గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 12 January 2015

సంకట హర చతుర్థి. ఈ రోజున భక్తి తో వినాయకుడిని పూజించాలి.

 సంకట హర చతుర్థి. ఈ రోజున భక్తి తో
వినాయకుడిని పూజించాలి.
వినాయకుడిని పూజించడం వలన ... ఏడాదికి
ఒకసారి వచ్చే వినాయక చవితి రోజున
ఆయనను అర్చించడం వలన విఘ్నాలతో
పాటు విచారం కూడా తొలగిపోతుందని
పురాణాలు చెబుతున్నాయి. అలాంటి వినాయకుడి
అనుగ్రహం కోసం 'సంకటహర చతుర్థి'
వ్రతం చేస్తే లభించే పుణ్య ఫలాల గురించి
ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.
ఇంచుమించు వినాయక చవితి వ్రతం మాదిరిగానే
అనిపించే ఈ వ్రతం ... ' బహుళ చవితి' రోజున
చేయాలి.
ఉదయాన్నే తలస్నానం చేసి వినాయక వ్రతంలానే
పూజకు సంబంధించిన అన్ని
ఏర్పాట్లు చేసుకోవాలి. బాల గణపతి .. బాలచంద్ర
గణపతి .. కృష్ణ గణపతి .. వికట గణపతి ..
సువర్ణ గణపతి .. అంబర గణపతి .. శుక్ల
గణపతి .. నింబ గణపతి .. ధూమ్ర గణపతి ..
లంబోదర గణపతి .. శక్తి గణపతి .. నిర్విఘ్న
గణపతి .. రక్త గణపతి .. రుణవిమోచన
గణపతి .. ఏకదంత గణపతి .. వక్రతుండ
గణపతి .. చింతామణి గణపతి .. లక్ష్మీప్రద
గణపతి .. సిద్ధి గణపతి .. లక్ష్మీ గణపతి ...
విష్ణు గణపతి ... ఇలా 21 వినాయక
రూపాలను పూజించాలి.
వినాయకుడి 21 రూపాలను 21 రకాల
పత్రులతో ... 21 రకాల పువ్వులతో అర్చించాలి.
వినాయకుడుకి ఇష్టమైన 21 రకాల
వంటకాలను నైవేద్యంగా సమర్పించి, 21
వత్తులను వెలిగించి హారతి ఇవ్వాలి. ఆ తరువాత
21 మంది బ్రాహ్మణులకు వినాయక విగ్రహాలతో
పాటు పదార్ధాలను దక్షిణ తాంబూలాలతో
పాటు దానమివ్వాలి.
ఈ విధంగా ఈ వ్రతాన్ని 21 సంవత్సరాల
పాటు ఆచరించి 'వినాయక చవితి' రోజున
ఉద్యాపన చెప్పుకోవాలి. ఈ వ్రతాన్ని
ఆచరించడం వల్లనే సీతారాములు ... శ్రీ
కృష్ణుడు ... ధర్మ రాజు ... బలిచక్రవర్తి
వంటి వారు తమ
సంకటములను తొలగించుకున్నట్టు శాస్త్రాల్లో
కనిపిస్తోంది.
గణపతికి గరిక చాలా ప్రీతి.
గణపతికి ప్రతిరోజూ గరికతో పూజ
చేసుకుంటూ వస్తే శనైశ్చరుని వలన కలిగే
ఈతిబాధలు, సమస్యల నుంచి బయటపడతారు.
శనిభగవానుడిని శనివారం నాడు గరికతో పూజిస్తే
ఏలినాటి శని, అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి.
గరిక పత్రంతో శ్రీ మహా గణపతికి పూజ చేసి
తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే
కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి.
గరిక పత్రాన్ని నగదు ఉంచే ప్రదేశంలో పెడితే
మీకు రావలసిన నగదు త్వరగా వచ్చేస్తుంది.
దుర్గాదేవికి గరికతో పూజ చేస్తే రహస్య
ప్రార్థనలు ఫలిస్తాయి. గరికను దారంతో కట్టి
గణపతికి మాల వేస్తే మీ మనోగతమైన అన్ని
రకాల కోరికలు పూర్తిగా నెరవేరుతాయి. గరికతో
చేసిన అంజనాన్ని ప్రతిరోజూ ధరిస్తే అన్ని
పనులు నెరవేరుతాయి. ఇంకా గరిక రసం తాగితే
దేహంలోని సమస్త
వ్యాధులు నయం అవుతాయి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML