గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 19 January 2015

[డిసెంబర్ 25-- జనవరి --1 లను పండుగలుగా ఎందుకు జరుపుకుంటున్నామో అన్నది ఆంగ్లేయులకే అవగాహనలేకున్నా , , మనం జరుపుకుందాం , చాదస్తాలు మానుదాం అని ముఖ పుస్తకములో ఎవరో రాసినదానికి జవాబు ][డిసెంబర్ 25-- జనవరి --1 లను పండుగలుగా ఎందుకు జరుపుకుంటున్నామో అన్నది ఆంగ్లేయులకే అవగాహనలేకున్నా , , మనం జరుపుకుందాం , చాదస్తాలు మానుదాం అని ముఖ పుస్తకములో ఎవరో రాసినదానికి జవాబు ]

డిసెంబర్ 25-- జనవరి --1
అది ఒక ఎంజాయ్ మెంటు తేదీ తప్ప మనకు వేరేరకమైన ప్రాముఖ్యం లేదు. ఆ రోజు మన ప్రభుత్వ శలవు దినం కాదు. అది మనకు అంతర్జాతీయం గా ఒక కాలచక్ర సూచిక మాత్రమే.
మనం ఏమీ పండుగ జరుపోవడం లేదు కదా! ఒక సరదాగా జరుపుకునే దానికి మనం విమర్శలు చెయ్యడం సరికాదేమో!
విశ్వవ్యాప్తంగా ఏకీకృతమైన భావనకోసం మనం ఇంగ్లీషువారి నూతన సంవత్సరం జరుపుకోవటంలో సమతౌల్యత అలోచించాలే కానీ స్వాభిమానపు పోకడలు పోయి ప్రక్కవారిచేత వీడిదో చాదస్తం
అనిపించుకోవటం మంచిదా మిత్రమా ఆలోచించి రాబోయే నూతన సంవత్సరాదిని ఆహ్వానిద్దాం....
ఆనన గ్రంధము గోడపై అంటించిన,ఒక కరపత్రమునకు పైన కొందరు విజ్ఞులు తమ తమ స్పందనలను తెలియజేసినారు. పెర్లిచ్చట పొందుపరుపబడలేదు.
నాకు తోచిన నాలుగు మాటలు వ్రాయలనిపించి వ్రాస్తున్నాను. సహజ సామాన్యముగా 'పోనీలే' అన్నది మన మనస్తత్వము. ఒకసారి సింహావలోకనము చేస్తే ఏమేమి పోగొట్టుకోన్నామో అన్నది తెలియలేనంత పోగొట్టుకొన్నాము అని మనకవగతము కాగలదు. ఈ దేశపు విజ్ఞానము అపారము కావున పోయినది పట్టించుకోకుండా వున్నది పట్టుకొని ప్రాకులాడుచున్నాము. ఇప్పుడు 'ముదిమి మీదపడినది ' అని అనుకొనే వాళ్లయినా ఆలోచించకుంటే తదుపరితరానికిచ్చుటకు ఏమి మిగులదు. ఇక వారు వారి తరువాత తరానికి ఏమివ్వగలరు అన్నది విజ్ఞులు ఊహించగలరు.
'Enjoyment' ,తప్పుగా తలవకపోతే , కు ఏమని అర్థము చెప్పుకొందాము . త్రాగడమా, అన్య స్త్రీల పొందును అభిలషించడమా, మై మరచి గంతులు వేయడమా, దీపాలనార్పడమా. తన, పర అన్న విచక్షణ లేని క్లబ్బు పబ్బు గబ్బులలో అర్ధరాత్రి అరుపులతో కేరింతలతో మసలడమా ఏమిటి?దాదాపు రెండు పదుల సంవత్సరాలక్రితము వరకు ఈ దినము సెలవు దినముగా కూడా వుండేది. ఆంగ్లేయుల అధిపత్యముండినది కావున అది తప్పుల పట్టికయైనా మనపై రుద్దినారు . ప్రపంచ పతములోని ఎన్నో దేశములలో మన దెశమునకున్నంత పూర్వీక సంస్కృతి లేదు . వారికి ఆంగ్లేయుల ననుసరింపక తప్పదు. నా బాలయమున కూడా ఇంగ్లిషు కేలెండర్ వుండేది. నాడు అది ప్రభుత్వ కార్యాలయములకు మాత్రమె పరిమితము . నాగరీకులు మన పంచాంగమునే అనుసరిచేవారు .
డిసెంబర్ 25 న క్రీస్తు పుట్టలేదని ఎందఱో పాశ్చాత్యులు నిరూపించినారు.
క్రిస్టమస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండగ. యేసు క్రీస్తు పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు. కొంతమంది క్రైస్తవులు డిసెంబర్ 25న, మరికొంత మంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు. చారిత్రక మరియు సందర్భోచిత ఆధారాల ప్రకారం యేసుక్రీస్తు డిశంబరులో పుట్టి ఉండకపోవచ్చు. ఈ రోజును ఒక రోమన్ల పండగ రోజు అయినందునో లేదా వింటర్ సోల్టీస్ అయినందునో క్రిస్టమస్ జరుపుకోవటానికి ఎంచుకున్నారు.(వికిపీడియా నుండి)
అసలు
William J. Tighe is Associate Professor of History at Muhlenberg College in Allentown, Pennsylvania, and a faculty advisor to the Catholic Campus Ministry. He is a Member of St. Josaphat Ukrainian Catholic Church in Bethlehem, Pennsylvania. He is a contributing editor for Touchstone.
విలియమ తిఘే గారి మాటలలో చదవండి.
It is true that the first evidence of Christians celebrating December 25th as the date of the Lord’s nativity comes from Rome some years after Aurelian, in A.D. 336, but there is evidence from both the Greek East and the Latin West that Christians attempted to figure out the date of Christ’s birth long before they began to celebrate it liturgically, even in the second and third centuries. The evidence indicates, in fact, that the attribution of the date of December 25th was a by-product of attempts to determine when to celebrate his death and resurrection.
How did this happen? There is a seeming contradiction between the date of the Lord’s death as given in the synoptic Gospels and in John’s Gospel. The synoptics would appear to place it on Passover Day (after the Lord had celebrated the Passover Meal on the preceding evening), and John on the Eve of Passover, just when the Passover lambs were being slaughtered in the Jerusalem Temple for the feast that was to ensue after sunset on that day.
Solving this problem involves answering the question of whether the Lord’s Last Supper was a Passover Meal, or a meal celebrated a day earlier, which we cannot enter into here. Suffice it to say that the early Church followed John rather than the synoptics, and thus believed that Christ’s death would have taken place on 14 Nisan, according to the Jewish lunar calendar. (Modern scholars agree, by the way, that the death of Christ could have taken place only in A.D. 30 or 33, as those two are the only years of that time when the eve of Passover could have fallen on a Friday, the possibilities being either 7 April 30 or 3 April 33.)
Clemens Alexandrinus, Origen, Tertullian, Julius Africanus, Lactantius, Jerome, St. Austin, Sulpicius Severus, Prosper, and as many as place the death of Christ in the 15th or 16th year of Tiberius, make Christ to have preached but one year, or at most but two.
మరి వాస్తవికతయే లేకుండా పుర్రెకు తోచినట్లు ఏర్పాటు చేసిన పండుగకు మనము ప్రాధాన్యత ఇచ్చుట చిన్నబుచ్చుకోవలసిన విషయము కాదా. ఇక సాంటాక్లాస్ ఒక అభూత కల్పన. ఎందుకు మనము వెర్రి గా దానిని బట్టుకొని మన పిల్లలతో వ్రేలాడ దీయిన్చుతున్నామో తెలియదు.
జనవరి 1 న ఏమేమి ఆ మతస్తులు జరుపుకొను చున్నారో మనమదే జరుపుకొంటూ, పండుగ జరుపుకొనుట లేదంటే ఆ మాట సమంజసతకు దూరమౌతుందేమో.
తెల్లవాడికి సాంప్రదాయము గొప్ప అని ఎవరో వ్రాసినారు . తమ మతస్తులు కానివారి తలలు కోయుట సాంప్రదాయమా, తమ మతస్తులయ్యును మరమతము నుండి నేర్చుకోనవలసినదని పరిశోధించి తెలిపినవారిని చిత్రహింసల పాలుచేసి చంపడము సాంప్రదాయమా, 15 వ శతాబ్దము వరకు సక్రమమైన కుటుంబ వ్యవస్థ లేకుండుట సాంప్రదాయమా,నా కొడుకుకు\కూతురికి పెళ్లి చేస్తున్నాను అని స్వతంత్రముగా పెళ్లి పత్రిక అచ్చోత్తించుకోలేక పోవుట సాంప్రదాయమా, పుట్టిన రోజున దీపములార్పుట సాంప్రదాయమా. ఏది సాంప్రదాయము.
జనవరి మాసము పాశ్చాత్యుల 'autumn' (శిశిరము ) లో వస్తుంది . గ్రహ గమనములో ఎటువంటి ప్రత్యేకత వుండదు. శిశిరము రాలిపోవోటకు సంకేతము. వసంతము అంకురించుటకు సంకేతము. అసలు september అంటే సప్త అంటే 7 అట్లే october november december లు 8,9,10, మాసాలను తెలుపుతాయి . అంటే january 11 వ నెల february 12 వ నెల march క్రొత్త సంవత్సరము మొదటి నెల . అంటే విశ్వ వ్యాప్తంగా 'వసంతము' లోనే అందరికీ సంవత్సరాది యుండేది. వారి కాల గణనలో తప్పులు దిద్దుకొనుటకు వారు కొట్ట కొనకు, కట్ట కడపటికి, తుట్ట తుదకు, చిట్టచివరకు, ఎట్టకేలకు జనవరికి pope geregory తన శాస్త్రజ్ఞ సముదాయముతో 1582 లో మార్చుట సంభవించినది
The Julian calendar day Thursday, 4 October 1582 was followed by the first day of the Gregorian calendar, Friday, 15 October 1582 (the cycle of weekdays was not affected). ఈ కాల గణనా ప్రవాహములొ ఎన్ని రోజులు కొట్టుకు పోయినవో గమనించగలరు.
అసలు వాళ్ళకు అర్ధరాత్రి ఎందుకు ఒక దినము మొదలౌతుందంటే, వారి కేలెండరును మనలాగే సూర్యోదయాదితో మొదలు పెట్టుటకు వీలులేక మన సూర్యోదయాది సమయమునే ఎంచుకొన్నారు. మనకంటే 6 గం. వెనకలుంటారు కావున వారు రాత్రి 12 గం.లకే తెల్ల వార్చుకొన్నారు. ఇక స్వాభిమానమునకు వస్తే ,కాకిపిల్ల కాకికి ముద్దు' అన్నసామెత మన పూర్వీకులు చెప్పినదే కదా. మరి మనకవసరము లేదా.
ఏ రాజగోపాలాచారి గారో, ఏ రాధాకృష్ణ గారో ,ఏ ప్రకాశం పంతులుగారో ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడగల్గినా వారి బాసనే తప్ప యాసను సొంతము చేసుకోలేదు. జనవరి 1 వేడుకలు జరుపుకొన్న దాఖలాలను నేను గుర్తెరుగను. ఇక చివరిగా మన సాంప్రదాయమిది అని మన తరువాతి తరానికి చెప్పక లేక పొతే వారి చేతిలోకో వారి పిల్లల చేతి లోకో వారి పిల్లల చేతి లోకో మతగ్రంధములు మనమొద్దన్నా వచ్చేస్తాయి. అయినా వద్దనుట కప్పుడు మన ముండముగా!
ఒకవేళ అప్పుడు మన అను ఈ సంస్కృతీ అంతా పోయి వసుధైవ కుటుంబకము లో కలిసి పోయి మత గ్రంధాలను చేతిలో పట్టుకోవలసి వస్తుందేమో!
ఆర్ష ధర్మముపై అభిమానము గలిగినవారు మనసారా చదివి మన సంస్కృతిని పునరుద్ధరించండి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML