.....
మెదక్ జిల్లా సిద్దిపేటలో సోమవారం వీహెచ్‌పీ ఆధ్వ ర్యంలో జరిగిన విరాట్ హిందూ సమ్మేళనం, హనుమాన్ చాలీసా కోటి పారాయణ యజ్ఞాల్లో ఆయన పాల్గొన్న వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కె.చంద్రశేఖర్ రావులు హిందువుల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబేమో జెరూసెలం వెళ్లే క్రైస్తవులకు, కేసీఆర్ ఏమో హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సాయం అందిస్తున్నారని, అదే తిరుపతి వెళ్లేందుకు ఎస్సీ, ఎస్టీలైన హిందువులకు ఒక్క రూపాయి అయినా ఎందుకివ్వరని ఆయన ప్రశ్నించారు.రు. రిజర్వేషన్ల పేరిట హిందువులకు నష్టం చేస్తున్నారని, హిందువులు సురక్షితంగా ఉండాలంటే దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలని, అప్పుడే మతమార్పిడులు ఆగిపోతాయని ఆయన అన్నారు. దేశం ఒక్కటే అయినపుడు రెండు రకాల చట్టాలెందుకంటూ. ‘ఉమ్మడి పౌర స్మృతి’ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి హిందువుకు సురక్ష, సంవృద్ధి, సన్మాన్ లభించేలా అందరూ సక్రమ హిందువులుగా సంఘటితంగా మెలగాలని, అంటరాని తనాన్ని అంతం చేయాలని, ప్రతి హిందువు నిరుపేద హిందువులను ఆదుకునేందుకు రోజు పిడికెడు బియ్యం, నెలకొక విద్యార్థికి ఫీజు, డాక్టర్లు రోజుకొక రోగికి ఉచిత వైద్యం అందించాలని, కశ్మీర్‌కు 4లక్షల మంది హిందువులు తిరిగి వచ్చినపుడే.. లాహోర్, రావల్పిండి మొదలైనవి కలిసి అఖండ భారత నిర్మాణం జరిగినపుడే నేను ఉత్సవంగా భావిస్తా’’ అని ఆయన చెప్పారు..@ జనబందు.
No comments:
Post a comment