పూర్వము సూర్యభగవానుని తేజము ప్రాణులకు భరించరానిదిగా ఉండేది. అప్పుడు దేవతలందరు సూర్యుని పూజించి నీ తేజమును ప్రాణులకు భరింపతగినదిగా చేయమని ప్రార్థించారు. అంతట సూర్యదేవుడు మహాతపస్సంపన్నుడగు విశ్వకర్మనుచూచి నా తేజమును నీవు గ్రహించి విగ్రహరూపమున తయారు చేయమని ఆఙ్ఞాపించెను. అంతట విశ్వకర్మశాకద్వీపమునయంత్రమును నిర్మించి కల్పవృక్షము యొక్క కొయ్యతో సూర్యవిగ్రహమును హిమవత్పర్వతము యొక్క వెనుకభాగమున నిర్మించెను. సూర్యుని ఆఙ్ఞాపై సాంబునికొరకు దానిని చంద్ర భాగానదిలో విడిచెను. సాంబుడు దానిని గైకొని మిత్రవనమున ( కోణార్క) ప్రతిష్టించి పూజించెను. సారాంశమేమనగా ప్రతిష్టకు యంత్రము , విగ్రహము కూడా కావలెను.

No comments:
Post a Comment