గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 8 December 2014

నడుం లోతు నీటి లో శివ లింగం= వింత ఆలయాలువింత ఆలయాలు -విచిత్ర విశేషాలు


నడుం లోతు నీటి లో శివ లింగం


నల్గొండ జిల్లాలో నల్గొండకు అతి సమీపంలో "పానుగల్లు "గ్రామం ఉంది .అక్కడున్న ఛాయాసోమేశ్వర ఆలయం ప్రసిద్ధమైనది .ఆలయం చుట్టూ ఎనిమిది వైపులా చిన్నమండపాలుండటం ప్రత్యేకత .వీటి మధ్యలో మూడు గర్భగుడులు ఉన్నదేవాలయం ఉండటం విశేషం .దీన్నే"త్రికూటాలయం "అంటారు .గర్భాలయంలో
నడుము లోతు జలంలో శివలింగం ఉండటం ప్రత్యేకత .ఈ జలం అన్నికాలాల్లో అదే లోతులో ఉండటం విచిత్రం .ఈ జలలింగం పైన అన్ని సమయాల్లో స్తంభాకారం లో నీడపడటం మరో వింత .సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీడ ఒకే రకంగా పడటం వింతల్లో వింత .ఇదే "ఛాయాసోమేశ్వరం "ఈ రహశ్యం ఇప్పటికీ
దుర్భేద్యంగానే ఉంది .ఇంకో వింత కూడా ఉందండోయ్ .సింహ ద్వారానికి ఎదురుగా,గర్భాలయం ద్వారంలో నిలబడితే ,మన నీడ ఒకటి మూడు చాయాల్లో, అయిదు చాయాల్లో ఎదుటి గోడ మీద పడుతుందట .ఈ కాంతి రహస్యం, తెలిసిన ఆ అజ్ఞాత శిల్పి చాతుర్యానికి మప్పిదాలు .అంతే కాదండోయ్ .ఈ ఊరి దగ్గరే "పచ్చల సోమేశ్వరాలయం "ఉందట .నల్లరాతి స్థంభనిర్మాణం అది .ఆ స్తంభాలపై మన ప్రతిబింబాన్ని చూసు కోవచ్చునట .అంటే అంత నున్నగా చెక్కారన్న మాట. అద్దం లాగా ఉంటుందన్నమాట .లింగంలో "ఒక పచ్చ "ను శిల్పి పోదిగాడట .పచ్చలహారం నిత్యం స్వామికి ధరింపజేయటం వల్ల పచ్చల సోమేశ్వరుడు అయ్యాడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML