గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 3 January 2015

ఈ వారం ఒక అధ్బుతమైన పుణ్య క్షేత్రం దర్సనం చేసుకున్నాను అదే ద్వారకతిరుమల ( చిన్నతిరుపతి ) ఈ క్షేత్రం మహిమను కాస్త నేను సేకరించాను .ఈ వారం ఒక అధ్బుతమైన పుణ్య క్షేత్రం దర్సనం చేసుకున్నాను అదే ద్వారకతిరుమల ( చిన్నతిరుపతి ) ఈ క్షేత్రం మహిమను కాస్త నేను సేకరించాను .

“ వినా వేంకటేశం ననాథో న నాథ: సదావేంకటేశం స్మరామి స్మరామి !!”

కృతయుగం లోని వృషశైలం పెద్ద తిరుపతి అయితే త్రేతాయుగం లోని శేష శైలం ఈ చిన్నతిరుపతి అయ్యింది .ఇదే ద్వారకా తిరుమల. ఇచ్చటి స్వామి స్వయంభువుడని స్ధలపురాణం చెపుతోంది.


పెద్ద తిరుపతి కి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకోలేని వారు ఈ చిన్న తిరుపతి లో తీర్చుకుంటే స్వామి దయతో అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యపట్టణం ఏలూరు 41 కి.మి . దూరం లో శ్రీలక్ష్మీనివాసుడైన వేంకటేశ్వరుడు స్వయంభువు గా వెలసిన దివ్యక్షేత్రం ఈ ద్వారకా తిరుమల .ఇది అత్యంత పురాతన దివ్యక్షేత్రం గా బ్రహ్మపురాణం లో చెప్పబడింది.

స్థలపురాణం.:------- ద్వారక మహర్షి

ద్వారకుడనే మహర్షి ఈ పవిత్ర ప్రదేశం లో దీర్ఘకాలం తపస్సు చేశాడు. ఈయన ధర్మపత్ని సునంద. ఈ దంపతులు శ్రీ వేంకటేశ్వరుని పాదసేవకే అంకితమై, నిరంతర గోవింద నామ స్మరణ తో వేంకటేశ్వరుని ధ్యానించేవారు. భక్త సులభుడైన ఆ శ్రీనివాసుడు మహర్షి దంపతుల భక్తి కి ముగ్ధుడైన వారిని కటాక్షించి , ప్రత్యక్షమయి వరం కోరుకోమన్నాడు. ఎల్లప్పుడూ శ్రీవారి పాదాలను సేవించుకొనే మహద్భాగ్యాన్ని కల్గించమని ద్వారక మహర్షి ప్రార్ధించాడు. అనుగ్రహించాడు శ్రీ లక్ష్మీనాథుడు. సమీపమందలి వల్మీకం ( సంస్కృతంలో పుట్ట అంటే వల్మీకం) లో శ్రీ స్వామి విగ్రహాన్ని దర్శించి. ఆశ్రయించి. సేవించి , తరించాడు ద్వారకమహర్షి. ఈ దివ్యక్షేత్రం లో శ్రీ స్వామి వారి పాదాలు వల్మీకము లోనుండి ద్వారక మహర్షిచే పూజించబడుచుండుట వలన భక్తులకు శ్రీ స్వామి వారి దివ్యరూపము నాభి వరకు మాత్రమే దర్శనీయ మగుచుండును.

ఇట్లు ద్వారకమహర్షి వలన స్వయం వ్యక్తుడై శ్రీ శ్రీనివాసప్రభువు వెలసిన ఈ క్షేత్రము ద్వారకా తిరుమల గా , చిన్న తిరుపతిగా , ప్రసిద్దికెక్కింది.

“ ఈ క్షేత్రమునందు స్వయంవ్యక్త మూర్తి ని సేవించడం వలన మోక్షాన్ని,ప్రతిష్టిత మూర్తిని సేవించడం వలన ధర్మ,అర్థ, కామాలను సాధించవచ్చని విజ్ఞుల చెపుతున్నారు.

క్షేత్ర ప్రత్యేకత ::--- ఇచ్చట స్వామిని సేవించు కొను భక్తులకు స్వామివారి పాదసేవ దుర్లభ మగుట వలన సర్వాంగ పరిపూర్ణుడగు శ్రీ శ్రీనివాసుని మంగళ రూపాన్ని మహర్షులు వైఖానసాగమానుసారంగా స్వయంవ్యక్తమగు ధృవమూర్తికి వెనుక భాగాన ప్రతిష్ఠించారు. ఇట్లు ఒకే విమానము క్రింద ఇద్దరు ధృవమూర్తులుండుట ఈ క్షేత్రప్రత్యేకత గా చెప్పబడుచున్నది.

అంతేకాకుండా ఈ క్షేత్రము లో స్వామి దక్షిణాభిముఖులై యుండుట మరొక ప్రత్యేకత. ఈ ఆలయమునందు ఇద్దరు ధృవమూర్తులుండుటచే ఏడాదికి రెండు సార్లు తిరుక్కళ్యాణ మహోత్సవములు జరుగుట కూడ ఒక ప్రత్యేకత గా నే చెప్పవచ్చును. స్వయంవ్యక్తమూర్తి కి వైశాఖ మాసం లోను, ప్రతిష్ఠంచబడిన స్వామికి ఆశ్వయుజ మాసం లోను కళ్యాణమహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి..

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML