గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 19 January 2015

మహా మృత్యుంజయ మంత్రం ఫలితం ..మహా మృత్యుంజయ మంత్రం ఫలితం .......జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆపద సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. ఏ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకువస్తుందో ఊహించలేం. అలాగే హఠాత్తుగా ఏ వ్యాధి ఎప్పుడు ఈ శరీరంపై దాడిచేస్తుందో తెలియదు. ఆ వ్యాధి జీవుడిని ఈ లోకం నుంచి వెంటనే తీసుకువెళుతుందో, లేదంటే జీవించినంత కాలం బాధపెడుతుందో కూడా తెలియదు.

ఇలా అనుకోకుండా తరుముకొచ్చే ప్రమాదకరమైన సంఘటనల బారి నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదని నిరాశా నిస్పృహలకు లోనవ్వడం జరుగుతూ వుంటుంది. అయితే ఎలాంటి దుర్ఘటనల బారిన పడకుండా అనుక్షణం రక్షిస్తూ ఉండేదిగా 'మహా మృత్యుంజయ మంత్రం' చెప్పబడుతోంది. మహా మృత్యుంజయ మంత్రం అసమానమైనది. ఈ మంత్ర ప్రభావం దుర్ఘటనలకు దూరంగా ఉండేలా చేస్తూ సదా రక్షిస్తూ వుంటుంది.

'' ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్. ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్'' అంటూ ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ వుండటం వలన ప్రాణహాని కలిగించే వివిధ రకాల ప్రమాదాల నుంచి, వ్యాధుల బారి నుంచి రక్షణ లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ప్రతి రోజు ఉదయాన్నే పూజా సమయంలో ఈ మంత్రాన్ని పఠించడాన్ని ఒక నియమంగా పెట్టుకోవాలి. అనునిత్యం ఈ మంత్రాన్ని పఠిస్తూ వుండటం వలన, అది ఒక రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటుందని స్పష్టం చేయబడుతోంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML