గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 19 January 2015

వైభవంగా ముగిసిన పార్వేట ఉత్సవం ...

వైభవంగా ముగిసిన పార్వేట ఉత్సవం .......తిరుమలలో శుక్రవారం శ్రీవారి పార్వేట ఉత్సవం వేడుకగా జరిగింది. ఏటా సంక్రాంతి మరుసటిరోజు ఈ ఉత్సవం నిర్వహిస్తారు. స్వామివారికి ప్రాతఃకాలారాధన పూర్తయ్యాక మలయప్పస్వామిని బంగారు తిరుచ్చి, శ్రీకృష్ణస్వామిని వెండి తిరుచ్చిపై ఆలయం నుంచి పార్వేట మండపానికి వేంచేపు చేశారు. అక్కడ స్వామికి పుణ్యాహవచనం అయ్యాక మంచెలో వేంచేశారు. స్వామికి ఆరాధన, నివేదనలు జరిపి హార తులిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య వంశీకులు పాల్గొన్నారు. ఆ తర్వాత మల యప్పస్వామి, శ్రీకృష్ణస్వామిలను మండపం నుంచి ప్రాంగణానికి తీసుకొచ్చారు. సన్నిధి గొల్ల పూజచేసిన చోటుకు శ్రీకృష్ణస్వామిని తీసుకొచ్చి పాలు, వెన్న నైవేద్యం ఇచ్చాక మల యప్పస్వామి చెంతకు చేర్చారు. గొల్ల సమర్పించిన పాలు, వెన్నను మలయప్పస్వామికీ నివేదనగా సమర్పించాక గొల్లకు మరోసారి బహుమానం అందించారు. ఆ తర్వాత మలయ్యపస్వామి తరపున అర్చకులు ముందుకు కొంతదూరం పరుగెత్తి బాణంవేసి వెనక్కు వచ్చారు. ఇలా మూడుసార్లు కన్నుల పండువగా జరిగింది. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భక్తులు, స్థానికులు తరలివచ్చారు. ఆ తర్వాత స్వామివార్లు ఊరేగింపుగా ఆలయ మహద్వారం వద్ద కు చేరుకున్నారు. అక్కడ హథీరాంజీ మఠంవారికి బెత్తం ఇచ్చి మలయప్పస్వామి తిరు వీధుల ప్రదక్షిణ పూర్తిచేసుకుని మహద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడ హథీరాంజీ మఠం వారి నుంచి బెత్తం స్వీకరించి సన్నిధికి వేంచేస్తారు.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML