భద్ర, శ్రీ, లౌహ, భాండీర, మహా,తాళ,ఖదిరికాః
బహుళ, కుముదం ,కామ్యం, మధు, బృందావనం తధా
ద్వాదశైతాన్యరణ్యాని కాళింద్యాః సప్తపశ్చిమే
పూర్వే పంచవనం ప్రోక్తం తత్రాస్తి సహ్యముత్తమం
( పద్మ పురాణం )
యమునానదికి పశ్చిమంగా మధువనం, తాళవనం, కుముదవనం, బహుళవనం,కామ్య వనం, ఖదిరవనం, బృదావనం (ఏడువనాలు) విలసిల్లుతున్నాయి. భద్రవనం, భండీర వనం, బిల్వ( శ్రీ వనం), లౌహవనం, మహా వనం అనే ఐదు వనాలు యమునకు తూర్పున ఉన్నాయి.
కృష్ణావతారానికి చాలా పూర్వమే ఇవి విష్ణువుని విభుతితో కూడిన మోక్షక్షేత్రాలు. ఆదియుగంలో ధ్రువుడు మధువనంలో తపమూఅచరించి విష్ణు సాక్షాత్కారం పొందాడు. అంబరీషుడు కార్తీక ద్వాదశి వ్రతాన్ని ఆచరించినది ఈ చోటనే . శ్రీ రాముని ఆనతి మేరకు శ్త్రుఘ్నుడు ఈ వనంలోనే లవణాసురుని సమ్హరించి మధురానగరాన్ని నిర్మిచాడు. ప్రతి వనంపు శ్రీ కృష్ణ లీలా విలసితం.స్వామి నిత్యలీలతో వినోదించే చోటులు ఇవి.ద్వాపరయుగంలో ప్రత్యక్షమై ప్రకటించిన లీలలే కాక, తన అనంతశక్త్లు అయిన గోపికలతో ఆ పరమాత్ముడు నిత్యమూ ( నేటికి సైతం) తన దివ్య లీలల్ను సూక్ష్మ భూమికలలో ప్రకటిస్తున్నాడు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Friday, 9 January 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment