ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Saturday, 3 January 2015

పూర్వం కృత యుగంలో చంద్రావతీ నగరాన్ని పాలించే 'మురు' డనే రాక్షసుడుండే వాడు.పూర్వం కృత యుగంలో చంద్రావతీ నగరాన్ని పాలించే 'మురు' డనే రాక్షసుడుండే వాడు. దేవతల్ని జయించి, వేధించే వాడు. విష్ణువు వానితో వెయ్యేండ్లు యుద్ధం చేసి, అలసి, విశ్రాంతికై ఒక గుహలో చేరి నిద్రించాడు. అట్టి శ్రీహరిని సంహరించడానికి 'మురు'డు సిద్ధ పడగా,స్వామి శరీరం నుండి దివ్య తేజస్సులతో ఒక కన్య ఉద్భవించింది. దివ్యాస్త్రాలతో యుద్ధం చేసి, ఆ కన్య మురుణ్ణి సంహరించింది. విష్ణువు మేల్కొని ఆ కన్యనూ, మరణించి యున్న మురుణ్ణీ చూచి, ఆశ్చర్య పడినాడు. కన్య నమస్కరించి, జరిగిన దంతా విన్నవించింది. సంతోషించిన విష్ణువు ఆమెను వరం కోరుకోమ్మన్నాడు. ఆమె ఆనందంతో "దేవా! నేను ఏకాదశి నాడు నీ శరీరము నుండి ఉద్భవించాను. కనుక నా పేరు ఏకాదశి. నా వ్రతం చేస్తూ ఈనాడు ఉపవాసం వుండేవారు సంసార బంధాల నుంచి తరించేట్లుగా వర మిచ్చి అనుగ్రహించండి" అని ప్రార్ధించింది. స్వామి "అట్లే ఆగుగాక!" అని వరమిచ్చి అద్రుశ్యు డైనాడు. నాటి నుండి ఏకదశీ వ్రతం భక్తితో ఆచరించేవారు సకల పాపాల నుండి విముక్తులై , విష్ణు లోకాన్ని పొందుతారన్న ప్రశస్తి ఏర్పడింది.
ఏకాదశీ తిథికి అధిదేవత ఏకదశీదేవి. ఈమె విష్ణు దేహసముత్పన్న కనుక స్త్రీ మూర్తియైన మహా విష్ణువే! "జన్య జనకంబులకు భేద శంకలేదు" కదా! సర్వోత్తమ తిథి ఏకాదశి. ఏకాదశీ వ్రత ప్రభావాన్ని వివరించే కథలు చాలా ఉన్నాయి.
కుచేలుడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించి మహైశ్వర్య వంతు డైనాడని ఐతిహ్యం. ధర్మరాజు ఆచరించి కష్టాలనుంచి గట్టెక్కినాడు. రుక్మాంగదుడు ఆచరించి పుత్ర ప్రాప్తి నోందాడు. సకల దేవతా పాత్రుడైనాడు. మోక్షగామి యైనాడు. క్షీర సాగర మధనం - లక్ష్మీ ఆవిర్భావం ఏకాదశినాడే జరిగాయి. వైఖానాస రాజు ఆచరించి, పితరులకు ఉత్తమలోకప్రాప్తి చేకూర్చాడు. అంబరీషుని వ్రత ప్రభావం జగద్విదితం!


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML