గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 19 December 2014

మనం మన పుస్తకాలలో 'వృక్ష శాస్త్ర(Botany) పితామహునిగా గ్రీకు దేశ తత్వవేత్త,వృక్ష శాస్త్రవేత్త అయిన 'థియోఫ్రాస్టస్' అని చదువుకున్నాము. కానీ 'మహా భారతం లోని శాంతి పర్వం 184 వ అధ్యాయం' లో ఉన్న భ్రుగు మహర్షి,భరద్వాజ మహర్షి మధ్య మొక్కలలో ప్రాణముందన్న విషయముపై జరిగిన సంవాదము మాత్రం మన సిలబస్ లలో ఉండదు.మనం మన పుస్తకాలలో 'వృక్ష శాస్త్ర(Botany) పితామహునిగా గ్రీకు దేశ తత్వవేత్త,వృక్ష శాస్త్రవేత్త అయిన 'థియోఫ్రాస్టస్' అని చదువుకున్నాము.

కానీ 'మహా భారతం లోని శాంతి పర్వం 184 వ అధ్యాయం' లో ఉన్న భ్రుగు మహర్షి,భరద్వాజ మహర్షి మధ్య మొక్కలలో ప్రాణముందన్న విషయముపై జరిగిన సంవాదము మాత్రం మన సిలబస్ లలో ఉండదు.ఇంకా ఒక ఆనందించదగ్గ విషయమేమిటంటే 'ఆధునిక కాలములో మొక్కలలో ప్రాణముందని నిరూపించిన "జగదీశ్ చంద్రబోసు' కు మాత్రం 'నోబెల్' బహుమతినివ్వటం,ఇది పురస్కరించుకొని మన సిలబస్ లలో చేర్చటo.

చాలామంది మొక్కలు నిర్జీవ పదార్ధాలని,అవి మనుష్యుల లాగ జ్ఞానముతో కూడిన కర్మలు చేయలేవని అనుకుంటూ ఉంటారు.మరియు వేప,రావి మొ.లగు చెట్లకు కల్యాణం చేయటం చూసి ఇదెక్కడి మూడ నమ్మకం అనుకుంటూ ఉంటారు.ఇదిగో మహాభారతములో ఉన్న ఈ సంభాషణ చూసి మీరే నిర్ణయించండి.


మహా భారతం లోని శాంతి పర్వం 184 వ అధ్యాయం' లో భ్రుగు,భరద్వాజ మహర్షుల సంవాదముంది.ఇందులో "భరద్వాజుడిలా అడుగుతాడు.:

"వృక్షములు చూడవు,వినవు,రస గంథాలను అనుభవించవు,స్పర్శ లేదు కదా అయినా అవి కూడా "పాంచభౌతిక చేతన పదార్తములే " అని ఎందుకంటారో సెలవివ్వుడి అనగా..

భ్రుగు మహర్షి ఇలా సమాధానమిచ్చాడు.

"ఓ భరద్వాజ ! వృక్షములెంత గట్టిగ కనిపించినను వానిలోనూ ఆకాశమున్నది.దీనివలననే నిత్యం పుష్ప ఫలముల ఉత్పత్తి సాధ్యమగుచున్నది. - 10

వృక్షములలో వేడి ఉంటుంది.దాని వలననే దాని ఆకులు,బెరళ్ళు,పూలు,కాయలు,పళ్ళు వాడిపోతూ ఉంటాయి.రాలిపోతూ ఉంటాయి.దీనివలన మొక్కలలో స్పర్శ జ్ఞానముందని తెలుస్తున్నది. - 11

వాయువు,అగ్ని,విద్యుత్ యొక్క ఫెళ ఫెళ శబ్దాలకు చెట్లనుండి ఆకులు,పూలు,పళ్ళు రాలి పడుతాయి.
దీనివలన చెట్లకు వినికిడి జ్ఞానం ఉన్నట్లు ఋజువగుచున్నది.- 12

తీగ చెట్టును నలువైపులా చుట్టుకొని దాని శీర్షము పైకి ప్రాకిపోతుంది.చూడకుండానే ఎవరికైనా తాను ముందుకెళ్ళే మార్గం ఎలా తెలుస్తుంది? దీనివలన మొక్కలకు చూపుడు జ్ఞానం కూడా ఉందని తెలియుచున్నది. -13

సువాసన - దుర్వాసనల వలన ,అట్లే అనేక రకాల పొగ వాసనల వలన,అగరు వత్తుల వాసన వలన వృక్షములు రోగరహితములగుచున్నవి మరియు పుష్పించుచున్నవి.దీనివలన వృక్షాలు వాసన చూస్తాయని కూడా తెలియుచున్నది. - 14

వృక్షములు తమ వేళ్ళ తో నీరు త్రాగుతాయి.చెట్టుకు ఏదేని రోగము వస్తే నీళ్ళలో మందు కలిపి చికిత్స చేసే పద్ధతి ఉంది.దీనివలన వృక్షాలకు రుచికి సంభందించిన జ్ఞానం ఉందని తెలియుచున్నది.-15

మనం కమలపు తూడు (కాండం) నోటిలో పెట్టుకొని నీటిని పీల్చుకోగలుగుతాము.అదే విధముగా వృక్షములు గాలి ఒత్తిడి వలన వృక్షములు వేళ్ళ ద్వారా నీటిని పైకి పీల్చుకుంటున్నాయి. -16

వృక్షము తెగిన చోట క్రొత్త పిలక పుడుతుంది.అవి సుఖ దుఃఖాలు అనుభవిస్తాయి కనుక వృక్షములలో ప్రాణమున్నది.అవి అచేతనాలు కావు.- 17

వృక్షములు వేళ్ళ ద్వారా పీల్చిన నీటిని చెట్టులోని వాయువు,అగ్ని ఉడికిస్తాయి.ఆహారం పరిపక్వమైనప్పుడు వృక్షము నిగనిగలాడుతూ ఉంటుంది. -18

ఇలా భ్రుగు మహర్షి అనేక ఋజువులు చూపిస్తూ నిజమైన 'వృక్ష పితామహుడు' అని అనిపించుకున్నారు

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML