శ్రీ మహావిష్ణువు ఉత్తరం వైపునే ఎందుకు కొలువై ఉన్నాడు?
ఉత్తరం వైపునే కొలువై ఉన్నాడు అని కాదు! అన్ని వైపులా కొలువై ఉన్నాడు. ఉత్తరం వైపునుంచి మనం ఊర్ధ్వంగా ప్రయాణం చేస్తూన్నాం. ఆ స్వామి దక్షిణాభిముఖుడై మనకు దర్శనాన్ని ఇస్తాడు. మనం ఉత్తరం వైపు నుంచి ఊర్ధ్వంగా ప్రయాణం చేయడం మొదలుపెడతాం. సూర్యనారాయణ మూర్తి రెండు మార్గములలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. 1. ఉత్తరాయణం 2. దక్షిణాయనం. ప్రత్యక్షంగా కనిపించేటటువంటి జ్ఞానదాత, కర్మసాక్షి సూర్య నారాయణ మూర్తి ఆ శ్రీమన్నారాయణ మూర్తి యొక్క అవతార స్వరూపము. "ధ్యేయస్సదా సవిత్రు మండల మధ్యవర్తీ నారాయణ స్సరసిజాసన సన్నివిష్ణః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హరీ హిరణ్మయవ పుర్ద్రుట శంఖ చక్రః" అని సూర్యనారాయణ మూర్తిని మనం ధ్యానం చేస్తాం. ఆయన యొక్క ప్రత్యక్ష స్వరూపం. ఈ స్వరూప విశేష అవతార విశేషాదులన్నీ పరిశీలించినట్లయితే ఆ స్వామి అన్ని చోట్లా ఉంటాడు. మనమంతా కూడా ఉత్తరం మార్గంతో జీవ ప్రయాణం మొదలు పెట్టినట్లయితే కైవల్యం చేరుకుంటాం. మన దేహంలో రెండు భాగములు ఉన్నాయి. ఇందులో ఎడమను కుడి నియంత్రిస్తుంది. కుడిని ఎడమ నియంత్రిస్తుంది. మన ప్రయాణంలో ఉత్తరాభిముఖంగా అంటే ఊర్ధ్వ మార్గంగా ప్రయాణం చేసే విధానం. ఉండే ఎనిమిది దిక్కులలో నైరుతి ఎత్తులో ఉండగా ఈశాన్యము, ఉత్తరము కాస్త పల్లంగా ఉంటాయి. అంటే నిజంగా వచ్చేటటువంటి వాయువు, వర్షము వీటిని తట్టుకొని ఆ నైరుతి భాగం ఎత్తుగా ఉండి మనకు రక్షణ కలిగిస్తే మనము ప్రయాణం ప్రారంభం చేసి ఆ దిశలో ఉండేటటువంటి శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుంటాం. అందుకే ఉత్తరముఖంగా ప్రయాణం చేయడం. మనలో ఉండే వివేకము, విజ్ఞానము అంతా కూడా ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు చూస్తుంది. దక్షిణదిశకు యమధర్మరాజు అధిపతి కాగా ఉత్తర దిశకు కుబేరుడు అధిపతి. కుబేరుడు భౌతికమైనటువంటి ధనము, సంపద, ధాన్యము, ఆర్ధిక పరమైనటువంటి వనరులు అన్నీ అందించేవాడు. ఈ అన్నింటితో సంబంధాలను వదులుకుంటే గానీ కైవల్యం లభించదు. భూమి, ధనము, సంపద, ఆనందము ఉత్తర దిశలో ఉండే వీటిపట్ల మనం మమకారం పెంచుకుంటే మనం ఇక్కడే ఉంటాం. ఇల్లు కట్టుకున్నా కూడా ఉత్తరం ఖాళీ అందుకోసమే ఏర్పాటు చేస్తారు. వీటిపైన మమకారం వదిలి మనం దక్షిణ మార్గంగా ప్రయాణం మొదలుపెడితే స్వామి కరుణిస్తాడు. కైవల్యం ప్రసాదిస్తాడు. అందు నిమిత్తమై సంవత్సరంలో ప్రత్యేకంగా చెప్పబడ్డ రోజు ధనుర్మాసంలో ఉన్న ఈ వైకుంఠ ఏకాదశి. ఇకనుంచి ఐదారు రోజులలో ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమౌతుంది అనుకోవడానికి ఇది సూచన.

No comments:
Post a Comment