పూజలు, పునస్కారాలు చేయడానికి మాకు సమయం ఎక్కడుంది? పొద్దున్నే పనికి వెళ్ళి ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకునే మేము పూజలు ఎలా చేయగలం?" అనే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇందుకు సమాధానం శ్రీ కృష్ణ పరమాత్మే చెప్పాడు" ప్రతి మనిషీ ఎదో ఒక పని చెయ్యక తప్పదు. ప్రతి కర్మకు దైవం ఒక కారణంగా ఉంటాడు". ఆయన మాట ప్రకారం చేస్తున్న పనులనే భగవంతుని ఆరాధించడంగా భావించి తరించిన భక్తులెందరో ఉన్నారు. కబీర్ వంశవృత్తి నేతనేయడం. నేత పనిలో నిమగ్నమైనప్పుడు కూడా కబీర్ మనసు భగవంతునియందే నిమగ్నమై ఉండేది. గోరా అనే కుమ్మరి ఎప్పుడూ పాండురంగని నామాన్ని జపిస్తూ, కుండలుచేసేవాడు. శివభక్తుడైన నందనార్ కొద్దిమంది బాలుర సాయంతో చెరువును తవ్వడం మొదలుపెట్టాడు. అంతే చూస్తుండగానే వందలాది శివగణాలే కూలీల రూపంలో వచ్చి, ఆ పనిని శీఘ్రతిన ముగించేసారు.
మనం అసలు నిత్యం ఆ పరమాత్మ స్మరించుకుంటు , మనం చేసే ప్రతి పనిని ఆయనకు సమర్పించుకుంటూ, ధార్మికంగా జీవితాన్ని గడపటమే పెద్ద పూజ! అసలు నిత్యం నామస్మరణ చేసుకుంటే..అదే భక్తి మార్గం..ముక్తికి ద్వారం....మోక్షానికి కారణం!
ఓం నమో భగవతే వాసుదేవాయా!

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment