గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 10 January 2015

పిడుగుపాటును అడ్డుకునే తులసి

పిడుగుపాటును అడ్డుకునే తులసి
భారతీయ జీవన విధానంలో వృక్షములను పూజించే ఆచారం ఉన్నది. వృక్షమును గూడ తల్లిగా భావించే సంస్కృతి మనది. రావి చెట్టు, వేప చెట్టు, తులసీ మొక్కలను పూజించడం తరచు చూస్తుంటాము.''నాస్తి మూల మనౌషదం'' సృష్టిలోని ప్రతి చెట్టు ఔషధీ లక్షణం కలిగి ఉన్నప్పటికి (ప్రస్తుతం విశేషణ తులసి మొక్కకు మాత్రమే పరిమితం చేసుకుందాము.
ఒకప్పుడు భారతదేశంలో తులసి మొక్క లేని హిందువుల ఇల్లు ఉండేదికాదు. ఇప్పుడు ప్రతి ఇంట్లో తులసి మొక్కలు ఉంటున్నాయి. ఇంటి ఎదుట తులసి మొక్క ఉంటే ఆ ఇల్లు ఎంతో కళగా కనిపిస్తుంది. తులసికి ఒక పౌరాణిక గాథ ముడిపడి ఉంది. ''బంధ'' అనే ఒక పతివ్రత విష్ణువు శాపకారణంగా భూలోకంలో తులసిగా అవతరించింది. కాబట్టి తులసీ పూజ సద్గుణాలను సంపాదించుకోవడానికి మార్గదర్శకంగా ఉంటుంది.
శివునకు మారేడు దళములు, విష్ణువుకు తులసి దళములు ప్రీతికరమైనవి. వాకిటి ముంగిట, వాకిటి వెనుక తులసి మొక్క ఉండటం, అవకాశం ఉంటే ఇంటి ప్రాంగణంలో ఎన్ని తులసిమొక్కలు పెంచుఓకోగలిగితే ఆ ఇంటికి, ఇంట్లో వారికి సర్వ శుభాలు సమకూరుతాయి. అందుకే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో తులసి వనాలను పెంచుతుంటారు.
యన్మూలే సర్వతీర్థాని సన్మధ్యే సర్వ దేవతా
యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహమ్‌||
అని మన శాస్త్రాలో చెప్పబడింది. తులసి మొక్క మధ్య భాగంలో అనగా కాండం నుంచి సమస్త దేవీ దేవతలు, అగ్ర భాగమునందు నాల్గు వేదాలు నివాస ముంటాయి. అటువంటి తులసికి నేను నమస్కరించుచున్నానని దాని అర్థం. దీనిని బట్టి తులసికి ఎంత అత్యున్నత స్థానమీయ బడినదో మనమూహించవచ్చును.
మన జీవనవిధానం ప్రకృతి కనుగుణమైంది. ఈ జీవనం సాఫీగా సాగడానికి పురాణ గాధలతో ముడిపెట్టి అనేక వైజ్ఞానిక విషయాలను ప్రవేశపెట్టారు.
హిందువుల ఆచారాలలో ఏ ఒక్కటి అనాలోచితం, అర్థరహితం, ప్రకృతి విరుద్దం కాదు. అది మానవ జీవన వికాసానికి దోహదం చేసేదిగా ఉంటుంది. సమాజానికి హితకరంగా ఉంటుంది.
ఈనాడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య పర్యావరణ కాలుష్యాన్ని నిర్మూలించుటకు దార్శానికులైన మన మునులు ఈ కాలుష్యాన్ని నివారించి మానవాళి శ్రేయస్సుకోసం హోమాలు, యజ్ఞాలు, యాగాలు, వృక్ష పూజలు ప్రవేశపెట్టారు.
చెట్లు కార్బన్‌-డై-ఆక్సైడ్‌ను పీల్చుకొని ఆక్సిజన్‌ను అందిస్తాయని శాస్త్రజ్ఞులు చెప్తుంటారు. అయితే రాత్రిపూట మాత్రం బొగ్గుపులుసు వాయువునే విడిచిపెడుతుంటాయి. అందుకే బాగా చల్లదనాన్ని యిస్తున్నప్పటికీ విజ్ఞులైన పెద్దలు రాత్రిపూట చెట్ల కింద పడుకోవద్దని సలహా యిస్తుంటారు. కానీ తులసీ విషయంలో మాత్రం దీనికి మినహా యింపు తులసి మొక్క సర్వకాల సర్వావస్థలందు ప్రాణ వాయువునే విడిచి పెడుతుంటుంది.
దీనిలో 'థైమాలీ'' అనే ఔషధ ద్రవ్యం ఉంటుంది. దీనికారణంగా తులసిలోని సువాసనలు చాలా దూరం వరకు వ్యాప్తిస్తుంటాయి. ఈ ద్రవ్యం మూడింట ఒకవంతు భాగం ప్రతి ఆకులోను నిండి ఉంటుంది.
సుగంధ భరిత రసం అధికంగా ఉన్న కారణంగా దీనికి ''సురస'' అనే పేరు సార్థకమైంది. తులసిలో మనకు తెలిసిన కృష్ణతులసీ, లక్ష్మీతులసీ అనే రెండు ప్రధానమైనప్పటికినీ రామ తులసీ, అడవి తులసీ, నేల తులసి, మరువక తులసీ,రుద్రజిడ తులసి అనే పలురకాలు కనిపిస్తున్నాయి.
''ఆర్విన్‌ ఎర్నెస్ట్‌ అనే విదేశీ శాస్త్రవేత్త తులసి మొక్క మీద పరిశోధనలు చేసి అనేక అద్భుత విషయాలను వెలుగులోకి తెచ్చాడు. హిందువుల దూరదృష్టికి నిత్య జీవనంలో వాటికిచ్చిన ప్రాదాన్యతకు ఆశ్చర్య చకితుడై హిందూ జీవన విధానాన్ని అభినందించకుండా ఉండలేక పోయాడు.
పుణ్య క్షేత్రాలలో భక్తులరద్దీ అధికంగా ఉంటుండటం వల్ల అంటు రోగాలను కలిగించే వైరస్‌లను ఈ తులసీ వనాలు అడ్డుకొని అవి గాలిలో వ్యాపించకుండా కాపాడుతున్నాయి. గ్రీకు దేశంలోని ఒక చర్చిలో క్రైస్తవుల ''పంటల పండుగ'' సందర్భంగా అక్కడున్న బిషప్‌ తులసీ తీర్థాన్ని ఇస్తారనీ ప్రతీతి.
భారతదేశంలోని ప్రతి మహిళ ప్రతిరోజూ తులసి కోటవద్ద పూజ చేసి ఇంతనీరు పోసి ప్రదక్షిణం చేయాలని ఒక ఆచారాన్ని ప్రవేశపెట్టారు. ఇలా ధార్మికతతో ముడిపెట్టడం వల్ల తప్పనిసరిగా దానిని పాటించే మనస్తత్వం నిర్మాణ మౌతుంది. ఆ పూజా పద్ధతి వల్ల ఆ చెట్టు వద్దనే కొంచెం సేపు ఉంటున్న కారణంగా ఆరోగ్యం కూడా చేకూరుతుందని దాని వెనుక ఉన్న ఉద్దేశం. మగవారు కూడ రోజూ తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేయాలనే పద్ధతికూడా ఉంది. ఇది కేవలం మహిళలకే అని ఉపేక్షించవలసిన అవసరం లేదు. తులసి ఒక పతివ్రత. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం అనే గాథలుండటం వల్ల ఇది మహిళలకు మాత్రమే అనే ఒక ఆచారం చోటుచేసుకుంటుంది. అది వాస్తవం కాదు. తులసి పూజ అందరూ చేయవలసిందే. మిగిలిన మొక్కలలో కంటే తులసిలో ''ఎలక్ట్రో కండక్టవిటీ'' లక్షణం ఎక్కువగా ఉన్న కారణంగా దీని సమీప ప్రదేశంలో పిడుగు పడే అవకాశం లేదని శాస్త్రవేత్తలు నిరూపిం చారు. తులసి వెలువరిస్తున్న వాయువు ఆకాశంలోని ఓ జోన్‌ పొర దెబ్బతినకుండా సంరక్షిస్తుందని. ఎన్ని ఎక్కువ తులసి మొక్క లుంటే అంతగా ప్రపంచ ప్రజలను సంరక్షించే అవకాశం ఉంటుందని తెలుసుకున్నారు.
అందుకే మన దేశంలోని చిన జీయర్‌ స్వామి వంటి స్వామీజీలు, సేవాభారతి వంటి స్వచ్ఛంద సంస్థలు తులసి మొక్కల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు.
ఇక ఔషదీపరంగా ఆలోచిస్తే ఒక్క మాటలో చెప్పాలంటే తులసి సర్వరోగనివారణి, శిరస్సు, నేత్రం, చెవి, శ్వాస సంబంధం, నోరు, గొంతు, ఉదర సంబంధ వ్యాధులకు, విషాహారం, దురదల నివారణకు, శరీర వర్ఛస్సును పెంపొందించడానికి, సౌందర్య సాధనంగాను ఉపయోగపడుతుంటుంది. కిడ్నీలో రాళ్లు, జలుబు, దగ్గు, స్త్రీ సంబంధ వ్యాధులు నివా రణకుపకారి. గుండె సంబంధమైన వాటికి ఉపయోగ పడుతుంది.
తులసి ఒక డాక్టరు
తులసి మొక్కకు ఆధ్యాత్మికంగా విలువలు, గౌరవం, ప్రాధాన్యతలు ఉన్నాయి. అంతేకాకుండా అనారో గ్యాలకు తులసిని ఒక ఇంటి వైద్యంలో వాడతారు. ఇది ఒక అద్భుత ఔషధ మొక్కనే కాకుండా మానవాళికి వరప్రసాదం లాంటిది.
- తులసి మొక్క ఉంటే క్రిమికీటకాలు చేరవు.
- తులసిని నమిలితే నులి పురుగులు నశిస్తాయి.
- మంచి నీటితో త్రాగితే మంచి ఆరోగ్యం తయారు అవుతుంది.
- జలుబు, దగ్గు, నివారిస్తుంది.
- తులసీ యాంటీ సెఫ్టిక్‌ లా పని చేస్తుంది.
- తులసి ఆకు రసం, టైఫాయిడ్‌, ఫ్లూ, న్యూమోనియా జ్వరాలకు దివ్యౌషదం.
- చర్మవ్యాధులు ఏర్పడి భరించలేని దురద కలిగితే తులసి ఆకులను చర్మం మీద రుద్దితే దురద తగ్గి, వ్యాధినివారణకు తోడ్పడుతుంది.
- అజీర్ణానికి మహామందు తులసీ.
- తులసి ఆకులు నమిలితే గొంతు సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి.
- బ్రాంకైటీస్‌, ఉబ్బసాలకు ఉపశమనం కలిగిస్తుంది.
- తులసిలోని ఆయిల్‌ దోమలను సంహరిస్తుంది. తులసిలో ఇతర ఖనిజాలతోపాటు క్రోమియం, యూజినాల్‌, మెథిల్‌, చవైనాల్‌ లాంటి ఆయిల్స్‌ ఉంటాయి.
- తులసాకుల రసంతో ముద్ద కర్పూరాన్ని కలిపి తలకు పట్టిస్తే పేలు చచ్చి పోతాయి.
- రుద్రజడ తులసి గింజలను సజ్జాగింజలు అంటారు. వాటిని నీటిలో నానేసి వాటిని త్రాగినట్లయితే చలువ చేస్తుంది.
- తలనొప్పిని నివారిస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో ఐదు, నుండి పది ఆకులు వేసుకొన్న తరువాత 15 ని|| సేవించాలి.
- జ్ఞాపక శక్తికి దివ్యౌషధం.
- దేహానికి శక్తిని కలిగిస్తుంది. డయాబెటీస్‌ రోగులలో బ్లడ్‌ షుగర్‌ తగ్గిస్తుంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML