అయోధ్యాకాండలో అనసూయ, సీతను పక్కకు తీసుకువెళ్ళి ఒకమాట అడిగింది. "ఏమమ్మా, మీ నాన్నగారు నిన్ను వీర్యశుల్క అన్నారు కదా! రాముడు శివధనుర్భంగం చేశాడు కదా! నీవు వచ్చి రాముని మెడలో వరమాల వెయ్యలేదా? రాముడు వెంటనే వివాహం చేసుకోలేదా? వివాహానికి పదిపదిహేనురోజులు ఆలస్యం ఎందుకు అయింది?" అని అడిగింది. అపుడు సీతమ్మ అంది - "శివధనుర్భంగము చేసిన తరువాత సీత నీది అని నా తండ్రి రామునితో అన్నాడు. అపుడు రాముడు ఈమాట నిర్ణయించవలసినది మా నాన్న గారు అన్నాడు. అందుకని దశరథ మహారాజు గారికి కబురు వెళ్ళింది. దశరథ మహారాజు గారు వచ్చి చూసి మీ పిల్లను చేసుకుంటాము అన్న తర్వాత, రాముడు నా మెడలో తాళికట్టాడు. నా మామగారి అనుమతి పొందిన పిదప నా మెడలో తాళి కట్టిన రాముని భార్యను నేను" అని చెప్పింది. ఆ మాటలకు అనసూయ ఎంతో పొంగిపోయి - 'ఇది కదా రాముడు అంటే - తండ్రిమాట విని తాళికట్టినవాడు రాముడు అని తెలుసుకొని పొంగిపోయిన భార్యవు నీవు కదా' అని సీతమ్మకు కొన్ని పట్టువస్త్రాలు, నగలు, అంగరాగములు ఇచ్చింది.
ఈ రహస్యమును అయోధ్యాకాండలో చెప్పారు. అందుకని శివధనుర్భంగము జరిగిన వెంటనే సీతమ్మ తల్లి వచ్చి రాముని మెడలో వరమాల వెయ్యలేదు.
ఈ రహస్యమును అయోధ్యాకాండలో చెప్పారు. అందుకని శివధనుర్భంగము జరిగిన వెంటనే సీతమ్మ తల్లి వచ్చి రాముని మెడలో వరమాల వెయ్యలేదు.

No comments:
Post a comment