వయస్సు సుమారు 32 ||సంవత్సరాలు ఉండవచ్చు-- (‪#‎లూకా‬ 3;23). అందుకే మొత్తం బైబిల్ గ్రంధంలోనే యేసు 12సం|| లనుండి 32||సం వరకు ఏం చేసినది, ఎక్కడున్నది, ఎలా గడిపినది వంటి వివరాలు మనకు లభ్యం కావట్లేదని బార్బరా థియరింగ్ పేర్కొంది. అంతటితో ఇది ముగిసిపోలేదు. ఆ తర్వాత మళ్ళీ యేసు భారతదేశానికి వచ్చి ,తన చరమాంకమంతా భారతదేశంలోనే గడిపి,తన 80 సం|| వయసులో కాశ్మీరులోనే,ఈ పుణ్యభూమిలోనే,ఈ ఆధ్యాత్మక భూమిలోనే తనువు చాలించాడు. ఈ విషయం పట్ల యేసుకు భారతదేశం పట్ల ఎంత ప్రేమ ఉందీ అన్నది తెలుస్తుంది. ఆ యేసు తనువు చాలించిన ప్రదేశము, అతని సమాధి నేటికీ మనకందరికీ " శ్రీనగర్" లో దర్శనీయమే. ఆశ్చర్యపోతున్నారా!..? అసలు యేసు భారతదేశానికి రావటమేంటి.? అని మేము ఆశ్చర్యపోతుంటే ,ఆయన శ్రీనగర్ లో చనిపోయాడు, అతని సమాధి ఇక్కడే ఉందని "షాక్ "ఇస్తారేంటి అని అనుకుంటున్నారా..? ఆయన శిలువపై మరణించాడు కదా..! ఆ తర్వాత 3వ రోజు బ్రతికి,శరీరంతో కూడా ఆకాశంలో దేవుడి వద్దకు వెళ్ళాడు కదా,అంటున్నారా,.! అయితే ఇది చదవండి. యేసు భారతదేశం ఎలా వచ్చాడో,ఎలా ఇక్కడ చచ్చాడో ఇక్కడ చదవండి. చాలా ఆశ్చర్యం గొలిపే యేసు మరణం గురించి బైబిల్ గ్రంధం ఇలా తెలుపుతోంది.. అప్పటికే యేసును,మరో ఇద్దరినీ శిలువ వేసిరి...
మధ్యాహ్నం 3గం||లకు యేసు ప్రాణం విడిచాడు.(మార్కు 15: 33-34) సాయంత్రం అనగా అరిమతయ గ్రామస్థుడు యేసేపు ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని అడిగాడు. యేసు అప్పుడే చచ్చిపోయాడా అని పిలాతు ఆశ్చర్యపోయినాడు.(మార్కు 15-42-45).
"ఆదినము సిద్దపరుచు దినము: మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక ఆదేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండుకుండునట్లు వారి కాళ్ళు విరగ్గొట్టించి వారిని తీసి వేయించుమని యూదులు పిలాతిని అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను,రెండవ వాని కాళ్ళను విరుగగొట్టిరి.వారు యేసు వద్దకు వచ్చి అంతకముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు గానీ సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను.వెంటనే రక్తము,నీళ్ళును కారెను.ఇది చూచినవాడు సాక్షమిచ్చుచున్నాడు.అతని సాక్షము సత్యమే.మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయనెరుగుదును.-(యోహాను 19:31-36).
అటు తర్వాత ఆయన మృతి పొందినాడని,ఆయన దేహము యేసేపునకు శిష్యులకు,బంధువులకు,అప్పగించిరి.వారు ఆయనను సమాధి చేసి,దానిపై నొక బండరాయిని ఉంచి.రాత్రి ఇళ్ళకు వెళ్ళిరి.మరుసటి దినము మగ్ధలిన,మరియ,యాకోబు తల్లి,సలోమే వచ్చి చూడగా సమాధి తెరువబడి,అందులోని యేసు దేహము లేకుండెను.ఆ తర్వాత 3వ రోజు ఆయన తిరిగి బ్రతికి కనిపించుట అఐదరికీ తెలిసిన విషయమే.
మరి ఇంత విషాదంగా ఆయన మరణం గురించి,ఆయన పునరుద్దానం,స్వర్గారోహణం గురించి బైబిల్ చెబుతుంటే మళ్ళీ ఆయన కాశ్మీరులో చావటమేమిటి.?అంటారా.? చూడండి యోహాన్ సువార్త 19:31-36 చదివితే అందులో చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే ఒక విషయం ఉంది.అదేమిటంటే "యేసు అప్పటికే మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టక, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను.అప్పుడు "రక్తము,నీళ్ళునూ కారినవి".అని ఉంది.
చూశారా.! ఇప్పుడు మీక్కూడా తెలిసిపోయిందికదా.!అవును అదే.!"నిజంగా యేసు చనిపోయి ఉంటే ,చనిపోయిన యేసుకు రక్తం ఎలా కారుతుంది".? "ఆశ్చర్యంగా ఉందా.! వైద్య శాస్త్రం ఏం చెబుతోందంటే,ఏ ప్రాణికైనా చనిపోగానే శరీరంలో ఉష్ణోగ్రత పడిపోయి ,శరీరం చల్లబడి,రక్తం గడ్డకడుతుంది.అప్పుడు ప్రాణిని పొడిచినా,నరికినా రక్తం కారదు.మనం కోడి ,మేక వంటి వాటిని కసాయివాడు చంపినప్పుడు కూడా చూసే ఉంటాము.అది చచ్చిపోయాక దాని శరీరాన్ని వాడు ముక్కలుగా కోసినా రక్తం కారదు కదా.! కాబట్టి వైద్యశాస్రం ప్రకారం జీసస్ మరణించలేదని ఆయన మరణించి ఉంటే ఆయన శరీరం నుంచి రక్తం రాదని,కానీ ఆయన ఆ సమయానికి అపస్మారక స్థితిలో ఉండటం వల్ల పొడిచినా ఆయనకి నొప్పి తెలియలేదని ఫ్రొఫెసర్ బార్బరాథియరింగ్ తన పుస్తకంలో తెలిపింది.
ఆ తరువాత ఆయన నిజంగా మరణించాడనుకొని సైనికులు యేసు శరీరాన్ని ఆయన బంధువులకు,శిష్యులకు అప్పగించారు.దగ్గరగా పరిశీలించిన ఆయన శిష్యులు ఆయన ఇంకా బ్రతికి ఉండటం చూచి,ఆయన శరీరంపైన గాయాలకు సుగంధ,ఆయుర్వేద లేపనాలు, పూసి ఎవరికీ అనుమానం రాకుండా సమాధి నందు ఉంచారు.దానిపై ఒక పెద్ద బండనుంచారు.తరువాత రాత్రి సమయంలో మళ్ళీ శిష్యులు వచ్చి ఆబండను తొలగించి,యేసును సమాధి నుంచి వెలుపలికి తెచ్చి,రహస్య ప్రదేశంలో ఉంచి ,వైద్యం చేయించారు .(ఈ విషయాలు జీసస్ ది మ్యాన్ పుస్తకంలోచాలా వివరంగా సాక్ష్యాలతో ఇవ్వబడ్డాయి.)
ఆతర్వాత కొద్దిగా కోలుకున్న యేసు తిరిగి తన (అపోస్తులులతో) శిష్యులతో సమావేశాలు జరిపాడు. దీనినే బైబిలు నందు పునరుద్దానం అని చెప్పారు. ఆ తర్వాత అపోస్తులుల అభ్యర్థనల మేరకు యేసు తన ప్రాణానికి ముప్పు ఉన్నందువలన మరికొందరితో కలిసి ఆ దేశాన్ని వదిలి భారత దేశానికి వెళ్ళినాడని "బార్బరా థియరింగ్" తన పరిశోధనలో తెలిపారు.
ఓ.కే ఇంతవరకు బాగానే ఉంది.యేసు మన పాపాల నిమిత్తం శిలువపై మరణించలేదు అని సువార్తలోని సాక్షమే ఋజువు చేస్తుంది. గనుక ఒప్పుకుంటాము.మరి ఆయన భారతదేశం వచ్చాడనీ,ఇక్కడ శేష జీవితం గడిపాడని,మరి శ్రీనగర్ లో ఉన్నది వారి సమాధేనని ఎలా నమ్మేది..?అంటారా! అందుకు సాక్ష్యము ఉంది.అవును అందుకు బలమైన సాక్ష్యమే మన "భవిష్యపురాణం" ప్రక్షిప్తమో ,క్షిప్తమో గానీ,కలియుగ ఆరంభం నుంచి భారతదేశానికి సంబంధించిన ప్రతి సంఘటన "భవిష్యపురాణము లో ఇవ్వబడింది.
భవిష్యపురాణంలో కలి పురుషుడు యజ్ఞం చేసి మహా విష్ణువు వరంతో పశ్చిమాశియాలో ఆదాముడు,హవ్యవతులను(ఆదాము,హవ్వ) పుట్టించటం.
(చాలా మంది సృష్ఠి మొదలైంది ఆదాము,హవ్వలతోనే వారు ఒక పండు తినటంతోనే అనుకుంటారు.కానీ ఆదాము,హవ్వలు పశ్చిమాశియాలో పుట్టక ముందే తూర్పు దేశాలలో అంటే భారతదేశంలో మనుష్యులు ఉన్నారు.అందుకు సాక్ష్యము బైబిల్ లోని ఈ క్రింది దేవుని వాక్యము చూడండి.
"అప్పుడు కయూను యోహోవా సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు. ఏదేనుకు తూర్పున ఉన్న నోదు దేశంలో కయూను నివసించాడు.కయూను తన భార్యతో కలిసినప్పుడు గర్భవతియై హనోకు అన్న కుమారుని కన్నది".-(ఆది కాండము 4:16-17).
(అప్పటికే దేవుడు సృష్టించిన మానవులు కేవలం ఇద్దరు,ఆదాము,హవ్వ వారికి కలిగిన సంతానము ఇద్దరు ,హేబేలు,కయూను,వారిలో కయూను, హేబేలును అసూయతో చంపాడు.అంటే ఇక మిగిలింది ముగ్గురు.కానీ పై సువార్త ప్రకారం కయూను తూర్పున ఉన్న నోదు దేశానికి వెళ్ళాడు. కేవలం భూమి మీద ముగ్గురే ఉంటే మళ్ళీ ఈ దేశమెక్కడిది.?అలాగే "కయూను తన భార్యతో కలవగా హనోకు పుట్టెను."ఉన్నది ముగ్గురే అయితే ఈ భార్య ఎక్కడిది.?" కనుక ఈ ముగ్గురు పుట్టుక మునుపే తూర్పున ఇంకా దేశాలు,ప్రజలు ఉన్నట్లు తెలియుచున్నది.).
ఆదాము ,హవ్వల పుట్టుక,మోషే పుట్టుక,ఏసు పుట్టుక,జీవనం .భారతదేశంపై ముస్లింల దండయాత్రలు,బ్రిటీష్ దండయాత్రలు,అక్బర్,ఔరంగజేబు,వంటి వారి గురించి, శివాజీ గురించి, ఆఖరుకు ఆంగ్ల భాష గురించి కూడా భవిష్యపురాణంలో వివరంగా వర్ణించబడింది.
భవిష్యపురాణంలో "యేసు హిమాలయాలలో ధ్యానం చేస్తుండగా శాలివాహనుడు శకులను తరిమివేసి వస్తూ (యేసు,శాలివాహన చక్రవర్తి సమకాలీకులు) ఆయనను చూచి ఓ మహానుభావా ! మీరెవరు, మీరు మా దేశస్థుడిలా లేరు?మీ గురించి తెలపండి అని అడుగగా .సమాధానంగా యేసు,
"ఈశపుత్రంచమాంవిద్ధి
కుమారీ గర్భ సంభవం
మ్లేశ్ఛదర్మస్యవక్తారం
మసీహుహం సమాగతః
ప్రతి సర్గ-3 వ ఖండం- 2వ ఆధ్యాయం 23-24) .నేను ఈశపుత్రుడను,కన్య గర్భాన జన్మించాను,మసీహ్(మెస్సయ్య)అని నన్ను పిలుస్తారు అని సమాధానం చెప్పాడు.
ఇంకా నేను ప్రవక్తను ,మసీహుగా పిలువబడ్డాను.మా ధర్మ లక్షణం ఇలా ఉంటుంది.శరీరం మలినంగా ఉన్నాసరే మనసు నిర్మలంగా ఉంటే చాలు.ఇలా శుభ,అశుభ సమన్వితమైనది మా ధర్మం.మనసును ఏకాగ్రం చేసి ఆకాశంలో వెలిగే సూర్యభగవానునిపై మనసు పెట్టి పరిపూర్ణమయిన శరణాగతి చేసి ఆయనను.నమ్మితే చేసిన చెడు కర్మలన్నీ నశించి,మనిషి ఉత్తమగతిని పొందుతాడు.సూర్యుడే దివిలో వెలిగే మాతండ్రి ,ఆయనను చేరుటమే మా లక్ష్యం.ఇదే మా ధర్మం అని చెప్పాడు.25-31 శ్లోకాలు
. ఇలాంటి సంభాషణలు ,వివరాలు మన భవిష్యపురాణంలో ఉన్నాయి.ఇవి ఎవరో స్వార్థపరులు మన భవిష్యపురాణంలో కేవలం యేసు గురించి మాత్రమే రికార్డు చేసినవి కావు.కలియుగారంభం నుంచీ చీమ చిటుక్కుమన్న ,భవిష్యపురాణంలో తెలుపబడింది.ఇంతకంటే సాక్ష్యం కావాలా యేసు తన శేష జీవితం భారతదేశంలో గడిపాడని చెప్పడానికి.? అలా ఈ దేశంలో స్థిరపడిన యేసు ,ఇక్కడే తనువు చాలించాడు. ఆయన సమాధి ప్రక్కనే ఆయన పాదాలు మొలచబడి ఉన్నాయి.ఆ పాదాలపై శిలువ వేసినపుడు చీలలు కొట్టిన గుంతలు గుర్తులు కూడా మొలచబడ్డాయి.అలాగే ఆయన సమాధిపై హబ్రూ భాషలోని లిపి ఉంది. భారతీయుడా! నీ దేశం చాలా గొప్పది.నీ ధర్మం అత్యున్నతమైనది.ప్రపంచంలోని అన్ని ఇతరమతాలు ఒక నిర్ణీత సమయంలో,నిర్ణీత వ్యక్తులపై ఆధారపడి పుట్టాయని సాక్ష్యం ఉంది.కానీ నీ హిందూ ధర్మం భూమి పుట్టినప్పుడే పుట్టింది.నీ వయిన వేదాలు ప్రపంచానికే వెలుగునిచ్చాయి,బ్రతకటం నేర్పాయి.
బైబిల్ నందు యోహోవా "తాను కేవలం ఇజ్రాయిలీ ప్రజల దేవుడను" అని చెప్పుకున్నాడు.ఎక్కడా ఆయన తాను ప్రపంచ ప్రజలకు ముఖ్యంగా భారతీయులకు దేవుడనని చెప్పలేదు.ఆయన ఇజ్రాయిలీలను మాత్రమే ప్రేమించాడు.వారికోసం ఈజిప్ట్ వంటి ఇతర దేశాల,జాతులను ప్రజలను శిక్షించాడు.(చూడండి నిర్గమ కాండం.)
అలాగే యేసు కూడా "తప్పిపోయిన ఇజ్రాయిలీ ప్రజల కోసం మాత్రమే దేవుడు నన్ను పంపాడు".అని స్వయంగా చెప్పాడు.(మత్త 15:24) అంతేకాక ఆయన తన భోధనలు కేవలం ఇజ్రాయిలీలకే చెప్పమని,ఇతర దేశాలలో ప్రవేశించవద్దని కూడా స్వయంగా చెప్పాడు.(మత్త 10:5-6) అంటే వీరిరువురూ ఇజ్రయిలీ ప్రజలకే రక్షకులని తామే చెప్పుకున్నారు కానీ,
మన వేదాలలో ,ఇతిహాసాలలో,పురాణాలలో,భాగవతంలో,శ్రీమన్నారయణుడు అయిన శ్రీకృష్ణుడే ఈ సకల చరాచర సృష్టికి మూల కారణమని,పద్నాలుగు భువన భాండములు,అన్ని దేవతలు,ఆయన నుంచే పుట్టాయని,చీమ నుంచీ బ్రహ్మ వరకూ అన్ని ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తాయనీ,ప్రాణులన్నింటికీ,తండ్రి,పోషకుడు,రక్షకుడు శ్రీకృష్ణుడే అని తెలుపుతున్నాయి. శ్రీ కృష్ణుడు కేవలం ఒక దేశానికి,ఒక జాతికి చెందిన దేవుడు కాదు.ప్రపంచాని కంతా దేవుడు. నిజంగా నీ కష్టాలు తీర్చేవాడే శ్రీ కృష్ణుడే.కన్న తండ్రి తన బాగోగులు చూసినంతగా పినతండ్రి చూడలేడు. కబ మన కన్న తండ్రి శ్రీకృష్ణుడే కనుక నీ కన్న తండ్రి ని ఎన్నడూ మరచిపోకు., ఎప్పుడూ మార్చుకోకు. ఇజ్రాయిలీల దేవుడు నీ కన్నతండ్రి కాలేడు. మన పాపాల నిమిత్తం యేసు శిలువపై చనిపోలేదు,బైబిల్ నందలి యోహాన్ సువార్త(19:31-36) తెలుపుతోంది.కనుక విశ్వసించిన నీ పాపాలు పోతాయన్నది అబద్దం. అయినా నేను అన్నం తింటే నీకు కడుపు నిండదు.అలాగే నీ పాపానికి వేరొకరు శిక్ష అనుభవించలేరు.ఇది ప్రకృతి విరుధ్ధం,దైవ విరుద్ధం.
"ఉద్ధరేత్మానాత్మానం-ఆత్మానమవసాదయేత్"-భగవద్గీత. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి.నిన్ను అధోగతి పాలు చేసుకోరాదు.అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పిఉన్నాడు. కనుక కృష్ణభక్తి కలిగి కృష్ణ చైతన్య మార్గంలో జీవించు.
అలాగే ప్రార్థనలు జరిపినంత మాత్రానే రోగాలు పోతాయి అనేది నిజమే అయితే ప్రపంచంలో క్రైస్తవులకు ఆసుపత్రులెందుకు.? క్రైస్తవులు ఆసుపత్రులకు పోవటెమెందుకు.?
యేసును విశ్వశించిన వారు."తమ చేతులతో పాములు పట్టుకోగల్గుతారు.వారు విషం త్రాగినా వారికే హాని కలగదు.అని చెప్పాడు (మార్కు 16:18) ప్రియ సోదరుడా! మరి యేసును విశ్వసించినవారినందరిని విషం త్రాగి కూడా డాక్టరు వద్దకు వెళ్ళకుండా నీ ముందు నిలబడమని అడిగి చూడు.! ఏమవుతుందో అలా చేయడానికి ఏ విశ్వాసి కూడా ముందుకు రాడు.ఎందుకంటే అది ప్రకృతి విరుద్ధం.
"జాతస్యహి ధృవోమృత్యుః"-భగవద్గీత. జన్మించిన వాడికి మరణము తప్పదు.
పూర్వజన్మనందలి నీ పనులే నేటి ఈ జన్మలో నీ భాధలకు,కష్టాలకు,రోగాలకు,కారణం.కనుక ఈ జన్మలో,రేపటి జన్మలో నీవు సుఖంగా బ్రతకాలంటే నీతి, నిజాయితీలతో మంచిగా బ్రతుకు. జన్మ,వ్యాధి,ముసలి తనము,మరణం,వీటి నుండి దేవేంద్రుడయినా తప్పించుకోలేడు. అయితే శ్రీ కృష్ణుడు తన గీతావాణిలో దేవాదిదేవుడను,సర్వలోకరక్షకుడను,శ్రీ కృష్ణుడను అయిన నన్ను అనన్య భక్తితో పూజించేవారి యోగక్షేమములను నేనే చూసుకుంటాను అని చెప్పాడు.(భగవద్గీత 9ఆ-22).
యోగము అంటే అప్రాప్యవస్తు ప్రాప్తి.క్షేమము అంటే వారి రక్షణము కనుక శ్రీకృష్ణుడికి శరణాగతులయిన వారి యోగ క్షేమములు ఆయనే చూసుకుంటాడు.
ఇంకా "లోకంలో అల్ప బుద్ధిగల ప్రజలు ఇతర దేవుళ్ళను ఆరాధించినా,నిజానికి ఆ దేవుళ్ళ రూపంలో వారి కోరికలు తీర్చునది నేనే"-(భగవద్గీత 7ఆ-22శ్లో||)అని కూడా శ్రీకృష్ణుడే చెప్పాడు.
భాగవతంలో వ్యాసుడు "కృతయుగంలో ప్రజలు తపస్సులు చేసేవారు.త్రేతా యుగంలో యజ్ఞాలు చేసేవారు.ద్వాపరయుగంలో పరిచర్యలు చేసేవారు.మరి కలియుగంలో ప్రజలు తరించుటకు గల ఏకైక మార్గం "హరి నామ సంకీర్తనమే"అని తెలిపారు. కనుక ప్రతిరోజూ 108 సార్లు జపించండి.
""హరేకృష్ణ హరేకృష్ణ హరేహరే.!హరేరామ హరేరామ రామరామ హరేహరే.!!
ప్రతిరోజు భగవన్నామ జపం చేయండి.-మీ జీవితంలో మార్పు చూడండి.
ఆదాము,హవ్వలు కూడా శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేసినట్లు భవిష్య పురాణం చెబుతోంది.
కనుక భారతీయులారా.!ప్రతిరోజు హరినామ జపం చేయండి,కలిమాయ నుండి,కష్టాల నుండీ బయటపడి,సుఖంగా ఉండండి. -లోకాసమస్తాసుఖినోభవంతు "హిందువునని గర్వించు హిందువుగా జీవించు."
గమనిక::- బైబిల్ నుంచీ ఉదహరించబడ్డ వ్యాక్యలేవి స్వంత వ్యాక్యలు కావు. అన్నింటికీ సువార్త నెంబర్లు ఇవ్వబడ్డాయి. దారి తప్పిన క్రైస్తవ సోదరులు గమనించగలరు.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML