
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Monday, 12 January 2015
విష్ణు సహస్ర నామాలలో 34వ నామం ప్రభవః :
విష్ణు సహస్ర నామాలలో 34వ నామం ప్రభవః :
1. ఉత్కర్ష - ఆధిక్యత కలిగిన పుట్టుక కలవాడు. పుడుతూ పోతూ సాగే మన పుట్టుకల
చక్రాన్ని పోగొట్టుకోవాలంటే స్వామి పుట్టుక (అవతారం)ను స్మరించి
కీర్తించితే చాలు. మనకు జన్మ బంధాలను నివర్తింపజేయడానికి తాను లీలగా,
అత్యంత ఉత్కృష్టమైన విభూతులతో జన్మించాడు.
జన్మకర్మ చ మే దివ్యమేవం యోవేత్తి తత్త్వతః!
త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున!!
అని
గీతలో తన అవతార ప్రయోజనాన్ని చాటి చెప్పాడు స్వయంగా. "అర్జునా! ణా
దివ్యమైన జన్మమును, కర్మమును చక్కగా తెలుసుకొనేవాడు. దేహమును విడచినా
పునర్జన్మను పొందడు. నన్నే పొందుతాడు". ఎంత చక్కని అభయం! ఎంత అద్భుతమైన
అనుగ్రహం! మన జన్మను పోగొట్టడానికి తానూ జన్మించే కృప అది! ఆ 'కృప'యే
'ప్రకృష్టం'. దయను వెదజల్లే అద్భుతావతారుడు కనుక - ప్రభవుడు.
అప్రమేయ మనాద్యంతం కామాజ్జాత మజం నృషు!
పాండవస్తర్కయామాస కర్మభిః దేవా సమ్మతైః!! (మహాభారతం)
కొలతకందని
వాడై, ఆద్యంత రహితుడై యున్నా తన ఇచ్ఛచే మానవునిగా పుట్టి ఉన్నాడని
కృష్ణుని దివ్య చేష్టలను బట్టి అర్జునుడు గ్రహించాడు. సంపూర్ణత, ప్రకృష్టత
కల దివ్యచేష్టల అవతారములు దాల్చినవాడు - సంభవుడు, ప్రభవుడు.
2. విశేషంగా మహాభూతాలన్నీ ఈయన నుండి కలుగుతున్నాయి. కనుక - ప్రభవుడు.
3.
సృష్టికర్త అయిన బ్రహ్మకు సృష్టిని చేసే శక్తినిచ్చిన పరమాత్ముడు, ఆ
బ్రహ్మను కూడా సృష్టించిన వాడు. కనుక ప్రకృష్టమైన సృష్టికి హేతువైన
ప్రభవుడు.
సర్వసృష్టికి హేతువు మాత్రమే కాక పాలకుడూ, సమర్థుడూ కూడా ఆయనే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment