
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Monday, 12 January 2015
రామాయణములో స్వల్పసమయమైనా చేసినది మాత్రం కొంపలు కూల్చే పెద్దపని. వాళ్ళు .1. మంధర, 2. శూర్పణఖ.
రామాయణములో స్వల్పసమయమైనా చేసినది మాత్రం కొంపలు కూల్చే పెద్దపని. వాళ్ళు .1. మంధర, 2. శూర్పణఖ.
మంధర దాసి. తన పని తన యజమానైన కైకేయి క్షేమం చూడటము. పుట్టినింటినుంచివచ్చినది కనుక అమెపైన కైకేయికి చాలా ప్రేమ .కనుకనే ఇతరులకు ఇవ్వనంత ప్రాధాన్యతనిచ్చేది. ఆమె సలహాలను తీసుకునేది. కానీ అసూయా గ్రస్తమయిన హృదయాలు గలవాళ్ళు తాము మనశ్శాంతిగా వుండలేరు. ఇతరులు ప్రశాఁతముగా వుంటే తట్టుకోలేరు. వాళ్ల దుర్బుద్దిని ఇతరులకు కూడా అంటించి కొంపలు కూలి వాళ్ళేడుస్తుంటే ఆనందిస్తారు. వేరుపురుగు చేరి వృక్షంబుచెరచు అన్నట్లు… మంధర తానాశ్రయించిన కైకేయికి రాముని మీదున్న ప్రేమను విరచి ,ఆమె మనసులో స్వార్ధాన్ని రేకెత్తించింది. యుక్తాయుక్తాలు మరచిపోయేంతటి స్తాయిలో . దాని పరిణామముగా కైకేయి తన సౌభాగ్యాన్ని కోల్పోయి, అందరిచేత చీత్కరించబడి, చరిత్రలో మాయన మచ్చని తెచ్చుకున్నది. చివరకు కొడుకుచేతకూడా ఛీ కొట్టించుకోవలసి వచ్చినది. మంధర అసూయ రాముని అడవులకు పంపి రామాయణానికి ఒక కారణమయినది. ఇటువంటి స్త్రీలు మనచుట్టూవుంటారు. అత్తా కోడల్లు అన్యోన్యంగా వున్నా తట్టుకోలేరు, వాళ్ళుచాలు విబేధాలు సృష్టించి కాపురాలలో చిచ్చుపెట్టడానికి
ఇక రెండవ పాత్ర శూర్పణఖ. తాను విపరీత కామాంధురాలు. తనకు నచ్చినది తనకు దక్కాలనుకునే మనస్తత్వం. అందుకోసం ధర్మాధర్మాలను లెక్కచేయదు. రాముడు భార్యతోవున్నవాడు,అయినా తనకు దక్కాలి. రాముడు లౌక్యంగా లక్ష్మణుని చూపిస్తే ,అప్పుడన్నా గ్రహించక అతడయినా అందంగా వున్నాడుకనుక తన కామార్తిని తీర్చుకోవాలని అతనిని చేరటానికైనా సిద్ధపడుతుంది. వారిచేత అవమానించబడి. ప్రతీకారేచ్చతో తన అన్నవద్దకు పోయి పగరగిలిస్తుంది అదీ ఎలా? నిజాన్ని కప్పిపెట్టి. అన్నా! రాముని భార్య చలా అందగత్తె .దానిని నీకోసం తీసుకు రావాలని ప్రయత్నిస్తే నన్నిలా అవమానించారని అబద్దంతో అతన్ని రెచ్చగొడుతుంది. మనచుట్టూవున్న వాళ్ల్లో ఇటువంటివాళ్ళనుంచి జాగ్రత్తగా వుండకపోతే సర్వనాశనానికి సిద్దపడ్డట్ళే . తనసుఖంకోసం ,అసూయా గ్రస్తమయిన మనసుతో ఇటువంటివాళ్ళు ఎన్ని కాపురాలను కూలుస్తున్నారో ప్రతివారికి ఉదాహరణలు కనిపిస్తూనేవుంటాయి గమనిస్తే. ఇటువంటివారు దేనికైనా తెగిస్తారు.
ఈ ఇద్దరి పాత్రలు చాలా చిన్నవయినా వారి మనస్తత్వాలు ఎంతప్రమాదకరమో తెలుసుకోక కైకేయి రావణాసురులవలె, చెప్పుడుమాటలు వినే అలవాటువుంటే రామాయణ యుద్ధాలు మనయిల్లలోకూడా ప్రారంభమవుతాయి తస్మాత్ జాగ్రత్… అంటున్నారు వాల్మీకి మహర్షి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment