గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 19 January 2015

భృగు మహర్షి త్రిమూర్తులను పరిక్షించుట త్రిమూర్తులను శపించుట :భృగు మహర్షి త్రిమూర్తులను పరిక్షించుట
త్రిమూర్తులను శపించుట :

కలియుగ ప్రారంభమున
ప్రజలంతా తమ ధర్మములను విడిరి, విచక్షణా జ్ఞానము లేక ఘొరమైన అకృత్యములు చేయుచుండిరి
ఎక్కడ చూసినా అశాంతి ,అరాచకములు , కరువు, కాటకములతో ప్రజలు సుఖములను కోల్పోయిరి
అట్టి ధౌర్భాగ్య పరిస్థితిని గాంచిన మహర్షులు
అందరు కలిసి ప్రజా శ్రేయస్సు కొరకు లోక కళ్యాణార్థం యజ్ఞము చేయదలచిరి


యజ్ఞములకు గంగనదీ తీరాన్ని యజ్ఞస్థలంగా ఎంపిక చేసి అచట మునులందరు కలసి యజ్ఞ సామాగ్రితో యజ్ఞము ప్రారంభించబూనిరి
చక్కటి ప్రశాంత వాతావరణమున ఋషుల వేద ఘోష ప్రతిధ్వనించుచుండెను
అంతట అచటికి నారదులవారు వేతెంచిరి

ఓ! మహా మునులారా లోకోపకరమైన యజ్ఞము చేయబూనారు
ఈ యజ్ఞ ఫలం ఎవరికి దారపోస్తారు
దీనికి త్రిమూర్తులు మాత్రమే అర్హులు వారిలో శాంతము సహనము కలిగినవారు
ఋషులకు విలువనిచ్చువారు ఎవరో నిర్ణయించి వారికే దారపోయండి"
అని పలికెను

ముని మాటలకు తెల్లబోయిన ఋషులంతా ఒకరి మొకము నొకరు చూసుకుంటు వాదోపవాదములు చేసి విసిగి పోయి

మహర్షులంతా త్రమూర్తుల పరిక్షింప శక్తి ధైర్యము మాకులేవు అందులకు సమర్థుడు మహాతపస్వి అయిన భృగుమహార్షియే అని ఆయన్ని ప్రార్థించిరి
ఋషుల మాట కాదనలేక ఆ భాద్యతని తన బుజస్కందాలపై వేసుకొని భృగువు కార్యచరణ మొదలుపెట్టెను

మొట్టమొదట సత్యలోకమున తన తండ్రి అయిన బ్రహ్మ ని చెరెను
అచట బ్రహ్మ సృష్టి కార్యమున నిమగ్నమైవుండెను
చాలా సమయం వేచి చూసిన భృగువు కోపగ్నిచే

"ఓయి! బ్రహ్మ నీవు చరాచర సృష్టికి సృష్టికర్తవైననేమి.. అహంభావముతో కార్యార్థమై వచ్చిన ఋషి శ్రేష్టుడనయిన నన్ను నీవు కన్నెత్తి అయినా చూడక అవమానించితి..నీకింత గర్వమా..??
నీకు భూలోకమున నీకు పూజలు గాని
దేవాలయములు గాని లేకుండు గాక ..."

అని శపించి కైలాసమునకేగెను

కైలాసమున ప్రమథ గణములు శివనామ స్మరణతో తన్మయులై నృత్యాధికములు చేయుచు ఎవరూ భృగు రాకను గమనింపలేదు
శివ పార్వతులు ఆనంధమున శివతాండవము చేయుచుండిరి
భృగువు తన్మయుడై చాలా సమయము వేచి యుండెను కాని శివుడు తన రాకను గుర్తించి ఉచితాసనం చూపలేదని ఆగ్రహమున

"శంకరా! నా రాకని నా అంతరంగాన్ని గుర్తింపక ఉచితాసనంబు కూడా చూపక అవమానించితివి
నేటి నుండి నీకు భస్మమే అలంకారము
స్మశానమే నీ నివాసము
లింగ ఆకారముగానే పూజింపబడుదువు"

అని శపించి
తాను వచ్చిన కార్యము నెరవేరలేదని భాదతో వైకుంఠమునకేగెను

అచట
విష్ణువు శేషశయనుడు కాగా భృగు పుత్రిక భార్గవి (లక్ష్మి) భర్త సేవలో నిమగ్నమైవుండెను ఆ దృశ్యాన్ని చూసిన భృగువు తన్మయుడై ఆనందమున విష్ణువును ధ్యానించుచు ఉండెను
చాలా కాలం గడిచినప్పటికిని విష్ణువు తనని గమనించలేదని
బ్రహ్మ, శంకరుల వలన కలిగిన అవమానం చల్లారకముందే విష్ణువు వలన కలిగిన పరాభవముచే
అవేశమున విష్ణువుని దరిచేరి ఒక్క ఉదుటున తన కాలితో శ్రీ మహావిష్ణువు వక్ష స్థలాన్ని తన్నెను
వెనువెంటనే లక్ష్మీ నారాయణులు ఉలిక్కిపడి లేచి నిర్ఘాంతపోయిరి

వెంటనే పరిస్థితిని ఆకలించుకున్న విష్ణువు
భృగు మహర్షికి నమస్కరించి

"స్వామి నన్ను తమ సుకుమార పాదముతో తన్నుట వలన మీ పాదములకు ఎంత నొప్పి కలిగినదో కదా..!
అహా ఏమి నా భాగ్యము మీ వంటి తపశ్శాలి ఋషి శ్రేష్టుల పాద స్పర్శ కలిగినందుకు నేను ధన్యుడనైతిని"

అంటూ భృగువునకు ఉచితాసనంబు ఏర్పరచి పాదపూజ చేసి వారి పాదములు వత్తుచుండెను
భృగువునకు పాదమందు తపశ్శక్తికి గుర్తుగా మొలచిన పాదము వలన అతనికి అంత అహంభావము కలిగి వాస్తవము చూడలేకపోవచుండెను అని భావించిన విష్ణువు
భృగువు అరికాలియందలి మూడవ నేత్రాన్ని చిదిమివేసెను

అంతట అహంకారం వీడి జ్ఞానోదయం పొందిన భృగువు ఇలా తలచెను

" శ్రీమన్నారాయణుడు ఎంతటి శాంత చిత్తుడు ఎంత సాత్వకమూర్తి నా తొందరపాటుకు ఏమాత్రం ఉద్రేకమొందక తిరిగి నాకే సపర్యలు చేయుచున్నాడు
యజ్ఞఫలము పోంద విష్ణువు మాత్రమే అర్హుడు"

అని నిశ్చయించి
ఇలా పలికెను

" ఓ జగత్ప్రభు నారాయణా
లోక కళ్యాణార్థం యజ్ఞము చేయదలచితిమి
యజ్ఞ ఫలము పొంద మీరు మాత్రమే అర్హులు అని నిశ్చయించితిని కనుక మీరు వచ్చి యజ్ఞఫలాన్ని స్వీకరించవలెను"

అందులకు విష్ణువు

"ఋషి పుంగవా మీరు యజ్ఞము జరపండి మీ కార్యం తప్పక సిద్ధిస్తుంది నేను తప్పక వచ్చి యజ్ఞఫలము స్వీకరించెదను" అని పలికి భృగువుని సాగనంపెను

కాని మహా లక్ష్మీ దేవి తన తండ్రి అయిన భృగువు
తన నివాసమయిన విష్ణువు వక్షస్థలమున తన్నెను
ఆ సంఘటన జీర్ణించుకోలేక
భూలోకమున భృగు వంశ బ్రాహ్మణులు తన పుట్టింటి వారైన పద్మశాలి ఇంట ఆడపడుచుగా జన్మించెను

లక్ష్మిలేని వైకుంఠమును భరించలేక విష్ణువు
శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించెను

జగన్నాటక సూత్రధారుడు విష్ణువే
లోక కళ్యాణార్థం వేంకటరమణుడిగా అవతారించదలచి
తన నాటకంలో భృగువునకు కీలక పాత్ర ఒసంగెను

మీ..
ఎక్కలదేవి మోహన కృష్ణ ఆచార్య...


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML