ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Friday, 16 January 2015

చక్కెర పొంగలి

సంక్రాంతికి పచ్చకర్పూరం, కొత్త బియ్యంతో పొంగలి చేసుకోండి..........సంక్రాంతికి పచ్చకర్పూరం, కొత్త బియ్యంతో పొంగలి చేసుకోండి. పెద్ద పండుగైన సంక్రాంతి రోజున బంధువులు, స్నేహితులకు తీపిపదార్థాలు పంచుకుంటుంటారు. తరచూ కొత్త బియ్యంతో చక్కెర పొంగలి కాకుండా ఈసారి పచ్చకర్పూరంతో చక్కెర పొంగలి తయారు చేయండి.
కావలసిన పదార్థాలు :
బియ్యం.. ఒక కేజీ
ఎండుకొబ్బరి ముక్కలు.. ఒక కప్పు
పెసరపప్పు.. ఒక కప్పు
జీడిపప్పు.. 50 గ్రా.
పంచదార.. 300 గ్రా.
కిస్‌మిస్.. 50 గ్రా.
నెయ్యి.. 150 గ్రా.
పచ్చ కర్పూరం.. 2 గ్రా.
తయారీ విధానం :
బియ్యం, పెసరపప్పులను ముందుగానే ఉడికించి పక్కనుంచాలి. ఓ పాత్రలో నెయ్యి వేసి వేడయిన తరువాత కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేసి రెండు నిమిషాలపాటు కలియదిప్పుతూ వేయించాలి. ముందుగా ఉడికించుకున్న అన్నం, పెసరపప్పు మిశ్రమాన్ని జతచేయాలి. పంచదార కలిపి బాగా కలియబెట్టి పచ్చకర్పూరం కూడా వేసి కలిపి దించేయాలి. అంతే చక్కెర పొంగలి సిద్ధమైనట్లే.





No comments:

Powered By Blogger | Template Created By Lord HTML