గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 3 January 2015

వేగంగా బరువు తగ్గించే వెజిటబుల్స్బరువు తగ్గించుకోవడం కోసం క్రాష్ డైట్ లేదా మోనో డైట్ చేయడం అంత మంచి పరిష్కార మార్గం కాదు. ఖచ్చితంగా బరువు తగ్గాలని నిర్ణయించుకొన్నవారు, సరైన ఆహారాలు తీసుకోవడం వల్ల అవి శరీరానికి కావల్సిన శక్తిని అందివ్వడంతో పాటు, శరీరంలో చేరిన అదనపు కొవ్వును కరిగించే విధంగా సహాయపడాలి. బరువు తగ్గాలనుకొనేవారు తక్కువ క్యాలరీలు, అదే విధంగా తక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. శరీరంలో అదనపు కొవ్వును కరిగించే ఆహారాలు వివిధ రకాలున్నాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు, శరీరం మంచి ఒక ఆకృతిని పొందవచ్చు.
అటువంటి స్లిమ్ బాడీ పొందాలంటే, సిట్రస్ పండ్లు, నిమ్మ, బెర్రీస్ వంటివి బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. అదే విధంగా కొన్ని రకాల వెజిటేబుల్స్ కూడా బరువు తగ్గించడంలో సహాయపడుతాయి. ఉదాహరణకు : కీరదోసకాయ వంటివి రెగ్యులర్ డైట్ లో ఉండాల్సినటువంటి ఒక వెయిట్ లాస్ వెజిటేబుల్. కీరదోసలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గించడానికి ఒక హెల్తీ వెజిటేబుల్. బెల్ పెప్పర్ కూడా బరువు తగ్గిస్తుంది. ఎల్లో, రెడ్ మరియు గ్రీన్ బెల్ పెప్పర్ లేదా క్యాప్సికమ్ లు జీవక్రియలు చురుకుగా పనిచేసి, క్యాలరీలను తగ్గిస్తుంది. ఇంకా శరీరంలో కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తాయి. ఇంకా గ్రీన్ వెజిటేబుల్స్ బీన్స్, ఆకుకూరలు, మరియు బ్రొకోలీ వంటివి అదనపు పౌండ్ల బరువును తగ్గించేస్తాయి. కాబట్టి, నేచురల్ గా మీ బరువు తగ్గించే కొన్ని రకాల వెజిటేబుల్స్ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడంతో పాటు, రెగ్యులర్ వర్కౌట్స్ చేస్తే తప్పనిసరిగా బరువు తగ్గుతారు. వ్యాయామం వేగంగా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.

కాకరకాయ: కాకరకాయలో చేదు కలిగిన వెజిటేబుల్స్ లో ఇది ఒకటి. కాకరకాయ రసం లేదా కాకరకాయ బ్లడ్ షుగర్ లెవల్స్ మరియు ఇన్సులిన్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడంతో పాటు, బరువు కూడా తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది.

కీరదోసకాయ: కీరదోసలో నీటి నీరు 90శాతం ఉంటుంది. చాలా తక్కువ క్యాలరీలుంటాయి. ఈ జ్యూసీ వెజిటేబుల్ బరువు తగ్గాలనే డైటర్స్ కు ఒక బెస్ట్ వెజిటేబుల్.

ఆకుకూరలు: గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ను వైయిట్ లాస్ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాల్సినటువంటి ఒక సూపర్ ఫుడ్. ఆకుకూరలతో వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి . ఇవి చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గడానికి ఇది ఫర్ ఫెక్ట్ వెజిటేబుల్.

సొరకాయ: సొరకాయలో ఫైబర్ కంటెంట్ మరియు నీరు అధికంగా ఉంటుంది. ఇది ఆకలి కోరికలను తగ్గిస్తుంది. కాబట్టి, మీ దినచర్యను బాటిగార్డ్(సొరకాయ)జ్యూస్ తో ప్రారంభించండి. జ్యూస్ చేసిన తర్వాత వడగట్ట కుండా అలాగే తీసుకోవడం వల్ల మీకు అవసరం అయ్యే ఫైబర్ అందుతుంది. క్యాలరీలు తగ్గించడంలో ఫైబర్ అద్భుతంగా సహాయపడుతుంది.

బ్రొకోలీ: ఇది మరొక గ్రీన్ వెజిటేబుల్. ఇది బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. దీన్ని ఉడికించి లేదా ఆవిరి పట్టించి తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువ న్యూట్రీషియన్స్ అందుతాయి. దాంతో ఎక్కువ ప్రయోజనం.

గ్రీన్ బీన్స్: గ్రీన్ బీన్స్ లో ఎక్కువ విటమిన్లు మరియు ఫైబర్ కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి బరువు తగ్గడానికి బాగా సహాయపడుతాయి. గ్రీన్ బీన్స్ లోని యాంటీఆక్సిడెంట్స్ బరువు తగ్గించడంలో సహాయపడుతాయి.

బెల్ పెప్పర్ లేదా క్యాప్సికమ్: ఇది ఒక ఫ్యాట్ బర్నింగ్ వెజిటేబుల్. ఇదుంలో యాంటీఆక్సిడెంట్ మరియు విటమిన్లు ఉన్నాయి. ఇవి బరువు తగ్గాలనుకొనే వారికి చాలా అవసరం అవుతాయి.

ఉల్లిపాయ: నమ్మలేకపోతున్నారు కదూ? కళ్ళలో నీళ్ళు పెట్టించే ఈ ఉల్లిపాయ, బరువు తగ్గించడానికి సహాయపడుతుందంటే ఆశ్చర్యమే . బరువు తగ్గించడంతో పాటు బ్లడ్ ప్రెజర్, చెడు కొలెస్ట్రాల్, ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

క్యాబేజ్: ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్లో ఫైబర్ మరియు నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది పొట్టను నిండుగా ఉంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

క్యారెట్: క్యారెట్ లో విటమిన్ ఎ, సి మరియు కె, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీర ఆరోగ్యానికి మరియు చర్మ ఆరోగ్యానికి ఒక హెల్తీ వెజిటేబుల్.

సెలరీ: సెలరీని వెయింట్ లాస్ డైట్ లో చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్ మరియు నీటికంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నింపుతుంది మరియు కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తుంది.

టమోటో: టమోటోలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది బరువు తగ్గించడంలో, చెడు కొలెస్ట్రాలన్ ను కరిగించడంలో, బౌల్ ను శుభ్రం చేయడంలో మరియు చర్మసంరక్షణకు గొప్పగా సహాయపడుతుంది.

సేకరణ: వన్ ఇండియా

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML