ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Monday, 19 January 2015

వేదం ఉపనిషత్తులతో ముగుస్తుంది. వీటికే వేదాంతం అని పేరు.వేదం ఉపనిషత్తులతో ముగుస్తుంది. వీటికే వేదాంతం అని పేరు. వేదం పూర్తిగా అర్దమవ్వలాంటే ఉపనిషత్తులను అర్దం చేసుకోవాలి. వేదం యొక్క అంత్యభాగంలో ఉండడమే కాక, వేదవిద్య మొత్తం అభ్యసించిన తర్వాత, విద్యాభ్యాసం చివరలో భోధించబడేవి కనుక వీటికి వేదాంతం అని పేరు. ఇవి సమస్త ప్రపంచానికి ఏకైక తత్వశాస్త్ర నిధులు. ఉపనిషత్తు అనే పదం సంస్కృత భాష నుంచి వచ్చింది. ఉప అనే ధాతువుకి దగ్గరగా అని అర్దం, ని అనగా తపనతో, నిశ్చయాత్మక బుద్ధితో, కుతూహలంతో అని అర్దం. రకరకాల శాస్త్రాలు మనిషి జీవనానికి తోడ్పడుతాయి, అతని అభివృద్ధికి దోహదపడచ్చు కానీ అవే జీవితం కాదు. జీవితపరమార్ధాన్ని తెలుసుకోపోతే జన్మ వ్యర్ధం. అందుకే గురువు మొత్తం వేదవిద్యను శిష్యునికి ఉపదేశించిన తర్వాత, అతనిని తన దగ్గర కూర్చుబెట్టుకుని జీవిత సత్యాలను భోధిస్తాడు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఖగోళ శాస్త్రం, యుద్ధవిద్య, వృత్తులు వంటివి నీ జీవనాన్నిసుగమం చేస్తాయెమో కానీ, నీకు ఎందుకు జీవించాలో స్పష్టంగా చెప్పలేవు, మరణసమయంలో పనికి రావు, మరణభయాన్ని తొలగించలేవు. భూమి ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, పర్వతాలు, సముద్రాలు, పీఠభూములు ఏలా ఏర్పడ్డాయి, భూకంపాలు ఎలా సంభవిస్తాయో శాస్త్రాలు నిర్వచనం మాత్రమే చేయగలవు, అవి కేవలం సృష్టిని విశ్లేషించగలవు. కానీ కొత్తగా సృష్టి చేయలేవు. శాస్త్రవేత్త కూడా అంతే. అన్ని చదువుకున్నాకా భౌతికవాదం ప్రభలుతుంది. అన్నీ తనకు తెలుసని అనుకుంటాడు అని చెప్తూ, గురువంటాడు 'నాయనా! నీవు కేవలం సృష్టి క్రమాన్ని మాత్రమే చదువుకున్నావు. కానీ ఈ సృష్టిని సృష్టించిన ఒక కర్త ఉన్నాడు. వాడిని భౌతిక దృష్టితో చూడటం అసాధ్యం. వాడు బాహ్యనేత్రానికి కనిపించడు. విశ్వంలో ఎన్ని పాలపుంతలు దాటి ప్రయాణించినా, సృష్టికర్తను పట్టుకోలేవు. ఆ మాటకు వస్తే, సృష్టికర్త అయిన భగవంతుడు ధృక్ గోచరమైన వస్తువు/విషయం కాదు, కనుక ఆయన్ను బాహ్యంలో వెతకడం కుదరని పని. అలా అని ఏదో తెలియని శక్తి ఉంది, దాన్ని నువ్వు నమ్మవలసిందే అని నేను చెప్పను. ఆ భగవంతుడిని ఎరుకలోకి ఎలా తెచ్చుకోవాలో, నీకు మార్గం వివరిస్తాను. భగవంతుడనేది ఒక నమ్మకం కాకూడదు, ఉన్నాడని రూఢీ చేసుకోవాలి, నేను చూసిన విధంగానే నువ్వూ భగవంతుడిని చూడాలి, నీ తర్వాతి తరంవాళ్ళకి చూపించాలి. అందుకు నీకు ఇప్పుడు ‪#‎మార్గం‬ వివరిస్తాను' అంటాడు శిష్యునితో.


శిష్యుడు కూడా గురువు గారి దగ్గరకు వెళ్ళి, కూర్చుని, శ్రద్ధగా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. గురువు కేవలం గ్రంధంలో చెప్పబడిన విద్యనే కాకుండా, తాను జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్న అనేక రహస్య సత్యాలను శిష్యునికి ఉపదేశిస్తాడు. అలా గురువుకు దగ్గరగా ఆసనం వేసుకుని కూర్చుని, విని, నేర్చుకునే విద్య కనుక వీటికి ఉపనిషత్తులు అని పేరు.

To be continued ......................

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML