విశిష్టమైనదే మానవ జన్మ
మానవ జన్మ మహోత్కృష్టమైంది. భగవంతుని లీలామయ సృష్టికి మానవుడు వజ్రకిరీటం వంటివాడు. శ్రీశంకరాచార్యుల వివేక చూడామణిలో భగవంతుని కృప లేనిదే మానవ జన్మ, మోక్షం కొరకు తపన, మహాత్ముల సంపర్కం మానవునికి సంక్రమించవని చెప్పారు భగవద్గీతలో
''ఈశ్వర స్సర్వ భూతానాం హృద్దేశేర్జున! తిష్ఠతి''
అని చెప్పబడింది. అనగా ప్రతిజీవి హృదయంలో భగవంతుడున్నాడు. స్వామివివేకానంద మానవులను భూలోక దేవతలుగా వర్ణించారు. తనలోని దైవాంశను గుర్తించి, భక్తి ప్రేమలలో మానవుడు ఆ వెలుగును, అఖండ జ్యోతిగా ప్రజ్వలింప చేయవలెను.
''దేహో దేవాలయ: ప్రోక్త: సజీవ: కేవల: శివ:''
భగవంతుని తనలో దాచుకొనిన మానవ శరీరం దేవాలయంలో సమానం. ఈ ఆలయంలో జ్ఞాన జ్యోతిని వెలిగించి మానవుడు తరించాలి.
''మానవ శరీరం పంచభౌతిక యంత్రం. దూరదేశంలోని శద్ధాలన్నీ రేడియో ద్వారా బంధించి ఏ విధంగా వినగలమో అదే విధంగా ఈ శరీరం ఉపయోగించి సర్వేశ్వరుని వశపరచు కొనవచ్చు. ఈ మానవ శరీరం ఒక అద్భుత కల్పన. కేవలం మాసం, ఎముకలు, రక్తంతో తయారైనట్లు కనిపించినా ఇందు ఒక విచిత్రమైన పరికరం అమర్చబడింది. దానిని తగు విధంగా ఉపయోగించి భగవత్ సందర్శనం పొందవచ్చును. ఈ శరీరం భుజించుటకు, నిద్రించుట, సంతాన ప్రాప్తి కొరకు మాత్రమే ఉపయోగించరాదు.''
మనమందరం దేవుని వారసులు పనికిమాలిన క్రిములను కాము. ఈ విషయాన్ని మనస్సున గట్టిగా ముద్రించుకోవాలి. మానవునికి అసాధ్యమైన దేదీ లేదు. శ్రీరామకృష్ణ పరమ హంస ఈ క్రింది విధంగా బోధించారు.
భగవంతుని సాధించుటే మానవ జన్మ పరమార్థం. మానవ జన్మ అనే కానుక ధనార్జన కొరకు కాదు, భగవంతుని సేవ కొరకు ప్రసాదింపబడింది.
ఈ రెండు సూత్రాల ప్రాతిపదికపై జీవిస్తూ మోక్షమార్గంలో ధైర్యంతో పయనించి కార్యసాధకుడవు కావాలి.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment