కర్ణుడి మరణానికి అర్జునుడి విజయానికి ఒక్కే ఒక్క కారణం...
వీరత్వం లో కర్ణుడు అర్జునుడు సమానత్వం
కృష్ణుడికి కర్ణుడు అర్జునుడు సమానమే ఇద్దరు కుంతి పుత్రులే
మరి కురు క్షేత్రం లో అర్జునుడు విజం పొందాడు దీనికి కారణం "మార్గం"...!
మనిషి ఎంచుకొని నడిచే మార్గం... కర్ణుడు అధర్మాన్ని ఎంచుకున్నాడు
అటు వైపు నిలబడి కురు క్షేత్రం లో మరణం పొందాడు
అర్జునుడు ముళ్ళలో పాదాలు మోపిన సమాజానికి విరుద్ధ జీవితాన్ని దైవం తనకిచ్చిన,,.. తల్లిని సోదరులని రాజ్య ప్రజలని దైవ సమానముగా భావించాడు. తన వీరత్వాన్ని మంచి వైపు నడిపించి సంప్రదాయమైన శాంతి ధర్మాన్ని స్థాపించాడు...! దేహం రథం అయితే దానికి సారధి మనస్సు.... మనస్సుని మంచి వైపు నడవాలంటే ధర్మాన్ని అనుసరించాలి...అప్పుడే శాంతి సంపద విజయం మన సొంతం అవుతాయి. అలాంటి ధర్మ మార్గాన్ని ఎన్నుకున్నాడు కాబట్టే అర్జునుడి రథానికి సారధిగా సాక్షాత్ శ్రీమాన్ నారాయణుడు మారాడు. కర్ణుడు అధర్మం వైపు సాగాడు అందుకే కురు క్షేత్రంలో తన సారధిగా తన అంతరాత్మే కూర్చుంది... తన జీవితాన్ని తన ముందు నిలిపి నిస్సహాయుడ్ని చేసింది...చివరికి ధర్మం చేతిలో బలి చేసింది. నిచాతి నీచమైన హేయమైన మార్గం లో నడిచే వారికి వారి యొక్క అంతరాత్మే వాళ్ళకి శిక్ష వేస్తుంది... ప్రతి మనిషి అంతరాత్మ భగవంతుడే.... ఓం నమో భగవతే వాసుదేవాయ.
రచన : శ్రీ గంగ చౌదరి

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment