గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 3 January 2015

ఆత్మజ్ఞానముఆత్మజ్ఞానము

ఆత్మజ్ఞానము సర్వవేదాంత సారము. జగద్గురు ఆదిశంకరాచార్యులవారు రచించిన ‘ఆత్మబోధ’లో పలు శ్లోకాల ద్వారా విషయమును విశదీకరణము చేసి లోకానికి సందేశాత్మకంగా అందించారు. ఆత్మజ్ఞానమును తెలిసికొన్న జీవులు ధన్యులు కాగలరు. మనలోని దివ్యత్వమును పైకి తెచ్చేది తపస్సు. ఇంద్రియ నిగ్రహమే దీనికి మూలం, కోరికలను జయించిన వారికే శాంతి లభిస్తుంది. అజ్ఞాని ఆత్మనుగాంచలేడు.

జ్ఞానమార్గం ఎంతో విశిష్ఠమైనది. జ్ఞానం లేనిదే మోక్షం సిద్ధించదు. అజ్ఞాన కలుషితమైన దానిని జ్ఞానసాధన మార్గం ద్వారా శుద్ధిచేసుకోవాలి. ఆత్మస్వరూపం జ్ఞానమే, వ్యక్తి చైతన్యం శుద్ధ అఖండ చైతన్యంలో లీనం కావాలి. జ్ఞానము- జ్ఞాత- జ్ఞేయము అనునవి స్వరూప జ్ఞానము యొక్క ప్రతిబింబాలుగా ఉంటాయి.


రాగద్వేషాలతో కూడుకొన్న సంసార జీవితం జ్ఞానోదయం కానంతవరకు సత్యమైన దానివలె కన్పిస్తుంది. పరమార్థ ప్రయోజనం ఆశించువారికి ప్రపంచం యావత్తూ స్వప్నతుల్యవౌతుంది. ఆత్మజ్ఞానం కలుగనంత కాలం జీవులు చస్తూ- పుడుతూ, సంసార బాధలకు లోనౌతుంటారు. క్షణిక భోగాలకూ, కష్టాలకూ గురిఔతారు. వ్యావహారిక ప్రపంచం, స్వప్న ప్రపంచం రెండూనూ క్షణికములే.

సకల సృష్టికి అంతర్భూతం బ్రహ్మపదార్థమే, సృష్టి అంతయూ భ్రాంతిగనే వుంటుంది. నామరూపాత్మకమైన జగత్తే జీవులకు గోచరిస్తూ వుంటుంది. బ్రహ్మ పదార్థము సత్‌చిత్ ఆనందమయము. విశ్వదృష్టితో చూస్తే సృష్టి, స్థితి, లయాలకు కారణభూతం. శాశ్వతము- సర్వవ్యాపకము- సత్-చిత్ స్వాభావికమైన విష్ణువునందే సర్వము భాసిస్తుంటుంది. ‘‘సర్వం విష్ణుమయం జగత్’’ అని వేదం.

పూర్వజన్మకృత కర్మలకు తగినట్లుగా జన్మకల్గుతుంది. అపంచీకృతమైనది సూక్ష్మ శరీరము. దశేంద్రియములతో కూడి వుంది. సుఖదుఃఖాలను అనుభవింపజేస్తుంది. వీటికి ప్రధానం మనసు. ఇది చేయు పనినిబట్టి అహంకారము- చిత్తము- బుద్ధి అని పిలువబడుతూ, పునర్జన్మలకు నిలయవౌతుంది. ఆత్మజ్ఞానము కలుగుటకు అవరోధంగా వుంటుంది. అజ్ఞానంలో జీవులు సంచరించినంతకాలం ఆత్మను ఎఱుగలేరు. ఆత్మజ్ఞానమును పొందలేరు. శాశ్వతానంద స్వరూపము ఆత్మదేగాన, అన్నమయ- ప్రాణమయ- మనోమయ- విజ్ఞానమయ- ఆనందమయ అను పంచకోశములను శుద్ధాత్మనుండి వేరుచేయాలి.

విచారణ- వివేకము జ్ఞానమునకు ప్రధాన సాధనములు. శ్రవణ- మనన- నిధి- ధ్యాసలు వీటికి మూలంగాన వీటి ద్వారా పంచకోశములను విడదీసినచో ఆత్మగోచరిస్తుంథి. ఆత్మజ్ఞానము లభిస్తుంది. ఆత్మపరిశుద్ధ మనస్కులకే ద్యోతకవౌతుంది. నిష్కల్మషమైన మనోబుద్ధులు కల్గి- క్రమశిక్షణ నీతి మార్గమును అనుసరించిన వారికి బుద్ధికుదురుతుంది. అటువంటి వారికే ఆత్మసాక్షాత్కారము కలుగుతుంది. ఆత్మ జ్ఞానమును పొందే అవకాశం పెరుగుతుంది. ఆత్మజ్ఞానమును పొందిన వారికే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. మనసులు సత్-చిత్ ఆనందమయవౌతాయి. అజ్ఞానం అంతరిస్తుంది. అన్ని అవస్థలను అధిగమించిన వారే ఆత్మజ్ఞానులు.
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML