గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 20 January 2015

వింత ఆలయాలు –విచిత్రవిశేషాలువింత ఆలయాలు –విచిత్రవిశేషాలు
• మాత్రు వంశం వారికి మాత్రమె పిండ ప్రదానం చేసే సిద్ధ పూర్ మందిరం

గుజరాత్ లో అహమ్మదా బాద్ కు నూట పది హీను కిలో మీటర్ల దూరం లో మాత్రు వంశం వారికి మాత్రమె పిండ ప్రదానం చేసే సిద్ధ పూర్ మందిరం సరస్వతీ నదీ తీరం లో ఉంది .ఇదే విశేషం విచిత్రం .ఇక్కడ గోవింద మాధవ్ ,రణచోర్ ,రాధా కృష్ణ మందిరాలున్నాయి .

• పగలు ఒక చోట ,రాత్రి వేరే చోట ఉండే అమ్మ వారి ఆలయం

గుజరాత్ లో ద్వారకకు పద మూడు కిలో మీటర్ర్లు ,పోర్ బందర్ కు ముప్ఫై ఎనిమిది కిలో మీటర్ల దూరం లో నియగాం అనే చోట ‘’హర సిద్ధి మాత ‘’ఆలయం ఉంది .అమ్మవారిని యంత్రం పై ప్రతిష్టించారు .విక్రమాదిత్య చక్ర వర్తి ప్రార్ధన తో అమ్మ వారు పగలు ఉజ్జయిని లో రాత్రి పూట హర సిద్ధి మాతా ఆలయం లో ఉండటం వింత విచిత్ర విశేషం .కనుక ఇక్కడ ఆలయం రాత్రి పూట మాత్రమె తెరచి ఉండటం మరో విశేషం .

• బంది పోటు దొంగల బారి నుండి కాపాడిన యోధుడికి గుడి,

గుజరాత్ లో రాణ్ ఆఫ్ కచ్ కి చివరి భాగం లో వెర్ణు అనే గ్రామం సింద్ కు డెబ్భై కిలో మీటర్ల దూరం లో ఉంది .ఇక్కడి దేవుడిని ‘’వెర్ణు’’అని పిలవటం వింత ‘’.వెర్ణుదాదా ‘’అనే యోధుడు ఆ గ్రామాన్ని బండి పోటు దొంగల బారి నుండి కాపాడి ప్రాణాలు అర్పించి నందుకు కృతజ్ఞత గా గుడి కట్టి ఆయన్నే దేవుడిగా కొలవటం విశేషం .అప్పటి నుండి అక్కడ ఆడంబరాలనన్నిటిని స్వచ్చందం గా ఆపి వేయటం విచిత్రం.

• కోడి పుంజు వాహనం గల పిల్లల దేవత,

గుజరాత్ లో మొహసీనా జిల్లా లో బహుచరాజి అనే చోట బాలా యంత్రం పై ‘’బహుచరాజి దేవి ‘’ప్రతిస్టింప బడిన ఆలయం కలదు .ఈ అమ్మ వారికి వాహనం కోడి పుంజు .ఇది వింత .ఈమె పిల్లల కు మాత్రమె దేవత అవటం విచిత్రం .ఇంతకీ ఈ అమ్మ వారెవరు ? యశోద గర్హాన అష్టమ సంతానం గా పుట్టి,.కంసుడు చంప బోతే యోగమాయా దేవిగా మారి హెచ్చరించిన దేవత
• పిండాలు నీటి లో తేలే సరో వరం.

గుజరాత్ లో ద్వారక కు ముప్ఫై కిలో మీటర్ల దూరం లో ‘’పిండారా’’ లో ‘’పిండాల సరస్సు ‘’ఉంది .ఇక్కడ పితృ దేవతలకు శ్రాద్ధ కర్మ లు చేసి పిండాలను నీటిలోకి వదిలి పెడితే పైకి తేలటం వింత .,విశేషం .ఇక్కడి ఆలయం లో స్వామి ‘’కపాల మోచన మహా దేవ్’’.కురు క్షేత్ర యుద్ధం లో చని పోయిన వారి బంధువులందరూ ఇక్కడ పిండ ప్రదానం చేసి నీటిలో వదిలితే పైకి తేలాయట. దూర్వాస మహర్షి ఆదేశాను సారమే పిండాలు తేలాయని ఐతిహ్యం ఇప్పటికీ అలానే తేలుతాయట ఇది విచిత్రం

• 6సార్లు కాశీ యాత్ర =1సారి మహీ సాగర యాత్ర,

గుజరాత్ లో ఖేడ్ జిల్లా లో అరేబియా సముద్ర తీరం లో ‘’మహీ నది ‘’సముద్రం లో కలిసే చోట ‘’శత్రుఘ్ని మాత ‘’ఆలయం ఉంది .అమా వాస్య శని వారం ఇక్కడ స్నానం చేస్తే మహా పుణ్యం .ఆరు సార్లు కాశీ యాత్ర చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒకే ఒక్క సారి మహీ సాగర సంగమ యాత్ర చేస్తే అంతటి పుణ్యం వస్తుందని విశ్వాసం .ఇక్కడ నవ నాధులు కొలువై ఉండటం విచిత్రం విశేషం .వాసాద్ గ్రామం లో విశ్వనాద్ ,వేరాలో ధారనాద్ ,సారసా లో వైద్య నాద ,హరినాద్ ,బాదర్వాలో ఊత నాద ,సోమనాద్ ,ఖాంపూర్ లో కామనాద్ ,వాన్కేవీర్ లో త్రయంబక నాద సీలీ లో సిద్ధనాద్ ఆలయాలు ప్రక్క ప్రక్కనే ఉండటం మరో విశేషం .ఇవన్నీ తీర్ధ స్తానాలే
• శంఖం తో మాత్రమె అభిషేకం జరిపించుకొనే శివుడు,

గుజరాత్ లో దేవేర్ కు రెండు కిలో మీటర్లు ,మాల్ సర్ కు ఎనిమిది కిలో మీటర్ల దూరం లో ఉన్న రాణాపూర్ లో శివలింగానికి అభిషేకం శంఖం తో పోసే జలం తోనే చేయాలనే నియమం ఉంది .ఇది విశేషం. స్వామి పేరు కంబ కేశ్వరుడు

• 11 శిరస్సులు ,22చేతులు ఉన్న హనుమాన్,

గుజరాత్ లో గాంధీ గారు పుట్టిన పోర్ బందర్ ను శ్రీకృష్ణుని బాల్య స్నేహితుడైన కుచేలుని పేరు అయిన సుదామ ‘’ఆనే పేరు తో పిలుస్తారు .ఇక్కడ శ్రీ కృష్ణ కుచేలులు కొలువై ఉన్న దేవాలయం ఉండటం విచిత్ర మైన వింత .కృష్ణుడు పాతాళం లో అహి రావణుని వధించిన రూపం ఇక్కడ ఉండటం విశేషం .ఇక్కడే’’ ఏకాదశముఖ ‘’ హనుమాన్ భారీ విగ్రహం ఉంది స్వామికి ఇరవై రెండు హస్తాలున్డటం మహా విచిత్రం,

• పిల్లల కోసం ముస్లిం దర్గా లో ఉయ్యాల కట్టటం,

గుజరాత్ లో భావనగర్ కు దగ్గర లో ‘’పాళీదాన్’’అనే చోట ఉన్న మహమ్మదీయ దర్గా లో స్త్రీలు సంతానం కోసం ఉయ్యాల కట్టటం వింత ,విచిత్రమైన విశేషం ఇది శత్రుమ్జయ పర్వతాలలో ఉంది .

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML