గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 3 January 2015

ఏల్నాటి శనిఏల్నాటి శని

తులా,వృశ్చిక,ధనస్సు రాశి వారికి ఏల్నాటి శని జరుగుతుంది.ఏలిన నాటి శని జరుగు చున్నప్పుడు గృహ నిర్మాణము చేస్తే ఆ గృహము నిర్మాణము పూర్తి కాదు. ఏదో విధమైన ఆటంకములు ఏర్పడి మధ్యలో ఆగి పోతుంది . సమయానికి డబ్బు చేతికి అందదు . పూర్తవడానికి చాలా కాలము పడుతుంది . అనేక ఒడుదుడుకుల ఎదుర్కొంటే గానీ గృహమును పూర్తి చెయ్యలేరు.అనవసర వ్యయం అవుతుంది.

వివాహము నకు మాత్రము ఆటంకము కలుగదు . చాలా మందికి ఏలిన నాటి శని జరుగు చున్నప్పుడు వివాహము జరుగుతుంది . వధూ వరుల ఇద్దరిలో ఎవరో ఒకరికి అర్దాష్టమ శని , అష్టమ శని , ఏలిన నాటి శని ఉన్నప్పుడు మాత్రమే వివాహము జరుగు చున్నది . ఎంతో కాలము వివాహము జరుగ కుండా ఉన్న వారికి కూడా ఏలిన నాటి శని జరుగు చున్నప్పుడు వివాహము జరుగు చున్నది .


మన దృష్టిలో వివాహము అనేది శుభ కార్యము . కానీ బ్రహ్మ చారులై ఉండే వారికి సంసార బంధమును ఏర్పరచి భాధ్యతలను పెంచేవాడు శని గ్రహము . కుటుంబమును ఏర్పరచి భవ బంధములను ఏర్పరుస్తాడు

శని బద్దకమును పెంచుతాడు , అతినిద్ర, మత్తు, బద్దకము కలిగిస్తాడు . ఏకాగ్రత లోపిస్తుంది . విద్యార్ధులయితే వేకువ జామున లేవండి .బ్రహ్మ ముహూర్త కాల సమయమైన తెల్ల వారుజామున లేచి చదువుట వలన తెలివి తేటలు పెరుగుతాయి .

మిగతా వారు ఆరోగ్యమును కాపాడుకొనుటకు అన్ని వేళలా అలర్ట్ గా ఉండాలి .

కొంత మందిలో అయితే ఊబ కాయులు అవడము, శరీరమునందు కొవ్వు పెరిగి శారీరక అందమును కోల్పోయి వికారముగా తయారవుతారు . నూనె సంభందిత పదార్ధాలను తినడము తగ్గించండి . ఎక్కువగా వ్యాయామము చెయ్యండి . దీనివలన బద్దకము తగ్గుతుంది . యాక్టివ్ గా ఉంటారు .

ఏలిన నాటి శని జరుగు చున్న వారు ఏ నిర్ణయమును సరిగ్గా తీసుకోలేరు . ఒకే విషయమును గురుంచి పదేపదే అలోచిస్తూంటారు . వృధాగా కాల యాపన చేస్తారు . అనుకొన్న పనిని అనుకొన్న సమయమునకు పూర్తి చెయ్యలేరు . ఇటువంటి వారు ఉదయాన్నే యోగా చేయండి , లేకపోతే మీ కుల దైవమును గానీ , మీ ఇష్ట దైవమును గానీ మనసున ఉంచుకొని ధ్యానం చెయ్యండి . దీనివలన ఏకాగ్రత పెరుగుతుంది . ఉత్సాహముగా ఉంటారు .యాక్టివిటీ పెరుగుతుంది .

ఇలా శారీరకముగా మానసికముగా అన్ని విధములా మనకు జరిగే పరిస్థితులకు అనుగుణముగా కొన్ని కొన్ని పరిహారములను చేయడం వలన శనీశ్వరుని అనుగ్రహమును పొంద గలము .

శనీశ్వరుని పూజించడము , నువ్వుల నూనెతో అభిషేకములు చేయించడము , నలుపు వస్త్రములు , నల్ల నువ్వులు దానము ఇవ్వడము వలన శనీశ్వరునికి శాంతి జరిగి మంచిని ప్రసాదించ గలడు .

ప్రతిరోజూ శని గ్రహ స్తోత్రమును పటించుట వలన కూడా శాంతి కలుగును . నల్ల చీమలు , కాకులు మున్నగు వాటికి ఆహారమును పెట్టుట మంచిది . వీలయినపుడు ఎవరికైనా సరే అన్న దానము చేయ వలెను . మీరు వాడిన పాత బట్టలను ఎవరైనా బీదవారికి ఇవ్వండి . అనాధ పిల్లలకు ఆశ్రయము కల్పించండి . మీకు తోచిన సహాయము చెయ్యండి .

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML