గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 10 January 2015

పెళ్ళి అనే పదానికి వెండ్లి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, కళ్యాణము, సప్తాపది అనే పలు విధములుగా అర్ధములు ఉన్నవి.పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాద్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతులు ప్రకారం మారుతుంది, కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో, సాధారణంగా సన్నిహిత మరియు లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిపార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం. విస్తారంగా వివరించుటకు వివాహం అనేది ఒక సాంస్కృతికంగా సార్వజనీనమైన కార్యం.


పెళ్ళి అనే పదానికి వెండ్లి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, కళ్యాణము, సప్తాపది అనే పలు విధములుగా అర్ధములు ఉన్నవి. పెళ్ళికిఇంగ్లీషు భాషలో "'మ్యారేజ్"' అని అర్ధము. ఆంగ్లభాషలో"మ్యారేజి (Marriage) అని అంటారు. ఈ పదం మధ్య ఆంగ్ల పదమైన mariageనుండి ఉత్పత్తి అయినది. ఈ పదం మొదటగా క్రీ.పూ 1250-1300 లలో కనిపించినట్లు తెలుస్తుంది. ఈ పదం తర్వాత కాలంలో పాత ఫ్రెంచ్ భాషలో పదం marier(పెళ్ళి చేసుకొనిట) నుండి తుదకు లాటిన్ పదమైన marītāre (భర్త లేదా భార్యను సమకూర్చుట) మరియు marītāriఅనగా వివాహం చేసుకొనుట. విశేషణ పదమైన marīt-us -a, -um అనగా పెళ్ళీ సంబంధము లేదా పెళ్ళిలో పురుష రూపంలో భర్త అనే పదం లేదా స్త్రీ రూపంలో "భార్య" అనే పదానికి నామవాచక రూపంగా కూడా వాడుతారు."[1] పెళ్ళీకి సంబందించిన పదం "matrimony" పాత ఫ్రెంచ్ పదం అయిన matremoine పదం నుండి ఉద్భవించినది. ఈ పదం క్రీ.పూ 1300 కాలంలోనిది. ఆ తర్వాత ఈ పదం mātrimōniumఅనే లాటిన్ పదం నుండి జనించినది.[2]


హిందూ వివాహం ఒక పవిత్ర కార్యము అని గతంలో గుర్తింపు నివ్వడం జరిగినది. అయితే 1956 లో హిందూ వివాహ చట్టం రూపొందించిన తరువాత, వివాహానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ గానీ, విధానంగానీ చెప్పబడలేదు. అంతే కాక హిందూ మత ఆచారానికి గుర్తింపునివ్వబడింది. హిందూ మతంలో ఉన్న విభిన్న సామాజిక వర్గాలు వేరువేరు వివాహ పద్ధతులను ఆచరించడాం జరుగుతుంది. హిందూ వివాహపు సరైన గుర్తింపు కోసం మతాచారాలను పాటించడం ప్రధానం. హిందూ వివాహం చెల్లుబాటు అగుటకు ఈ క్రిందినుదహరించిన పద్ధతులు పాటించాలి.
వరుడు 21 సంవత్సరాలు, వధువు 18 సంవత్సరాలు నిండి ఉందాలి. ఈ షరతును ఉల్లంఘించితే శిక్షార్హమైన నేరంగా పరిగణింపబడుతుంది.
వధూవరులకు గతంలోణే వివాహమైన పక్షంలో వారి భార్త లేదా భర్త జీవించి ఉండరాదు లేదా అట్టి వివాహం అమలులో ఉండరాదు. ఈ షరతును భిన్నంగా జరిగిన ద్వితీయ వివాహాన్ని బహుభార్యత్వం అనే నేరంగా పరిగణిస్తారు.
వధూవరులిద్దరూ వివాహానికి అనుమతి ఇవ్వగల మానసిక సామర్థ్యం కలిగి ఉండాలి. మానసిక వైకల్యం వివాహానికి కానీ, సంతాన వృద్ధికి గానీ ఆటంకమవుతుంది.
వధూవరులిద్దరూ తరచూ మానసిక వైకల్యానికి లేదా "ఎపిలెప్సీ" అనే మానసిక వ్యాధికి గురి అయి ఉండరాదు.
వధూ వరుల మధ్య నిషేధించబడిన స్థాయిలలో బంధుత్వం ఉండరాదు. అనగా ఒకరు వారి తల్లి నుంది మూడు తరాలు లేదా తండ్రి నుండి మూడు తరాలలో బాంధవ్యం కలిగి ఉండరాదు. అలాగే వధూవరులకు సపిండ బంధుత్వంలో ఒకే తరపు బంధువు పైస్థాయిలో ఉండరాదు. సోదర/సోదరి, పిన తండ్రి/మేనమామ , మేనకోడలు/కూతురు , మేనత్త/పినతల్లి/మేనల్లుడు/కుమారుడు, సోదరులు/సోదరీల సంతానముల మధ్య వివాహం నిషేదించబడినది. ఏ వ్యక్తి అయినా తన సోదరుడి భార్యను విడాకులైన తరువాత కూడా వివాహం ఆడరాదు. అయితే ఏ ప్రాంతములోనైనా, లేదా సామాజిక వర్గంలోనైనా అనాదిగా పాటిస్తూ వచ్చిన ఆచారం రీత్యా నిషిద్ధ స్థాయిలలో బంధుత్వం ఉన్నప్పటికీ వివాహం చేసుకోవచ్చు. అలాగే భార్య గతించిన వ్యక్తి, భర్త గతించిన మహిళను వివాహమాడవచ్చు.
కేవలం సబ్‌రిజిష్టర్ కార్యాలయంలో ఒక దస్తావేజు రాసి నమోదు చేయించినంత మాత్రాన హిందూ వివాహం చెల్లుబాటు కాదు. వివాహానికి సంబంధించిన ఆచార క్రతువులు నిర్వర్తించనిదే ఆ వివాహం సక్రమమైనదిగా గుర్తించలేము. అదే విధంగా హిందూ వివాహాల రిజిష్టర్ లో అసలు వివాహం కార్యక్రమమే జరుపకుండా నమోదు చేసిన వివరాలు ఆ వివాహాన్ని చలామణి చేయవు. అయితే వివాహ కార్యక్రమం పూర్తి అయినాక హిందూ వివాహ రిజిష్టర్ లో వధూవరులు తమ వివాహ వివరాలను నమోదు చెయవచ్చు. ఈ రిజిష్టర్ లోని నమోదు చేయబడిన అంశాలు వివాహం వాస్తవంగా జరిగినట్లు సాక్ష్యంగా ఉపయోగపడతాయి. అందువల్ల ఇలా నమోదు చేయడం దంపతులిద్దరికీ ఉపయోగకరం.
ఆంధ్రప్రదేశ్ లో అన్ని వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 35, మహిళా అభివృద్ధి, బాలలు మరియు వికలాంగుల సంక్షేమ విభాగం తేది.24.09.2003 ద్వారా నిర్దేశించింది. హిందువులు 1955 నాటి హిందూ వివాహ చట్టంలో పేర్కొనబడిన విధానాల ద్వారా మాత్రమే కాక 1954 నాటి ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం వివాహం చేసుకోవచ్చు. అంతేకాక హిందూ మతాచార వివాహాన్ని కూడా ప్రత్యేక వివాహాల చట్టం పరిధిలో నమోదు చేసుకోవచ్చు. ఒక హిందూ మరొక హైందవేతర స్త్రీ పురుషుల మధ్య వివాహం ప్రత్యేక వివాహం చట్ట పరిధిలోకి వస్తుంది. స్త్రీ పురుషులిద్దరు తప్పనిసరిగా హిందువులు అయినపుడు మాత్రమే వారి వివాహం హిందూ వివాహ చట్టంలోని అంశాల ద్వారా నియంత్రించబదుతుంది.


ధర్మార్ధ కామమోక్షాల నాలుగు పురుషార్ధాలలో ఒకటైన కామాన్ని ధర్మ బద్ధం చేటానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్యం నిర్వహణా మార్గం సుగమం చేయబడింది. వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది. ఉదాహరణగా బాలసారె నుండి వివాహం వరకు ఉన్నా అనేక సుసంస్కారములుజరిపించటానికి హిందూ ధర్మశాస్తం ప్రకారము వివాహం జరగని వారుకాని, వివాహానంతరం అనేక కారణాలవలన ఒంటరిగా మిగిలిన స్త్రీ, పురుషులయిననూ ఈ సంప్రదాయక కార్యక్రమములు నిర్వహించటకు అనర్హులు. దంపతులైన స్త్రీ పురుషులు మాత్రమే సంప్రదాయక విధి నిర్వహణకు అర్హులౌతారు. కనుక హిందూ సంప్రదాయంలో వివాహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తీర్ధయాత్రల సమయంలో చెప్పే సంకల్పం, దేవతామూర్తుల కళ్యాణము, సత్యనారాయణ వ్రతం, హోమం, యజ్ఞం, యాగం లాంటివి నిర్వహించటానికి గృహస్థు ధర్మపత్ని సమేతంగా జరపాలని నియమం ఉన్నది.వివిధ కులాలను బట్టి, ప్రాంతాలను బట్టి కొద్ది తేడాలున్నప్పటికీ, స్థూలంగా భారతదేశంలో జరిగే హిందూ వివాహాలన్నీ ఒక పద్ధతిలోనే ఉంటాయి.
తల్లిదండ్రుల అనుమతి లేకుండా 21 ఏళ్ళ లోపు వయసున్న యువతిని పెళ్లాడడం శిక్షార్హమైన నేరమని కర్ణాటక హైకోర్టు ప్రకటించింది.


హిందూ ధర్మ శాస్త్రముల ప్రకారము పూర్వకాలములో వివాహము కావలసిన వధూవరుల ఇరువురు తరపున తల్లిదండ్రులు, పెద్దవారు, దగ్గరివారు, స్నేహితులు, హితులు లేదా బంధువులు ముందుగా వధూవరుల జాతక సమ్మేళనము లోని ముఖ్యమైన 17 జాతక వివరణ విభాగములు మరియు 20 వింశతి (కూట) వర్గములు అనే వివాహ పొంతనములు చూసిన పిదప సంబంధము నిశ్చయించుకునేవారు.
ప్రస్తుత కాలములో వారి వారి అభిరుచుల, అవసరాల, అలవాట్ల, అందుబాటు, అవసరార్ధం, అవకాశం, ఆర్ధిక స్థితిగతుల, ఆకాంక్ష అయినదనిపించుకునేందుకు, తదితరాల మేరకు సంబంధము కలుపుకొని నిశ్చయించు కుంటున్నారు. ప్రస్తుతము వివాహ సంబంధములు ఈ రోజుల్లో ఏక కుటుంబాలలో ఎక్కువగా ఆ కుటుంబములోని వారే నిశ్చయ నిర్ణయములు తీసుకోవడము అలవాటుగా మారుతూ ఆనవాయితీగా మారిపోయింది.
జీవితంలో మరపురానిది పెళ్ళి. ఇది స్త్రీ పురుషులకు జీవన మైత్రి నిచ్చునది. శారీరక మానసిక స్థితి గతులలో విడదీయరానిది. వివాహము సర్వమతాల వారికి, వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఆమోదయోగ్యమైనది. హంగులతో ఆర్భాటాలతో వివాహము చేసుకొని ఆనందము పొందుట మన సామాజిక లక్షణము. వివాహం వల్ల ఆడ మగా ఇద్దరూ శారీరకంగాను, మానసికంగాను సుఖాన్నిపొందుతారు. పిల్లల కోసం, ఆస్తిపాస్తుల రక్షణ కోసం, వంశాభి వృద్ది కోసం పెళ్ళి అవసరం అవుతంది. "క్రమ బద్ధమైన జీవితాన్ని ఆశచూపి పురుషుడినీ, భధ్రతను భరోసాగా ఇచ్చి స్త్రీని, పెళ్ళి అనే తాడుతో గట్టిగా కట్టి పడేశాక ఇక వారివైపు చూడదు సమాజం. పెళ్ళికున్న పాత ధర్మాలు పాతబడ్డాయి, కొత్తవి రాలేదు" అన్నారు చలం.


ఆడపిల్ల వారు మగపిల్ల వాడికి చేయవలసినవి

కాలానుగుణంగా వివాహ వేడుకలు మార్పులు చెందుతున్నాయి.
స్నాతకంలో వరుడికి బట్టలు (చాపు)
పానకంలో కావడి మీద బట్టలు (చాపు)
పానకం బిందెలు - 2, గ్లాసులు - 2
మధుపర్కములు - బట్టలు (చాపు
కాళ్ళు కడుగు పళ్ళెం - 1
మరచెంబు - 1
తెరసెల్లా -1
కట్నాలు (బహుకరణలు)
పిల్ల మధుపర్కము - చీరపల్లె (పిల్ల మేనమామ ఇవ్వాలి)
భటువు (ఆభరణము)
ఉత్తర జందెము (జంధ్యము)లు
మంగళ సూత్రం - 1
మట్టెల జత - 1
పెళ్ళి గంప - 1
సదస్యంలో బట్టలు (పట్టువి)
నాగవల్లిలో ఉత్తరీయపు బట్టలు (చాపు)
స్థాళీపాకంలో దీపారాధన కుంది - 1
స్థాళీపాకంలో దీపారాధన గిన్నెలు - 2
స్థాళీపాకంలో వరుడికి బట్టలు (చాపు)
అలక పాన్పు మీద జంపఖానా
బొమ్మను అప్పగింత చీర (ఆడపడుచుకి)
ఆడపడుచు లాంచనాలు
అప్పగింతల బట్టలు
దొంగ చెంబు
గృహ ప్రవేశంలో పిల్లవాడికి బట్టలు
గృహ ప్రవేశంలో పిల్లకి బట్టలు
సత్యనారాయణ వ్రతంలో పిల్లవాడికి బట్టలు
సత్యనారాయణ వ్రతంలో పిల్లకి బట్టలు
మూడు (3) నిద్రలకు వెళ్ళినప్పుడు పిల్లవాడికి బట్టలు
మూడు (3) నిద్రలకు పిల్లవాడి వెంట వెళ్ళిన వారికి బట్టలు


ఆడపిల్ల పెళ్ళికి కావలసిన సామాగ్రి


పసుపు
కుంకుమ
తమలపాకులు
పసుపు కొమ్ములు
వక్కలు
ఎండు ఖర్జురాలు
ఎండు కొబ్బరి చిప్పలు
మంగళ సూత్రం - 1
భటువు - 1
మట్టెల జత -1
జంధ్యము (జందెము)లు - 2 సెట్ట్లు
దీపారాధన కుంది - 1
నాగలి కావడి - 1
పెళ్ళి గంప - 1
కాళ్ళు కడుగు పళ్ళెం - 1
మరచెంబు - 1
పానకం బిందెలు - 2
గ్లాసు(లు) - 1 లేదా 2
ఆడపిల్లకు మధుపర్కాలు - (బట్టలు) వల్లి (బట్ట)తో
ఆడపిల్లకు మధుపర్కాలు - (బట్టలు)
వర బహుమతి
కొబ్బరి బొండాలు - 2
ఉత్తర జంద్యములు
దారపు బంతులు
నవధాన్యాలు
మూకుళ్ళు - 6
ముంతలు -3
ప్రమిదలు -6
రవికెల గుడ్డలు
తుండు గుడ్డలు
తెరసెల్లా - 1
ఇత్తడి గిన్నెలు చిన్నవి - 2

మగపెళ్ళి వారు ఆడపిల్ల వారికి చేయవలసినవి


కాలానుగుణంగా వివాహ వేడుకలు, పద్ధతులు (తంతు) మార్పులు చెందుతున్నాయి.
స్నాతకంలో బావమరిదికి బట్టలు (చాపు)
పెళ్ళికుమార్తెను బుట్టలో తీసుకుని వచ్చిన మేనమామకు బట్టలు (చాపు)
అలక పాన్పు మీద బావమరిదికి బట్టలు
లాజకట్నం - బావమరిదికి బట్టలు
ముత్తవ కానుకలు
మంగళ సూత్రం - 1
మట్టెల జత - 1
నల్లపూసలు - అందులో బంగారపు గుండు - 1
స్థాళీపాకంలో పెళ్ళికుమార్తెకు చీర - 1
సదస్యంలో పెళ్ళికుమార్తెకు చీర - 1
నాగవల్లిలో పెళ్ళికుమార్తెకు చీర - 1
పెళ్ళికుమార్తె తల్లికి చీర - 1
గృహ ప్రవేశం అనంతరం వెళ్ళేటప్పుడు ఆడపిల్లకు చీర - 1
గృహ ప్రవేశం అనంతరం వెళ్ళేటప్పుడు ఆడపిల్ల వెంట వచ్చిన వారికి చీర - 1


మగపిల్ల వాడి పెళ్ళికి కావల్సిన సామాగ్రి


పసుపు
కుంకుమ
మట్టెలు జత
మంగళ సూత్రం
తలంబ్రాలు
తమలపాకులు
వక్కలు
ఎండు ఖర్జురాలు
కొబ్బరి చిప్పలు
బియ్యం
రవికెల గుడ్డలు
తుండు గుడ్డలు
తెరసెల్లా
పాము కోళ్ళు
భాషికాలు
నల్లపూసలు
నల్లపూసల్లో బంగారపు గుండు
గులాము
దారపు బంతి


నిశ్చయ వివాహం : పెద్దలు నిర్ణయించి కుదిర్చిన పెళ్ళిని నిశ్చయ వివాహం అంటారు. నిశ్చయ వివాహంను ఆంగ్లంలో ఆరేంజ్డ్ మ్యారేజ్ (Arranged marriage) అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం భారతదేశంలోని హిందువులు నిశ్చయ వివాహాలను జరిపిస్తున్నారు.
వధువు : హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీ, సరస్వతి, పార్వతి ల ఏకాత్మక రూపంగా వధువును తలుస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్య పరచే ప్రకృతి యొక్క ప్రతిరూపంగా వధువుయొక్క కాళ్ళకు పారాణి పూసి జడలో మల్లెలు తురిమి మొహానికి పసుపును రాసి అలంకరిస్తారు.
వరుడు :త్రిమూర్తుల దివ్యస్వరూపం. విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషునిగా వరుడిని తలుస్తారు.
పెళ్ళి చూపులు : తెలుగు వారి పెళ్ళిళ్ళలో ఉండే ఆ సందడి, సంతోషం ఎవరూ మరువలేరు. సకుటుంబ సపరివార సమేతంగా, బాజా భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే ఆ కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో ఒక మరువలేని సంఘటన. పెళ్ళి చూపులతో పెళ్ళి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. సాంప్రదాయం ప్రకారం అబ్బాయి, అమ్మాయి ఇంటికి బంధువర్గ సమేతంగా వెళ్ళి అమ్మాయిని చూస్తారు. కట్న కానుకలు, లాంఛనాలు అన్నీ కుదిరాక నిశ్చితార్థపు తేదీ నిర్ణయించు కుంటారు.
ఆహ్వాన పత్రికలు : నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారి వారి కులాచారానుసారంగా ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. వీటిని శుభలేఖలు|పెళ్ళి పత్రికలు అంటారు. మంగళ సూచకంగా శుభలేఖకు నాలుగువైపులా పసుపు పూస్తారు.
పెళ్ళి పిలుపులు : బంధుగణమును పిలుచుకొనుట అనేది పెళ్ళిళ్ళలో సర్వ సాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ, అప్పుడెప్పుడూ కలిసే బంధువులందరూ కలువవగలిగే మంచి సంధర్భాలు, పెళ్ళిళ్లు. ఆ కలయికలకు వేదికగా పెళ్ళివారి ఇల్లు మారిపోతుంది.
సరంజామా :పెళ్ళి సరంజామా కొనటం అనేది పెళ్ళి వారి ఇండ్లలో అన్నిటికంటే పెద్దపని. పెళ్ళి అనగానే పట్టుచీరల రెపరెపలు, బంగారు ఆభరణాల ధగధగలు, కొత్తకొత్త వస్తువులు ఇలా అన్నీ కొత్తగా కొనుక్కుంటారు.
కళ్యాణ మండపము : కొందరు మండపములను వాడితే మరికొందరు వాడరు. సాధారణంగా పల్లెలలో కొబ్బరి ఆకుల పందిరి వేయుట వలన మండపంయొక్క ఆవశ్యకత తక్కువ. పట్టణాలలో టిప్ టాప్ పందిరి వేయుట వలన మండపాలు తప్పని సరిగా వాడటం జరుగుతుంది.
నిశ్చితార్ధము : వధూవరులు పరస్పరం నచ్చాక వారి తలిదండ్రులు కట్నకానుకలు, ఆభరణాలు మొదలగు విషయాలు మాట్లాడుకొన్న తరువాత ఒక శుభముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించి, లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకొంటారు. ఈ వేడుక ఒక పెళ్ళి కొరకు ఒప్పందం లాంటిదనుకోవచ్చు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టుగానే భావిస్తారు. నిశ్చితార్థం అనగా వివాహ నిశ్చయం. వీలైనంత తక్కువ సమయంలో లేక నిర్ణిత కాల వ్యవధిలో వివాహంద్వారా సంబంధాన్ని ఏర్పచుకుని ఏకమవడానికి చేసిన ప్రతిపాదనను వాగ్ధానం ద్వారా నిశ్చయించుకోవడాన్ని నిశ్చితార్థం అంటారు. దీనిని ఇంగ్లీషులో Engagement అంటారు. నిశ్చితార్ధం జరిగిన తరువాత పెళ్లి అయ్యేంత వరకు నిశ్చితార్ధపు జంట లోని అబ్బాయిని పెండ్లి కుమారుడు అని అమ్మాయిని పెండ్లి కుమార్తె అని వ్యవహరిస్తారు.
స్నాతకము : పెళ్ళి కుమారుని ఇంటిలోగాని, కళ్యాణమండపంలోగాని లేదా విడిదిలోగాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు వరునిచే గోత్ర ప్రవరలు చేయిస్తారు.
కాశీప్రయాణం : బాజా భజంత్రీల మధ్య వరుడు గొడుగు పట్టుకొని చేత్తో కర్ర పుచ్చుకొని కాళ్ళకు పాదుకలు ధరించి మెడలో పసుపు బట్టను వేసుకొని తాను సన్యాసం స్వీకరించేందుకు కాశీయాత్రకు పోతున్నానని బయలుదేరుతాడు. వధువు సోదరుడు వచ్చి 'అయ్యా, బ్రహ్మచారిగారూ! మీకాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించండి', అని చెప్పి బొట్టు పెట్టి, నూతన వస్త్రాలను ఇచ్చి వెనుకకు తీసుకొని వస్తాడు. కొన్ని కులాల వారికి ఈ సంప్రదాయం లేదు.
వరపూజ (ఎదురుకోలు) :కాశీయాత్ర విరమించుకొని వరుడు కళ్యణ మండపానికి వస్తుంటే కన్యాదాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో ఎదురేగి స్వాగతం పలుకుతాడు. పానకం వరునికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. తరువాత కన్యాదాత అందరినీ మండపానికి తీసుకెళతాడు.
గౌరీవృతం :
మంగళ స్నానాలు :
కన్యావరణము :బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందుటకై వచ్చే వరునికి ఎదురేగి 'నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్దిల్లమ'ని కన్యాదాత దీవిస్తాడు.
మధుపర్కం : మధువు అంటే తేనె.కుమార్తెకు భర్తగా వరుని ఎంపిక తరువాత అతను వధువు తల్లి తండ్రికి సంప్రదాయం అనుసరించి పుత్ర సమానుడౌతాడు.వివాహానంతరం మధుపర్కము అంటే తీయని పానీయము అని అర్ధము. ఇంతకు ముందు దీనిని ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రస్తుతము దీనికి బదులుగా వరునికి పంచదార రుచి చూపిస్తున్నారు.
యజ్ఞోపవీతధారణ :
మహాసంకల్పం :
కాళ్ళు కడుగుట :
సుముహూర్తం (జీలకర్ర, బెల్లం) : పెళ్ళిచూపులతో ఒక కార్యక్రమం పూర్తి అయిన పిదప వారిరువురి జాతకాల ననుసరించి జ్యోతిష్యములో అనుభవమున్న పండితులతో పెళ్ళికి తగిన ముహూర్తం నిర్ణయించ బడుతుంది. వారు నిర్ణయించిన ముహూర్తానికి వరుడు వధువు తలపై జీలకర్ర బెల్లం పెట్టడం జరుగును. ఈ కార్యక్రమమునందు ఈ క్రింది మంత్రము చదువుతారు.
“అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే!ఇంద్రపుత్రఘ్నీం లక్ష్మంతామస్మై సవితు స్సువః!! ఓం అఘోర చక్షురపతిఘ్వేది శివా పతిభ్య స్సు మనా స్సు వర్చా!! జీవ సూర్ధేవ కామాస్యోనా శంనో భవద్విపదే శంచతుష్టదే!!!!”
కాళ్ళు తొక్కించడం :
కన్యాదానం : దానము అంటే ఇతరులకిచ్చునది. అది విద్య, భూమి, వస్తువు ఇలా వీటిని వారి వారి జీవన విధానానికి అనువుగా మలచుకొనేందుకు ఇస్తారు. అలాగే కన్యాదానము చేసేది వరుడు ఆమెతో సహజీవనము చేస్తూ గృహస్థుడై అభివృద్ది చెందవలెనని. ఈ క్రింది మంత్రముతో కన్యను వరునికి అప్పగిస్తారు.
“కన్యాం కనక సంఫన్నాం'కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం'బ్రహ్మలోక జగీషియా!!”
పరాశర ప్రకారం అష్ట వర్ష భవేత్ కన్యా."అపూర్ణ దశవర్షా కన్యముద్వహేత్ " అని ఆపస్థంభం.సప్తవర్షా భవేద్గౌరీ,దశవర్షాతు నగ్నికా,ద్వాదశేతు భవేత్కన్యా,అత ఊర్ద్వం రజస్వలా" భవిష్యపురాణం ప్రకారం 12ఏళ్ళు దాటితే పుష్పవతి కాకున్నను సంభోగార్హత ఉంది."వర్ష ద్వాదశకాదూర్ద్వం నస్యాత్పుష్పం బహిర్యది"అని కాశ్యప సంహిత.
దీని అర్ధం-ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకము వంటి శరీర చాయ కలది. శరీరమంతయు ఆభరణములు కలిగినది. నా పిత్రాదులు సంసారమున విజయము పొంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిపొందినట్టు శృతి వలన విని యున్నాను. నేనూ ఆ శాశ్వత ప్రాప్తి పొందుటకై విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానము చేయుచున్నాను.మొత్తము మీద వధువు (భార్య) పురుషార్ధాలైన ధర్మ,అర్ధ,కామ,మొక్షము లకు మూలమని కన్యాదానం చెబుతుంది.
స్వర్ణ జలాభిమంత్రం :
యోత్రేభంధనం :
మంగళసూత్రధారణ : వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు.
“మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే బద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం!!”
మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వత అనుభంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం.శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు. ఆందుకే స్త్రీలు మాత్రమే మంగళ సూత్రాన్ని ధరిస్తారు. వివాహిత స్త్రీ మెడలో మంగళ సూత్రం లేదంటే ఆమెను విధవరాలుగా భావించవచ్చును.
తలంబ్రాలు : మంగళ సూత్రధారణ పూర్తి అయిన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకొంటారు. దీనినే అక్షతారోహణంఅంటారు. 'క్షత' అంటే విరుగునది- 'అక్షత' అంటే విరగనిది. అనగా విడదీయరాని బంధము కావలెనని భావము. తలన్+బ్రాలు అంటే తల నుండి క్రిందికి జారునవి అని ఈ క్రింది మంత్రముతో పురోహితుడు తలంబ్రాల కార్యక్రమము కొనసాగిస్తాడు.
“ప్రజాపతి స్త్రియాం యశః'ముష్కరోయధధాద్సపం! కామస్య తృప్తిమానందం'తస్యాగ్నేభాజయేహమా!!”
బ్రహ్మముడి :
అంగుళీకాలు తీయడం : ఉంగరాలు తీయడాన్నే ప్రధానాంగుళీయకం అంటారు. మూత కురచగా ఉండే చిన్న బిందెలో పాలూ, నీళ్ళూ పోస్తారు. దానిలో ఒక బంగారు ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పగానే గభాలున దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నిస్తారు. దొరికిన వారు వేరొకరికి తొడుగుతారు. చూడటానికి సరదాగా కన్పించే ఇది కేవలం అప్పటిదాకా పరిచయం లేని వదూవరులకు స్పర్శ తాలూకు సాన్నిహిత్యాన్ని తెలియచేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం.
సప్తపది, పాణిగ్రహణం :నాలుగు మంత్రాలతో వరుడు వధువు చేతిని తన చేతిలోకి తీసుకోవడం అగ్ని సమక్షంలో జరుగుతుంది. అంటే అగ్ని సాక్షిగా జరుగుతుంది. మంచి సంతానం కోసం, విధి విహితమైన కర్మలను నిర్వర్తించడం కోసం పాణిగ్రహణం చేస్తున్నానని వధువు అనడం ఈ మంత్రాల ఆంతర్యం. వరుడు తన కుడిహస్తాన్ని కింద ఉండే విధంగా వధువు హస్తం పైన ఉండే విధంగా పట్టుకుంటాడు. కేవలం స్త్రీ సంతానాన్ని మాత్రమే కోరుతుంటే వరుడు వధువు వేళ్లు మాత్రమే పట్టుకునేవాడు. ఇప్పుడు ఈ ఆచారాలను పాటించేవారు అరుదు.
సన్నికల్లుతోయం :
పెళ్ళుకూతురు చేత "సన్నికల్లు" ఎందుకు తొక్కిస్తారు?సన్ని కల్లు పొత్రం ఒకటి లెకపొతే రెండోది పని చెయ్యదు, పెళ్ళికూతురి కాలికి మెట్టెలు అప్పుడే పెట్టిస్తారు వరుడి చెత, అలా పెట్టించి సప్తపది హోమం చుట్టు వెయించి ,వరుడు వధువు మెడలో నల్ల పూసలు కడతాడు,ఒకరికొకరు, సన్ని కల్లు పొత్రం లా కలిసి ఉందాలని దీని సంకేతం.రుబ్బురొలు పెద్దగా ఉంటుంది, ఇంకా శివ స్వరూపం , దాన్ని మోసుకు రావటం కష్టం కనుక సన్ని కల్లు మీద చెయించరు మనవాళ్ళు. ఇది కూడా ఒక సాక్షం గా తీసుకుంటారు, అగ్నిని తీసుకున్నట్టు.
రాజహోమం :
స్థాలీపాకం
నాగవల్లి
సదస్యం
నల్లపూసలు : మంగళ సూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరించడం మన హిందూ సాంప్రదాయం. దుష్ట శక్తులు తన మాంగల్యం మీద పడకుండా ఉండటానికి ముక్యంగా ధరిస్తారు. అంతే కాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము.పెళ్లైందన్న గుర్తుతో పాటు అంగరంగ వైబోగంగా జరిగిన తమ వివాహం గురించి , తమ సంసారిక సుఖజీవనాన్ని గురించి నలుగురు మాట్లాడుకునేటప్పుడు వారి నోటి వెంట వచ్చిన దోషాలను అరికడుతుందని ఓ నమ్మకం.ప్రతి మాట చేష్ట చేష్ట తనదని స్రీ ఒప్పుకున్నందుకు నిదర్శనంగా చెబుతారు. ఏమైనా బంగారంతో చుట్టిన నల్లపూసలు ధరించటం వల్ల ఓ ప్రత్యేక అందం స్రీకి వస్తుందనటంలో సందేహం లేదు.
అరుంధతీ నక్షత్రం
ముందు అరంధతీ నక్షత్రం కని పించేది రాత్రి పూట మాత్రమే. తరువాత సప్తఋషి మండలం చెవర వశిష్టుడి వెనకగా కొంచం చిన్నగా కనిపిస్తుంది అరుంధతీ నక్షత్రం. అరుంధతీ దేవి మహా పతివ్రత .అగ్ని హోత్రుడు సప్తఋషుల భార్యల అందానికి మోహింపపడి క్షీణించి పోతూ ఉండగా వివరం తెలుసుకున్న అగ్ని హోత్రుడి భార్య స్వహా దేవి వశిష్టుడి భార్య ఐన అరుధతి తప్ప మిగతా అందరి భార్యల వెషమూ వెయ్య గలిగింది, కానీ ఎంత ప్రయత్నించినా అరుంధతీ దేవి వేషం వెయ్య లేక పోయింది. అందుకనే మహా పతివ్రత ఐన అరుంధతి కూడా నక్షత్రం ఐ నూతన వదూవరులకి సప్తపది ఐన తరువాత చూపించ పడుతుంది . ఇది అగ్ని హోత్రుడు ,ఆవిడకి ఇచ్చిన వరము.పగటి పూట నక్షత్రము చూపటము మన పురోహితుల మూర్ఖత్వము తప్ప మరేమీ లేదు.అసలు సప్తపది వివాహానంతరము రాత్రి పూట చేయించి స్తాళీ పాకం షేష హోమం తరువాత వధూవరులకి అరుంధతీ నక్షత్రాన్ని చూపించాలి.మనవాళ్ళు ఇప్పుడు సమయాభావం వల్ల పగలే అన్నీ చెసేసినక్షత్రాన్ని కూడా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు.వాళ్ళకి మాత్రం కనిపిస్తుందా?
అంపకాలు
సత్యనారాయణ వ్రతం
కంకణి విమోచనం
గర్భాధానం : గర్బాధానం అనగా స్త్రీ గర్భమును పురుషునికి దానం చేయుట. అంటే పురుషుడు తన వీర్యకణ విత్తనాలు నాటుటకు స్త్రీ తన మట్టి వంటి గర్భమును దానం చేయుట.గర్భాధానాన్ని శోభనం అని కూడా అంటారు.గర్బాధానం స్త్రీ యొక్క పుట్టింట 3 రాత్రులు, మెట్టినింట 3 రాత్రులు ఉండును. ఈ కార్యంలో భార్యా భర్తలు శారీకంగా కలుస్తారు.గర్బాధానం వలన సంతానం కలుగుతుంది. వివాహంతరువాత నవదంపతులు శారీరకంగా ఒకటయ్యే మొదటి రాత్రి జరిపే సంభోగం, శోభనం అంటారు. ఇది నూతన జంటకు చాలా మధురమైనది. ఆ రాత్రిని శోభనరాత్రి అంటారు.
విందువినోదాలు :పెళ్ళిళ్ళలో విందు వినోదములకు పెద్దపీట వేస్తారు. ఎంత గొప్పగా పెళ్ళి చేసారు అనేది వారు నిర్వహించిన విందు వినోదాల వలననే తెలుస్తుందంటారు. ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధంగా విందు వినోదాలు జరుగుతాయి.
భార్య చిటికిన వేలును భర్త చిటికిన వేలుతో పట్టుకోమని బ్రహ్మ ముడి వేస్తారు ఎందుకో తెలుసా...? భార్య భర్తల బంధంలో ఒకరిని ఒకరు విడిచి ఉండకూడదు. ప్రయాణమైన-పుణ్యక్షేత్రమైన-మోక్షమైన-వనవాసమైన భార్య భర్తలు కలిసి వెళ్ళాలి-ఉండాలి. భార్య భర్తలుగా మారటం అంటే రెండు శరీరాలు ఒకే ప్రాణంగా మనుగడ సాగించటం. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగిన ఎన్ని మనస్పర్ధలు ఉన్న వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ముడి.., అంటే వీళ్ళ మధ్య ఇంకొకరు దూరటానికి వీలు లేని విధంగా ఉండాలని, అలా ఉంచుకోవాలని గోరంత స్థలము ఏర్పడినా ఆ అదును చూసుకొని మూడో వ్యక్తి స్థలము ఏర్పరచుకుంటారని- ఏమి జరిగినా భర్తతోనే జీవితం అనుకోవాలని స్త్రీకి - భార్యే సర్వస్వంగా భావించాలని భర్తకి చెప్పి బ్రహ్మ ముడి వేస్తారు - "అంటే రెండు శరీరాలను ఒక ప్రాణంగా మార్చటం " శుభలేఖలకి నలువైపులా పసుపును ఎందుకు రాస్తారు? ఇది దేనికి సూచిక?
మహలక్ష్మిదేవికి, ఆమె అక్క జ్యేష్టదేవికి ఎవరెక్కడ ఉండాలన్న విషయమై చర్చ వచ్చింది. లక్ష్మీదేవి సముద్రంలోకి వెళ్లి దాక్కోవటంతో ఆమెని బయటికి రమ్మని జ్యేష్టాదేవి కోరింది. ఆ సమస్య కొలిక్కి వచ్చిన సమయంలో లక్ష్మీదేవి తానేక్క డ ఉంటుందో చెప్పింది. వాటిలో పసుపు ఒకటి. అందువల్లనే వివాహ శుభలేఖలకి , కొత్త వ్యాపార పుస్తకాలకు పసుపు రాసి శ్రిమహలక్ష్మికి ఆహ్వానం పలుకుతారు. ఆమెను ఆవిధంగా స్మరించుకోవడం వల్ల ఆమె కృప అన్నివేళలా వారిపై ఉంటుందని పురాణాలూ తెలియజేస్తున్నాయి. చెల్లెలి మాటపై జ్యేష్టాదేవి ఆ పరిసరాల్లోకి రాదు. అగ్ని కూడా ఇక్కడే సాక్షి , పెళ్ళి మంటపంలో మంగళ సూత్రం కట్టే ప్పుడు అక్కడ అగ్ని పెట్టరు, పక్కన విడిగా పెడతారు.
పెళ్లిలో వరుడు వధువు నడుముకి ఒక తాడు కడతాడు... అదేంటి? ఎందుకు అలా కడతారు
అలా నడుముకి తాడు కట్టడాన్ని యోక్త్రధారణ అంటారు. యోక్త్రం అంటే ధర్భలతో వేసిన త్రాడు. ఇది ఒక రకంగా నడుము బిగించడం/దీక్ష తీసుకోవడం లాంటిది. మంచి మనస్సును, మంచి సంతతిని, సౌభాగ్యాన్ని కలిగి ఉండి సహధర్మచారిణివై సత్కార్యములు చేయడానికి సిద్దముకమ్ము. ఈ జీవిత యజ్ఞమనే పనికి నడుము కట్టుము అని
అగ్ని సాక్షిగా పెళ్ళి చేసుకోవడం
ఆడపిల్ల పుట్టగానే ఆమె పోషణ భాద్యత (సోమునిది)చంద్రునిది. కొన్ని సంవత్సరాలు ఆమె పోషణ చంద్రుడు స్వీకరించి ఆమెకు ఆకర్షనీయతను అందిస్తాడంట. తరువాత గంధర్వుడు పోషణ భాధ్యత స్వీకరించి ఆమెకు లావణ్యాన్ని సమకూరుస్తాడట. ఆ తరువాత అగ్ని కొన్ని సంవత్సరాలు పోషించి కామగుణాన్ని పెంపొందిస్తాడంట. ఈ విధంగా పరిపక్వమయిన కన్యగా మారిన తరువాత ఆమెను "వరుడు" స్వీకరిస్తాడు అని శాస్త్రాలు చెప్పాయి అని విన్నాను. ఈ విధంగా చంద్రుడు సాక్షిగా గంధర్వుడు, గంధర్వుడు సాక్షిగా అగ్ని, అగ్ని సాక్షిగా "వరుడు" స్వీకరిస్తాడు కాబట్టి "అగ్ని సాక్షిగా పెళ్ళి చేసుకోవడం" అంటారు అని విన్నాను పెళ్ళిలోవదువు వరుడు "తలంబ్రాలు" ఎందుకు పోసుకుంటారు
మాంగల్య ధారణ అనంతరం అత్యంత కోలాహలంగా-ఇరువైపు బంధుమిత్రుల మధ్య పోటీలాగా జరిగే తంతు వధూ-వరులు "తలంబ్రాలు" పోసుకోవడం. ఎందుకంటే, వధూవరులుతో పాటు, బంధుమిత్రులకు కూడా చక్కటి వినోదాన్ని-ఆనందాన్ని కలిగించే కార్యక్రమం ఇది. మంగళ సూత్ర ధారణ పూర్తైన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకోవడం హిందూ సాంప్రదాయం. దీనిని అక్షతా రోహణం అని కూడా అంటారు కొందరు. 'క్షత' అంటే విరుగునది-'అక్షత' అంటే విరగనిది. అంటే, "వివాహ బంధం" విడదీయరాని బంధం కావాలని భావం. "తలన్+బ్రాలు" అంటే తల నుండి క్రిందికి జారేవి అని కూడా అర్థం. అర్థాలు ఏవైనా, ఇదొక ఆనంద ప్రదమైన ఆచారం. వధూవరుల గృహస్థా శ్రమ జీవితం శుభప్రదంగా, మంగళ ప్రదంగా వుండాలని "మంగళ ద్రవ్యాలతో" చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది. పసుపు-బియ్యం-నెయ్యి-ఆవు పాలు అనే మంగళ ద్రవ్యాలతో ఈ తంతు జరిపిస్తారు.
కన్యను దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని. తథాస్తు అనే వాడు వాయువు. దంపతులు చాలా బాగున్నారని అనే వాడు చంద్రుడు. ఇవన్నీ నిజమే అని వంత పలికే వాడు-ఆనందించే వాడు సూర్యుడు. ఇవన్నీ అర్థం వచ్చే రీతిలో పురోహితుడు చెపుతున్న మంత్రాల మధ్య, వరుడి చేతితో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన మొదలు పోయిస్తారు. "నీవలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక" అని వరుడితో అనిపించుతారు. దానికి వధువు సమాధానం చెప్పకుండా, అంగీకార సూచకంగా, పురోహితుడు చెప్పిన పద్ధతిలో, వరుడి లాగనే తలంబ్రాలు తీసుకొని, వరుడి శిరస్సుపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు, "పుట్టబోయే సంతానానికి పాల కొరకు" అన్న అర్థం వచ్చే రీతిలో, "నా పశు సంపద అభివృద్ధి చెందుగాక" అని వధువుతో అనిపించుతారు. దీనికి అంగీకార సూచకంగా వరుడు తలంబ్రాలు పోయాలి. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థస్ఫూర్తిగల మంత్రాల చదువుతుంటే, వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు. చివరికి అదొక పోటీలాగా ఒకరి శిరస్సుపై మరొకరు పోసుకోవడం ఇటీవలి కాలంలో ఆచారంగా మారింది. తలంబ్రాల పళ్లెం ఎత్తి శిరస్సుపై కుమ్మరించడం కూడా పరిపాటై పోయింది. ఈ తంతు ముగిసిన తర్వాత, "బ్రహ్మ ముడి" వేడుక జరుగుతుంది. వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేస్తారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో ముడి వేయడం అనే భావన వుందిందులో. ఇకనుంచి, ఇరువురు కలిసి-మెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, "ఇంటి యజమానురాలు" గా అన్ని బాధ్యతలు స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దు కోవడానికి రమ్మని, వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు వివాహం వల్ల భార్యా భర్తలు కలిసి మెలసి ఒకరికొకరు తోడుగా ఉండాలని సమాజం ఆశిస్తుంది. వివాహం నిలబడటానికి భార్యాభర్తలు ఒకరి నుండి మరికరు వేరు కారాదు. అయితే దంపతులలో ఎవరైనా సరైన కారణం లేకుండా మరికరిని వదిలి దూరమైతే బాధిత్ భర్త లేదా భార్య కోర్టుద్వారా తమ వైవాహిక సంబంధాల పునరుద్ధరణ కోసం దావా దాఖలు చేయవచ్చు. అయితే తప్పుచేసిన వ్యక్తి ఇలాంతి పరిహారం తీసుకోవడానికి వీలులేదు.

మనువు వివాహ పద్దతులను 8 రకాలు గ విభజించారు ..

1. బ్రాహ్మo 2 దైవం 3. ఆర్షం 4 ప్రాజపత్యం 5 ఆసురం 6 గాoదర్వం 7 రాక్షసం 8 పైశాచం

1) బ్రాహ్మo అంటే అలంకరించిన కన్యను పoడితుడు, శిలవతుడు, అయిన వరుడిని పిలిచి దానం ఇవ్వడం ...

అంటే మనం ఈ రోజుల్లో చేసుకునే పెద్దలు నిర్ణయించిన పెళ్లి అన్న మాట

6) గాoదర్వం అంటే వధు వరులు ఇరువురు పరస్పర అనురాగంతో మంత్రములు లేకుండా చేసుకోవడం ..
అంటే ప్రేమ పెళ్లి అన్నమాట ...

వివాహం ఎందుకు?

మనిషి పుడుతూనే 3 రుణాలు తో పుడతాడు ...

1) రుషి ఋణం 2) దేవ ఋణం 3) పితృ ఋణం

ఋషి ఋణం మంచి విద్యను, పురాణాలను అభ్యసించి వాటిని తరవాత తరం వారికీ అందిచటం ద్వారా ఈ ఋణం తీరుతుంది.

దేవ ఋణం మన యజ్ఞము లు , క్రతువులు నిర్వహించుట ద్వారా ఈ ఋణం తీరుతుంది ..

పితృ ఋణం మంచి సంతానం కనటం ద్వారా ఈ ఋణo తీరుతుంది..

వేద అధ్యయనం, యజ్ఞo చేయటం, సంతానం కనటం ఇవి మానవుడు తప్పని సరిగా చేయవలిసిన విధులు.

ప్రతి మానవుడి జీవితం లో నాలుగు దశలు ఉంటాయి

అవి 1) బ్రహ్మచర్యం 2) గృహస్తం 3) వానప్రస్తం ఇంకా 4) సన్యాసం

బ్రహ్మచర్య దశ లో నియమ నిష్ఠలతో విద్యాబ్యాసం చేయాలి ..

గృహస్త ఆశ్రమం లో.. వివాహం చేసుకొని చక్కని సంతానాన్ని కలిగి వారిని సమాజం లో మంచి వ్యక్తులు గ తీర్చిదిద్దాలి ..

వానప్రస్తం లో పిల్లలకు వివాహాది కార్యక్రమములు నిర్వహించి మన భాద్యతలని నేరేవేర్చాలి .

సన్యాసం లో రాగా ద్వేషాలని విడిచి భగవంతుని ధ్యానం లో నిమగ్నమవటం ...

పెళ్లి ఎవరితో.... ఎప్పుడు .....?

భారతీయులకి, వివాహం ఒక వేడుక, ఉత్సవం కాదు అది ఒక సంస్కారం .. అందుకే మన లో వివాహానికి అంతటి విలువ.
వివాహ వయస్సు ఈ నాటి పరిస్తితుల లో 18-25 ఉత్తమం.

ఎంపిక ఎలా ?

బుద్దిమంతులు, తెలివిగల 4 మిత్రులను వెదుకుటకు పంపుతారు, వారు నలుగురిని విచారించి అటు వైపు వారికీ , ఇటు వైపు వారికీ కనీసం 3 తరాలు తక్కువ కాకుండా వివరములు తెలుపుతారు.

అలా తెలుసుకున్నట పిమ్మట తమ అంగీకారం తెలుపుటకు తాంబూలాలు

Significance of Indian(Telugu) Wedding

A Telugu Wedding is an elaborate affair and comprises of a large number of rituals and ceremonies that spread over several days. It may be noted that there may be certain regional and caste variations regarding ceremonies related to Telugu wedding ceremony. However, what remains essentially the same is the highest regard of Telugu people for the institution of marriage.
Here is a short description of some of the popular pre-wedding rituals of a Telugu marriage ceremony.
Pre-Wedding Rituals:
Nischitaartham: The wedding ceremony is the most celebrated social event in Indic societies . The concept of marriage as a major event in a human life, can be traced back to Vedic times. Mostly Hindu marriage ceremonies are elaborate ones and they may last for a few days especially among those who are wealthy enough to afford the same. Although the main wedding ceremony is a one-day affair, there are different ceremonies that are held on separate days preceding the main wedding ceremony. According to Hindu religion out of sixteen ceremonies in a person's lifetime, marriage is considered to be the thirteenth one. In most Indic societies where arranged marriages are not uncommon, the decisions regarding the conduct of the marriage are made jointly.
Once they decide, the date of the engagement and marriage is fixed. There are various pre wedding functions and rituals one of which is the engagement ceremony, and which is the most important since it marks the beginning of the wedding ceremony. In this day and age, especially among the Diaspora when an extended courtship appears to be the norm rather than the exception, it is not uncommon for an engagement ceremony to be held months before the wedding is conducted. It is known by different names in different regions of the country such as Misri, ring ceremony, aashirwad, Vaagdaanam or Vaakdaana , Nischitaartha and mangni. Nischitaartha means the process of making a decision and a commitment to each other, and is generally the term used in the Southern part of India. The term literally means "firming up". The ceremony is based on vedic practices going back over 5000 years begins with a Ganapati Puja and consists mainly of pledges between the 2 fathers. This is done by invoking the lineage of the families and making a formal proposal for the alliance. Variations notwithstanding, the general practice is for the father of the bride to make the initial overture. The affirmative response by the parents of the groom, signifies the resulting commitment to the marriage.
In the Western tradition, an engagement consisting mainly of a proposal by the prospective groom to the intended bride to marry him is generally made in private and is accompanied by the gift of a ring to the lady. an engagement party may then take place depending on the interval between the engagement and the marriage itself.
Muhurtam: Muhurtam means determining the auspicious part of the day for the marriage. The period that is considered auspicious starts from 7.00 p.m. and goes on till the next day until about 11 am. Telugu Weddings don't usually take place in the months of Aashad, Bhadrapada and Shunya as these months are considered not auspicious. The following are the names of the months in the Hindu calendar
Chaitra, Vaishakh, Jeshta, Ashadh, Shrawan(Sawan), Bhadrapad(Bhado), Ashwin, Kartik, Margshirsh, Paush(Pushya), Magha, Falgoon (Fagan)

Pendlikoothuru/Pendlikoduku: This ceremony involves anointing the bride and the groom with oil and turmeric before bath. Following the bath, the couple dons new clothes. The bride-to-be wears flowers in her hair. She also adorns her forehead with a bindi or vermilion dot and wears bangles on her wrists.
Upanayanam: It is a sacred thread ceremony that all men have to undergo before they are considered eligible for marriage. It involves wearing a white thread known as jynau on the upper part of the body.
Snathakam: Snathakam ceremony is performed at the bridegroom's house before the muhurtam. It is a sort of thread ceremony that involves making the groom wear a silver thread on his body.
Eduru Sannaham & Kashi Yatra: This is an extremely joyful ceremony. Following the tradition, after the recitation of Vedic verses, the groom pretends to leave for Kashi, a pilgrimage center to become an ascetic. He carries a walking stick and other essentials to show that he is not interested in becoming a householder anymore. He relents and agrees to the marriage only after he is stopped and persuaded by the bride's brother to fulfill his responsibilities as a householder.
Mangala Snaanam: Following the custom, the bride and groom must take a Mangala Snaanam or an auspicious bath on the day of the wedding. The bath is believed to cleanse and purify them and make them ready for the sacred rites that are to follow.
Aarti: After the ceremonial bath, the bride and groom are anointed with oil at their respective homes. Their families perform aarti. The ceremony is significant as it carries with it the family's prayer that the mind of the bride/groom be illuminated by wisdom.
Ganesh & Gauri Pooja: The bridegroom performs Ganesh pooja in the mandapam or wedding hall just before the marriage ceremony. Worshipping the revered Ganesha who is the remover of all obstacles. Similarly, the bride performs Gauri Puja and seeks blessings for a blissful married life.
Wedding Rituals: A typical Telugu Wedding is full of joyous and colorful rituals. Please read on to know more about Telugu Wedding traditions.
Kanyadaanam: A significant part of Hindu weddings, the Kanayadaan is that part of the marriage ceremony in which the girl's family gives her way to the groom. In a traditional Telugu wedding, bride's maternal uncle carries her in a bamboo basket to the mandapam where a curtain separates the bride and bridegroom. They are not to see each other until after the marriage ceremony. The priest invokes the blessings of the ancestors belonging to the last seven generations of both families. The bride's parents wash the groom's feet in a gesture that symbolizes their belief that he is a form of God to whom they now offer their daughter's hand.
Jeelakarra Bellam: After the priest recites the wedding shlokas from the Vedas, the bride and groom apply a paste of cumin seeds (jeera) and jaggery on each other's hands. This is known as Jeelakarra-Bellamu. This slightly bitter cumin and sweet jaggery when ground together turn into an inseparable mixture. The custom signifies that bride and groom are supposed to become inseparable through life's bitter and sweet times.
Madhuparkam: For the Madhuparkam ceremony the bride wears a white cotton sari with a red border, while the groom dons a white cotton dhoti with a red border. White signifies purity and chastity, while red color represents strength.
Jyothulu & Talambralu: Under this ceremony, ten married women (Sumangalis) accompany the bride. Six of them hold plates full of rice and turmeric powder mixed together. The remaining hold plates with small lamps made from a mixture of rice flour, sugar and milk. Rice signifies abundance while lit lamps represent sweetness and light, two qualities that the bride brings with her to this new phase of life.
Mangalsutra: To carry out this ritual, the curtain between the bride and the groom is removed. After offering prayers, the groom ties the two strings each with a golden disc representing the Mangalsutra separately around the bride's neck with three knots to represent the strength of their union physical, mental and spiritual.
Garlands: After the mangalsutra ceremony, the couple exchange garlands. Those present at the wedding shower their blessings on the couple by sprinkling flowers and turmeric-colored rice or Akshat on them.
Saptapadi: 'Saptapadi' or seven steps are what the couple takes together. In this ceremony the bride's saree and the groom's dhoti are tied together at one end in a knot. In each step that he takes, the groom prays for life-long blessings. During this ceremony, saris, ornaments and other gifts are offered to the couple and to other family members.
Sthaalipaakam: In this sweet ceremony, the groom slips silver toe rings on the bride's feet. The girl is also adorned with a string of black beads, to protect her from the evil eye.
Arundhati Darshanam: Here, the couple gazes out together on the Arundhati star as a reminder to the pair about their cosmic responsibilities that they have to perform in the coming walks of life.
Appagintalu: It refers to handing over the daughter to the groom and his family after the marriage ceremony is over.

Post-Wedding Rituals: Given here is a short description of some prominent post-wedding rituals of a traditional Telugu Wedding.
Grihapravesh: When the marriage ceremony is over the bride is ceremonially taken to the groom's home for Griha Pravesh (entering the house for the first time). Here, the in-laws give the bride a warm welcome.
16 days festival: As is customary in a Telugu wedding, the two mangalsutras are united on a common thread 16 days after the wedding. An elder member of the family or the husband himself can unite the two mangalsutras on a common thread. A few black or golden beads are slipped between the two plates so that they don't clash with each other. Signifying harmony between the two families. The bride takes a bath and wears a new sari before wearing the mangalsutra on this day. 16 days are symbolic of the time needed by the bride to understand her husband's family.

హిందూ వివాహము - ఆచారవ్యవహారాలు

కన్యను అలంకరించి వరునికి ఇచ్చి జరిపించే వివాహం బ్రహ్మ వివాహం,
యజ్ఞం చేయడం కోసం రుత్విక్కుకు కన్యని దక్షిణగా ఇవ్వడం దైవవివాహం,
ఆవు, ఎద్దు దానం చేసి ఆపై కన్యను ఇవ్వడం ఆర్ష వివాహం,
మహానుభావునికి ప్రియురాలిగా సహధర్మచారిణి గ ఉండమని ఆదేశించి కన్యను ఇవ్వడం ప్రాజాపత్య వివాహం,
తల్లి, తండ్రి అనుమతి లేకుండా ఇరువురు చేసుకోవడం గాంధర్వ వివాహము,
షరతు పెట్టి వివాహం చేసుకోవడం అసుర వివాహం,
కన్యను బలాత్కారంగా తీసుకెళ్ళి వివాహం చేసుకోవడం రాక్షస వివాహం,
కన్య నిదురపోతున్నప్పుడు, ఏమరు పాటుగా ఉన్నప్పుడు అనుభవించి ,చేసుకున్న వివాహం పైశాచిక వివాహం.

పెళ్ళిలో వధూవరులు ఒకరిపై ఒకరు తలలపై జీలకర్ర, బెల్లం పెట్టేదేందుకు?--- మంత్రాలతో వధూవరుల నెత్తి మీద జీలకర్ర,బెల్లం పెట్టేది శుభాసూచికముతో పాటు శరీరంలో ఉన్న దోషాలు పోవాలని, జీలకర్ర, బెల్లంలా వారిరువురు కలసి మెలసి ఉండాలని. జీలకర్ర, బెల్లం పెట్టె సమయమే వధూవరుల తొలిస్పర్శ .ఎప్పుడైతే ఒకరినిఒకరు తాకుతారో అప్పుడే పెల్లయిపోయినట్టు.

తలంబ్రాలు పోసుకునేదేందుకు? ---- ప్రధమంగా నాలుగుసార్లు ఒకరిపై ఒకరు పోసుకొని ఆపై పోటిపడి ఒకరిపై ఒకరు సంతోషంగా పోసుకుంటారు. ఆ సమయాన మంత్రాలకు అర్ధం సంతానం వృద్ధి చెందాలని మగవాడు, ధన ధాన్యాలు వృద్ధి చెందాలని వధువు ....ఇలా సమస్త సంపదలు, సుఖాలు కావాలని ఇరువురు భగవంతున్ని కోరుకోవడమే తలంబ్రాల ఉద్దేశము.

సప్తపది అనగా ఏంటి? ---- వరుడు వధువుని ఏడడుగులు నడిపిస్తూ.... నన్నే సదా అనుసరించు, పరమేశ్వరుడు నీవు నాతో నడిచే అడుగుతో మనల్ని ఒకటిగా చేయాలి. ఇంకా అన్నాన్ని, శక్తిని, బుద్ధిని , సుఖాన్ని పశువ్రుద్ధిని, రుతు సంపదను, ఋత్విక్ సంపదను కలగచేయాలి. ఇరువురము ధర్మ,మోక్ష, సుఖ కార్యాలను కలసి చేద్దాము.

పెళ్ళిలో మంగళసూత్రం కట్టడంలో పరమార్ధం ఏంటి? --- పెల్లికోడుకైన నేను నీ మేడలో మాంగల్యం కడుతున్నాను, నా, నీ జీవనం ఈ క్షణం నుండి ప్రారంభం. నిండు నూరేళ్ళు పూర్ణ ఆయుస్శుతో మనం కలసి ఉండాలి. రెండు తాళి బొట్లు గౌరీ శంకరులు. పరస్పరం ఒక్కటై అత్తింటి వార్నీ, పుట్టింటి వారిని రెండు తాలిబోట్ల వలె సదా కలిపి ఉంచి సుఖంగా జీవితాన్ని గడుపుదామని పరమార్ధం.

పెళ్ళిలో అల్లుడి కాళ్ళు మామ గారెందుకు కడుగుతారు? --- ఓ పెండ్లి కూమారుడా పంచ భూతాల సాక్షిగా, అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నా పుత్రికను , నా కన్యమనిని, ధర్మ, అర్థ, కామ , మోక్షాలకై నీకు అర్పిస్తున్నాను, దానమిస్తున్నాను. ఈ దానం వల్ల నాకు బ్రహ్మ లోక ప్రాప్తి కావాలని అడుగుతున్నాను....
"ఓ వరుడా......నీవు ఈ సమయాన సాక్షాత్తు శ్రీమన్నారయనుడవి, నా బిడ్డ లక్ష్మి దేవి, కాబట్టి అంతటి నీకు కాళ్ళు కడుగుతున్నాను" అని వధువు తండ్రి వరుని కాళ్ళు కడుగుతాడు. అందుకే అంతా వారిపై అక్షితలు వేసి, శ్రీ లక్ష్మి నారాయనులుగా భావించి నమస్కరిస్తారు.

నల్ల పూసలు ధరించేది ఎందుకు? --- మంగళ సూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరించడం మన హిందూ సాంప్రదాయం. దుష్ట శక్తులు తన మాంగల్యం మీద పడకుండా ఉండటానికి ముక్యంగా ధరిస్తారు. అంతే కాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము.

భర్త, భార్యను ఎప్పుడు తాకాలి? --- వివాహాది మంత్రాల ప్రకారమూ, సామాజిక ధర్మం ప్రకారం, భార్యకు కడుపు నిండా తిండి పెట్టి , కప్పుకోవడానికి, సిగ్గును దాచు కోవడానికి బట్టలివాలి. అన్ని వైపులా నుంచి రక్షణ, భద్రత ఇవ్వాలి. ఆ తర్వాతే స్త్రీని తాకాలి. అట్టి వాడే స్త్రీకి అత్యంత దగ్గరిగా వెళ్ళడానికి అర్హుడు.

భార్య, భర్తకు ఏ వైపుగా ఉండాలి? --- సమస్త కార్యాలలోను ఎడమ పక్కనే ఉండాలన్న నియమాన్ని శాస్త్రం చెప్పడం లేదు. పూజాదికాలు నిర్వహించే టప్పుడు, దానాలు,ధర్మాలు చేసే సమయాన భార్య, భర్త ఎడమవైపున ఉండాలి. కన్యాదాన సమయాన, విగ్రహ ప్రతిష్టలప్పుడు కుడి వైపున ఉండాలి.
బ్రహ్మ దేవుడు మగవాడ్ని కుడి భాగం నుంచి, స్త్రీని ఎడమ భాగం నుంచి సృష్టించాడని శాస్త్రాలు చేపుతున్నంయి. శ్రీ మహా విష్ణు శ్రీ మహా లక్ష్మిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకుంటాడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML