గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 3 January 2015

బీట్‌రూట్...! {'జర్నల్ ఆఫ్ ఆప్లైడ్ ఫిజియాలజీ'} అనే వైద్య పత్రిక కధనం}బీట్‌రూట్...! {'జర్నల్ ఆఫ్ ఆప్లైడ్ ఫిజియాలజీ'} అనే వైద్య పత్రిక కధనం}
************* ******************************************************
*సెక్సువల్ స్టామినాకు నేచురల్ వయాగ్రా బీట్‌రూట్ అనేది తెలుసా.. బీట్‌రూట్ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. నైట్రేట్స్ పుష్కలంగా కలిగిన ఈ బీట్‌రూట్‌ను తీసుకోవడం ద్వారా నైట్రిక్ యాసిడ్‌ను శరీరంలోకి విడుదల చేస్తుంది. తద్వారా సెక్సువల్ స్టామినా పెరుగుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి సెక్స్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.

*ఇంకా గర్భం ధరించిన మహిళలకు బీట్‌రూట్ ఎంతగానో మేలు చేస్తుంది. ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే బీట్‌రూట్‌ను గర్భిణీలు రోజూ తీసుకోవడం ద్వారా శిశువు వెన్నెముక, ఎముకలు బలపడతాయి. ఇంకా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. గర్భిణీలకు తగిన ఎనర్జీని ఇస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వయసు పెరుగుతున్నప్పటికీ యవ్వనంతోనే ఉండాలని ఉందా?.. దీనికి మీరు ఏ అమృతం కోసమో పాకులాడాల్సిన పని లేదు. రోజూ ఓ గ్లాసు బీట్రూట్ రసాన్ని తాగండి.. మీ వయసు పెరుగుతున్నప్పటికీ.. మీరు మాత్రం కుర్రాడిలాగా చలాకీగానే ఉంటారు. బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు తాజాగా ఈ విషయాన్ని కనుగొన్నారు. "మానవ దేహంలో రక్తనాళాలు బాగా విచ్చుకొని.. రక్త ప్రసరణ సమగ్రంగా జరిగేలా బీట్రూట్ రసం దోహదపడుతుంది. ముదిమి మీదపడుతున్న వారు, ఊపరితిత్తుల సమస్యలు, హృద్రోగంతో బాధపడే వారు.. ఈ రసాన్ని బాగా తాగాలి.

*శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా.. పెద్ద వయసు వారు కూడా కుర్రాళ్లలా చలాకీగా ఉండేందుకు బీట్రూట్ రసం ఉపకరిస్తుంది'' అని బ్రిటన్‌లోని ఎక్సెటర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు క్యాటీ లాన్స్‌లే అన్నారు. బీట్రూట్ రసంలో నైట్రేట్ నిల్వలు అధిక స్థాయిలో ఉంటాయి. దాంతో బీట్రూట్ రసం తాగిన వాళ్ల శరీరంలో రక్త నాళాలు మరింతగా విచ్చుకొనేలా ఈ నైట్రేట్ దోహదపడుతుంది.
ఫలితంగా అలాంటి వారిలో రక్తపోటు తగ్గి.. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలా వారి శరీరంలోని అవయవాలన్నింటికీ అధిక స్థాయిలో ఆక్సిజన్ అందుతుంది.

*ఎర్రటి బీట్‌రూట్‌లో ఎ, బి, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఫోలిక్ ఆమ్లం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ అందాన్ని కాపాడటంలో కీలకంగా పనిచేస్తాయి.

*బీట్‌రూట్ రసాన్ని రోజూ తాగితే రక్తశుద్ధి జరుగుతుంది. దీన్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. దాంతో చర్మం నిగారింపు పొందుతుంది.

* బీట్‌రూట్‌ని మిక్సీలో వేసి మెత్తని గుజ్జుగా చేయాలి. దానికి కప్పు ఓట్‌మీల్, చెంచా తేనె, రెండు చుక్కల నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి, ఇరవై నిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రపరచుకోండి. ఇలా తరచూ చేస్తుంటే దుమ్మూధూళీ ప్రభావం చర్మంపై ఉండదు. చర్మ గ్రంథులు శుభ్రపడతాయి. మచ్చలూ ముడతలూ వంటివి తగ్గుముఖం పట్టి చర్మం తాజాగా కనిపిస్తుంది.

* జుట్టు తెల్లబడిందనో, లేక చక్కని రంగు కావాలనిపించో రసాయనాలతో కూడుకున్న కృత్రిమ రంగుల్ని వాడుతుంటారు చాలామంది. వీటి వల్ల జుట్టు పాడైపోతుంది. ఇలాంటప్పుడు గోరింటాకు పొడిలో రెండు చెంచాల బీట్‌రూట్ పౌడర్‌ని కలపాలి. ఈ రెండింటిని టీ డికాక్షన్‌లో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తలకు రాసుకుంటే జుట్టు చక్కని రంగులోకి మారుతుంది, ఆరోగ్యంగా ఎదుగుతుంది. బీట్‌రూట్ రసంలో చెంచా నిమ్మరసం కలిపి తలకు పట్టించినా ఫలితం ఉంటుంది.

* పెదాలు నల్లగా, గరుకుగా ఉండి ఇబ్బంది పెడుతుంటే.. బీట్‌రూట్ రసంలో కొంచెం తేనె కలిపి పెదాలకు రాసుకోండి. నాలుగైదు నిమిషాల తరవాత చన్నీళ్లతో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నలుపు తగ్గుతుంది.

*ఆకు కూరల్లో కూడా నైట్రేట్ లభ్యమవుతుంది. అయితే.. ఆకు కూరలను వండుకొని తినడం కన్నా.. బీట్రూట్ రసాన్ని ఎక్కువ మోతాదులో తాగడం తేలిక. కాబట్టి రోజూ బీట్రూట్ రసాన్ని తాగడాన్ని ఓ అలవాటుగా చేసుకోవాలని పెద్ద వయసు వారికి పరిశోధకులు సూచిస్తున్నారు. కాగా.. ఈ పరిశోధకులు తమ అధ్యయన ఫలితాలను 'జర్నల్ ఆఫ్ ఆప్లైడ్ ఫిజియాలజీ' అనే వైద్య పత్రికలో ప్రచురించారు.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML