గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 4 January 2015

దేవుళ్ళకి ఇన్ని నివేదనలా? అనే వారికి ఏమని సమాధానం ఇవ్వాలి?దేవుళ్ళకి ఇన్ని నివేదనలా? అనే వారికి ఏమని సమాధానం ఇవ్వాలి?

కొందరు అంటారు దేవుళ్ళకి ఇన్ని నివేదనలా? అని. నివేదనలు చేసి తీరాలండీ. ఇంట్లో ఒక దేవత అంటూ పెట్టాక నివేదన అంటూ జరగాలి. మనిషిని ఇంటికి పిలిచాక భోజనం పెట్టకుండా ఊరుకుంటారా? మహాత్ముడండీ, సిద్ధ పురుషుడు, మా ఇంటికి వచ్చాడు యతీశ్వరుడు చాలా సంతోషం. భోజనం పెట్టడం మానేస్తామా? మనం చేయవలసింది చేయాల్సిందే. పైగా దేవతలకు కూడా అన్నం. అన్నం చాలా గొప్ప విషయం. దాని గురించి చెప్పాలి అంటే పెద్ద సైన్స్. వినేవాళ్ళకి ఓపిక, చెప్పేవాడికి తీరిక ఉండాలే గానీ అన్నం అంటే ఏమిటి, అన్నం తినడం ఎలా అని సైన్స్ వేదం ఆధారం చేసుకొని చెప్పుకోవాలి అంటే కొన్ని రోజులు చెప్పుకోవచ్చు. అసలు main subject అదే. ఉపన్యాసం లేకుండా ఉండచ్చు కానీ అన్నం లేకుండా ఉండలేం కదా! అందుకు అది చాలా main subject. అన్నాన్ని నివేదన చేసేటప్పుడు దానికొక శక్తి వస్తుంది. మామూలుగా వండుకు తింటే వేరే విషయం. సూర్య నమస్కారాలు ఉన్నాయి. చేస్తే ఆరోగ్యం, చాలా మంచిది అని తలుపులేసుకొని చేస్తే ఏం ప్రయోజనం excersise లాగా? వాటి పేరే సూర్య నమస్కారం. ఆ కిరణాలు పడినప్పుడు ఉండే శక్తి వేరు. అందుకు పెద్ద వాళ్ళు ఏం చెప్పినా చాలా విశేషం ఉంటుంది. అయితే దేవతలు ఎప్పుడూ కూడా దర్శన మాత్ర సంతుష్టులు. మానవుడు తింటే సంతోషిస్తాదుట. దేవత దర్శిస్తే సంతోషిస్తుందిట. అందుకే దేవతకి పదార్థం నివేదించుతాం. నివేదనతో దేవత సంతోషిస్తుంది. ఒకసారి మంత్రంతో ఆవాహన చేయగానే దేవతా శక్తి వచ్చి తీరుతుంది. ఇది నమ్మకం కాదు. చాలామంది అంటూంటారు. విగ్రహారాధన మన నమ్మకం అని. పిచ్చి. విగ్రహారాధన నమ్మకం కాదు సైన్స్ అది. ఆ విగ్రహ కల్పనలో ఒక శాస్త్రం ఉంది. దానిని పూజించేటప్పుడు మంత్రముతో ఆవాహన చేస్తాం. మంత్రంలో దేవతా చైతన్యం ఉంటుంది కనుక మంత్రం అని ఒక పువ్వో, దళమో పెట్టగానే దేవతాశక్తి వచ్చి కూర్చుంటుంది. అప్పుడు ఆ దేవతకు చేయవలసిన ఉపచారములన్నీ చేయాలి. ఆ చేసేటప్పుడు నివేదన, నివేదించుతాం. అప్పుడు ఆ దేవత దృష్టి పెడుతుందిట. దేవతా దృష్టి పడగానే అన్నం పవిత్రమై పోతుందిట. అందుకే ఆ దేవతకి నివేదించేటప్పుడు చాలా శుచిగా, జాగ్రత్తగా నివేదించాలి. నివేదించి వెంటనే నివేదనకి, పూజా స్థలానికి దూరం ఎక్కువ ఉండకూడదు. కొంతమంది మా ఇంట్లో వండి తీసుకు వస్తాం నైవేద్యం పెడతారా? అంటారు. కావాలంటే ఎక్కువ దక్షిణ ఇస్తామండీ. ఇదొక పాపపు మాట. మహా దోషం అది. అలాంటివి చేయరాదు. పిచ్చి నమ్మకాలు కాదు ఇక్కడ. అలాగే దేవతకి ఏ పదార్ధం పెట్టాలో నియమం అది. ఒకాయన హాస్యం చేశాడు. దేవతల మీద హాస్యాలా? ఎప్పుడూ దేవతలకి ఇవే నైవేద్యాలా? వెరైటీగా పిజ్జా, బర్గర్లు పెడితే సరిపోదా? అంది ఒకావిడ. ఎంత పాపపు రోజులొచ్చాయో చూడండి. మనలాంటి tasteలు కావు వాళ్ళవి. వాళ్ళ బుద్ధి ఏమిటో మనం ఆలోచించగలమా? దేవతల తత్త్వమేమిటి? మన తత్త్వానికీ, పశువుల తత్త్వానికీ తేడా లేదూ? అలాగే మన తత్త్వానికీ దేవతా తత్త్వాలకీ చాలా తేడా ఉంటుంది. శాస్త్రంలో ఏది వాళ్లకి నివేదన చేయాలని చెప్పారో అదే చేయాలి. ఒక దేవతకి నివేదించిన పదార్ధం ఇంకొక దేవతకి కూడదు. పైగా కూడనివి కూడా ఉంటాయి. గణపతి విష్ణు స్వరూపమైనా ఆయనకి తులసి వేయకూడదు. ఆదిత్యుడు శివ స్వరూపమైనా మారేడు వేయకూడదు. ఆ రూపంలో ఉనప్పుడు అవి నియమాలు. ఎందుకు ఆ నియమాలు? అంటే నీకు దేవతా తత్త్వం ఎలా తెలుస్తుంది? ఏ శరీరానికి ఏది పడుతుంది అనేది ఆ శరీర తత్త్వం యొక్క లక్షణం అది. ఎవరికెలా తెలుస్తుంది? శాస్త్రం చెప్తుంది. నమ్మి చేయడమే. దేవతలను మనం detect చేయగలమా? scanning చేయగలమా? వాళ్ళ తత్త్వాలు మన తర్కాలకి అందదు. కనుక దేవతా తత్త్వం శాస్త్ర ప్రమాణంతో చెప్పుకోవాల్సిందే తప్ప తర్కాలతో భౌతిక శాస్త్రాలతో చెప్పరు.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML