
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 27 January 2015
దంపతుల నూరేళ్ల జీవితం వలపుల పంటగా మారాలంటే... అనుసరించాల్సిన వివాహ సంప్రదాయాల గురించి మన శాస్త్రాలేం చెబుతున్నాయో కాస్త క్లుప్తంగా తెలుసుకోండి.
పెళ్లంటే.... పది కాలాల పాటు పిల్లా పాపలతో పచ్చగా చేసుకొనే కాపురానికి నిలువెత్తు గోపురం. దంపతుల నూరేళ్ల జీవితం వలపుల పంటగా మారాలంటే... అనుసరించాల్సిన వివాహ సంప్రదాయాల గురించి మన శాస్త్రాలేం చెబుతున్నాయో కాస్త క్లుప్తంగా తెలుసుకోండి.
ఒకే లగ్నమునకు ఇద్దరు అన్నదమ్ములకు గాని, అక్కాచెల్లెళ్లకు గానీ వివాహం చేయరాదు. ఒకే లగ్నంలో అబ్బాయికి, అమ్మాయికి వివాహం చేయరాదు.
*ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు ఒకే సమయంలో కల్యాణం లేదా ఉపనయనం చేయకూడదు.
*అన్నాచెల్లెళ్లకు ఒకే లగ్నంలో ఒకే వేదిక మీద పెళ్లి చేయరాదు.
*అమ్మాయి పెళ్లయిన తరువాత అబ్బాయి వివాహం చేయాలంటోంది మన శాస్త్రం.
*ఇద్దరు అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లను ఇచ్చి వివాహం చేయరాదు.
*కొడుకు ఉపనయనం, కూతురి వివాహం ఒకేసారి చేయవచ్చును.
*కూతురి పెళ్లికంటే ముందుగా కుమారునికి ఉపనయనం చేయడం మంచిది.
*ఒక కుమారునికి, ఒక కుమార్తెకు ఒకే సంవత్సరంలో వివాహం చేయుట శుభం.
*ఇద్దరు కుమారులకు ఒకే సంవత్సరంలో ఉపనయనం, వివాహం చేయరాదు. ఇతర శుభకార్యాలు జరిపించవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment