గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 10 January 2015

పాద గయ



పాద గయ
కృతయుగంలో విష్ణు భక్తుడైన గయాసురుడు విష్ణుమూర్తి కృపను ఆపేక్షించి, ఎన్నో దివ్య సంవత్సరాలు తపస్సు చేసి, స్వామిని మెప్పించి ఈ పృథివీ మండలము మీద ఉన్న అన్ని పుణ్య క్షేత్రాల కన్నా తన దేహము పవిత్రము అగునట్టు వరమును పొందాడు. ఇక అతనిని దర్శించిన ఎంతటి పాపాత్ముడైనా చివరకు అతని శరీరముపైనుంచి వీచే గాలి సోకినంత మాత్రానే క్రిమి కీటకాది జన్మలెత్తిన పాపత్ములు కూడా తరించిపోయేవారు. అతను ఎన్నో అశ్వమేధాది పూణ్య క్రతువులు చేసి ఇంద్ర పదవిని కూడా పొందాడు. పదవీచ్యుతుడైన దేవేంద్రుడు తిరిగి తన పదవి పొందేందుకు త్రిమూర్తులను గూర్చి కొన్ని వేల ఏళ్ళు తపస్సు చేసి వారిని మెప్పించి ఆతనిని వారే వధించే వరం పొందాడు. గయాసురుడు ధర్మాత్ముడైనప్పటికీ, దుష్టులైన అతని అనుచరులు ధర్మ విరుద్ధమైన పనులు యధేచ్ఛగా చేస్తుండడంతో ఇలా జరిగింది.


ఇక ముగ్గురు త్రిమూర్తులు బ్రాహ్మణ వేష ధారణలో ఆతని వద్దకు వెళ్ళి ఒక గొప్ప యాగముకొరకు అతిపవిత్రమైన అతని శరీరాన్ని ఒక ఏడు రోజుల పాటు యజ్ఞ వేదికగా పొందారు. కానీ ఆ యజ్ఞము పూర్తయ్యేవరకు అతడు కదలకూడదని, కదిలితే సంహరిస్తామని చెబుతారు. అందుకు అతను మనఃపూర్తిగా అంగీకరిస్తాడు.

గయాసురుడు మహిమా శక్తిచేత తన దేహమును బీహారు రాష్ట్రంలోనున్న గయా క్షేత్రంలో శిరస్సు ఉండునట్లు, నాభీ స్థానము నేటి ఒరిస్సా రాష్ట్రంలోనున్న జాజిపూర్ నందు ఉండునట్లు, పాదములు పీఠికాపురంలో ఉండునట్లు విస్తరించాడు.

అలా ఆ దివ్య యజ్ఞం ఆరు రోజులు నిర్విఘ్నంగా జరిగిపోతుంది. కానీ ఏడో రోజు విష్ణుమూర్తి ప్రేరేపణచేత శివుడు లింగోద్భవ కాలంలో అంటే అర్ధరాత్రి, కోడిరూపము దాల్చి, కోడి కూత ధ్వని చేస్తారు. ఈ మాయ తెలియని గయాసురుడు ఏడు రోజులు పూర్తయిందని తన దేహాన్ని కదిలిస్తాడు. యజ్ఞము పూర్తి కాకుండానే తన దేహాన్ని కదిల్చాడని అందుచేత సంహరిస్తామని పలికి, త్రిమూర్తులు ఆతని చివరి కోర్కె తెలుపమని ఆడుగుతారు.

అప్పుడు గయాసురుడు, తన శరీరంలోని మూడు భాగాలు తన పేరిట గయా క్షేత్రములుగా వెలిసి, వాటియందు త్రిమూర్తులూ వసించాలని వరము పొందుతాడు. ఆ మూడు క్షేత్రములు శక్తి పీఠలుగా కూడా విరాజిల్లుతాయి. మానవులు చనిపోయిన తమ పితరులను ఉద్దేశించి చేయు శ్రాద్ధ కర్మలు ఈ గయా క్షేత్రాలలో చేస్తే, విశేషమైన ఫలితముంటుంది.

క్లుప్తంగా ఇది, పాదగయ వెనుకనున్న వృత్తాంతం. అంత పెద్ద శరీరం కుదురుతుందా? తవ్వితే భారీ అస్తికలు దొరుకుతాయా అంటూ ప్రశ్నలు మాత్రం వేయకండి. సాధారణంగా ఇతరత్రా విశేషాలు, ఇలా తేలికగా బోధపడే విధంగా తెలియ జెప్పడం మన పురాణాల్లో ఎప్పుడూ కనపడుతూనే ఉంటుంది.

గయాసురుడి వృత్తాంతం
గయాసురుడి వృత్తాంతం
శిరోగయ = గయ క్షేత్రం – బీహారు రాష్ట్రం; ఫల్గునీ నదీ తీరం; విష్ణు క్షేత్రం; మంగళగౌరీ దేవి శక్తి పీఠం.
నాభిగయ = జాజిపూర్ క్షేత్రం – ఒరిస్సా రాష్ట్రం; యజ్ఞవేదికా స్వరూప బ్రహ్మ; గిరిజాదేవి శక్తి పీఠం
పాదగయ = పిఠాపుర క్షేత్రం – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం; కుక్కుటేశ్వరలింగరూపంలో ఈశ్వరుడు; పురుహూతికా శక్తి పీఠం

గయా తీర్థం
గయా తీర్థం
స్వయంభూ శివ క్షేత్రం
సర్వలో శుభంకరుడైన శంకరుడు లోకకళ్యాణార్ధము గయసురుని సంహారార్థమై కోడి రూపము ధరించి కోడి కూత ఇక్కడే చేశారు కాబట్టి, ఆతని కొరికమేర కోడి / కుక్కుట రూపంలో లింగారూపుడై స్వయంభువమూర్తియై శ్రీ కుక్కుట లింగేశ్వర స్వామిగా ఈ క్షేత్రంలో విరాజిల్లుతుంటారు. ఇక్కడి అర్చకులను అడుగగా, ముందు ఇక్కడి శివలింగం కోడి ఆకృతిలో ఉండేదని, అభిషేకాలవల్ల ఆ రూపు కొద్దిగా గుండ్రంగా మారిందని చెప్పారు.

ద్వజ స్తంభం
కుక్కుటేశ్వర స్వామి వారి గర్భగుడి గోపురం
కుక్కుటేశ్వర స్వామి వారి గర్భగుడి గోపురం
శక్తి పీఠం
కృతయుగంలో, దక్ష ప్రజాపతి పరాశక్తిని గూర్చి గొప్ప తపస్సుచేసి, అంబను మెప్పించి తన కూతురుగా పొందుతాడు. ఆవిడే సతీదేవి లేదా దక్షుని కూతురగుటవలన దాక్షాయని. కొన్ని కారణాల వల్ల దక్షుడు నిరీశ్వర యాగం చేయాలని సంకల్పిస్తాడు. పిలవకుండానే, అమ్మవారు తన తండ్రి తలపెట్టిన యాగానికి చేరుకుంటుంది. ఈశ్వర ద్వేషాన్ని సంహించలేక, దాక్షాయని అని ఇక పిలిపించుకోవటం ఇష్ట పడక, తల్లి యోగాగ్నిలో తన తనువును చాలిస్తుంది. మరణించిన సతీదేవియందు తనకు గల ప్రేమ చేత శివుడు ఆమె మృత కళేబరాన్ని భుజాన ధరించి విరాగియై లోక సంచారము చేస్తుంటాడు. అప్పుడు పరాశక్తి ఆజ్ఞమేర శ్రీ మహా విష్ణువు సతీ మృత దేహాన్ని తన సుదర్శన చక్రంతో ఖండిస్తారు. ఆ దేహ భాగములు భూమిపై పడి 108 శక్తి పీఠాలుగా విరాజిల్లాయి. వాటిలో 101 విశేషముగానూ, 52 పీఠములు ముఖ్యమైనవిగాను, అందులో ముఖ్యాతి ముఖ్యమైనవిగా 18 భాగాలు అష్టాదశశక్తి పీఠాలుగా పిలువబడుతున్నాయి.

1. ఎడమ చెవి – శ్రీలంక – క్యాండీదంబులా – శాంకరీ దేవి
2. కుడి కన్ను – కాంచిపురం (తమిళనాడు) – కామాక్షీ దేవి
3. కుడి చేయి – ప్రద్యుమ్నం (చోటిల్లా, గుజరాత్) – శృంఖలా దేవి
4. ఎడమ చేయి – క్రౌంచపట్టణము (కర్నాటక) – చాముండేశ్వరి దేవి
5. కుడి చెవి – ఆలంపుర్ (కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్) – జోగులాంబ దేవి
6. కుడి కాలు – శ్రీశైలం (కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్) – భ్రమరాంబికా దేవి
7. ముక్కు – కోల్హాపూర్ (మహరాష్ట్ర) – మహాలక్ష్మీ దేవి
8. కంఠము – మాహూర్ (మహరాష్ట్ర) – ఏకవీరా దేవి
9. నాలుక – ఉజ్జయిని (మధ్య ప్రదేశ్) – మహాకాళీ దేవి
10. పిరుదులు – పిఠాపురం (ఆంధ్ర ప్రదేశ్) – పురుహూతికా దేవి
11. కటి భాగము – జాజిపూర్ (ఒరిస్సా) – గిరిజా దేవి
12. నాభి – దక్షారామము (ఆంధ్ర ప్రదేశ్) – మాణిక్యాంబ దేవి
13. హృదయం – హరిద్వార్ (ఉత్తరాంచల్) – మానసా దేవి
14. ఎడమ కాలు – అలహాబాదు (ఉత్తర్ ప్రదేశ్) – మాధవేశ్వరి దేవి
15. నోరు – జమ్ము (జమ్మూ కాశ్మీర్) – వైష్ణో దేవి
16. స్తనములు – గయ (బీహార్) – మంగళగౌరి దేవి
17. ఎడమ కన్ను – వారణాశి (ఉత్తర్ ప్రదేశ్) – విశాలాక్షి దేవి
18. కపాలం – కాశ్మీర్ (జమ్మూ కాశ్మీర్) – సరస్వతి దేవి

అమ్మవారి ఉపాలయం
శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం
శ్రీపాద శ్రీవల్లభులవారు జగద్గురు అవదూత శ్రీ గురుదత్త స్వామి వారి మొదటి అవతారంగా భక్తులు విశ్వసిస్తారు. విగ్రహమూర్తి స్వరూపములోనున్న ఏకైక దత్త క్షేత్రము ఈ పిఠాపురం పాదగయ క్షేత్రంలో మాత్రమే ఉన్నది. మిగిలిన దత్త క్షేత్రములలో, దత్త పాదుకలు మాత్రమే దర్శనమిస్తాయి. స్వామి ఆలయం పక్కనే మూడు కొమ్మలుగల ఔదుంబర వృక్షం (మేడిచెట్టు) చాలా మహిమ గలది. ఈ చెట్టు మొదట్లో ఉన్న పాదుకలు శ్రీపాదశీవల్లభులవారి నిజపాదుకలట.



Add caption






No comments:

Powered By Blogger | Template Created By Lord HTML