గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 10 January 2015

విడిపోయిన భార్యా భర్తలను కలిపిన భక్తాంజనేయుడు. జనవరి 15, 2009హనుమద్ లీలామృత గాధలు - 07 .

ఈమధ్య నా దగ్గరకొక వ్యక్తి వస్తున్నాడు. విలేఖరి గాపనిచేస్తున్నాడు దినపత్రికలో .మంచివాడు. ఇతను తన బాధను చెప్పుకొస్తున్నాడు. తన భార్యకు ఉపాధ్యాయురాలిగా జాబ్ వచ్చినది. తెలాంగాణ ప్రాంతం లో నుండి కశ్టపడి వినుకొండకు తీసుకొచ్చాడు.ఆ అమ్మాయి వాళ్ళు కన్వర్టెడ్ క్రిష్టియన్స్ ,వాళ్ల ఆచారాలు వ్యవహారాలు వేరయినా ఇతను సర్దుకుని పోతుండేవాడు. ఇక అమ్మాయి వాళ్ల అమ్మగారికి నాన్నగారికి ఇద్దరూ ఆడపిల్లలవటముతో ఈఅమ్మాయి ఉద్యోగస్తురాలు కూడా అవటముతో.అమ్మాయి తమతోనే వుండాలని అమ్మాయిని తమతోనే వుంచారు. ఇతనికి జాతకప్రభావమో,ఏమోగాని అతను చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యి ఏపనిలోనూస్థిరపడ లేక పోయాడు. మానసికంగా కొద్దిగా డిసప్పాయంట్ అయ్యాడు.కొద్దిగా కలతలు.అమ్మాయి ఉద్యోగం తో నే వాల్ల అమ్మనాన్నల కుటుంబము కూడా గడపాలి. ఇద్దరికీ తగాదాలు .విడిపోయారు ఇద్దరు పిల్లలు తల్లి దగ్గరె వున్నారు. ఇతన్ని ఇంటికి రానీయరు. ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చాయి ఇంకా గొడవలెందుకు అని ఇతను సర్దుకుని కలవాలనుకుంటున్నా విడాకులిస్తాగాని నిన్ను రానివ్వనని ఆమే పట్టుదల. ఈమధ్య ఇతను నన్ను మాష్టర్ గారూ నాకుటుంబాన్ని నిలబెట్టమని ,మీచేతులతో ఎందరికో సహాయం చేస్తున్నారు, నావిషయం చూడమని బాధ పడుతున్నాడు. ఆమెగురించి కొందరు వుపాధ్యాయమిత్రులను,యూనియన్ నాయకులను విచారించాను ,వాళ్ళంతా ఆమె పెద్దగా తెలివిగలిది కాదండీ , అని తన గురించి వివరాలు చెప్పారు. ఆవిషయం అర్ధమవుతూనేవుంది ,లేకుంటే అమ్మనానలను తన బంధువులను పోషిస్తూ రేపు తన బిడ్దల భవిష్యత్తు ,తన భర్త గురించి ఆలోచించని ఆమె తెలివి తేటలు ఏపాటివో.ఒకసారి పూజచేపిద్దామని రమ్మని అడిగి చూడమన్నాను.పాపం అతను అడిగితే ఆ అమ్మాయి తిక్కలగా మాట్లాడుతున్నదే కాని తన కాపురం సరి చేసుకుందామని ప్రయత్నించేలా లేదు. తనకు భర్తను ,కాపురాన్ని సరిచేసుకోవాలనే భావన లేదు. మన సంస్కృతీ సాంప్రదాయాలను ఆమెకు అందించకుండా పెంచిన తల్లిదండ్రుల పెంపకం ఇలా వున్నది. విడాకులు,,,,విడాకులు ఏమిటీ సంస్కృతి .తీసుకుని ఏమి బావుకుంటారు.? సహనము ప్రేమతో కాపురాలను సరి చేసుకునే స్త్రీలను .ఆ మనస్తత్వం నుండి వేరు చేస్తున్నదెవరు? మగవాళ్లంతా మంచివాళ్లని ఆడవారి మీద తప్పులు మోపటము లేదు నేను. కాని భూదేవంత సహనంతో దారి తప్పిన భర్తలను కూడా పరివర్తనతో దారికి తెచ్చుకోగలైగిన ఈదేశ స్త్రీ మూర్తులు కూడా ఇలా ఎందుకవుతున్నారు? పుట్టిన బిడ్దల కు తగిలే మనోఘాతాలు భవిష్యత్తు లో వాళ్లనేమి చేస్తాయి> ఆలోచిస్తున్నారా? నాకు అయోమయం గావున్నది.ఏమి చేయాలో వాళ్లకు ఎలా చేతనయినంత సహాయం చేసి కాపురాలు ఎలా నిలబెట్తాలో తెలియక. మీలో ఈవిషయాల లో నిష్ణాతులైన మేధావులు వున్నారు.
ఈ సమస్యకు బలైన వాళ్ళు వుండవచ్చు. కొద్ది సేపు సమాన హక్కులు , చట్తాలు జోలికి వెళ్లకుండా ఈపరిణామాలకు అసలు కారణాలు విష్లేషించండి. మీ కుతోచిన పరిష్కారాలు చెప్పండి ,విడదీసే పాపం కాకుండా.ఇవన్నీ స్నేహితులుగా లోకం యొక్క భావాలు ఎలా వున్నాయో వారి ప్రవర్తన పట్ల వాళ్లకు చూపుతా.అదృష్టం బాగుండి ఈప్రయత్నం వల్లనైనా ఒకకుటుంబం విచ్చిన్నం కాకుండా కాపాడగలిగినా ధన్యులమే.[ వ్యక్తుల పేర్లు మార్చాను ]
నమ్మినవారిని కాపాడటమే దీక్షగా పెట్టుకున్న స్వామి మరొక అద్భుత లీల చూపాడు. ఆనాడు వేరైన సీతారాములను తిరిగి కలిపి వారి హృదయాలలో వేదనతొలగించి భక్తారాజు హనుమంతుడు , మరొకసారి తన మహిమచూపి భక్తరక్షణలో తన నిత్యసత్యమైన ఉనికిని చూపాడు నేడు. విషయాని కొస్తున్నాను.


ఈకాపురాలు కూలనున్నాయి,సలహా చెప్పమని మిమ్మల్ని కోరుతూ ఈనెల ఒకటవతేదీ ఒక పోష్ట్ వ్రాసాను.దీనికి స్పందించి తమ విలువైన సలహాలను కూడా బ్లాగర్లు పంపారు.

నేను వ్రాసిన మూడు కుటుంబాలలో మూడవ కుటుంబానికి చెందిన విచిత్రం ఇది. ఇందులో వున్న భార్యా భర్తలిరువురు విడిపోయి నాలుగు సంవత్సరాలయినది. ఎన్నిసార్లు ఇతను కలుపుకు పోదామన్నా ఆవిడ కలసిరాలేదు. కన్న బిడ్దలదగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలని ఎంత తపించినా సాధయం కాక,తన భార్యకు చేరువకాలేక సతమతమవుతున్న ఈతను ఈమధ్య నాదగ్గరకొచ్చి తన బాధను నాతో చెప్పుకున్నాడు.నెను మానవప్రయత్నాలనేకాదు దైవాన్ని విశ్వసించమని ,హనుమంతుని ఉపాసించమని సలహా చెప్పాను. అతను నిష్టగా చాలీసాపారాయణము, ప్రదక్షిణాలు చేస్తున్నాడీ మధ్య. అయితే మానవప్రయత్నము కూడా చేసి చూద్దామని నాప్రయత్నాలు చేసినా అవి ముందుకు సాగలేదు. అతను కూడా తనప్రయత్నాలు చేసినా ఆవిడనుండి తిరస్కారమే ఎదురైనది. ఈప్రయత్నాలగురించి నేను మొన్నరాసిన పోస్ట్ లో చెప్పాను. ఆమరుసటిరోజు అతను ఫోను చేసి లాభం లేదు మాష్టారూ! తాను అంకెకొచ్చేరకము కాదు.ఇక బిడ్డలకోసము నేను తపనబడి లాభము లేదు. విడాకులే కోరుతున్నది ఆవిడ అని బాధపడి, ఆవిడ ఇష్టం ప్రకారమే విడాకులకు సిద్దమవుతానని చెప్పాడు, నేను వారించి ఇంతకాలం ఓపిక పట్టావు,స్వామిని ఆశ్రయించి నిరాశ పడవద్దు.మిమ్మల్ని విడిపోనివ్వడాయన,నాకా నమ్మకం వున్నది.ఇంకొద్ది కాలం ఆగు.చాలీసా పారాయణం తీవ్రతరం చేయి అని నచ్చచెప్పాను.

ఈరోజు ఉదయాన ఆరుగంటలకే గుడిలో వున్నప్పుడు ఫోన్ వచ్చినది.కోటేస్వరరావునుంచి అని ఇంటిలోనివారు తెచ్చిఇచ్చారు ఫోన్. నేను ఏమిటి అనగానే అతను తలనెప్పి వదిలినది సార్ అన్నాడు. అయ్యో వీల్లేదో విడిపోయినట్లుందే అని నిరాశపడి ఏమైనది అని అడిగాను.స్వామి అనుగ్రహం సార్ మీకే ముందుగా చెబుతున్నాను.రాత్రి మా అత్తగారింటికి వెళ్ళి మాట్లాడాను
ఎప్పుడూ లేనిది కొందరు ఆ అమ్మాయి బంధువులు కూడా వచ్చి తనను మందలించారు నాతో కలిసి వుండటానికి నా భార్య ఒప్పుకున్నది. అని ఆనందంగా చెప్పాదు. హమ్మయ్య…స్వామీ నామాట నిలబెట్టావు….పొరపాటు..పొరపాటు..నీ భక్తజనరక్షదీక్షను నిరూపించుకున్నావని స్వామి వారికి కృతజ్ఞతలను తెలుపుకున్నాను. నన్ను ఈరోజు రమ్మన్నారు సార్ అత్తగారింటికి అన్నీ తీసుకుని అని చెబుతున్నాడు,నామనసుమాత్రం స్వామి వారి భావనతో ఆనందం నిండిపోతున్నది. ఈరోజు కనుమ పండుగ వద్దులే ..అదీగాక మాంసాహారం పెడతారు,నువ్వు చాలీసా పారాయణలో వున్నావు ,రేపు వెళ్లమని చెప్పాను.స్వామి పారాయణము మరింత శ్రద్దతో చేయమని సూచించాను.
ఇక్కడ మానవప్రయత్నాలన్నీ వృధాయైన సమయాన ఆప్రయత్నాలకు భగవంతుని అనుగ్రహాన్ని జోడించినప్పుడు ఎలాశుభాలనిస్తాయో దైవశక్తి మరొకసారి నిరూపించినది.అలా కాదు ఎప్పుడో నుంచి ప్రయత్నాలు ఇప్పటికి ఫలితాని కొచ్చాయని వాదించకండి.ఇప్పటిఫలితమే ఎప్పుడో ఎందుకు రాలేదు అని ఎదురు ప్రశ్నవేస్తే వాదించేవారి వద్ద సమాధానం ఉండదు.కాకుంటే వితండవాదం సాగుతుంది అదివృధా! నమ్మిన వారికి సొమ్ము.నమ్మకుంటే దుమ్ము,అని మహాత్ములు గొలగమూడి వెంకయ్యస్వామివారు బోధించినవిధంగా పెద్దలమాటనమ్ముదాము.భగవంతునిశరణాగతులమై ధర్మబద్ధ జీవితమ్ గడుపుదాము.

జయ సీతాశోకనివారకాయ ,భక్తరక్షాదీక్షాధారిణే , హనుమతే నమ:

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML