అయిదవ నెలలో ఐదవనెల పొడుగునా పెసరపప్పన్నాన్ని తినాలి. ఈ మాటని వింటూనే 'పులగం' కదా మాకు తెలుసనుకోకూడదు. గర్బిణికి సంబంధించిన ఆహారం కాబట్టి దీన్ని ఎలా చేయాలో తెలిపారు ప్రాచీనులు.
సుశాలి తండులప్రస్థం తదర్థమ్ముద్గభిన్నకం
చతుష్ఫలం గుడం ప్రోక్తం తన్మానం నాలికేరకం!!
ముష్టిమాత్రం మారీచం స్యాత్తదర్థం సైంధవం రజః!
తదర్థం జీరకం విద్యాత్ కుదాపం గోఘృతం విదుః!
గోక్షీరేణ స్వమాత్రేణ సంయోజ్య కమలాననే
మందాగ్నిపచనా దేవ సిద్ధాన్న మిద ముత్తమం!!
ఒక కొలపాత్రెడు బియ్యం, దానిలో సగం పెసరపప్పు, అంతే పరిమాణపు బెల్లం, అంతే పరిమాణపు కొబ్బరి, మిరియాల పొడి, సైంధవ లవణం తగుమాత్రం, వీటికి సరిపోయినన్ని పాలు, రుచికి సరిపడినంత ఆవునెయ్యి, తగుమాత్రపు జీలకరా...ఈ మొత్తాన్ని సన్నని మంట మీద వండితే ఏర్పడేది ముద్గాన్నం.
దీన్ని నివేదన చేసిన పిమ్మట రోజుకు ఒక ముద్దా చొప్పున నెలపొడుగునా తినాలి.
"పంచమే మాసే పృష్ఠ వంశో భవతి' అని ఉపనిషత్తు చెప్తోంది. కాబట్టి శిశువుకి వెన్నెముక ఏర్పడే ఈ మాసంలో ఆ మేరుదండంలో ఏ దోషమూ లేకుండా కాపుండేందుకై ఈ పెసరపప్పు అన్నాన్ని గర్భిణి తినవలసిందే. ఐదవనెల పొడుగునా శిశువుని రక్షించే తల్లి పేరు 'సాకినీదేవి'.

No comments:
Post a comment