
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Tuesday, 30 December 2014
Lessons learned from life:: Inspirational life stories:: Read completely::
Lessons learned from life:: Inspirational life stories:: Read completely::
నిజమైన జీవితం విలువ తెలియాలంటే దానిని కోల్పోయినవారినే అడగాలి... వినటానికి బాధగా ఉన్నా మన కథ మరికొన్ని రోజుల్లో జీవితం ముగుస్తుందని తెలిసిన నలుగురి ఇంటర్వ్యూ... తన వృత్తిలోని అంకితభావాన్నే అర్హతగా మార్చుకున్న ఒక నర్సు ఎదుర్కొన్న వివిధ వ్యక్తుల జీవన సారం మన కథ.. ఆంగ్లమూలంలో ఉన్న కథకు స్వేచ్ఛానువాదం !!
"అది అత్యవసర సేవా విభాగంలో క్రొత్తగా ఉద్యోగాన్ని ప్రారంభిస్తున్న రోజులు..
అత్యవసర సేవా విభాగమంటే ఆషామాషీ ఉద్యోగం కాదు.. దానికి ఎంతో ఓర్పు, ప్రేమ అంకితభావం కావాలి.. అందుకే ఈ విభాగంలో అడుగు పెట్టాలంటే ఎంతో అర్హత అవసరం.. నర్సు రోగుల పట్ల చూపిస్తున్న ప్రేమ, అంకితభావం ఆ సేవావిభాగంలో పనిచేసే అర్హతను సంపాదించిపెట్టాయి.. అక్కడ మొత్తం పది మంది రోగులు ఉన్నారు.. అందరూ జీవితంలో చివరిదశలో ఉన్నవారే.. ప్రతి ఒక్కరూ కోటీశ్వరులే(ఈ కథ లో ధనం ముఖ్యం కాదు.. అది చివరలో మీకర్థమవుతుంది)... అందుకే అక్కడ ఉద్యోగం కత్తి మీద సాము మరి... ఇవేవీ తన మదిలోకి రానీయకుండా జాగ్రత్తగా సేవ చేయడం ప్రారంభించిన ఆమెకు వారి నమ్మకాన్ని చూరగొనుటకు ఎన్నో రోజు లు పట్టలేదు.... వారికి గురికుదిరింది... వారికి తెలుసు తాము చివరి క్షణాల్లో ఉన్నామని... వారికి చేసిన సేవల ఫలితమో లేక తన మీద ఉన్న అభిమానమో... తమ చివరి క్షణాలలో తాము చేసిన తప్పులను నర్సుతో పంచుకోవడం మొదలెట్టారు... అవి కేవలం తప్పులు కావు.. వారి వారి అనుభవసారాలు...
మొదటి వ్యక్తి:
నేను అందరినీ సంతృప్తి పరచాలనే తాపత్రయంతో ఎవ్వరేమి చెప్పినా ఎదురు చెప్పలేక.. ఆ పని చేయలేక.. చాలా వత్తిడి కి లోనయ్యాను.. ఒకసారి ''నో ''అని చెపితే సరి పోయే దానికి చాలా బాధలు అనుభవించాను.. అందరు చెప్పినవి నో అనలేక.. పని చేయలేక... అందరి దగ్గర అసమర్థుడు అనే బిరుదును తీసుకుని... రోగగ్రస్థుడనయ్యాను” కాబట్టి నేను నేర్చుకున్న జీవిత సత్యం..... స్వీకరించవలసిన పనిని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని నిర్థారించుకోవాలి...
రెండవ వ్యక్తి:
“ప్రతి మనిషికి కొన్ని స్వప్నాలుంటాయి.. కొన్ని లక్ష్యాలుంటాయి.. ఏది సాధ్యం ఏది అసాధ్యమనేది మనకు తెలిసుండాలి... జీవితంలో ఎప్పటికప్పుడు మన లక్ష్యసాధనలో ఎక్కడున్నాం అనేది తెలుసుకుంటూనే జీవితాన్ని అనుభవించాలి..కానీ నేను సాధ్యంకాని లక్ష్యాలకై పోరాడి పోరాడి మానసికంగా చాలా ఒత్తిడులకు లోనై ఈ వ్యాధిని తెచ్చుకున్నాను" అందుకే జీవితంలోని లక్ష్యాలను చాలా జాగ్రత్త ఎంపిక చేసుకోవాలి...
మూడవ వ్యక్తి:
నా జీవితం ఒక ట్రేడ్ మిల్ పై పరుగులాగానే సాగింది... మనం ట్రేడ్ మిల్ పై పరిగెత్తే టపుడు ఆయాసం, వగడ్పు వస్తాయి కానీ ఒక్క అడుగు కూడా ముందుకువేయలేం.. ఇలాగే నా పురోభివృద్ధి లేదు కానీ ఎండమావులకై పరుగులో తన స్నేహితులను.. బంధువులను ఎవరినీ తోడుగా నిలుపుకోలేకపోయాను... .. ఇప్పుడు తుది దశలో ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుంటే ఏం కోల్పోయానో తెలిసింది.. కానీ చేయాల్సింది ఏమీ లేకపోయింది..."
నాలుగవవ్యక్తి:
తన జీవితమంతా ధనార్జనే లక్ష్యంగా సాగింది... తన భార్య, పిల్లలు ఇవేవీ పట్టించుకోలేదు.. తన యవ్వనమంతా ధారపోసాడు.. తన పిల్లల బాల్యాన్ని, వారి ఆటపాటలను, ముద్దుమురిపాలను అన్నింటినీ కోల్పోయాడు.. తన ఇష్టసఖి సాంగత్యానికి దూరమయ్యాడు... ఇంతా చేసి తాను ఎవరి కోసమైతే సంపాదిస్తాడో వారే తనను ఏవగించుకొనేసరికి తన మనస్సు మొద్దు బారిపోయి తట్టుకోలేక రోగగ్రస్థుడయ్యాడు..
వారు తెలిపిన జీవిత సత్యాలు:::
1. జీవితం అంటే ట్రేడ్ మిల్ పై పరుగు కాదు...
2.మనకు ఇష్టం లేని దానిగురించి ఎదుటివారికి జాగ్రత్తగా వివరించాలి కానీ దాని కోసం ఎక్కువగా బాధ పడకూడదు...
3. సంపాదనే జీవితం కాదు... విలువలు ప్రధానం...
4. జీవితంలో లక్ష్యాలు ఉండాలి.. కానీ అందుకోలేని లక్ష్యాల కోసం జీవితాన్ని పణంగా పెట్టరాదు...
5. జీవితంలో ఆనందంగా ఉండాలనుకోవడం కూడా ఒక నిర్ణయమే...
6. మన లక్ష్యాలు, ఆశయాలు, ఎంపికలు దేనినైతే ప్రేరేపిస్తాయో అలాగే మన జీవితం గడుపుతాం.. ఇవేవీ మనలో ని ఆనందాన్ని త్రుంచకుండా.. బంధాలను, అనుబంధాలను పెంచేవిధంగా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తే.. సుఖప్రదమైన.. ఆనందమైన జీవితాన్ని మనం పొందవచ్చు...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment