గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 27 January 2015

మాఘ మాసం లో ముఖ్యమైన రోజుల్లో ఆచరించ వలసిన విధులుమాఘ మాసం లో ముఖ్యమైన రోజుల్లో ఆచరించ వలసిన విధులు
ఈ మాసం లో సంకట హర చతుర్థి రోజున ఫిబ్రవరి 7న, వినాయకుణ్ణి పూజించి నువ్వులతో చేసిన 21 లడ్డూలను నివేదన చేసి బ్రహ్మచారులకు దానం ఇవ్వాలి, శ్రవణా నక్షత్రం ఫిబ్రవరి 18 రోజున తులసి దళాలతో విష్ణు పూజ చేస్తే సకలపాపాలు తొలగుతాయి.

సంకటహర చథుర్ది నాడు సాయంత్రం వరకు ఉపవసించి సంధ్యా సమయం లో గణపతి ని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి

భీష్మ ఏకాదశి (ఈ నెల 30) రోజున ఉపవాసం చేసి విష్ణుసహస్రనామ పారాయణం చేస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది

తిలద్వాదశి (31) నాడు నువ్వుల తో చేసిన పదార్ధాలను తినడం, నువ్వుల నూనె తో అభ్యంగన స్నానమాచరించడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించి దానమివ్వడం చేస్తే కష్టాలు తొలగుతాయి.

శని త్రయోదశి నాడు నల్ల నువ్వులు, నల్లని వస్త్రం, దక్షిణ తో సహా బ్రాహ్మణునికి దానం ఇచ్చి, శివలింగానికి తైలాభిషేకం చేయించడం వలన శని బాధల నుండి ఉపశమనం లభిస్తుంది.

మాఘ పౌర్ణమి (ఫిబ్రవరి 3) రోజున మాఘ మాసం లో ప్రతి నిత్యం స్నానమాచరించలేని వారు ఈ ఒక్క రోజు మాఘ స్నానం ఆచరిస్తే శుభం కలుగుతుంది. దైవ శక్తి సంపూర్ణం గా విలసిల్లే దివ్యమైన రోజున చేసే జపాలు, పూజలు, దానాలు, హోమాలు అక్షయ ఫలితాన్నిస్తాయి. ఈ రోజున చేసే సముద్ర స్నానం వలన చెప్పలేనంత పుణ్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు చెప్పులు, గొడుగు, వస్త్రాలు దానమిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అమ్మవారికి కుంకుమార్చన చేస్తే సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది. శివాలయం లో ఆవు పాలతో అభిషేకం చేస్తే అన్ని గ్రహాల బాధలు తొలగుతాయి. పంచామృతాలతో అభిషేకం చేస్తే అన్ని కోరికలు తీరుతాయి.

విశాఖ నక్షత్రం ( ఫిబ్రవరి 12 ) రోజున సుబ్రమణ్య స్వామి ని భస్మం తో పూజిస్తే పాపక్షయం కలుగుతుంది, బిల్వపత్రాలతో పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయి. స్వామివారికి వస్త్రాలు సమర్పించి పూజించి ఉపవాసం చేస్తే ఉద్యోగమార్గాలు లభిస్తాయి.

విజయ ఏకాదశి ఫిబ్రవరి 15 - శ్రీ రామచంద్రుడు లంకను చేరుకోవడానికి సేతువు నిర్మించడం పూర్తైన రోజు కావున విజయ ద్వాదశి అని అంటారు. ఈ రోజు ఉపవాసం ఉంది శ్రీ మహా విష్ణువు ని పూజిస్తే విజయాలు ప్రాప్తిస్తాయి

మహా శివరాత్రి ( ఫిబ్రవరి 17 ) పర్వదినాన శివారాధన, రుద్రాభిషేకం, జాగరణ, ఉపవాసం ఏది చేసిన పుణ్యం లభిస్తుంది. విభూది, రుద్రాక్ష ధారణ వలన మంచి ఫలితాలు పొందుతారు. శివ పార్వతుల కల్యాణం చేస్తే భార్య భర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహ దోషాలు ఉన్న వారికి దోషాలు తొలగి వివాహం జరుగుతుంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML