ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Thursday, 11 December 2014

జనమేజయుని సర్పయాగంజనమేజయుని సర్పయాగం

పరీక్షిత్తు మహారాజు గొప్ప ధర్మాత్ముడు, చక్కటి పరిపాలకుడుగా ఉండెను. వేటయందు మిక్కుటమైన ఆసక్తి కలిగియుండెను. ఒకరోజు వేట నిమిత్తము అడవుల్లోకి వెళ్లిన పరీక్షిత్తు ఒక జింకను వేటాడెను. ఆ జింక పరీక్షిత్తుకు దొరకకుండా తప్పించుకు పోయెను. వేటాడి, వేటాడి అలసి, సొలసి పోయిన పరీక్షిత్తుకు మౌనవ్రతంలో ఉన్న రుషి తారసపడెను. ఆ రుషిని ప్రశ్నించగా అతడేమి జవాబు చెప్పలేదు.దీంతో ఆగ్రహించిన రాజు అచ్చట చచ్చిపడి వున్న ఒక పామును ఆ రుషి భుజంపై వేసి వెడలిపోయెను.

ఈ మౌని రుషి కుమారుడైన శృంగి విషయం తెలుసు కొని అత్యంత కోపోద్రేకముతో పరీక్షిత్తు రాజును ఇలా శపించెను. ఏడు రోజులలోగా తక్షకునిచే కాటువేయబడి, రాజు చనిపోవునుఅని. సమాచారం తెలుసుకున్న పరీక్షిత్తు తన రక్షణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని కశ్యపున్ని కూడా పిలువనంపెను.


ఏడవ రోజు తక్షకుడు బయలుదేరి మార్గమధ్యములో వడివడిగా వెళ్లుచున్న కశ్యపున్ని చూసి, బ్రహ్మణోత్తమా! ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగెను. తక్షకునిచే కాటు వేయబడబోవుచున్న పరీక్షిత్తు రాజ ప్రాసాదమునకు వెళ్ళుచున్నాను అనెను. నేనే తక్షకున్ని, నా వేటు నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు, చూడుము అని ఒక మహా వృక్షమును కాటు వేయగా అది భస్మీపటలమయ్యెను.

వెంటనే కశ్యపుడు తన విద్యాబలముచే ఆ వృక్షమును ఎప్పటి వలె నవనవోన్మేషముగా చేసెను. ఆశ్చర్యపోయిన తక్షకుడు ఆ కశ్యపున్ని ప్రలోభ పెట్టసాగెను. నేను ఎలాగు ధనమును ఆశించి రాజు వద్దకు వెళ్లుచున్నాను. ఆ ధనము నీవిస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు అని కావలసిన ధనము తక్షకుని నుంచి తీసికొని కశ్యపుడు వెళ్లిపోయెను.

ఈ విషయమంతా సమగ్రంగా విన్న జనమేజయ మహారాజు ఇదంతా వాస్తవమేనా! దీని మూలమేమిటని ప్రశ్నించెను? దానికి సమాధానంగా మంత్రులు ఇలా చెప్పిరి. మహారాజా! తక్షకుడు చెట్టును భస్మీపటలము చేసినప్పుడు ఆ చెట్టు గుబురులో ఒక మనిషి ఉండెను. ఆ పిదప కశ్యపుడు చెట్టుకు పూర్వవైభవమును తీసుకురాగా, ఆ మనిషి కూడా బతికెను. ఆ మనిషి నుంచే ఈ సమాచారమంతయును సేకరించితిమి అని సెలవిచ్చిరి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML