ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Saturday, 10 January 2015

జ్యోతిష ప్రయోజనం



జ్యోతిష ప్రయోజనం

మనిషికి తెలిసిన అన్ని శాస్త్రాలలోకి జ్యోతిషం గొప్పది. పుట్టిన తేది, సమయం, ప్రదేశం- ఈ మూడిటిని బట్టి మనిషి వ్యక్తిత్వం, జీవితం లో జరుగబోయే సంఘటనలు, ఆయు ప్రమాణం, ఇతర వివరాలు ఏ ఇతర సైన్సు చెప్పలేదు. జీవితంలో ఎన్ని సాధించినా మనిషికి తెలియంది భవిష్యత్తు మాత్రమె. దానిని స్పష్టంగా చూపించే విద్య జ్యోతిషం.


జరిగేది ఎలాగూ జరుగుతుంది, జ్యోతిషం ఎందుకు అన్న ప్రశ్న ఈ నాటిది కాదు. చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్నది. భట్టోత్పలుడు వరాహుని గ్రంధాలకు, పృధు యశస్సు గ్రంధాలకు వ్యాఖ్యాత. ఈయన ఈ విషయాన్ని వివరంగా చర్చించాడు. ముందు జరుగ బోయేవి తెలుసుకుంటే మార్చుకునే ప్రయత్నాలు చెయ్యవచ్చు. అసలు జ్యోతిష ప్రయోజనం జరుగబోయే చెడును తొలగించుకోడమే. దానికి అవకాశముందా అన్నది ప్రశ్న?

భవిష్యత్తును మార్చుకునే అవకాశం తప్పక ఉంది. అవకాశమే లేకుంటే జ్యోతిష విద్యకు అర్థమే లేదు. అంటే కర్మ ఫలం అనేది స్థిరం కాదు. దానిని మార్చవచ్చు. జీవితంలో మనం అనుభవించే మంచి, చెడు రెండూ మనము పూర్వ జన్మలలో చేసుకున్న కర్మ ఫలితాలు. కనుక సరియైన కర్మను ఇప్పుడు చేసి, దాని ద్వారా పూర్వం చేసిన చెడు కర్మ ఫలితం మార్చవచ్చు. భగవంతుని సృష్టిలో మార్పుకు ఎప్పుడూ వీలుంటుంది.

అయితే భవిష్యత్తు మొత్తాన్నీ మన ఇష్టం వచ్చినట్టు మార్చగలమా? మార్చలేము. కర్మ మూడు రకాలు. మొదటిది అనుభవించక తప్పని దృఢ కర్మ. రెండవది రెమెడీస్ కి లొంగే అదృఢ కర్మ. మూడవది గట్టి రెమెడీస్ కి లొంగే మిశ్ర కర్మ. జ్యోతిష చక్రాన్ని బట్టి ఏది ఏదో తెలుస్తూంది. ఉన్నత అంశ చక్రాలైన ఖవేదాంశ , అక్ష వేదాంశ, నక్షత్రాంశ, షష్ట్యంశ లు పూర్వ జన్మ దోషాలను చూపుతాయి. నాడీ అంశ గుర్తించ గలిగితే పూర్వ జన్మలను అద్దంలో చూసినట్టు చూడవచ్చు. నాడీ జాతకాన్ని గురించి త్వరలో రాస్తాను. దోషాలన్నీ పూర్వ జన్మపు చెడు కర్మలు. మంచి యోగాలు మంచి కర్మలు. దోషాల పైన గురు దృష్టి లేదా పంచ విధ సంబంధాలలో ఏదో ఒకటి ఉంటే అది పరిహారాలకు లొంగుతుంది. శుభ గ్రహ సంబంధం లేకుంటే లొంగదు.

మనిషి జీవితంలో పశ్చాత్తాపానికి ఎప్పుడూ అవకాశం ఉంది. చేసిన తప్పులు దిద్దుకునే అవకాశం భగవంతుని సృష్టిలో ఉంటుంది. అయితే రెమెడీస్ అనేవి తూతూ మంత్రంగా చేసి తరువాత మళ్ళీ మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం అంటే కుదరదు. చిత్త శుద్ధితో, చేసిన పాపాలకు నిజమైన పశ్చాత్తాపం తో భగవంతుని వేడుకుంటూ రెమెడీస్ మనస్పూర్తిగా చేస్తే తప్పక అవి ఫలితాన్ని ఇస్తాయి. చాలా సార్లు ఫలితాలు వెంటనే కనిపించి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇది ఎన్నో సార్లు రుజువైంది.

కాకుంటే రెమెడీస్ చెయ్యడం చాలా కష్టం. తేలికగా కనిపించే రెమెడీస్ కూడా ఒక పట్టాన లొంగవు. చెయ్యటానికి బుద్ధి పుట్టదు. పుట్టినా అనేక అవాంతరాలు కలుగుతాయి. మధ్యలో మాని వేయాల్సిన పరిస్తితులు తలెత్తుతాయి. వీటన్నిటికీ తట్టుకొని నిర్ణీత కాలం వరకు చెయ్య గలిగితే తప్పక దోషాలు తోలగుతవి. జ్యోతిషం మణి, మంత్ర, ఔషదాలను రేమేడీలుగా సూచించింది. ఇవే గాక తాంత్రిక రేమేడీలు ఉన్నాయి. సులభంగా కనిపిస్తూ చేసేటప్పుడు నానా బాధలు పెట్టె లాల్ కితాబ్ రేమేడీలు ఉన్నవి.

జ్యోతిషం నిరాశావాదం కాదు. ఇది జీవితం మీద ఆశను పెంచే శాస్త్రం. రేమేడీల ద్వారా భవిష్యత్తును మార్చుకోవచ్చు అనేది నిర్వివాదం. ఇదే జ్యోతిషం యొక్క అసలైన ప్రయోజనం.
పండుగలు

జ్యోతిషశాస్త్ర విజ్ఞానమును మనకిచ్చిన మహర్షుల ఉద్దేశ్యముజ్యోతిషశాస్త్ర విజ్ఞానమును మనకిచ్చిన మహర్షుల ఉద్దేశ్యము భవిష్యత్తును చూచి భయపడి పారిపోవటానికో దుఖి:స్తూ కృషించడానికి కాదు. భయంకరమైన నది లాంటి సంసారము లో ఈదే జీవులు ఇక్కడసుడిగుండాలున్నాయో,ఎక్కడ భయంకర కాలసర్పాలున్నాయో,ఏప్రాంతములో ఏసమయానికి మిమ్మల్నిమింగాలనిమొసల్లు కాచుకుని వుంటాయో తెలియజేయటము.తెలియటము ద్వారా భయపడటము కాక జాగ్రత్తలు తీసుకుని ఆప్రమాదాలనుంచి లేక ఇబ్బందులనుంచి తెలివిగా తప్పుకుని సాగిపోవటమే వారు కరుణతో మనకందించిన ఈవిద్య లక్ష్యము. ఈ ప్రయాణము ఆపుదామన్నా ఆగేది కాదు,దాని సమయము పూర్తయినదాకా.కనుక నదిని ఈది దాటటము ప్రమాదకరము,కష్టతరము.కాని నదిని ఈదక తప్పదు. మొండిగా ఈదుతానిని దిగి కొందరు అలసి సొలసి ఈదితే,ఈలోపలకొందరు అంతమయ్యేదికూడా మధ్యలో జరుగుతుంది.

తెలివి అదృష్టవంతుడు ఒక చెక్కనో దుంగనో ఆధారము చేసుకుని ఈదుతూ తన శ్రమను కొద్దిగా తగ్గించుకుంటాడు.తెలివి కలవాడు ఒక పడవను తయారు చేసుకుని దానిని నడుపుకుంటూ ప్రమాదాలు దాటుకుంటూ వెళతాడు. భగవన్నామము అను ఓడను ఎక్కిన వాడు పూర్ణవిశ్వాసముతో నిశ్చితముగా ,హాయిగా ,విశ్రాంతిగా ,సునాయాసముగా ఈనదిని తరిస్తాడు.

ఈఈ ప్రమాదాలు ,గండాల గుండాలు ఎక్కడున్నాయో ప్రయాణముళో ఏసమయానికి మీకెదురవుతాయో తెలియజేసే స్పష్టమైన మ్యాపు జ్యోతిష్యము మనకిస్తుంది. దానిని చూసి భయపడి ప్రయాణము చేసినంతసేపు ఏడవడము కాదు.వివరాలు తెలిసాయికదా అన్న ధైర్యముతో సాగాలి.

ఆవిద్యను కూడా మనకిచ్చారా మహానుభావులు. అసలు మనిషి జీవిత విధానము ఈ ప్రకృతి లో ఏశక్తులు నియంత్రిస్తున్నాయో పరిశోధించి దర్శించి వాటి పరిష్కార మార్గాలను కూడా ఇచ్చారు.ఇంకా ఈప్రాకృతికశక్తులన్నీ ఏదివ్యచైతన్యముద్వారా నియమాత్మకముగా నడపబడుతున్నాయో ఆ పరాశక్తి ని ఆశ్రయిస్తే ,ఆశక్తితో మమేకమైతే ఇక సృష్టిలో ఎవరికీ భయపడవలసిన అవసరము లేదనే సత్యాన్నివారు కరుణతో మనకు బోధించారు. ఈపుణ్యభూమిలో మాత్రమే లభించినది ఈదివ్య విద్య.

ఇక మనకు ఈమధ్య ఆరోగ్య సృహ బాగాపెరిగినది. వ్యాధి రాకముందే అనేక రకాల వైద్య పరీక్షలు చేపించుకుంటున్నాము.అక్కద అన్ని పరీక్షలు చేసి వైద్యులు నాయనా ! నువ్వు ఈనూనెలు ఎక్కువ వాడితే నీకు గుండెపోటు రావచ్చు.నీ శరీరములో ఫలానా పదార్ధము ఎక్కువవుతున్నది దీనిద్వారా ఫలానా వ్యాధి వచ్చేఅవకాశమున్నది అని హెచ్చరిస్తే మనమేమి చేస్తాము. ఏడుస్తూ నాకావ్యాధి వచ్చేస్తున్నది అని తిండితిప్పలు మాని కూర్చుంటామా? లేదే! దానికి తగు జాగ్రత్తలు తీసుకుని రాబోయేప్రమాదాలనుంచి తప్పించుకుంటాము. ఎందుకండీ ఏపరీక్షలు లేనిపోనిది వల్లు చెప్పాక బాధపడాలి అని ఆపరీక్షలజోలి కెల్లకపోవటము మన ఇష్టాఇష్టాలకు సంబంధించినది. ఎక్కడో ఒక చోట కొందరు దుర్మార్గులైన వైద్యులు లేని రోగలక్షణాలను చెప్పి దోచుకునేవారుండవచ్చు,అంతమాత్రాన అది వైద్య విద్యకు సంబంధించిన లోపము కాదుకదా?

ఇక్కడ ఇంత ఉపోద్ఘాతము చెప్పేదెందుకంటే ఈమధ్య ఏదో ఉడతాభక్తిగా నేను చేస్తున్న ప్రయత్నానికి స్పందించి చాలామంది మిత్రులు అనేకవిషయాలపై నామీద నమ్మకముంచి నన్ను తమ ఆత్మీయునిగా భావించి తమ కుటుంబసభ్యులకు కూడా తెలుపని విష్యాలు నాకు తెలుపుతూ సమస్యకు కారణాలు పరిష్కారాలు సూచించమని వ్రాస్తున్నారు.ముందుగా నాపై ఇంతనమ్మకముంచిన నావారందరికి ధన్యవాదములు.
ఇక జ్యోతిష్యశాస్త్ర ఆధారముతో వారి సమస్యలకు మూలాలను తెలుసుకుని.నాకు గురువులు ప్రసాదించిన భగవన్నామమనే సంజీవనిని నాకోసమేగాక వారికి కూడా అందిస్తున్నాను. ఆకలైన వారు కోసము వంటచేసుకునితినాలి.ఓపిక లేనప్పుడో,లేక చేతకానప్పుడో మనమేదో వండి పెడతాము కానీ తిని ఆకలి తీర్చుకోవలసిన పని వారికేసాద్యము,వారే ఆపనిచేయాలి. కాదులే మాస్టారూ ,తినే ఓపిక లేదు మీరేతిని పెట్టండి అనే సోమరి పోతులకు మనమేమీ చేయలేము.ఆతినే స్థితి కూడా లేనివారి కోసమైతే ఏదో ఒక" సెలైన్ "ఓపిక తెచ్చేందుకు కట్టడానికి సాధ్యమవుతుంది కాని పూర్తి శక్తిని పొందాలంటే తిరిగి ఆజీవి తన ఆహారాన్ని తానే తినాలి.

ముందుగ నక్షత్రాలు, గ్రహాలు, రాశులు, లగ్నాలు మొదలైనవి నేర్చుకుందాం.
రాశులురాశులు 1201. మేష రాశి
02. వృషభ రాశి
03. మిధున రాశి
04. కర్కాటక రాశి
05. సింహ రాశి.
06. కన్యా రాశి
07. తులా రాశి
08. వృశ్చిక రాశి
09. ధనుస్సు రాశి
10. మకర రాశి
11. కుంభ రాశి
12. మీన రాశి గ్రహాలుగ్రహాలు 9
1. సూర్యుడు
2. చంద్రుడు
3. అంగారకుడు
4. బుధుడు
5. బృహస్పతి
6. శుక్రుడు
7. శని
8. రాహువు
9. కేతువు
నక్షత్రాలు:నక్షత్రాలు 2701. అశ్విని
02. భరణి
03. కృత్తిక
04. రోహిణి
05. మృగశిర
06. ఆరుద్ర
07. పునర్వసు
08. పుష్యమి
09. ఆశ్లేష10. మఖ
11. పుబ్బ
12. ఉత్తర
13. హస్త
14. చిత్త
15. స్వాతి
16. విశాఖ
17. అనూరాధ
18. జ్యేష్ట19. మూల
20. పూర్వాషాఢ
21. ఉత్తరాషాఢ
22. శ్రవణం
23. ధనిష్ట
24. శతభిషం
25. పూర్వాభాద్ర
26. ఉత్తరాభాద్ర
27. రేవతి నక్షత్రములు - స్వభావములుసవ్య నక్షత్రములుఅశ్విని
పునర్వసు
హస్త
మూలభరణి
పుష్యమి
చిత్త
ఉత్తరాభాద్రపూర్వాభాద్ర
పూర్వాషాఢ
ఉత్తరాషాఢ
రేవతికృత్తిక
ఆశ్లేష
స్వాతి అపసవ్య నక్షత్రాలురోహిణి
మఖ
విశాఖమృగశిర
పుబ్బ
అనూరాధశ్రవణం
ధనిష్ట
శతభిషంఆరుద్ర
ఉత్తర
జ్యేష్ట పురుష నక్షత్రాలుఅశ్విని
అనూరాధశ్రవణం
పుష్యమిఉత్తరాభాద్ర
పూర్వాభాద్రపునర్వసు
హస్త స్త్రీ నక్షత్రాలుభరణి
కృత్తిక
రోహిణి
ఆరుద్రఆశ్లేష
మఖ
పుబ్బ
చిత్తఉత్తర
విశాఖ
స్వాతి
జ్యేష్టపూర్వాషాఢ
ఉత్తరాషాఢ
ధనిష్ట
రేవతి పురుష నక్షత్రాలుధృవ తారలు : ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రోహిణి.
తీక్షణ తారలు : మూల, ఆరుద్ర, ఆశ్లేష, జ్యేష్ట.
ఉగ్ర తారలు : పూర్వాషాఢ, పూర్వాభాద్ర, భరణి, మఖ.
క్షిప్ర తారలు : కృత్తిక, విశాఖ.
చరములు : శ్రవణము, ధనిష్ట, శతభిషము, పుఅర్వాసు, స్వాతి. నక్షత్రములు - ఆధిపత్య గ్రహములుఅశ్విని, మఖ, మూలకేతువుభరణి, పుబ్బ, పూర్వాషాఢశుక్రుడుకృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢరవిరోహిణి, హస్త, శ్రవణంచంద్రుడుమృగశిర, చిత్త, ధనిష్టకుజుడుఆరుద్ర, స్వాతి, శతభిషంరాహువుపునర్వసు, విశాఖ, పూర్వాభాద్రగురువుపుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్రశనిఆశ్లేష, జ్యేష్ట, రేవతిబుధుడు

రాశి చక్రానికి ప్రారంభ బిందువు ఎక్కడ అన్నదొక వివాదం. ప్రతీ సంవత్సరం సూర్యుడు భూమధ్యరేఖ పైకి వచ్చే బిందువుని వసంత విషువద్బిందువు అని అంటారు. అది సుమారుగా మార్చి 21వ తేదీన జరుగుతుంది. ఆరోజు భూమధ్య రేఖమీద పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. ఈ బిందువే రాశి చక్రానికి ప్రారంభ బిందువు అని ఒక సాంప్రదాయం. ఇలా లెక్కపెట్టే రాశిచక్రాన్ని సాయన రాశిచక్రం అంటారు. కానీ భూమి తనచుట్టూ తాను తిరగడమే కాక బొంగరంలా ధృవాల దగ్గర అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. ఈ ఊగే చలనం ఫలితంగా ప్రతి ఏడాదీ సూర్యుడు భూమధ్య రేఖ మీదకి వచ్చే బిందువు కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది . దీని ఫలితంగా రాశిచక్రపు ప్రారంభ బిందువు కూడా మారిపోతూ ప్రతీ డెబ్భైరెండు సంవత్సరాలకు ఒక డిగ్రీ చొప్పున వెనక్కి జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి సాయన రాశి చక్రం అంటే ప్రతీ ఏడాదీ ప్రారంభ బిందువు మారిపోయే రాశిచక్రం . దీన్ని ప్రధానంగా పాశ్చాత్య జ్యోతిషంలో ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న భారతీయ జ్యోతిశ్శాస్త్రం ఇలా మారిపోయే రాశిచక్రాన్ని పరిగణనలోకి తీసుకోదు. ఒకానొక స్థిరమైన బిందువునించి రాశిచక్రాన్ని లెక్కిస్తుంది. ఆ రాశిచక్రాన్ని నిరయణ రాశి చక్రం అంటారు. వసంతవిషువద్బిందువుకీ (అంటే పాశ్చాత్య రాశిచక్రపు ప్రారంభ బిందువుకీ) ఈ స్థిరబిందువుకీ మధ్య ప్రస్తుతం సుమారు 23 డిగ్రీల తేడా ఉన్నది. దాన్నే అయనాంశ అంటారు. అయితే ఈ స్థిరబిందువు ఎక్కడ ఉండాలి అన్నదానిపై కూడా జ్యోతిష్కులకి ఏకాభిప్రాయం లేదు. భారతీయ జ్యోతిషంలో కూడా ఒక సంప్రదాయానికీ మరొక సంప్రదాయానికీ ఈ స్థిరబిందువు కొద్దిగా మారుతుంది. అంటే అయనాంశ మారుతుంది. ఈ అయనాంశలో లాహిరి, రామన్, దేవదత్త, కృష్ణమూర్తి మొదలైన రకాలు ఉన్నాయి. ఇవన్నీ వేర్వేరు రాశిచక్రాలు అనుకోవచ్చు. సాయన రాశిచక్రం ప్రధానంగా పాశ్చాత్య జ్యోతిషానికి చెందినది. ఒకే వ్యక్తి యొక్క జాతకచక్రాన్ని ఈ రెండు రాశిచక్రాల ప్రకారం గుణిస్తే అసలు ఒకదానికీ మరొకదానికీ సామ్యమే ఉండదు. ఒక జాతకం ప్రకారం మేషంలో సూర్యుడుంటే, మరొక జాతకం ప్రకారం మీనంలో ఉంటాడు (భారతీయ, పాశ్చాత్య రాశిచక్రాల మధ్య 23 డిగ్రీల భేదం ఉంది కాబట్టి). అదే విధంగా భారతీయ జ్యోతిషంలో కూడా అయనాంశ భేదాల ప్రకారం అంత కాకపోయినా కొద్ది భేదంతో (ఒక డిగ్రీ సుమారు) రాశిచక్రాలు మారతాయి.నిరయణ సిద్ధాంతం ప్రకారం విషువములూ, అయనములూ ఋతువులని అనుసరించి రావు. భాగవత ప్రమాణం ఇలా ఉంటుంది - మేష తులలయందు మిహిరుండహో రాత్రు లందు తిరుగు సమ విహారములను. (పంచమ స్కంధం, ద్వితీయాశ్వాసం, 21వ అధ్యయం, 79వ పద్యం.) అంటే మేష, తులా సంక్రమణాల సమయంలో పగలూ రాత్రీ సమానంగా ఉంటాయి అని. సాయన సిద్ధాంతం ప్రకారం మేష తులా సంక్రమణాలు వరుసగా మార్చి 21, సెప్టెంబరు 22న వస్తాయి. ఆ దినాల్లో భూమధ్యరేఖ పైన రాత్రీ, పగలూ సమానంగా ఉంటాయి. కానీ నిరయణమతం ప్రకారం మేష తులా సంక్రమణాలు ఏప్రిల్ 14, అక్టోబర్ 14 న వస్తాయి. ఆ రోజుల్లో పగలూ రాత్రీ సమానంగా ఉండవు.
గోచారము
గోచారము అంటే గోళాలు యొక్క సంచారం ఆధారంగా జోస్యం చెప్పడం. చంద్రగోళం భూప్రదక్షణం చేసే సమయంలో ఒక్కొక్క రోజూ ఒక్కొక్క నక్షత్రం సమీపంలో కనిపిస్తుంది. చంద్రుడు సమీపలోని నక్షత్రాన్ని జాతకుని జన్మ నక్షత్రం. ఈ నక్షత్రాలను వాటి ప్రక్కన కనిపించే నక్షత్రాతో కలిపి ఒక ఊహా రేఖతో గుర్తించి వాటిని రాసులుగా గుర్తించారు. దీని ఆధారంగా చంద్రుని సమీపంలో ఉన్న నక్షత్రరాసిని జాతకుని రాశిగా వ్యవహరిస్తారు. సూర్యుడు ఒకరాశినుండి ఇకంకొక రాశి మారటానిని సంక్రమణ లేక సంక్రాంతి అంటారు. సూర్యుడు జ్యోతిష్యశాస్త్రాన్ననుసరించి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాసిలో ప్రవేసిస్తాడు. సంవత్సరాకాలంలో 12 రాసులలో సంచరిస్తాడు. తమిళులు తమ సంవత్సరాన్ని సూర్య సంచారాన్ని అనుసరించి గణిస్తారు. సుర్యుడు మేషంలో ప్రవేసించే రోజు వారికి నూతన సంవత్సర ఆరంభం అవుతుంది. సూరుడు మకరరాశిలో ప్రవేసించినపుడు హిందువులు పెద్ద పండుగగా ఆచరించే సంక్రాంతి పండుగ పర్వదినం. సంక్రాంతిని మకర సంక్రాంతి అనే పేరుతో కూడా పిలవడం హిందువుల అలవాటు. ఒక సంవత్సర కాలంలో 12 సంక్రాంతులు వస్తాయి. ఈ విధంగా సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని మొదలైన గ్రహాలు ఛాయా గ్రహాలుగా జ్యోతిష్యశాస్త్రాలలో పిలవబడే రాహువు, కేతువు యొక్క సంచారము జ్యోతిష్య గణనలో భాగాలు. ఇవి కాక తెలుగు, మళయాళ జ్యోతిష్కులు శని గ్రహ ఊపగ్రహాలలో పెద్దదైన మందిని శని పుత్రునిగా వ్యహరిస్తూ గణనలోకి తీసుకుంటారు. తమిళ జ్యోతిష్యంలో మాంది గణనలోకి తీసుకొనే ఆచారం లేదు. గ్రహాలు సూరుని చుట్టూ ప్రదక్షిణ చేసే కాలాన్ని 12 రోజులుగా విభజించి జ్యోతిష్య గణన చేస్తారు. వీటి ఆధారంగా గోచార ఫలితాలు ఉంటాయి.
రాశులు నక్షత్ర పాదాలు
సాదారణంగా ఒక రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి.ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి.
రాశి
నక్షత్రపాదాలు
దినారంభంలో లగ్నం
మేషరాశి
అశ్విని 1,2,3,4 పాదాలు భరణి 1,2,3,4 పాదాలు కృత్తిక 1 పాదం
మేష సంక్రాంతి నుండి వృషభ సంక్రాంతి వరకు మేషలగ్నం
వృషభరాశి
కృత్తిక 2,3,4 పాదాలు రోహిణి 1,2,3,4 పాదాలు మృగశిర 1,2 పాదాలు
వృషభ సంక్రాంతి నుండి మిధున సంక్రాంతి వరకు వృషభ లగ్నం
మిధునరాశి
మృగశిర 3,4 పాదాలు ఆరుద్ర 1,2,3,4 పాదాలు పునర్వసు 1,2,3
మిధున సంక్రాంతి నుండి కటక సంక్రంతి వరకు మిధిన లగ్నం
కటకరాశి
పునర్వసు 4వ పాదం పుష్యమి 1,2,3,4 పాదాలు ఆశ్లేష 1,2,3,4 పాదాలు
కటక సంక్రాంతి నుండి సింహ సంక్రాంతి వరకు కటక లగ్నం
సింహరాశి
మఖ 1,2,3,4 పాదాలు పూర్వఫల్గుణి 1,2,3,4 పాదాలు ఉత్తర ఫల్గుణి 1 పాదం
సింహ సంక్రాంతి నుండి కన్యాసంరాంతి వరకు సింహ లగ్నం
కన్యారాశి
ఉత్తర ఫల్గుణి 2,3,4 పాదాలు హస్త 1,2,3,4 పాదాలు చిత్త 1,2 పాదాలు
కన్యా సంక్రాంతి నుండి తులా సంక్రాంతి వరకు కన్యా లగ్నం
తులారాశి
చిత్త 3,4 పాదాలు స్వాతి 1,2,3,4 పాదాలు విశాఖ 1,2,3 పాదాలు
తులా సంక్రాంతి నుండి వృశ్చిక సంక్రాంతి వరకు తులా లగ్నం
వృశ్చికం
విశాఖ 4వ పాదం అనూరాధ 1,2,3,4 పాదాలు జ్యేష్ట 1,2,3,4 పాదాలు
వృశ్చిక సంక్రాంతి నుండి ధనస్సు సంక్రాంతి వరకు వృశ్చిక లగ్నం
ధనస్సురాశి
మూల 1,2,3,4 పాదాలు పూర్వాషాఢ 1,2,3,4 పాదాలు ఉత్తరాషాఢ 1 పాదం
ధనస్సు సంక్రాంతి నుండి మకర సంక్రాంతి వరకు ధనుర్లగ్నం
మకరరాశి
ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు శ్రవణం 1,2,3,4 పాదాలు ధనిష్ట 1,2 పాదాలు
మకర సంక్రాంతి నుండి కుంభ సంక్రాంతి వరకు మకర లగ్నం
కుంభరాశి
ధనిష్ట 3,4 పాదాలు శతభిష 1,2,3,4 పాదాలు పూర్వాభద్ర 1,2,3,పాదాలు
కుంభ సంక్రాంతి నుండి మీన సంక్రాంతి వరకు కుంభలగ్నం
మీనరాశి
పూర్వాభద్ర 4వ పాదం ఊత్తరాభద్ర 1,2,3,4 పాదాలు రేవతి 1,2,3,4 పాదాలు
మీన సంక్రాంతి నుండి మేష సంక్రాంతి వరకు మీన లగ్నం
నక్షత్రాలు అధిదేతలు వర్ణం రత్నం
నక్షత్రం
అధిదేవత
వర్ణం
రత్నం
నామం
అశ్విని
అర్ధనారీశ్వరుడు
పసుపు
వైడూర్యం
చూ,చే,చో,ల
భరణి
రవి
ఆకాశనీలం
వజ్రం
లీ,లూ,లే,లో
కృత్తిక
అగ్ని
కావి
మాణిక్యం
ఆ,ఈ,ఊ,ఏ
రోహిణి
చంద్రుడు
తెలుపు
ముత్యం
ఒ,వా,వృ,వో
మృగశిర
దుర్గ
ఎరుపు
పగడం
వే,వో,కా,కి
ఆరుద్ర
కాళి
ఎరుపు
గోమేధికం
కూ,ఘ,బ,చ
పునర్వసు
రాముడు
పసుపు
పుష్పరాగం
కే,కో,హా,హీ
పుష్యమి
దక్షిణామూర్తి
పసుపు,ఎరుపు
నీలం
హూ,హే,హో,డా
ఆశ్లేష
చక్రత్తాళ్వార్
కావి
మరకతం
డి,డూ,డె,డొ
మఖ
ఇంద్రుడు
లేతపచ్చ
వైడూర్యం
మా,మి,మూ,మే
పూర్వఫల్గుణి
రుద్రుడు
శ్వేతపట్టు
పచ్చ
మో,టా,టి,టూ
ఉత్తరఫల్గుణి
బృహస్పతి
లేతపచ్చ
మాణిక్యం
టే,టో,పా,పీ
హస్త
అయ్యప్ప
ముదురునీలం
ముత్యం
పూ,ష,ణ,డ
చిత్త
విశ్వకర్మ
ఎరుపు
పగడం
పే,పో,రా,రీ
స్వాతి
వాయువు
తెలుపు
గోమేధికం
రూ,రే,రో,త
విశాఖ
మురుగన్
పచ్చ
పుష్పరాగం
తీ,తూ,తే,తో
అనూరాధ
మహాలక్ష్మి
పసుపు
నీలం
నా,నీ,నూ,నే
జ్యేష్ట
ఇంద్రుడు
శ్వేతపట్టు
మరకతం
నో,యా,యీ,యూ
మూల
నంది
ముదురుపచ్చ
వైడూర్యం
యే,యో,బా,బీ
పూర్వాషాఢ
వరుణుడు
బూడిద
వజ్రం
బూ,దా,థా,ఢా
ఉత్తరాషాఢ
గణపతి
తెలుపు
మాణిక్యం
బే,బో,జా,జీ
శ్రవణం
మహావిష్ణు
కావి
ముత్తు
ఖీ,ఖూ,ఖే,ఖో
ధనిష్ట
చిత్రగుప్తుడు
పసుపుపట్టు
పగడం
గా,గీ,గూ,గే
శతభిష
భద్రకాళి
కాఫి
గోమేదికం
గో,సా,సీ,సూ
పూర్వాభద్ర
కుబేరుడు
ముదురుపసుపు
పూస
సే,సో,దా,దీ
ఉత్తరాభద్ర
కామధేను
గులాబి
నల్లపూస
దు,శం,ఛా,దా
రేవతి
అయ్యప్ప
ముదురునీలం
ముత్యం
దే,దో,చా,చీ
గోచార ఫలదర్శన చక్రం
స్థానం
రవి
చంద్రుడు
కుజుడు
బుధుడు
గురువు
శుకృడు
శని
రాహువు
కేతువు
1
స్థానచలనం
సౌజన్యం
దు॰ఖం
బంధనం
గమనం
ఆరోగ్యం
విపత్తు
భయం
భయం
2
భయం
వ్యయం
వ్యయం
లాభం
ధనలాభం
భాగ్యం
హాని
కలహం
విరోధం
3
సంపత్తు
లాభం
లాభం
వ్యయం
విపత్తు
సౌభాగ్యం
సంపద
సౌఖ్యం
సుఖం
4
మానభంగం
హాని
రిపుభయం
శుభం
వ్యయం
సుఖం
రోగం
మానహాని
మానహాని
5
భయం
కార్యనాశం
రిపుభయం
దరిద్రం
సంపద
పుత్రలాభం
సుతక్షయం
ధనవ్యయం
క్లేశం
6
రిపుహాని
శుభం
ధనలాభం
భూషణం
దు॰ఖం
వ్యయం
సంపద
సుఖం
సంతోషం
7
దేహపీడ
లాభం
కలహం
వ్యసనం
ఆరోగ్యం
క్లేశం
రాజాగ్రహం
భయం
భీతి
8
రోగం
వ్యయం
భయం
సంతోషం
హాని
భయం
దు॰ఖం
మృత్యువు
హాని
9
భయం
వ్యాకులం
వ్యయం
దు॰ఖం
ధనాగమం
ధనలాభం
రోగం
సంతానం
కలహం
10
లాభం
లాభం
చలనం
శుభం
హాని
సౌఖ్యం
జాడ్యం
కలహం
విరోధం
11
ఆరోగ్యం
శుభం
లాభం
సుఖం
సంతోషం
సౌఖ్యం
లాభం
లాభం
ధనాగమం
12
వ్యయం
దు॰ఖం
రోగం
వ్యయం
పీడ
లాభం
క్లేశం
హాని
హాని
మహర్ధశ అంతర్ధశ
గ్రహం
రవి
సం–నె–రో
చంద్రుడు
సం–నె–రో
కుజుడు
సం–నె–రో
రాహువు
సం–నె–రో
గురువు
సం–నె–రో
శని
సం–నె–రో
బుధుడు
సం–నె–రో
కేతువు
సం–నె–రో
శుకృడు
సం–నె–రో
మహర్దశాకాలం
1.రవి
0–3–18
0-6-0
0-4-6
0-10-24
0-9-18
0-11-12
0-0-6
0-4-6
1-0-0
6 సం||లు
2.చంద్రుడు
0-6-0
0-10-0
0-7-0
1-6-0
1-4-0
1-7-0
1-5-0
0-7-0
1-8-0
10 సం||లు
3.కుజుడు
0-4-6
0-7-0
0-4-27
1-0-18
0-11-6
1-1-9
0-11-27
0-4-27
1-2-0
7 సం||లు
4.రాహువు
0-10-24
1-6-0
1-0-18
2-8-12
2-4-24
2-10-6
2-6-18
1-0-18
3-0-0
18 సం||లు
5.గురువు
0-9-18
1-4-0
0-11-6
2-4-24
2-1-18
2-6-12
2-3-6
0-11-6
2-8-0
16 సం||లు
6.శని
0-11-12
1-7-0
1-1-9
2-10-6
2-6-12
3-0-3
2-8-9
1-1-9
3-2-0
19 సం||లు
7.బుధుడు
0-10-6
1-5-6
0-11-27
2-6-18
2-3-6
2-8-9
2-4-27
0-11-27
2-10-0
17 సం||లు
8.కేతువు
0-4-6
0-7-0
0-4-27
1-0-18
0-11-6
1-1-9
0-11-27
0-4-27
1-2-0
7 సం||లు
9.శుకృడు
1-0-0
1-8-0
1-2-0
3-0-0
2-8-0
3-2-0
2-10-0
1-2-0
3-4-0
20 సం||లు
గ్రహాలు శత్రువులు మిత్రలు సములు
గ్రహం
మిత్రుడు
శత్రువు
సముడు
రవి
చంద్రుడు,కుజుడు,గురువు
శని,శుకృడు
బుధుడు
చంద్రుడు
రవి,బుధుడు
మిగిలిన వారు సములు
శత్రువులు లేరు
కుజుడు
గురువు,చంద్రుడు,రవి
చంద్రుడు
కుజ,గురువు,శని
బుధుడు
శుకృడు,రవి
చంద్రుడు
కుజుడు,గురువు,శని
గురువు
రవి,కుజుడు,చంద్రుడు
బుధ,శుకృడు
శని
శుకృడు
శని,బుధుడు
రవి,చంద్రుడు
కుజుడు,గురువు
శని
శుకృడు,బుధుడు
రవి,చంద్రుడు,కుజుడు
గురువు
జన్మలగ్నము
భూమి తనచుట్టూ తాను తిరిగే ఆత్మ ప్రదక్షిణ కాలంలో ప్రతి రెండు గంటలకు లగ్నం మారుతూ 24 గంటల సమాయాన్ని 12 రాశుల లగ్నాలుగా విభజిస్తూ జ్యోతిష్య గణన చేస్తారు. చైత్రమాసం పాడ్యమి సూర్యోదయం మేషలగ్నంతో ఆరంభం ఔతుంది. ఒక రోజుకు నాలుగు నిమిషాల కాలం ముందుకు జరుగుతూ చేర్చుకొని ఒక మాసకాలంలో 120 నిమిషాలు లగ్న కాలం మారుతూ వైశాఖమాస ప్రారంభం వృషభలగ్నంతో ఉదయం ఆరంభం ఔతుంది. ఈ విధంగా లగ్న గణన చేస్తూ జాతకుడు పుట్టిన లగ్న నిర్ణయం చేస్తారు
నవగ్రహ విశిష్టత
ప్రతి మానవుడు తనకు సంతోషం కలగాలని ఆనందంగా బ్రతకాలని కోరుకుంటాడు. కాని ఈ ఆనందము సంతోషము వేటిని ఆచరిస్తే కలుగుతాయో వాటిని మాత్రం ఆచరించడు ప్రతివారు `దుఃఖ మాభూత్' నాకు దుఃఖము కలుగాకున్డుగాక కష్టాలు నాకు రాకూడదు అని కోరుకుంటారు అని గీతా వచనము మానవుడు ఈజన్మలోను, రాబోవు జన్మలోను సుఖసంతోషములతో ఉండాలంటే శాస్త్రములందు ప్రమాణ బుద్ధి కలిగి అవి చెప్పిన రీతిననుసరించి మానవుడు మాధవుడవుతాడు అనడంలో సందేహం ఏ మాత్రము లేదు.
నవగ్రహ ధ్యాన శ్లోకములు

ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
రవి
జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిమ్తమో‌రిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం
చంద్ర
దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవంనమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం
కుజ
ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభంకుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం
బుధ
ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధంసౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం
గురు
దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభంబుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం
శుక్ర
హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుంసర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, తం ప్రణమామ్యహం
శని
నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం
రాహు
అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనంసింహికాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్
కేతు
ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్
2. 4. నవగ్రహ ధ్యాన శ్లోకములు
నవగ్రహాలను స్తుతించే ఒక బహుళ ప్రచారంలో ఉన్న శ్లోకం
ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచగురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
రవి
జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిమ్తమో‌రిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం
చంద్ర
దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవంనమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం
కుజ
ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభంకుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం
బుధ
ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధంసౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం
గురు
దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభంబుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం
శుక్ర
హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుంసర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, తం ప్రణమామ్యహం
శని
నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం
రాహు
అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనంసింహికాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్
కేతు
ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్
నవగ్రహాలు
ఆదిత్యుడు :
కశ్యపుని కుమారుడు సూర్యుడు. భార్య అదితి. అందుకేఆదిత్యుడు అని పిలుస్తాము. సప్త అశ్వాలతో ఉన్న రధం అతనివాహనం. ఆ సప్త అశ్వాలు ఏడు చక్రాలకు ( మూలాధారం,స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆగ్య్హ్నా చక్రం ,సహస్రారం )
వివాహ పరిబంధన దోషం, పుత్ర దోషం, పుత్ర పరిబంధన దోషం,విద్యా పరిబంధన దోషం, ఉద్యోగ పరిబంధన దోషం, సూర్యదోషం మొదలైన దోషాలతో బాధ పడే వారు సూర్యునిపూజించటం వలన ఫలితం పొందుతారు.
సింహరాశి కి అధిష్టాన దేవుడు సూర్యుడు. నవగ్రహాలలో మద్య స్థానం ఆదిత్యుడిది.అధిదేవత అగ్ని, ప్రత్యధి దేవత రుద్రుడు. ఆదిత్యుడు ఎరుపు వర్ణం లో ఉంటాడు.

ఇష్టమైన ధాన్యం : గోధుమలు
పుష్పం : తామర
వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం
జాతి రాయి : కెంపు
నైవేద్యం : గోధుమలు, రవ చక్కర పొంగలిచంద్రుడు :
చాల అందమైన వాడిగా మనం వర్ణిస్తూ ఉంటాం. వర్ణనలకుకంటే మిన్నగా చంద్రుడు చాల అందమైన వాడు. పది తెల్లటిగుర్రాలతో ఉన్న రధాన్ని అధిరోహిస్తాడు. నిశాదిపతి ( రాత్రికి రాజు), క్షుపరక (రాత్రిని కాంతివంతం చేసే వాడు) అనిపేర్లు కూడా కలవు. ఇరవైఏడు నక్షత్రాలను సూచిస్తునట్టు,ఇరవైఏడు మంది భార్యలను కలిగి ఉన్నాడు. తండ్రి సోమతల్లి తారక.
అనారోగ్యం తో బాధ పడుతూ ఉన్న తల్లి, చర్మ వ్యాధులు మొదలైన సమస్యలు కలవారుచంద్రుని పూజ వలన ఫలితం పొందగలరు.
కుంభ రాశి కి అధిపతి చంద్రుడు. తూర్పు - దక్షిణ అభిముఖుడై ఉంటాడు.

అధిదేవత : నీరు.
ప్రత్యధిదేవత : గౌరి
వర్ణం : తెలుపు
ధాన్యం : బియ్యం / వడ్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : ముత్యం
నైవేద్యం : పెరుగన్నం మంగళ :
అంగారకుడు ( ఎర్రని వర్ణం కలవాడు) అని కూడా పిలుస్తాం.ఇతను భూదేవి కుమారుడు. మేష, వృశ్చిక రాసులకిఅధిపతి. దక్షినాభిముఖుడు. రుచక మహాపురుష యోగవిద్యను భోదిస్తాడు. తమోగుణ వంతుడు.
భార్య / పిల్లలు / అన్నదమ్ముల వాళ్ళ సమస్యలు ఉండేవారు,స్నేహితులతో శత్రుత్వం, సంపదను కోల్పోయిన వారు మంగళ దేవుడిని పూజించటంవలన సత్ఫలితాలను పొందుతారు.

అధిదేవత : భూదేవి

వర్ణం: ఎరుపు
ధాన్యం : కందిపప్పు
పుష్పం : సంపంగి మరియు తామర
వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం
జాతి రత్నం : ఎర్రని పగడం
నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం
బుధుడు :
తార, చంద్రుల పుత్రుడు బుధుడు. రజోగుణవంతుడు. పుత్రదోషం, మంద విద్య, చంచలమైన మనసు కలవారు బుధునిపూజలు చేసి ఉపసమనం పొందుతారు. తెలివితేటల వృద్ధి,సంగీతం, జ్యోతిష్యం, గణితం, వైద్యం వంటి వాటిలోరానిచాలంటే బుధుడి అనుగ్రహం పొందాలి.
మిధున మరియు కన్యారాశి కి అధిపతి బుధుడు. తూర్పు -ఉత్తర ముఖుడై ఉంటాడు.
అధిదేవత : విష్ణు
ప్రత్యధిదేవత : నారాయణుడు
వర్ణం : చిగురాకు పచ్చ
వాహనం : సింహం
ధాన్యం : పచ్చ పెసర పప్పు
వస్త్రం : పచ్చని రంగు వస్త్రం
జాతి రత్నం : పచ్చ
నైవేద్యం : పెసరపప్పు తో కూడిన అన్నంగురు :
బృహస్పతి అని కూడా అంతము. దేవతలకు, దానవులగురువైన శుక్రాచారుడికి గురువు ఇతను. సత్వగుణసంపన్నుడు. పసుపుపచ్చ / బంగారు వర్ణం లో ఉంటాడు.
పేరు ప్రఖ్యాతులు, సంపద, తోడ బుట్టినవారి క్షేమము కొరకుగురువు ని పూజించాలి ధన్నురాశి, మీనా రాశిలకు అధిపతి. ఉతరముఖుడైఉంటాడు.

అధిదేవత : బ్రహ్మ
ప్రతదిదేవత : ఇంద్రుడు
వర్ణం: పసుపు
వాహనం : గజరాజు
ధాన్యం : వేరుసెనగ పప్పు
పుష్పం : మల్లె
వస్త్రం : బంగారు రంగు వస్త్రం
జాతి రత్నం : పుష్య రాగం
నైవేద్యం : సెనగపప్పు తో కూడిన అన్నం

శుక్రుడు :
ఉషన, బృగు మహర్షి ల సంతానం. అసురులకుగురువు ఇతను. రజోగుణ సంపన్నుడు. ధవళ వర్ణంతో మద్యవయస్కుడిగా ఉంటాడు. ఒంటె / గుఱ్ఱము /మొసలి వాహనంగా కల్గి ఉంటాడు.
అనుకోని పరిస్థితుల వల్లనా కుటుంబాలు విడిపోవడంలేక తగాదాలు రావడం , బాగా కలిసి ఉండేవారిమద్యలో శత్రుత్వం కలగడం మొదలైన విపత్కరపరిస్థితులనుండి శుక్రాచార్యుని పూజ వలన బయటపడే అవకాశం ఉంది.వృషభ, తులరాశులకు అధిపతి.
అదిదేవత : ఇంద్రుడు
వర్ణం : తెలుపు
వాహనం : మొసలి
ధాన్యం : చిక్కుడు గింజలు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : వజ్రం
నైవేద్యం : చుక్కుడు గింజల తో కూడిన అన్నం

శని :
సూర్యభగవానుడి పుత్రుడు శని. భార్య ఛాయా దేవి (నీడ). నల్లని వర్ణం తో, నలుపు వస్త్రదారనతో, కాకివాహనంగా కలిగి ఉంటాడు.
శని దేవుడిని అందరు తిడ్తూ ఉంటారు. నిజామే అలంటిబాధలు పెడతాడు శని. మనల్ని ఎంతగా బాధ పెట్టికస్టాలు పెడతాడో, అంతకంటే ఎక్కువ మంచి చేసివెళ్తాడు.
కుంభ, మకర రాసులకి అధిపతి. పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు.అదిదేవత : యముడు
ప్రతదిదేవత : ప్రజాపతి
వర్ణం : నలుపు
ధాన్యం : నల్ల నువ్వులు
/> వస్త్రం : నల్లని వస్త్రం
జాతి రత్నం : నీలం
నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం

రాహువు :
సూర్య చంద్ర గ్రహాణాలకు కారకుడు గా చెప్పబడేరాహువు ను ఒక పాము రూపం లో వారిన్స్తారు. ఒకకత్తి ని ఆయుధంగా చేసుకొని, ఎనిమిది నల్లటిగుర్రాలను అధిరోహిస్తూ ఉంటాడు.
పుత్ర దోషం, మానసిక రోగాలు, కుష్టు మొదలైనవిరాహు ప్రభావములే.
పడమర - దక్షినాభిముఖుడై ఉంటాడు.అదిదేవత : దుర్గ
ప్రత్యధిదేవత : పాము
వర్ణం : నలుపు
వాహనం : నిలపు సింహం
ధాన్యం : మినుగులు
పుష్పం : అడవి మందారం
జాతిరత్నం : గోమేధుకం
వస్త్రం : నల్లటి వస్త్రం
నైవేద్యం : మినుగులతో కూడిన అన్నం

కేతువు :
భార్య చిత్రలేఖ. ఆస్తి నష్టం, చెడు అలవాట్లు, పుత్ర దోషంమొదలైనవి తొలగాలంటే కేతు పూజలు చేయాలి.
ఉత్తరం - పడమటి ముఖాసీనుడై ఉంటాడు.
అదిదేవత : చిత్రగుప్తుడు
ప్రత్యధిదేవత : బ్రహ్మ
వర్ణం : ఎరుపు
వాహనం : గద్ద
ధాన్యం : ఉలవలు
పుష్పం : ఎర్రని కలువ
వస్త్రం : రంగురంగుల వస్త్రం
జాతి రత్నం : వైడుర్యం
నైవేద్యం : ఉలవల అన్నం.
పండుగలు
సూర్యుడు లేదా రవి గ్రహం

జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు మొదటి గ్రహం. సూర్యుడిని జ్యోతిష శాస్త్రంలో అధికంగా రవి అని వ్యవహరిస్తారు.
లింగం :- సూర్యుడు పురుష గ్రహం.
స్వభావం :- సూర్యుని స్వభావం పాప స్వభావం.
రాశి చక్రంలో స్థితి :- సూర్యుడు రాశి చక్రంలో సింహంలో రాజ్యాధికారంలోను, మేషంలో ఉచ్ఛ స్థితిలోను, తులలో నీచ స్థితిలోనూ ఉంటాడు.
ఈతర నామాలు :- సూర్యుడికి ఉన్న ఇతరనామాలలో కొన్ని అర్కుడు, ఆదిత్యుడు, అరుణుడు, తపసుడు, పూష, హేళీ, భానుడు, దినకరుడు, మార్తడుడు.
జాతి :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని జాతి క్షత్రియ,
తత్వం :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని తత్వం అగ్ని,
వర్ణం :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని వర్ణం రక్తవర్ణం,
గుణం :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని గుణం రజోగుణం,
గ్రహతత్వం :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని స్వభావం పాప స్వభాభావం, స్థిర స్వభావం,
రుచి :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుడు కారకత్వం వహించే రుచి కారం,
గ్రహ స్థానం :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని స్థానం దేవాలయం,
జీవులు :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుడు కారకత్వం వహించే జీవులు పక్షులు,
గ్రహోదయం :- పృష్టోదయం,
ఆధిపత్య దిక్కు :_ తూర్పు,
జలభాగం :- నిర్జల,
లోహం :- రాగి,
పాలనా :- శక్తి రాజు,
ఆత్మాధికారం :- ఆత్మ, శరీర
ధాతువు :- ఎముక,
కుటుంభ సభ్యుడు :- తండ్రి,
గ్రహవర్ణం :- శ్యాల వర్ణం,
గ్రహ పీడ :- శిరోవేదన, శరీర తాపం,
గృహంలో భాగములు :- ముఖ ద్వారం, పూజా మందిరం,
గ్రహ వర్గం :- గురువు,
కాల బలం :- పగటి సమయం,
దిక్బలం :- దశమ స్థానం,
ఆధిపత్య కాలం :- ఆయనం,
శత్రు క్షేత్రం :- మకరం, కుంభం,
విషమ క్షేత్రం :- వృశ్చికం, ధనస్సు, మకరం.
మిత్రక్షేత్రం :- మీనము.
సమ క్షేత్రం :- మిధునం, కన్య.
సూర్యుడు సింహ రాశిలో 20 డిగ్రీలలో మూల త్రికోణంలోనూ, మేష రాశిలో 10 డిగ్రీలలో పరమోచ్ఛలోను, తులా రాశిలో 10 డిగ్రీలలో పరమ నీచను పొందుతుంది. *మిత్రగ్రహాలు :- కుజుడు, చంద్రుడు, గురువు.
శత్రు గ్రహాలు :- శుక్రుడు, శని.
సమ గ్రహం :- బుధుడు.
నైసర్గిక బల గ్రహం :- శుక్రుడు,
వ్యధా గ్రహం, :- శుక్రుడు.
దిన చలనం :- 1 డిగ్రీ.
ఒక్కొక్క రాశిలో ఉండే సమయం :- 30 రోజులు,
రాశిలో ఫలమిచ్చే భాగం :- మొదటి భాగం,
ఋతువు :- గ్రీష్మ ఋతువు,
గ్రహ ప్రకృతి :- పిత్తము.
దిక్బలం :- దక్షిణ దిక్కు.,
పరిమాణం :- పొడుగు,

1. సూర్య గ్రహ గుణగణాలు
సూర్యుడు జ్యోతిష శాస్త్రంలో ఇలా వర్ణించారు. గుండ్రని ముఖం, రక్తవర్ణం, పొడగరి, గోధుమ వర్ణం కలిగిన జుట్టు కలిగిన వాడుగా వర్ణించబడ్డాడు. గుణత్రయాలలో సూర్యుని స్వభావం రజోగుణం. రుచులలో సూర్యుడు కారం రుచికి కారకత్వం వహిస్తాడు. చాతుర్వర్ణములలో సూర్యుడు క్షత్రియ జాతికి కారకత్వం వహిస్తాడు. తత్వం అగ్ని తత్వం, ప్రకృతి పిత్త ప్రకృతి. దిక్కు తూర్పు దిక్కు, లోహము రాగి, రత్నము మాణిక్యము, దిక్బలం దశమ స్థానం, రాశి సంఖ్య 1, కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తర ఆషాఢ నక్షత్రాలకు నక్షత్రాధిపత్యం వహిస్తాడు. శరీరావయవాలలో గుండే మరియు పురుషులకు కుడి కన్ను, స్త్రీలకు ఎడమ కన్ను, రాశ్యాధిపత్యం సింహరాశి, మేహరాశిలో 10 డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిని, సింహరాశిలో 20 ఇగ్రీలలో రాజ్యాన్ని, తులా రాశి 10 డిగ్రీలలో నీచను పొందుతాడు.
2. సూర్యుని ప్రభావం
సూర్యుని ప్రభావం ఉన్న వారు ఆత్మాభిమానం, చురుకు తనం కలిగి ఉంటారు. సంఘంలో పలుకుబడి ఉంటుంది. దుబారా వ్యయం, పొగడ్తలకు లొంగుట, ఆవేశపడుట, సమయస్పూర్తి కలిగి ఉంటారు. చక్కని సంపాదన ఉంటుంది. కంటి జబ్బులు, గుండె జబ్బులు, వడదెబ్బకు గురి అగుట వంటి శారీరక అవస్థలకు గురి ఔతుంటారు. పిత్త ప్రకృతి కలిగి ఉంటారు.
3. కారకత్వములు
సూర్యుడు ఆత్మకు, తండ్రికి, శక్తికి, అగ్నికి, ప్రతాపానికి, ఆకాశము, దిక్కు తూర్పు, దేశాధిపత్యములకు కారకత్వము వహిస్తాడు. ముళ్ళ చెట్లకు, పంటలలో మిరియాలు, మిరపకాయలు, కొబ్బరి, వాము, బియ్యం మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. శివ భక్తులు, శివ పూజ, శివాలయాలకు కారకత్వం వహిస్తాడు, జంతువులలో సింహం, ఎలుగుబంటి, గుర్రము, సర్పములకు కారకత్వం వహిస్తాడు. పక్షులలో కాకి కోకిల, కోడి, హంసలకు కారకత్వం వహిస్తాడు. వృత్తులలో ప్రభుత్వ కార్యాలయాలు, హృదయ సంబంధిత మందులు, వైద్యులు, రిజర్వ్ బ్యాంక్ సంబంధిత వృత్తులకు కారకత్వం వహిస్తాడు. ఆకాశ సంబంధిత విమానాలు, విమానాశ్రయము, ఖ్హగోళము, వాతావరణము, విమాన చోదకులు, విద్యుత్ సంబంధిత బ్యాటరీలు, విద్యుత్తు ఉత్పత్తి, భూకంపాలు, ఆకాశ వాణి, దూరదర్శన్వంటి ప్రసార సంబంధిత మాద్యమ వృత్తులు, విద్యుత్తు ఉపకరణ సంబంధిత వృత్తులకు కారకత్వం వహిస్తాడు.
4. రాశులు సూర్యుడు
సూర్యుడు మేష రాశి 10 డిగ్రీలలో ఉచ్చ స్థితిని పొందుతాడు. సిం,హరాశిలో 20 డిగ్రీల వద్ద రాజ్యా స్థితిని పొందుతాడు. సింహం సూర్యునికి స్వక్షేత్రం మరియు మూల త్రికోణ క్షేత్రం. సూర్యుడికి కుంభరాశి, మకర రాశి శత్రు క్షేత్రాలు, కాగా కన్యా రాశి, మిధున రాశి సమ క్షేత్రాలు. మీనం మిత్ర క్షేత్రం. వృశ్చిక, ధనస్సు, మకరాలు విషమ క్షేత్రాలు.
5. సూర్యుడు గ్రహాలు
సూర్యుడికి గురువు, చంద్రుడు, కుజుడు మిత్ర గ్రహాలు. శుక్రుడు, శని శత్రు గ్రహాలు. బుధుడు నైసర్గిక బలం కలిగిన గ్రహం. వ్యధా గ్రహం శుక్రుడే.
6. సూర్య ఆరాధన
సూర్యుడు తెలుగు సంవవత్సరం ప్రభవ మాఘ శుద్ధ సప్తమి ఆదివారం నాడు విశాఖ నక్షత్రంలో అతిధి, కశ్యపులకు జన్మించాడు కనుక సూర్యునికి రధసప్తమి నాడు విశేష పూజలు జరుపుతారు. సూర్యుడి పూజార్ధం రాగి విహగ్రహం ప్రతిష్ఠిస్తారు. గోధుమలు, బెల్లంతో వండిన పాయసం నైవేద్యంగా పెడతారు. గ్రహ ప్రీత్యర్ధం బెల్లం కలిపిన అన్నం సమర్పిస్తారు. సూర్యుడికి పళ్ళు లేవని అందువలన పాయసం అతడికి ప్రీతి కలిగిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. సూర్యుడు సప్త వర్ణాలకు ప్రతీకగా సప్త అశ్వములు పూన్చిన రధం మీద ఆరూఢుడై ఉంటాడు. వినతా పుత్రుడైన అనూరుడు సూర్యుడికి సారధి. అనూరుడు గరుత్మంతుని అన్న. శ్రీరామ నవమి సూర్య గ్రహ ప్రీత్యర్ధం చేయబడే మరి ఒక పండుగ. సూర్యుడికి ప్రీతికరమైన తిధి జ్యేష్ట శుక్ల ద్వాదశి, కార్తిక శుక్ల సప్తమి. సూర్యుడి ప్రీత్యర్ధం ఆదివార వ్రతం చేస్తారు. సూర్యుడిని వివిధరకాలుగా స్త్రోత్రం చేస్తారు. వాటిలో కొన్ని ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య అష్టోత్తర శతనామావళి మొదలైనవి. సూర్యుని ప్రీత్యర్ధం విష్ణుసహస్రనామ పారాయణ, హరి వంశ పురాణం పారాయణ చేస్తారు. గాయత్రీ మంత్రోపాసన, దీక్ష. జపం సూర్యునికి ప్రీతి కలిగిస్తుంది. సూర్యునికి ప్రతి రోజు త్రి సంధ్యలలో సంధ్యా వందనం చేయడం హిందూ సంప్రదాయాలలో ఒకటి.
7. ద్వాదశభావాల్లో సూర్యుడు
మేషం :- సూర్యుడు మేషరాశిలో ఉన్న వ్యక్తి కార్యకుశలత లలిగి ఉంటాడు. వీరికి పట్టుదల అధికం. కష్టసాధ్యమఇన పని అయినా శ్రమ పడి సాధిస్తారు. తమ మీద విశ్వాసం ఎక్కువ ఇతరుల సామధ్యం మీద విశ్వాసం తక్కువ కనుక ఇతరులు వీరిని గర్వము కలినన వారుగా భావిస్తారు. కాని వీరు నిష్కపటులు అని సన్నిహితులు గ్రహిస్తారు. పొగడ్తలకు లొంగే గుణము కలిగి ఉంటారు. ధైర్యసాహసాలు కలిగి ఉంటారు.
వృషభం :- సూర్యుడు వృషభంలో ఉన్న వారు స్థిరమైన స్వభావము కలిగి ఉంటారు. అలంకార ప్రియులు. తమకు వీలైంతగా తామున్న ప్రదేశాలను అలంకరిస్తారు.
అలంకరణ సామాగ్రికి అధికంగా వెచ్చిస్తారు.
మిధునం :- సూర్యుడు మిధున రాశిలో ఉన్న వారు వాక్చాతుర్యం కలిగి ఉంటారు. సమయానుకూలంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. ఇతరుల అభిప్రాయాలు సరి అయిన వాదనతో మార్చగలిగిన చతురత ప్రదర్శిస్తారు. వీరు తమ వాహనాదులను తరచూ మారుస్తుంటారు. తమ నేర్పు సమయస్పూర్తి వాకచాతుర్యంతో తామున్న చోటుకంటే ఉన్నత స్థితికి చేరుకుంటారు.
కర్కాటకం :- సూర్యుడు కటకరాశిలో ఉన్న వ్యక్తి హాస్యసంభాషణా ప్రియులు. బంధువులను ఆదరించే గుణము. పొదుపు పాటించడము. భూతభవిష్యత్తు వర్తమాన కాలములను భేరీజు వేస్తూ పొదుపు చేసి ఖచ్చితమైన నిప్రణాళిక వేస్తుంటారు. మనసులోని విషయాలు ఒక పట్టాన బయట పెట్టరు. హృదయపూవకంగా మాట్లాడుతారు. జరిగిన విషయాలను జీవివితకాలం మరువరు కనుక ఇతరుల మనస్తత్వాన్ని భేరీజు వేసి జాగరూకతగా మెలుగుతుంటారు. ఎవరితోను పేచీలకు దిగరు, ద్వేషము పెంచుకోరు, అనేక విషయాలలో ఇతరులతో సర్దుకు పోయినా అవసరమైన ప్రదేశాలలో కోపం ప్రదర్శిస్తారు. అతిథులను ఆదరంచి సత్కరిస్తారు.
చంద్రుడు

చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. చంద్రుడు స్త్రీ గ్రహం, వైశ్య జాతి, శ్వేత వర్ణం, పరిమాణం పొట్టి, వయస్సు డెబ్బై సంవత్సరాలను సూచించును. దిక్కు వాయవ్యం, తత్వం జల తత్వం, ప్రకృతి వాత, శ్లేష్మములు. ఋతువులలో వర్ష ఋతువును, లోహములలో వెండిని, రత్నములలో ముత్యమును సూచించును. చంద్రుడు చతుర్ధ భావంలో దిక్బలం కలిగి ఉంటాడు. గ్రహములలో చంద్రుడు ఏడవ వాడు. సత్వగుణ సంపన్నుడైన చంద్రుడు కృష్ణ పక్ష దశమి నుండి శుక్ల పక్ష పంచమి వరకు పూర్ణ చంద్రుడు. శుక్ల పంచమి నుండి అమావాస్య వరకు క్షీణ చంద్రుడు, అమావాస్య నుండి కృష్ణ పక్ష దశమి వరకు మద్యమ చంద్రుడు అని శాస్త్రం చెప్తుంది. చంద్రుడు రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాలకు అధిపతి. శరీరావయవములలో మగవారి ఏడమ కన్ను, స్త్రీల కుడి కన్ను శరీర మద్య భాగమును సూచించును. చంద్రుడు కర్కాటక రాశికి ఆధిపత్యం వహిస్తాడు. చంద్రుడు వృషభంలో మూడు డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిలో ఉంటాడు. వృషభంలో మూడు నుండి ఇరవై ఏడు డిగ్రీల వరకు మూల త్రికోణంలో ఉంటాడు. వృశ్చికంలో మూడు డిగ్రీల వరకు పరమ నీచ స్థితిలో ఉంటాడు. బుధుడు, సూర్యుడు మిత్రులు. చంద్రుడికి శత్రువులు లేరు.
1. చంద్రుని ప్రభావం
చంద్ర ప్రభావిత వ్యక్తులు శ్లేష్మమ వ్యాధి పీడితులుగా ఉంటారు. వీరు కొంత సమయం ఉత్సాహంతోనూ మరి కొంత సమయం నిరుత్సాహంగానూ ఉంటారు. కొంత కాలం ధైర్యము మరి కొంత కాలం భయం కలిగి ఉంటారు. కొంత కాలం ధనవంతులుగా మరి కొంతకాలం ధనహీనులుగా ఉంటారు. స్థూలంగా మానసిక స్థితి, సందలు అస్థిరంగా ఉంటాయి. అభిప్రాయాలూ తరచూమార్చుకుంటారు. మిత్రులనూ తరచూ మార్చుకుంటారు. భోజన ప్రియులుగా ఉంటారు. ఆ కారణంగా యుక్త వయసు దాటే సమయానికి పొట్ట పెద్దది అయ్యే అవకాశం ఎక్కువ. స్వతంత్రించి ఏకార్యం చెయ్య లేరు. నీటి పారుదల, జల విద్యుత్, ప్రజా ప్రాతినిధ్యం, బియ్యము, వస్త్రములకు సంబంధించిన వృత్తులలో రాణిస్తారు. పాండు రోగం, క్షయ, మధుమేహం, శ్వాశకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.
2. చంద్రుని కారకత్వాలు
చంద్రుడు తల్లికి, జలరాంతాలు, జలం, పూలు, సముద్రం, నదులు, ముఖము, ఉదరం, మహిళా సంఘాలకు, స్త్రీ సంక్షేమ సంఘాలకు చందుడు కాకత్వం వహిస్తాడు. వృత్తి సంబంధంగా నౌకా వ్యాపారం, ఓడ రేవులు, వంతెనలు, ఆనకట్టలు, చేపల పెంపకం, వెండి, మత్యములకు కారకత్వం వహిస్తాడు. వ్యాధులలో రక్త హీనత, అతి మూత్రం, గర్భ సంబంధిత వ్యాధులు, వరబీజము, బేదులు, మానసిక వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు, కేన్సర్(రాచ పుండు) మొదలైన వాటికి కారకుడు, ఆహార సంబంధంగా చెరకు, తేనె, పాలు, పెరుగు, భోజనము, గోధుమలు, జొన్నలు, రొట్టెలు, గోధుమలు, చేపలు, పంచదార, అరటి పండు, నెయ్యి, దోసకాయలు, తమలపాకులు, గుమ్మడి, క్యాబేజీ, కర్బూజా ఫలం, కుక్కగొడుగులు, ఆవులు, గుడ్లు తాబేలు, గుడ్లగూబ, బాతు, గబ్బిలం, పిల్లి, నీటి గుర్రం, సొర చేపల వంటి ప్రాణులకు కారకత్వం వహిస్తాడు., తిమింగలం మొదలైన ప్రాణులకు కారకత్వం వహిస్తాడు. గుడ్లు, క్కర్పూరం, నికెల్, జర్మన్ సిల్వర్ లాంటి వస్తువులకు కారకత్వం వహిస్తాడు. సంగీతం, నాటం, కవిత్వం లాంటి లలిత కళలకు కారకత్వం వహిస్తాడు. మనస్తత్వ శాస్త్ర పఠనం,వ్యవసాయం, విద్యా సంబంధిత వృత్తులు, జల వనరులవంటి వృత్తులకు కారకత్వం వహిస్తాడు. మూలికలు, స్త్రీలు, జీర్ణ వ్యవస్థ, జున్ను చంద్రుడు కారకత్వం వహించే ఇతరములు.
3. రూపురేఖలు
పురాణ కధనం అనుసరించి చంద్రుడు గౌరవర్ణం కలిగిన వాడు. శ్వేత వస్త్ర ధారణ చేయువాడు. శ్వేత వర్ణ ఆభరణములతో అలంకరించబడిన వాడు. రెండు భుజములతో, శిరస్సున బంగారు కిరీటము ధరించి మెడలో ముత్యాల మాలను ధరించి ఒక చేత గధ, ఒకచేత వరద ముద్రతో దర్శనం ఇస్తాడు. దశాశ్వములను పూన్చిన రధమును అధిరోహించి సంచరిస్తాడు.
4. చంద్రుడు రాశులు
చంద్రుడు కర్కాటకంలో స్వక్షేత్రంలోనూ వృషభంలో మూడు డిగ్రీల వద్ద ఉచ్ఛ స్థితిలోనూ, వృశ్చికంలోని మూడు డిగ్రీల వద్ద నీచస్థితిలోనూ ఉంటాడు. చంద్రుడికి శత్రువులు లేరు అలాగే శత్రు క్షేత్రం లేదు. చంద్రుడికి మిధునం, కన్య, సింహములు మిత్ర క్షేత్రములు. వృషభం త్రికోణ స్థానం. శుక్ర, శనులు సములు. కుంభం, మకరం, తులా రాశులు సమ రాశులు.
కుజుడు లేదా అంగారకుడు

అంగారకుడు ఉగ్ర స్వభావుడు. అధిపతి కుమారస్వామి.పురుష గ్రహం,రుచి చేదు, జాతి క్షత్రియ, అధి దేవత పృధ్వి, దిక్కు దక్షిణం, తత్వం అగ్ని, ప్రకృతి పిత్తము, ఋతువు గ్రీష్మం, లోహములలో ఇనుము, ఉక్కు, రత్నము పగడము, గ్రహ సంఖ్య ఆరు, భావరీత్యా దశమస్థానంలో స్థాన బలం కలిగి ఉంటాడు. గుణం తమో గుణం, ప్రదేశం కృష్ణా నది మొదలు లంక వరకు. అంగారకుడు మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్రాలకు అధిపతి. శరీరావయావలో ఎముకలో మజ్జ, కండరాలు, బాహ్యంలో జ్ఞానేంద్రియాలు. అంగారకునికి సూర్యుడు, చంద్రుడు, గురువు మిత్రులు, శత్రువు బుధుడు, సములు శుక్రుడు, శని.
1. అంగారకుడి ప్రభావం
అంగారక ప్రభావితులు పొడుగుగా దృఢంగా ఉంటారు. బంధువులంటే అపార ప్రేమ కలిగి ఉంటారు. అదుపు చేయ లేని ఆవేశ పరులు. విపరీత బంధు ప్రీతి కలిగి ఉంటారు. అధికారం, పదవి, సేవకులను కలిగి ఉంటారు. యంత్రములు, ఆయుధములు మొదలైన వాటిలో శిక్షణ పొందుటలో ఆసక్తుడు. అధిక దానధర్మములు కలిగి ఉంటారు.
2. అంగారకుడి రూపు రేఖలు
అంగారకుడు ఎర్రని మేని ఛాయ కలవాడు. సన్నని నడుము, కండలు తిరిగిన శరీరం, వంకీల జుట్టు కల వాడు. వయసు పద హారు. ఎర్రని వస్త్రధారణ, శంఖం వంటి మెడ, వాహనం పొట్టేలు, ఆయుధం శూలం, మంగళప్రదమైన రూపము.
3. కుజదోష నివారణకు పరిహారం
కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.
సుబ్రహ్మణ్య ఆలయ స్తుతి దర్శనం చేయాలి.
షష్టి, సుబ్రహ్మణ్య షష్టి, సుబ్రహ్మణ్య జననం జరిగిన కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయాలి.
సంతానం లేని దంపతులు ఏడు ఆదివారాలు కుమారస్వామి ఆలయానికి ప్రదక్షిణ చేయాలి.
ఎర్రని పుష్పాల మాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి.
కుజుని అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉండి కందిపప్పు బెల్లంతో చేసిన పదార్ధాలను నైవేద్యం పెట్టాలి.
కార్యాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంచి ధూపదీప నైవేద్యములు సమర్పించి కార్యక్రమాలు ప్రారంభించాలి. మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుట చేయాలి.
ఎర్రని వస్త్రాలను, ఎర్రని పండ్లను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దానం చేయాలి. స్త్రీలు ఎర్రని వస్త్రధారణ, పగడపు ఆభరణాలు ధరించి చేసి దుర్గాదేవిని పూజించుట, అమ్మవారికి ఎర్రని పూలను మాలలను సమర్పించి కుంకుమపూజ చేయాలి.
దుర్గాదేవిని స్తుతించాలి. మంగళ వారాలు దుర్గాదేవి ఆలయదర్శనం చేసి ప్రదిక్షిణం చేసి స్తుతించి పూజించాలి. గణపతి స్తోత్రం చేయాలి. ఆంజనేయస్వామి దండకం స్తుతి చేయాలి.
బలరామ ప్రతిష్టిత నాగావళీ నదీతీర పంచలింగాలను దర్శించాలి.
మంగళ వారాలాలలో సింధూరవర్ణ ఆంజనేయ స్వామి దర్శనం, ప్రదిక్షిణం, స్తుతి చేయాలి.
మంగళ వారం లేక కృత్తికా నక్షత్రం రోజున కుజుడికి శివాలయం లేక సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఏడు వేల కుజ జపం చేయించి ఎర్రని వస్త్రంలో కందిపప్పు మూట కట్టి దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి.
ఏడు మంగళవారాలు కుజుడికి ఉపవాసం ఉండి కుజ శ్లోకం డెబ్భై మార్లు పారాయణం చేసి ఏడవ వారం కందులు దానం ఇవ్వాలి.
నానవేసిన కందులను బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి.
కోతులకు తీపి పదార్ధములు పెట్టాలి,
ఎర్రమి కుక్కకు ఆహారం పెట్టాలి.
మంగళ వారం రాగిపళ్ళెంలో కందిపప్పు పోసి దక్షిణ తాంబూలాలతో యువకుడికి దానం ఇవ్వాలి.
4. భావాలు పరిహారం
కుజుడు కటకంలో నీచ స్థితి పొందుతాడు. కటకం లగ్నం నుండి పన్నెండు భావాలలో ఉన్నప్పుడు ఆయాభావాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి కనుక వాటికి తగిన పరిహారాలు కింద ఇవ్వబడ్డాయి.
మొదటి భావం లేక లగ్నం కుజుడికి నీచ స్థానమైన కటకం అయి అందులో కుజుడు ఉంటే అబద్ధములు చెప్పకూడదు, దంతంతో చేసిన వస్తువులు వాడరాదు. దానం తీసుకోరాదు.
కుజుడు రెండవ స్థానంలో ఉండి అది కుజుడికి నీచ స్థఆనమైన కటకం అయిన ఎడల కంఠ సమస్యలు ఉంటాయి కనుక కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యస్వామిని సేవించి గంట, దీపం దానం చేయాలి. రెండవ స్థానం కటకం అయి అందు కుజుడు ఉన్న అది కుజుడికి నీచ స్థితి కనుక ధన సమస్యలు ఉంటాయి. పరిహారంగా ఎర్రటి చేతి గుడ్డను ఎప్పుడూ వాడుతుండాలి. ఏడు మంగళ వారాలు చిన్న పిల్లలకు బెల్లం గోధుమలతో చేసిన ఆహారం తినిపించాలి.
కుజుడు అన్నదమ్ములకు చిహ్నం. మూడవ ఇంట కుజుడు ఉన్న సోదరులతో చిక్కులు ఉంటాయి కనుక పరిహారం కొరకు ఏనుగు దంతంతో చేసిన వస్తువును ఇంటికి దక్షిణంలో ఉంచి కుజుడిని ఆరాధించాలి. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ఇరుగు పొరుగుతో వివాదాలకు దూరంగా ఉండాలి. వెండి ఉంగరంలో పొదిగిన పగడపు ఉంగరం ఎడమ చేతికి ధరించవచ్చు.
నాగవ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కోతులకు, తల్లికి భోజనం పెట్టాలి. పంచదార వంటి తీపి పదార్ధాల సంబధిత వ్యాపారం చేయాలి.
పంచమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు రాగి పాత్రలో రాత్రి అంతా ఉంచిన నీటిని తెల్లవారిన తరువాత పచ్చని చెట్టుకు పోయాలి. ఇంటికి దక్షిణంలో వేప చెట్టు నాటాలి.
ఆరవ స్థానం రోగ, శత్రు స్థానం కనుక కుజ స్తోత్రం చదువుకోవాలి. తుప్పు పట్టిన ఇనుప వస్తువులను ఇంట్లో ఉంచరాదు.
ఏడు స్థానంలో కుజుడు ఉన్న భార్యాభర్తల మద్య వివాదాలు ఉంటాయి కనుక పరిహారంగా శిరః స్నానమాచరించి ఇంటికి దక్షిణ భాగంలో మూడు వత్తులతో దీపం వెలిగించి కుజుడి స్తోత్రం, సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయాలి. కంది పప్పుతో చేసిన ఆహారం తీసుకుంటే ధన సమస్యలు తీరి భార్యాభర్తల మద్య అనుకూలత కుదురుతుంది.
ఎనిమిదవ స్థానం ఆయుషు స్థానం స్త్రీలకు మాంగల్య స్థానం కనుక సుబ్రహ్మణ్య, దుర్గ, ఆంజనేయ, గణపతి, శివులకు విశేష పూజలు చేయాలి.
తొమ్మిదవ స్థానం అందు కుజుడు నీచమైన; పెద్ద వారిని గౌరవించడం, వెండితో పొదిగిన పగడపు ఉంగరం ధరించడం చెయ్యాలి.
పదవ స్థానం అందు కుజుడు నీచమైన; కార్యాలల్లో సుబ్రహ్మణ్య స్వామిని ఉంచి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కార్యాలు మొదలు పెట్టాలి.
పదకొండవ స్థానం లాభస్థానం, అన్నతో పేచీలు ఉంటాయి. మట్టి పాత్రలో సింధూరం లేక తేనె ఉంచిన దోష పరిహారం ఔతుంది.
వ్యయ స్థానం కుజుడు నీచమైన తేనె త్రాగుట, సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యాలి.
బుధుడు
బుధుడు నపుంసక గ్రహం. మిశ్రమ రుచుల కారకత్వం కలిగిన వాడు. ఇరవై వయసున్న వారిని సూచిస్తాడు. వర్ణం ఆకు పచ్చ, జాతి వైశ్య, అధి దేవత విష్ణువు, గుండ్రని ఆకారం, పరిమాణం పొడుగు, ప్రకృతి కఫ, వాత, పిత్తములు కల వాడు. శరధృతువును ఉత్తర దిక్కునూ, సూచిస్తూ, పృధ్వీ తత్వం కలిగిన వాడు, గ్రహ సంఖ్య అయిదు, రత్నం పచ్చ, లోహం, ఇత్తడి, కంచు, గుణం రజో గుణం కలిగిన వాడు. లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు. ఆశ్లేష, మూల, రేవతి నక్షత్రములకు బుధుడు అధిపతి. మిధున కన్యా రాశులకు అధిపతి. బుధుడు కన్యారాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ ఉచ్ఛ స్థితిని పొందుతాడు. మీనరాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ నీచను పొందుతుంది. కన్యారాశిలో పదిహేను ఇరవై డిగ్రీలు మూల త్రికోణము ఔతుంది. బుధుడికి సూర్యుడు, శుక్రుడు మిత్రులు. సింహరాశి, వృషభరాశి, తులారాశులు మిత్ర స్థానములు. చంద్రుడు శత్రువు. కర్కాటక రాశి శత్రు స్థానం. బుధ గ్రహ దశ పదిహేడు సంవత్సరాలు. బుధుడు ఏడవ స్థానం మీద మాత్య్రమే దృష్టిని సారిస్తాడు.
బుధుడు స్వభావరీత్యా శుభుడు, తత్వము భూతత్వం, గ్రహ స్వభావం, ఒంటరిగాపాపి శుభగ్రహములతో చేరిన శుభుడు. జీవులు పక్షులు, గ్రహ స్థానం క్రీడాస్థలాలు, జలతత్వం జలభాగం, ఆత్మాధికారం వాక్కు, పాలనా శక్తి రాకుమారుడు, గ్రహపీడ బంధువుల వలన బాధలు, గ్రహ వర్గం శని, గృహంలో భాగములు పఠనా మందిరం, దిక్బలం తూర్పు, నివాస ప్రదేశములు జనావాసాలు, చెట్లు ఫలములు లేని చెట్లు, పండ్లు సీమ చింత, ధాన్యం పెసలు, పక్షులు చిలుక, గబ్బిలం, జంతువులు మేక గొర్రె, ఇతర వస్తువులు నగలు, మిశ్ర లోహములు. వస్త్రం తడి వస్త్రం, దేవ వ్ర్గం శైవ, గ్రహ వేదం అధ్ర్వణ వేదం, గ్రహ గోత్య్రం ఆత్రేయ, అర్ధశుభుడు, అవతారం బుద్ధావతారం, గ్రహవర్ణం తాళపత్ర వర్ణం, వారం బుధవారం, మన స్థితి సాత్వికం, బలంగా ఉంటే వాక్చాతుర్యం బుద్ధి జ్ఞానం, ఋషి నారాయణుడు.
1. బుధుడి ప్రభావం
బుధ ప్రభావితులు పొట్టిగా ఉంటారు. చురుకుగా ఉంటారు. వాక్చాతుర్యం కలిగి ఉంటారు. బుద్ధి కుశలత కలిగి ఉంటారు. వృద్ధాప్యంలో కూడా యవ్వనంతో కనిపిస్తారు. దీర్ఘాలోచ కల వారు, మేధా సంపత్తి కల వారుగా ఉంటారు. సందేహ ప్రవృత్తి కలవారుగా ఉంటారు. విషయ జ్ఞానం అందు ఆసక్తులు. రచయితలు, కళాకారులుగా ఉంటారు. తలనిప్పి, తల నొప్పి, అల్సర్ వ్యాధి పీడితులయ్యే అవకాశం ఉంది. ప్రసార రంగంలోనూ, కళారంగంలోనూ, గణికులుగా ఉంటారు.
2. బుధుడి కారకత్వాలు
బుధుడు వాక్కుకు, మేనమామకు, మేనకోడలికి, మేనల్లుడికి, మాతా మహులకు కారకత్వం వహిస్తున్నాడు. ఉపన్యాసంలో నైపుణ్యం, లలిత కళలు, గణిత శాసత్రం, వాణిజ్యం, అర్ధ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వ్యాపార శాస్త్రం, వ్యాకరణం, జ్యోతిషం, వివిధరకాల భాషలు, శిల్పి, మంత్రం, తంత్రం, వివేకం, పుస్తక పచురణ, గ్రంధాలయం మొదలైన వాటికి కారణం. దౌత్యం, వైద్యం, మద్యవర్తిత్వం మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. వైష్ణవులు, వైష్ణవ భక్తి, వైష్ణవాలయం మొదలైన వారికి కారకత్వం వహిస్తాడు. నాభి, నరము,స్వరపేటిక, చర్మమును సూచిస్తాడు కనుక నరముల బలహీనత, మూర్చ, చ్చెముడు, మెదడుకు సంబంధించిన వ్యాదులకు కారకత్వం వహిస్తాడు. సకల విధ ఆకు కూరలు, కాయ కూరలకు కారకత్వం వహిస్తాడు. సభా నిర్వాహకులు, ప్రజాసంబంధిత వ్యవహారికులు, ప్రచారకులు, ఉపన్యాసకులు, ఉపాద్యాయులు, న్యాయవాదులు మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. వాక్సంబంధిత వృత్తులకు బుధుడు కారకుడు. మేధావులు, పండితులు, చరిత్రకులు, గుమస్తాలు, చిత్రకారులు, రాయబారులు, విద్య, గణికులు, దస్తూరి, నవలలు, వ్యాసాలు, కల్పితాలు, చిన్న పుస్తకములు, యువకులు, ప్రకటనలు, వాహనములు, వ్యాపారం, నిఘంటువులు, సత్యవాదముకు బుధుడు కాకత్వం వహిస్తాడు.
3. బుధుని రూపురేఖలు
బుధుడు దుర్వాదళ దేహకాంటి కలిగిన వాడు. నాలుగు భుజములు కలిగి పీత వస్త్రములను ధరించి పసుపు పచ్చని మాలా ధారణ చేసి గధ, కత్తి, డాలు ఆయుధములను చేత పట్టి ఉంటాడు. బుధుడు సింహమును అధిరోహించి ఉంటాడు.
4. బుధుని పూజించు విధానం
బుధుడిని పూజించుటకు బంగారు ప్రతిమను చేయాలి. పాలతో కలిపిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. అధిదేవత విష్ణువు, అధిష్టాన దేవత దుర్గ. ప్రసాదము పులిహోర, వడపప్పు, దోషనివారణకు దానం చేయవలసిన లోహం బంగారం. బుధుడికి శ్రావణ్ శుక్ల పంచమి, వైశాఖ పూర్ణిమ, ఆచరించ వలసిన వ్రతం సత్యనారాయణ వ్రతం, పారాయణ చేయవలసిన గ్రంధం దేవీ భాగవతం, పారాయణ చేయవలసిన బుధగ్రహ అష్టోత్తర శతనామావళి, విష్ణు సహస్ర నామం, ధరించవలసిన మాల తులసి మాల, తీసుకోవలసిన దీక్ష గోవింద దీక్ష, ధరించ వలసిన రుద్రాక్ష చతుర్ముఖ రుద్రాక్ష, దర్శించ వలసిన ఆలయాలు విష్ణాలయం దుర్గాలయం, పూజ దుర్గా పూజ, దానం చేయవలసిన వాస్థువులు పెసలు ఆకు పచ్చని వస్త్రాలు, ఆసనం బానాకారం, గ్రహ శాంతికి చేయ వలసిన జపం పది హేడు వేలు, హోమముకు వాడవలసిన సమిధ ఉత్తరేణి.
5. బుధుడు రాశులు
బుధుడు కన్యారాశిలో 15 డిగ్రీలలోఉచ్ఛ స్థిలోనూ, మీన రాశిలో 15 డిగ్రీలలోపరమ నీచ స్థితిలోనూ ఉంటాడు. కన్యారాశి బుధునికి త్రికోణ స్థానం. శత్రు క్షేత్రం కర్కాటక రాశి. విషమ క్షేత్రం కర్కాటక రాశి. మిత్ర క్షేత్రములు వృషభ రాశి, తులా రాశి, సింహ రాశి. సములు కుంభరాశి, మకర రాశి, మేష రాశులు, వృశ్చిక రాశులు, ధనస్సు, మీనములు. రాశిలో 30 డిగ్రీల వరకు శుభఫలితం ఇచ్చాడు. బుధుడు ఒక రాశిలో ఒక నెల రోజులు ఉంటాడు. దిన చలనం ఒక డిగ్రీ. లగ్నంలో దిగ్బలం చెందుతాడు. గోచార రీత్యా బుధుడు 2, 4, 6, 11 స్థానములలో శుభుడు. గోచార రీత్యా అశుభ స్థానములు 1, 3, 5, 7, 8, 9, 12. వేధ స్థానములు 3, 5, 9, 12. దశాసంవత్సరములు పదిహేడు.
గురువు దేవ గురువు. ఇతడు సద్బ్రాహ్మణుడు. గురువుకు బృహస్పతి అనేది ఇతడికి ఉన్న నామాలలో ఒకటి.ఇతడికి వాచస్పతి, దేవేజ్యుడు, ఆంగీరస, జీవ అనే ఇతర నామాలు ఉన్నాయి. ఆది వారంతో మొదలయ్యే వారాలలో గురువుది అయిదవ స్థానం. అందుకే దానిని బృహస్పతి వారం అని కూడా అంటారు. అత్యంత శక్తి వంతమైన గ్రహం. పురుష గ్రహం, అధి దేవత బ్రహ్మ, రుచులలో తీపికి రుచి కారకుడు, వయసు ముప్పై, ప్రకృతి కఫ ప్రకృతి, హేమంత ఋతువుకు అధిపతి, తత్వం ఆకాశ తత్వం, దిక్కు ఈశాన్య దిక్కును సూచిస్తాడు. లోహములలో బంగారమును, రత్నములలో పుష్యరాగమును సూచిస్తాడు. గురువు లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు. గోదావరి వింధ్య పర్వత నడుమ ఉన్న భూమికి గురువు అధిపతి. గురువు పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్రములకు అధిపతి. అంటే పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్ర జాతకులకు గురుదశ ప్రారంభ దశ. గురువు కటక రాశిలో ఉచ్ఛ స్థితిని, మకర రాశిలో నీచ స్థితిని పొందుతాడు. గురువు ధనస్సు రాశికి, మీనరాశికి ఆధిపత్యం వహిస్తాడు. గురువుకు మిత్రులు రవి, చంద్ర, కుజులు. శత్రువులు బుధ, శుక్రులు. సముడు శని. గురుదశ పదహారు సంవత్సరాలు. స్వభావం మృదు స్వభావం, సత్వగుణం, శుభ గ్రహం, జీవులు ద్విపాదులు, స్థానం ధనాగారం, అత్మాధికారత్వం జ్ఞానం, ధాతువు కొవ్వు, కుటుంబ సభ్యులు పుత్రుడు, గృహ స్థానం పూజ గది, ధన స్థానము, కాల బలం పగలు, స్థాన బలం లగ్నం, కాల ఆధిపత్యం మాసము, దిక్బలం తూర్పు, వర్ణం పసుపు వర్ణం, రాశిలో ఉండే కాలం ఒక సంవత్సరం, సమిధ రావి, మూలిక రావి అరటి వేరు, గోత్రము అంగీరస, వేదము ఋగ్వేదము, అవతారం వామనుడు.
1. రూపం
గురువుది స్థూల శరీరం, కపిల వర్ణ కనూలు, కపిల వర్ణ వెంట్రుకలు, పీతవర్ణ శరీర కాంతి కలవాడు. నాలుగు భుజములు కలిగి చేతులలో దండము, కమండలం, రుద్రాక్షమాల ధరించి ఉంటాడు. గురువు పీతాంబర ధారి, వాహనము సింహము. గురువు భార్య తార, తండ్రి అంగీరసుడు, తల్లి ప్రజాపతి మారీచి పుత్రిక అయిన సురూప.
2. గురువు కారకత్వం
ధనం,విద్య,పుత్రులు,జ్యేష్ట భ్రాత,దేహపుష్టి,బుద్ధి,అర్ధసంపద,యజ్ఞం,కీర్తి,గృహం,బంగారం,శస్త్రం,అశ్వం,మెదడు,జ్యోతిషం,వేదశాస్త్రం,శబ్ధశాస్త్రం, వాహనశాస్త్రం,ఆందోళికం,గంజం,యజ్ఞయాగాధి క్రతువులు,కర్మ,ఆచారం,ఛాందసం,సుజనత్వం,శాంతం,మంత్రిత్వం,ఐశ్వర్యం,బంధివృద్ధి,దయ, దాక్షిణ్యం,ధర్మం,దైవభక్తి,వస్త్రం,సత్యం,తర్కం,మీమాంస,సింహాసనం,వాగ్దోరిణి,పసుపురంగు,నృపసన్మానం,ధర్మం,వెండి,బ్రాహ్మణులు,జ్ఞానం, కోశాగారం,నవీనగృహం,బంధుసమూహం,సుబుద్ధి,ఉత్తరదిశ,కావ్యజ్ఞానం,నిక్షేపం,వైడూర్యం,ఊరువులు,అగ్నిమాంద్యం,దంతములు,వేదాంతజ్ఞానం, బ్రాహ్మణభక్తి,శ్రద్ధ,పాండిత్యం,బ్రాహ్మణవృత్తి,ఉపాద్యాయవృత్తి,ముద్రాధికారం,భాతృశుఖం,సంపత్తి,బహువిధ విద్వత్తు,వ్యాకరణం,రక్తం,పిత్తాశయం, రక్తనాళములు,ఉన్నత విద్యపై అధికారం,వాణిజ్య విషయములు,ధన విషయములు మొదలైనవి గురుగ్రహ కారకత్వాలు. ఆహార పదార్ధాలు నెయ్యి, నూనె, పాలు, వెన్నలకు కారకత్వం వహిస్తాడు. శనగలు, పనస కాయలు, దబ్బకాయలకు కారకత్వం వహిస్తాడు. పక్షులలూ పావురం, హంసలు జంతువులలో గుర్రములు, ఏనుగులకు, సింహములు వృక్షములలో వట వృక్షం కారకత్వం వహిస్తాడు. పుస్తకములు, కళాశాలలు, వైద్యులు, లాయర్లు, పూజారులు, ఫాదర్లు, బిషప్పులు, చర్చి మసీదు వంటి మత సంస్థలు, కరుణ, సంతోషం, పెట్టుబడులు, అభివృద్ధి , ఐశ్వర్యం, ఉపాసన, వీదేశీయులు, భవిష్యత్తు, బహుమతులు, ఆచారాలు బ్యాంకులు, ధనుర్విద్య, రేసులు, టైటిల్స్, నిజాయితీలను సూచిస్తాడు.
3. గురు ప్రభావం
గురు ప్రభావితులు స్థూలకాయం కలిగి మంచి ఆకారం కలిగి ఉంటారు. గురుగ్రహ ప్రభావితులకు ఆహారం, వస్త్రం వంటి జీవిత సౌఖ్యములు పుష్కలంగా ఉంటాయి. సంప్రదాయాల పట్ల గౌరవం, దైవభక్తి, పాండిత్యం, న్యాయ బుద్ధి, ధర్మనితరి, జ్ఞానం కలిగి ఉంటారు. చక్కని కంఠధ్వని, విశాల నేత్రాలు కలిగి ఉంటారు. విద్యావంతులై విద్యా సంస్థలతో సంబంధం కలిగి ఉంటారు. న్యాయశాస్త్ర అధ్యయనం, దేవాలయ వ్యవస్థ, విద్యా సంబదిత పదవులలో రాణిస్తారు.
4. కొన్ని విశేషములు
వృత్తులు :- గురువు న్యాయవాదులు, న్యాయ మూర్తులు, బోధకులు, ఉపాద్యాయులు, సామాజిక రచయితలు, మత ప్రవక్తలు, పురోహితులు, మత ప్రచారకులు, ఉన్నత ప్రభుత్వ పదవులు వహిస్తారు. గురువు రవి చంద్రులతో కలిసిన బ్యాంకులు, అధ్యక్షులు, మేయర్, కౌన్సిలర్లు, పార్లమెంటు సభ్యులు, మేనేజరు, మేనేజింగు డైరెక్టర్లు అయ్యే అవకాశం ఉంది. గురు బుధులు కలిసిన విదేశీ భాషలు, ఎగుమతులు దిగుమతులు , సివిల్ ఇంజనీరింగ్ వంటి వృత్తులను సూచించును.
వ్యాధులు :- మధుమేహం, కాలేయము, ప్రేగులకు సంబంధించిన వ్యాధులు, బోధకాలు, చెమట, నీరు చేరటం, నిస్సంతానం, కాన్సర్ వంటి వ్యాధులు.గురువు చంద్రుడితో కలిసిన గర్భాశయ వ్యాధులు, శుక్రుడితో కలిసిన మధుమేహం, విచిత్రమైన కోరికలు, రవితో కలిసిన కొలెస్ట్రాల్, మూత్ర పిండ వ్యాధులు, అతిమూత్ర వ్యాధి, పసికర్లు కామెర్లు వంటి వ్యాదులను సూచించును.
గురువు ఆశ్వీజ శుక్ల ద్వాదశి గురు వారం ధనిష్టా నక్షత్రం నాడు అంగీరస సురూపలకు పుత్రుడుగా జన్మించాడు.
5. పూజా విధానం
గురువుని పూజించుటకు బంగారు ప్రతిమను వాడాలి. దధ్యోజనం, శనగలు నైవేద్యం చేయాలి. శివ సహస్ర నామావళి, గురువుకుఆధిదేవత బ్రహ్మ, ప్రత్యధి దేవత ఇంద్రుడు కనుక వీరిని ఆరాధించాలి. దోష నివారణకు పసుపు వర్ణ వస్త్రములను దక్షిణ తాంబూలముతో దానం చెయ్యాలి. గురు అష్టోత్తర నామావళి, దత్త చరిత్ర, బ్రహ్మంగారి చరిత్ర వంటి గురు చరిత్రలను పారాయణం చెయ్యాలి. గురువుకు ఇష్టమైన వ్రతం అనఘా వ్రతం. గురువుకు ప్రీతికరమైన రోజు అషాఢ పూర్ణిమ. ధరించ వలసిన మాలలు చందన మాల, పుష్యరాగ మాలలు. పంచ ముఖ రుద్రాక్షను ధరించ వచ్చు. బంగారం, పసుపు, శనగలు, పసుపు రంగు వస్త్రాలు దానం చెయ్యాలి. పసుపు రంగు పండ్లు, పసుపు రంగు పూలను పూజకు ఉపయోగించాలి. గ్రహశాంతికి చేయవలసిన జపం పదహారు వేలు. హోమముకు రావి చెట్టు పుల్లలను వాడాలి. గురువులను ఆరాధించుట, గురువు ఆలయాలను దర్శించుట, గురుదీక్షలను స్వీకరించుట వలన దోష నివారణ చేయవచ్చు.

శుక్రుడు రాక్షస గురువు, భృగుపుత్రుడు, విష్ణుద్వేషి. స్త్రీగ్రహం, రుచులలో పులుపుకు ప్రతీక, వర్ణం తెలుపును సూచిస్తాడు. జాతి బ్రాహణ జాతి, అధి దేవత ఇంద్రాణి, ఏడు సంవత్సరాల వయసును సూచిస్తాడు, మనోహర శరీరం, నల్లని జుట్టు, సౌందర్యవంతులకు ప్రతీక. ప్రకృతి శ్లేష్మ, వాత ప్రకృతిని సూచిస్తాడు. తత్వము జలతత్వం, దిక్కు ఆగ్నేయము, రత్నము వజ్రము, లోహము వెండి, ఋతువు వసంతం, దిక్బలం చతుర్ధ స్థానం, గుణము రజోగుణము, ప్రదేశం కృష్ణా గోదావరి నదుల మద్య ప్రాంతం. శుక్రుడు భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ నక్షత్రాలకు అధిపతి. శరీరంలో సంతానోత్పత్తి వ్యవస్త. శుక్రుడు వృషభం, తులా రాశులకు ఆధిపత్యం వహిస్తాడు. శత్రువులు రవి, చంద్రులు. మిత్రులు శని, బుధులు. సములు కుజుడు, గురువులు. శుక్ర దశా కాలం ఇరవై సంవత్సరాలు. శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితిని, కన్య రాశిలో నీచ స్థితిని పొందుతాడు.
1. కారకత్వములు
శుక్రుడు శారీరక సుఖము, భార్య, యౌవనం, సౌందర్యం, రాజసము, వినోదము, స్త్రీలు, ఐశ్వర్యం, జలవిహారం, ఆభరణములు, సౌందర్య సాధనములు, చతుషష్టి కళలు, వీర్యము, మన్మధుడు, సుఘంధద్రవ్యములు, గౌరి, లక్ష్మి ఆలయములు, క్రీడా ప్రదేశములు, పాలు, పాల కేంద్రాలు,పాలకు సంబంధించిన వస్తు విక్రయము, వస్త్రములు దానికి సంబంధించిన వృత్తులు, అలంకార సామాగ్రి, పరిమళ ద్రవ్యములు వాటికి సంబంధించిన వృత్తులు, పానీయములు, పండ్లరసాలు వాటికి సంబంధించిన సంస్థలు, పెట్రోలు వాహనములు, నౌకలు, సముద్ర యానం, ర్స సంబదం ఉన్న నిమ్మ, నారింజ, కమలా, బత్తాయి మొదలైన పండ్లు, నేత్ర, సుఖ, చర్మ, కంఠముకు సంబంధించిన రోగములు. దర్జీ, కళాసంబంధ వృత్తులు, సౌందర్య సంబధిత వృత్తులు , స్నేహితులు, బహుమతులు, హనీమూన్, ప్రేమ, విందులు విలాసా విహారాదులు, పూలు, అలంకరణ సామాగ్రి, లౌక్యము, లాభము, ఒప్పందము, ఆకర్షణ మొదలైన వాటికి కారకుడు.
2. రూపము
శుక్రుడు వర్ణం ధవళ వర్ణం. నాలుగు భుజములు కలిగి ఉంటాడు. చేతులలో దండము, కమండలం, రుద్రాక్షమాలను ధరించి ఉంటాడు. రధాన్ని అధిరోహిస్తాడు. ఇతడి తండ్రి భృగువు తల్లి హిరణ్య కశిపుని కుమార్తె ఉష. ఇతడికి కావ్యుడు, సితుడు, భృగుసుతుడు, దానవాచార్యుడు, ఉశనుడు అనే ఇతర నామాలు ఉన్నాయి.
3. వ్యాధులు
గర్భాశయ వ్యాధులు, మూత్ర పిండ వ్యాధులు, సుఖ వ్యాదులు మొదలైన వాటికి కారకుడు. కుజుడితో కలిసిన గొంతు నొప్పి. టాన్సిల్స్, గొంతు కాన్సర్, గొంతు వాపు మొదలైనవి. బుధుడితో కలిసిన నపుంసకత్వం, చర్మ వ్యాధులు, మధుమేహం, శనితో కలిసిన సుఖ వ్యాధులు, రాహువుతో కలిసిన గర్భ సంబంధిత వ్యాదులు, కేతువుతో కలిసిన సంతాన లేమి మొదలైన వ్యాధులకు శుక్రుడు కారకుడు.
4. వృత్తులు
శుక్రుడు కళారంగ సంబంధిత వృత్తులు, స్వీట్ షాపులు, పానీయాల షాపులు, పండ్లరసాల వ్యాపారం, పాల సంబంధిత వృత్తులు, వెండి, బంగారు, రత్జ్ఞ వ్యాపారములు, ఫ్లాస్టిక్, కలప, రబ్బరుకు సంబంధించిన వృత్తులు శుక్ర ప్రభావితులకు లాభిస్తాయి. సముద్ర యానం, నౌకాయాన సంబంధిత వృత్తుఇలు. సముద్ర సంబంధిత వృత్తులు. ఆహార సంబంధిత వృత్తి వ్యాపారాలు, ఉప్పు సంబంధిత వృత్తి,వ్యాపారాలు. పెట్రోలు , వాహన సంబంధిత వ్యాపారులు. ముత్యముల వ్యాపారం, మత్యకారులను సంబంధిత వృత్తి వ్యాపారాలను సూచిస్తుంది.
5. శుక్రుడి గురించి పరాణాలలో
శ్రీకృష్ణుడి చేత కుచేలుడికి అనుగ్రహించబడిన అపార ధన సంపత్తిని ఉశనుడు అపహరించబూనడంతో ఈశ్వరుడు ఆగ్రహించి శుక్రుడిని సంహరించడానికి ఉద్యుక్తుడైనాడు. ఉశనుడు తన తపశ్శక్తితో ఈశ్వరుడి ఉదరంలో ప్రవేశించి ఈశ్వరుడిని స్తుతించసాగాడు. భోళాశంకరుడైన ఈశ్వరుడు ఉశనుడికి అభయం ఇచ్చి శుక్ర శోణిత రూపంలో బయటకు పంపాడు. అప్పటి నుండి అతడికి శుక్రుడన్న పేరు సార్ధకం అయింది.చైత్ర శుద్ధ ఏకాదశి నాడు మఖ నక్షత్రంలో మన్మధ సంవత్సరంలో ఉశనుడు శుక్రుడిగా అవతరించాడు. శివుడు అతడి స్తుతికి మెచ్చి ధన్వీర్యాలకు అధిపతిగానూ, రాక్షసులకు గురువుగానూ చేసి గ్రహమండలంలో స్థానం కల్పించాడు. అసురుల గురువైన శుక్రుడు వారి అభ్యున్నతి కొరకు ఘోర తపస్సు చేసాడు. ఈశ్వరుడిని మెప్పించి మృతసంజీవనీ విద్యను సాధించాడు. శుక్రుడు సంపదలకు, మంత్రములకు, రసాలకు, ఔషధులకు అధిపతి. అద్భుతమైన శక్తి సామర్ధ్యాలు కలిగిన ఇతడు తన సంపదలను దానవ శిష్యులకు అప్పగించి తపోవనాలకు వెళ్ళాడు. వర్షాలపై ఆధిపత్యం వహిస్తూ అతి వృష్టి, అనావృష్టికి కారకుడౌతాడు. వర్షాలను నిరోధించే వారిని శాంతింపచేస్తాడు.


శని నపుంసక గ్రహం. వర్ణం నలుపు, నీలం సూచిస్తాడు. శని సూర్యుడి పుత్రుడు. అధిదేవత యముడు. శని మకర రాశి, కుంభరాశులకు అధిపతి. తులారాశిలో ఉచ్ఛస్థితిని, మేషరాశిలో నీచ స్థితిని పొందుతాడు. పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. మిత్రులు బుధుడు, శుక్రుడు, శత్రువులు రవి, చంద్ర, కుజులు, సముడు గురువు. ముసలి వారిని, సన్నని పొడగరులను సూచిస్తాడు. తత్వం వాయుతత్వం, దిక్కు పడమర, ఋతువు శిశిరం, జాతి శూద్ర, లోహము ఇనుము, ఉక్కు, రత్నములలో నీలం, గ్రహసంఖ్య ఎనిమిది, దిక్బలం సప్తమ స్థానం, గుణము తమోగుణము, ప్రదేశము హిమాలయాలలోని గంగా పరివాహక ప్రాంతాన్ని సూచిస్తాడు. శరీర అవయవములలో ఎముకలు, క్లోమము, విసర్జకావయములను సూచిస్తాడు.
1. శని ప్రభావం
సాదారణంగా శనిని చూసి కష్టాలు కలిగిస్తాడని చాలా మంది భయపడుతుంటారు. శని పాపములకు తగిన దండన ఇస్తాడని జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. ఎలిన నాటి శని కాలం ఏడున్నర సంవత్సరమముల కాలం, శని మహర్దశా కాలంలో, అర్ధాష్టమి, అష్టమ స్థాన సంచార కాలంలో సమస్యలు సృష్టిస్తాడు. వీటికి ఆందోళన చెందవలసిన పని ఉండదు. పరిహారాలు ఉంటాయి. శని ఆధిపత్యంలో ఉన్న రాశులు అయిన కుంభ, మకర రాశుల వారికి , మిత్ర స్థానాలు అయిన మిధున, కన్యా, వృషభ, తులా రాశుల వారికి శని నక్షత్రాలైన పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలలో జన్మింక్ష్చిన వారికి, కొంత వెసులుబాటు ఉంటుంది. కష్టాలు మనిషి అహంకారం తగ్గించి జీవిత సత్యాలను తెలియ చేయడమే కాక సుఖానికి ఉన్న విలువను గుర్తించేలా చేస్తుంది. శని జీవిత గమనానికి కావలసిన స్థిరాస్థులను ఏర్పరుచుకోవడానికి కారకుడౌతాడు కనుక కొంత మంచి జరుగుతుంది. కష్టాలను ఓర్చుకునే శక్తిని, వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మనిషిని పుటం పెట్టిన బంగారంలా మెరిసేలా చేస్తుంది. శని వైరాగ్యాన్ని, భక్తిని ప్రసాదిస్తాడు.
2. కారకత్వం
ఆయుఃకారకుడు, ఆటంకములు, విరోధం, కష్టం, బాధలు, దుఃఖం, సేవకత్వం, దురాచారము, బంధనం, మూర్ఖత్వం, జూదము, జైలు జీవితం, మద్యపానం, అంగవైకల్యం, మూర్చ రోగం, అంగవైకల్యం, బ్లాక్ మార్కెట్, అన్యాయార్జన, జీవహింస, అవమానము, రాజదండన, బద్ధకం, క్షుద్రశక్తులు, అప్పులు, మృత్యుదేవతారాధాన, అంద విహీనత, బంధు మిత్ర తిరస్కారం సూచిస్తాడు. వంటవారు, నపుంసకులు, చండాలురు, అక్రమసంతానం, సేవకులు, నీచులను సూచిస్తాడు. పురాతన భవనాలు, పురాతన వస్తువులు, పూరావస్తు శాఖ, సొరంగాలు, గుహలు, చలివేంద్రములు, నువ్వుల నూనె, గానుగ, నూనె దుకాణములను సూచించును. నువ్వులు, ఉల్లి, వేరు శనగ, బంగాళాదుంపలు, రాగులు, జొన్నలు, మినుములు, దున్నపోతు, గాడిద, ఒంటె, కోడి, బొగ్గు, తారు, నల్లమంగోళ్ళకు సంబంధించిన సమస్యలు, అజీర్ణం, కిరోసిన్, వెంట్రుకలు, ఎముకలు, దంతములను సూచిస్తాడు. కలప, తోలు పరిశ్రమలను సూచిస్తాడు. ఆలస్యము, దురదృష్టము, సరిహద్దులు, దహనకార్యక్రమాలు, అపవాదు, పదవీ విరమణ, నిర్మాణం, శాస్త్రీయదృక్పదం, ఒంటరి తనం సూచిస్తాడు. గనులు, వంతెనలు, చర్మము, ఆనకట్టలు, పిరికి వాళ్ళు, రాళ్ళు, ఆస్తి, ఆపద, మంచు, ఆందోళన, వినయము, అనుమానము, అనుకూలత, వినయము, సెరామిక్స్, మట్టిని సూచిస్తాడు.
3. వ్యాధులు
శని వాత సంబంధ వ్యాదులను సూచిస్తాడు. కీళ్ళ వాతం, పక్షవాతం, బలహీనత, నొప్పులు, కిడ్ని లివర్ మొదలైన వాటిలో రాళ్ళు ఏర్పడుట, క్షయ, దగ్గు, ఆస్త్మా, న్యుమోనియా, ఎముకలకు సంబంధించిన వ్యాదులు, వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు, అజీర్ణ వ్యాదులు, పని చేయలేని అశక్తి, డ్రగ్స్ అలవాటు మొదలైన వాటికి కారకుడు. చంద్రుడితో కలిసిన మతి భ్రమణం, పిచ్చి, వాతం, గుండె నొప్పి, కండరాల నొప్పి, తల నొప్పి, బద్దకం, నీరసం మొదలైనవి సూచిస్తాడు. గురువుతో చేరిన జీర్ణ వ్యస్థకు సంబంధించిన వ్యాధులు. బుధుడితో కలిసిన మాటలు సరిగా రాకుండుంట, నత్తి, నాలుక మొద్దుబారటం, మెదడు మొద్దుబారటం, చెవి సంబధిత వ్యాదులు సూచిస్తాడు. కుజుడితో కలిసిన కండరాల నొప్పి, కండరాల జబ్బులు సూచిస్తాడు. శుక్రుడితో కలిసిన గొంతు నొప్పి, టాన్సిల్స్, పైల్స్, విరోచనాలు మొదలైన వ్యాదులను సూచిస్తాడు. రాహువుతో కలిసిన విషప్రయోగం, వైరస్ వ్యాదులను సూచిస్తాడు.కేతువుతో కలిసిన రక్త పోటు వ్యాదులను సూచిస్తాడు.
4. వృత్తులు వ్యాపారాలు
జైలర్, ప్లంబర్, వాచ్‌మన్, పాకీపని చేయు వారు, వీధులు ఊడ్చు వారు, కూలీలు, మేస్త్రీ పని వారు, తోటమాలి, రైతులను సూచిస్తాడు. లోహాలు, తోలు, కలప వ్యాపారాలు. చంద్రుడితో కలిసిన సివిల్ ఇంజనీర్లు, బిల్డర్స్, సర్వేయర్లు, ఎక్స్‌రే టెక్నీషియన్లను సూచిస్తాడు. రవితో కలిసిన ప్రభుత్వరంగ సేవలు చేసే వారు. గురువుతో కలిసిన భూముల కొనుగోలు అమ్మకాల వ్యాపారం, గనుల యజమానులు, సైంటిఫిక్ లాబ్‌లో పని చేయు వారు. బ్యాంక్ సిబ్బంది, ప్రచారం చేయు వారిని సూచిస్తాడు. బుధుడితో కలిసిన రచయితలు, శాస్త్రవేత్తలు, కలప కోయు వారు, ఉపాధ్యాయులు, సెన్సార్ బోర్డ్, సి ఐ డి డిపార్ట్ మెంటులో పని చేయు వారిని సూచిస్తాడు.
5. రూపము
శని నీల కాంతి కలిగిన మేని ఛాయ కలవాడు. నాలుగు భుజములు కలవాడు. ధనుర్భాణాలు, శూలం ధరించిన వాడు. కాకిని వాహనంగా చేసుకున్న వాడు. శనికి నిదానంగా సూర్యుడిని చుట్టి వస్తాడు కనుక మందుడు అని పిలుస్తారు. పంగు, సౌరి అను ఇతర నామాలు ఉన్నాయి. సూర్యుడికి ఛాయాదేవికి కలిగిన పుత్రుడు. మాఘ మాసం కృష్ణ పక్షం చతుర్ధశి నాడు ధనిష్ఠా నక్షత్రంలో విభవానామ సంవత్సరంలో జన్మించాడు. శనిభగవానుడి సోదరి యమున, సోదరుడు యముడు, భార్య జ్యేష్టాదేవి. సూర్యుడి భార్య త్వష్ట ప్రజాపతి కుమార్తె సజ్ఞాదేవి సూర్యుడి తాపం భరించ లేక తనకు ప్రతిగా ఛాయాదేవిని సృష్టించి పుట్టింటికి వెళ్ళిన సమయంలో శని జన్మించాడు. తరువాత కాలంలో సూర్యుడిని చేరిన సజ్ఞాదేవి శనిని సరిగా చూడని కారణంగా శని ఆమెను కాలితో తన్నాడు. ఆకారణంగా శనిని ఆమె శపించంగా శనికి మందగమనం ప్రాప్తించింది.
6. పరిహారం
శని దశా ప్రారంభ సమయం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలిననాటి శని కాలం శని సమస్యలను ఇచ్చే సమయం. శివారాధన,శివార్చన, శివాలయ దర్శనం సమస్యలకు పరిస్కారంగా చేయాలి. శని క్షేత్రాలయిన తిరునల్లారు, శని సింగినాపురం లాంటి క్షేత్ర దర్శనం. శ్రీకూర్మ దేవాలయ దర్శనం చేయాలి. శని దశాకాలం పందొమ్మిది సంవత్సరాలు కనుక పంతొమ్మిదివేల సార్లు జపం చేయించాలి. నువ్వులు, మినుములు, నూనెలను దానం ఇవ్వాలి. నల్ల వస్త్రాలు ధరించి శని గాయత్రి, శని శ్లోకం లాంటివి పారాయణం చేయాలి. అయ్యప్ప జయంతి, శనీశ్వర వ్రతం, సత్యనారాయణ వ్రతం, అయ్యప్పస్వామి పూజ చేయాలి. కూర్మపురాణ పారాయణం, వేంఖటేశ్వర శతనామావళి, శని అష్టోత్తరం చేయాలి.ఆంజనేయుడిని పూజించి దర్శించుట. పూజకు ఇనుముతో చేసిన ప్రతిమను వాడాలి. నైవేద్యం నువ్వులతో కలిపిన అన్నం, నువ్వు చిమ్మిరి, నువ్వు ఉండలు, ద్రాక్షరసం వాడాలి. కపిల గోవు దానం చేయాలి. శనికి ప్రీతికరమైన జ్యేష్టశుద్ధ ద్వాదశి, మార్గశిర శుద్ధ అష్టమి నాడు పూజలు జపాలు నిర్వహించడం శ్రేష్టం. దోషనివారణకు నీలమణి, ఎర్రచందన మాల, చతుర్దశ ముఖ రుద్రాక్ష ధారణ చేయాలి. హోమముకు వాడవలసిన సమిధ జమ్మి. ప్రీతికరమైన వారం శనివారం.


రాహువు స్త్రీ గ్రహం.ఇది ఛాయా గ్రహం. అపసవ్య మార్గాన నడుస్తుంది. అంటే మేషం, తరువాత మీనం ఇలా వెనక్కు నడుస్తుంది. రాహువు నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఈ మూడు నక్షత్ర జాతకులకు మొదటి దశ రాహుదశా శేషంతో ప్రారంభం ఔతుంది. రాహు దశాకాలం పద్దెనిమిది సంవత్సరాలు. సాధారణంగా రాహుదశాకాలంలో మనిషి జీవితంలో ఒడి దుడుకులు అధికం. కాని కొన్ని నక్షత్రాలకు కొంత వెసులు బాటు ఉంటుంది. రాహువుకు రాశిచక్రంలో ఇల్లు లేదు. రాహువు వృషభరాశిలో ఉచ్ఛస్థితి పొందుతాడు. రాహువు వృశ్చిక రాశిలో నీచ స్థితిని పొందుతాడు. కొన్ని ప్రాచీన గ్రంధాలలో జ్యోతిహ శాస్త్ర రాహువు ప్రస్తావన లేదు. కాని ఆధునిక శాస్త్రంలో రాహువుకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. రాహువు పాపగ్రహం. రాహువు ఏగ్రహంతో కలిసి ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు. రాహువు శరీరం దిగువ భాగం పాము శరీరం ఉంటుంది. అందుకనే రాహువుకు విషముతో అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఎప్పుడూ రోదశీలో ఉండే సూర్యుడిని కొంత కాలం కనిపించకుండా చేస్తాడు కనుక కల్పనా జగత్తుకు ప్రతీకగా జ్యోతిష పండుతులు విశ్వసిస్తారు. కళాకారుల జీవితంలో రాహువు ప్రధాన పాత్ర పోషిస్తాడని జ్యోతిష శాత్ర పండితులు విశ్వసిస్తారు.
1. గుణగణాలు
రాహువు తమోగుణ ప్రధానుడు, గ్రహ సంఖ్య రెండు, అధిదేవత గౌరి, ముసలి వారిని సూచిస్తాడు. బుధుడు, శుక్రుడు, శని మిత్రులు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు శత్రువులు. గురువు సముడు. స్వక్షేత్రం కుంభం, శత్రు క్షేత్రం సింహం, మిత్ర క్షేత్రం తుల. అసుర, బహి, స్వర్భాను, తమస అనేవి ఇతర నామాలు. జాతి మ్లేచ్ఛ, స్వాభావము క్రూరము, రుచులలో పులుపును సూచిస్తాడు. ప్రదేశం పాములు తిరిగే ప్రదేశం. దిక్కు నైరుతి, పాలనా శక్తి భటుడు, ఆత్మాధికారం కష్టాలు, లోహము సీసం, గృహ స్థానం ఉపయోగంలో లేని ప్రదేశం, గ్రహపీడ సంతాన లేమి, గ్రహం రాశిలో ఉండే కాలం ఒకటిన్నర సంవత్సరం. వృక్షము పొదలు, ఆహార పదార్ధాలు మినుములు, ఖర్జూరం, ఆవాలు. జంతువులు ఏనుగు, పాములు అడవి ఎలుకలు. వస్తువు గొడుగు, సమిధ దుర్వ, మూలిక చందనం, దేవ వర్గం శైవ, అవతారం వరాహావతారం.
2. కారకత్వం
రాహువు పితామహుడు (తాత), వృద్ధాప్యము, శ్వాస, భాష, అసత్యము, భ్రమ, వాయువు, విచారము, జూదము, కఫము, సంధ్యా సమయం, బయట ప్రదేశం, గొడుగు, పల్లకి, అపరి శుభ్రం, గొడుగు, పల్లకి, విమర్శ, అంటరాని తనం, నల్లులు, దోమలు, గుడ్లగూబలు, విషకీటకములను సూచిస్తాడు.
వృత్తులు :- విషసంబంధిత రసాయనాల తయారీ సంస్థలు, పాములు పట్టుట, భూతవైద్యము, శ్మశానంలో పని చేయుట, నాగ పూజ, దొంగతనం, వైద్య శాస్త్రం, గారడీ విద్యలు. శుక్రుడితో కలిసి ఉంటే సినీరంగం,నాటక రంగం, అడ్వర్టైజ్ మెంటు రంగం, బుధుడితో చేరిన రచయిత, గారడీ విద్య, శనితో చేరిన మోసపూరిత జీవితం, గురువుతో కలిసిన కపట గురువు మొదలైనవి. జైళ్ళు, క్రిమినల్ కోర్ట్లో ఉద్యోగాలు, ఎలెక్ట్రిక్‌సిటీ, ఆటోమొబైల్స్, గ్యాస్, ఇనుము, నిప్పుకు సంబంధించిన వృత్తులు. అగ్నిమాపక దళ వృత్తులను సూచిస్తాడు.
వ్యాధులు :- నులి పురుగులు, గుల్మ రోగం, అంతు చిక్కని రోగాలు మొదలైనవి. రాహువు ఏగ్రహంతో కలిసి ఉంటే ఆయాగ్రహ సంబంధిత రోగాలను ఇస్తాడు.
విద్యలు :- రాహువు ఏగ్రహముతో చేరిన ఆగ్రహ సంబంధిత విద్యలను సూచిస్తాడు.
3. రూపము
రాహువు క్రూర రూపము కలవాడు, పొడగరి, నల్లని మేని ఛాయ కలవాడు. నాలుగు భుజములు గలవాడు. కత్తి, త్రిశూలమును ధరించి కవచ ధారణ చేసి ఉంటాడు. సింహాన్ని అధిరోహించి ఉంటాడు. తండ్రి కశ్యపుడు, తల్లి సింహిక, భార్య కరాళ. పార్ధివ నామ సంవత్సరం భాద్రపద శుక్ల పూర్నిమ నాడు పూర్వాభద్రా నక్షత్రములో జన్మించాడు. రాహువు క్షీర సాగర మధన సమయంలో దేవతా రూపం ధరించి మోహినీ చేతి అమృతపానం చేసాడు. దానిని సూర్య, చంద్రులు విష్ణు మూర్తికి చెప్పడంతో విష్ణువు అతడి తలను మొండెం నుండి వేరు చేయడంతో పాము శరీరం పొందాడు. విష్ణు మూర్తి అతడిని అనుగ్రహించి గ్రహ మండలంలో స్థానం కల్పించాడు. అప్పటి నుండి సూర్యచంద్రులకు శత్రువై గ్రహణ సమయాన కబళించి తిరిగి విడుస్తుంటాడని పురాణ కధనం వివరిస్తుంది. రాహువు రాక్షస నామ సంవత్సరం మాఘ కృష్ణ చతుర్ధశి ఆశ్లేష నక్షత్రంలో గ్రహజన్మను ఎత్తాడు.
4. రాహుకాలం
రాహు కాలం వారంలో ప్రతి రోజు ఒకటిన్నర గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆంటంకం కలుగుతుందని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులైతే ఆసమయంలో చేయరు. కాని దోష నివారణ కొరకు రాహుకాలంలో పూజలు నిర్వహిస్తారు. దుర్గాదేవికి రాహుకాలంలో నిమ్మడిప్పలో నూనె పోసి దీపం వెలిగిస్తారు. ఆది వారం సాయంత్రం 4 1/2(నాలుగున్నర )గంటల నుండి 6 గంటల వరకు, సోమ వారం ఉదయం 71/2(ఏడున్నర) 9 వరకు, మంగళ వారం 3 గంటల నుండి 41/2(నాలుగున్నర) గంటల వరకు, బుధ వారం 12 గంటల నుండి 11/2(ఒకటిన్నర), గురువారం 1/2 గంటల నుండి 3 గంటల వరకు, శుక్ర వారం 10 1/2 గంటల నుండి 12 గంటల వరకు, శని వారం 9 గంటల నుండి 101/2 గంటల వరకు రాహుకాలం ఉంటుంది.
5. పరిహారం
రాహువును శాంతింప చేయడానికి చేయవలసిన పరిహార విధులు. ప్రతిమకు కావలసిన లోహము సీసం, ప్రతిమకు పూజకు గ్రహ ఆసనం చేట, సమిధ దూర్వ, నైవేద్యం మినప సున్ని, మినప గారెలు, ఖర్జూరం, చేయవలసిన పూజ అధిష్టాన దేవత అయిన సరస్వతి పూజ, దుర్గా పూజ, సుభ్రహ్మణ్య స్వామి పూజ, శివారాధన, రాహుకాలంలో దుర్గకు నిమ్మకాయ దీపం పెట్టడం. ఇది దేవాలయంలో దుర్గాదేవి సన్నిధిలో చేయాలి. ఇంట్లో అయితే నేతి దీపం పెట్టాలి.ఆచరించ వలసిన వ్రతం సరస్వతి వ్రతం, రాహువుకు ప్రియమైన తిధి చైత్ర బహుళ ద్వారశి, పారాయణ చేయవలసినవి రాహు అష్టోత్తరం, లలితా సహస్రనామం, ఆచరించవలసిన దీక్ష భవానీ దీక్ష, ధరించవలసిన మాల రుద్రాక్ష మాల, అష్టముఖ రుద్రాక్ష, రత్నము గోమేధికము, దర్శించవలసిన దేవాలయములు సరస్వతి, దుర్గ, సుభ్రహ్మణ్య స్వామి దేవాలయం, శివాలయాలు, నవగ్రహాలయాలు. దానం చెయ్యవలసినవి ఎండు ద్రాక్ష, తేనె, ఖర్జూరములు. చేయవలసిన జపసంఖ్య పద్దెనిమిది వేలు.


కేతువు రాశి చక్రంలో అపసవ్యదిశలో పయనిస్తుంటాడు. అంటే మేషం నుండి మీనానికి ఇలా పయనిస్తుంటాడు. రాశిలో ఒకటిన్నర సంవత్సరకాలం ఉంటాడు. సూర్యుడిని ప్రదిక్షిణం చేయడానికి పద్దెనిమిది సంవత్సరాల కాలం పడుతుంది. రాహువు కేతువులు ఎప్పుడూ ఒకరికి ఒకరు రాశిచక్రం లోని ఏడవ స్థానంలో సంచరిస్తుంటారు. కేతు మహర్దశాకాలం ఏడు సంవత్సరాలు. కేతువు ముక్తి కారకుడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈ మూడు నక్షత్రాలలో వారికి పుట్టిన ఆరంభ దశ కేతు దశ. కేతువుకు అవల, శిఖి, ధూమ, ధ్వజ, మృత్యు పుత్ర అనే ఇతర నామాలు ఉన్నాయి. కేతువు పురుష గ్రహము. గ్రహ స్వభావం పాప గ్రహం, తత్వం వైరాగ్యము, స్వభావం క్రూర స్వభావం, గుణం తమోగుణం, దిక్కు వాయవ్యము, ప్రదేశం పాములు తిరిగే ప్రదేశం. ఆత్మాధికారం మోక్షం, పాలనా శక్తి భటుడు, లోహము ఇనుము, కుటుంబ సభ్యుడు తాత, వర్ణం ధూమ్ర వర్ణం, గ్రహ పీడ అతి తెలివి, గ్రహ వర్గం గురువు, గృహంలోని ఖాళీ ప్రదేశాలను సూచిస్తాడు, కాల బలము పగలు, కాల బలం పగలు, శత్రు క్షేత్రం కటకం, సమ క్షేత్రం మీనము, ఉచ్ఛ క్షేత్రము వృశ్చికము, నీచ క్షేత్రము వృషభము, మిత్రులు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, శత్రువులు శని, శుక్రుడు, సములు గురువు, బుధుడు. వయసు ముసలి వయసు, చెట్లు ముళ్ళ చెట్లు, ధాన్యం ఉలవలు, పండ్లు సీతా ఫల, ప్రదేశములు గుహలు, బిలములు. దేశంలో కేతువు ఆధిక్యత ఉన్న ప్రదేశం అంతర్వేధి.ధాన్యము ఉలవలు, పక్షులు రాబందు, గద్ద, కోడి. జంతువులు కుక్క, పంది, గాడిద. మూలికలు తెల్ల జిల్లేడు, పున్నేరు వేరు, సమిధలు దర్భ. దైవ వర్గం వైష్ణవ, గోత్రము పైఠీనస. అవతారం మీనావతారం. గ్రహారూఢ వాహనం గ్రద్ద, రత్నము వైఢూర్యం, రుద్రాక్ష నవ ముఖ రుద్రాక్ష, లోహము కంచు, శుభ సమయం ఉదయ కాలం. వారము ఆదివారం. స్వభావం చంచల స్వభావం. దృష్టి అధోదృష్టి.
1. కారకత్వము
కేతువు కుటుంబ సభ్యులలో తాత(తల్లికి తండ్రి)ను సూచిస్తాడు. కేతువు దైవోపాసన, వేదాంతం, తపస్సు, మోక్షము, మంత్ర శాస్త్రము, భక్తి, నదీస్నానం, మౌన వ్రతం, పుణ్యక్షేత్ర దర్శనం, మోసము, పరుల సొమ్ముతో సుఖించుట, దత్తత మొదలైన వాటిని సూచిస్తాడు.
వ్యాధులు :- అజీర్ణం, స్పోటకము, రక్తపోటు, చెముడు, నత్తి, దురదలు, గ్యాస్, అసిడిటీ, వైద్యము, జ్వరము, వ్రణములను సూచిస్తాడు కేతువు ఏగ్రహముతో కలిసిన ఆ అవయవమునందు బాధలు కలిగిస్తాడు. రోగ నిర్దారణ సాగదు కనుక చికిత్స జరుగుటలో సమస్యలు సృష్టిస్తాడు. ఇతడు మృత్యు కారకుడు, భయాన్ని కలిగిస్తాడు, రక్తపోటు, అలర్జీ, మతి స్థిమితం లేక పోవుట మొదలైన వ్యాధులకు కారకుడౌతాడు.
2. రూపము
కేతువు పార్ధివ నామసంవత్సరం ఫాల్గుణమాసం శుక్ల పౌర్ణమి అభిజిత్ నక్షత్రంలో బుధవారం జన్మించాడు. కేతువు గోత్రం జైమినీ పైఠీనస. కేతువు బూడిద(బూడిద)వర్ణంలో రెండు భుజములతో ఉంటాడు. కేతువు వాహనం గ్రద్ద. బ్రహ్మదేవుడికి తాను సృష్టించి జనం అపారంగా పెరగడంతో వారిని తగ్గించడానికి మృత్యువు అనే కన్యను సృష్టించాడు. మానవులకు మరణం ఇచ్చే బాధ్యతను అప్పగించాడు. తనకు మరణం ఇచ్చినందుకు ఆ కన్య దుఃఖించింది. ఆమె కన్నీటి నుండి అనేక వ్యాధులు ఉద్భవించాయి. అప్పుడు తెల్లని పొగ రూపంలో ఒక పురుషుడు జన్మించాడు. కీలక నామ సంవత్సరం మార్గశిర కృష్ణ అమావాస్య నాడు మంగళ వారం మూలా నక్షత్రంలో కేతువు జననం జరిగింది. బ్రహ్మ ఆజ్ఞానువర్తి అయి కేతువు ధూమ్ర కేతువుగా సంచరించ సాగాడు. క్షీరసాగర మధన సమయంలో మోహినీ చేతి అమృతం తాగిన తరువాత విష్ణువు చేత పాము తలను ధరింప చేయబడ్డాడు. అప్పటి నుండి కేతువుగా నామధేయం చేయబడి విషు అనుగ్రహం చేత గ్రహస్థితి పొందాడు. కేతువు పత్ని చిత్ర రేఖ. సాధారణంగా కేతువు ఒంటరిగా కుజ ఫలితాలను ఇచ్చినా ఏగ్రహంతో చేరి ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు. గ్రహస్థానం పొందిన కేతువు విష్ణువుకు అంజలి ఘటిస్తూ ఉంటాడు.
3. పరిహారం
కేతుగ్రహ పరిహార పూజార్ధంగా కంచు ప్రతిమ శ్రేష్టం. అధి దేవత బ్రహ్మ. నైవేధ్యం చిత్రాన్నం, కుడుములు, ఉలవ గుగ్గిళ్ళు. ప్రీతికరమైన తిధి చైత్ర శుద్ధ చవితి. ఆచరించ వలసిన వ్రతం పుత్ర గణపతి వ్రతం, పారాయణం చేయవలసినది శ్రీ గణేశ పురాణం, కేతు అష్టోత్తర శతనామావళి, గణేశ శతనామావళి. దక్షిణగా ఇవ్వ వలసిన జంతువు మేక, ధరించ వలసిన రతజ్ఞం వైడూర్యం, ధరించ వలసిన మాల రుద్రాక్ష మాల, ధరించ వలసిన రుద్రాక్ష నవముఖి రుద్రాక్ష. ఆచరించ వలసిన దీక్ష గణేశ దీక్ష. చేయ వలసిన పూజ విజ్ఞేశ్వర పూజ, సూర్యారాధన, దానం చేయవలసిన ఆహార పదార్ధాలు ఖర్జూరం, ఉలవలు. గ్రహస్థితిని పొందిన వారం బుధవారం. మండపం జెండా ఆకారం. గ్రహం బలంగా ఉంటే ఆధ్యాత్మిక చింతన బలహీనమైన అతి భయం కలుగుతుంది

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML