లోకాలన్నిటినీ కడుపున దాచిన విశ్వంభరుడు గోపాల బాలుడై యశోదానందుల కొడుకైనాడు.
పాడిరి గంధర్వోత్తము
లాడిరి రంభాది కాంతలానందమునన్
గూడిరి సిద్ధులు, భయములు
వీడిరి చారణులు మొరసె వేల్పుల భేరుల్!!
అతి ప్రసన్నుడైన వెన్నుని కన్న దేవకి, పున్నమినాడు షోడశ కళాప్రపూర్ణుడైన చంద్రుని కన్న ప్రాగ్దిశవలె చెలువొందినదంటారు పోతన్నగారు. పదహారు కళల పూర్ణావతారంగా శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించినది అర్ధరాత్రి వేళ.
దేవతలకు కూడా దొరకని ఆ పరమ పురుషుడు గోపబాలురతో ఆడి పాడాడు. స్వయంగా అమృతాన్ని పంచిన మోహినీవేషుడు వ్రజవాడలో వెన్న దొంగిలించాడు. ఆకపటనాటక సూత్రధారి రాబోయే యుగాసందికి సంకేతంగా తల్లి చేతి తాళ్ళకు కట్టుబడ్డాడు. ఆ గోవిందుడు గోకులంలోని క్షీరాన్నే కాదు, జలాన్ని కూడా అమృతమయం చెయ్యాలని భావించాడు. అందుకే ప్రతి పసిప్రాణిలోనూ వసివాడని కన్నయ్య పసితనాన్నిభావించగలిగితే అదే జన్మ సాఫల్యం. జీవన మాధుర్యపు ఊటగా మారి ఆ దివ్య నర్తకుని చరణాలమీద అశ్రు అభిషేకం చేయదా!

No comments:
Post a comment