గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 December 2014

భగవద్గీత ప్రారంభం ధర్మ అనే మాటతో మొదలయింది. చివరిదేమిటి?

భగవద్గీత ప్రారంభం ధర్మ అనే మాటతో మొదలయింది. చివరిదేమిటి? కృష్ణ పరమాత్మ చెప్పిన 'సర్వధర్మాన్ పరిత్యజ్య' అన్న చివరిది కాదు. ధృతరాష్ట్రుడడిగితే సంజయుడు చెప్పినది కనుక, సంజయుడు చెప్పిన చివరిమాటే, గీతకి చివరిమాట మనకి. అది ఏమిటంటే, యత్ర యోగీశ్వరఃకృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః! తత్ర శ్రీర్విజయో భూతిః ధృవా నీతిర్మతిర్మమ!! ఇక్కడ ధర్మం తీసుకోండి. చివరిది మమ తీసుకోండి. ఈ రెండూ తీసుకుంటే ఏమిటొచ్చింది? ధర్మం, మమ - అంటే మమ ధర్మ - అంటే స్వధర్మం అని అర్థం. స్వధర్మం అంటే ణా ధర్మం. ధర్మాన్ని ఆచరించు. అదే గీతయొక్క ప్రధానమైన సూత్రం. ఈ స్వధర్మాచరణ చేయడం ఎలాగ? అది చెప్పడమే మిగిలిన లోపలి విషయాలు. చెప్పటం తేలికే. స్వధర్మాన్ని చెయ్యి అని, కాని ఆచరించడం అంత తేలికయిన విషయం కాదు కదా! స్వధర్మాచారణకి ఎన్ని విఘాతాలొస్తాయి? ప్రధమ విఘాతం ఎక్కడ్నుంచి వస్తుంది? మన నుంచే మనలో మోహమనే ఒక దుర్లక్షణముంది. అజ్ఞాన జనితమైనది. అజ్ఞాన జనితమైన మోహం చేతే స్వధర్మం కూడా అర్థం కాని విషయమేర్పడుతుంది. స్వధర్మం ఆచరిస్తున్నప్పుడే ఇది ఏది ధర్మమో, ఏది అధర్మమో అర్థం కాని సమూఢ తేజస్సు అని అర్జునుడు పేర్కొన్నాడే అది వస్తుంది. అందుకు స్వధర్మం అనే మాటని ధర్మ, మామ అను రెండు మాటలతో అనుసంధానించి చూస్తే, దాని ఆచరణలో వచ్చే అవరోధాల్ని ఏ తెలివితో ఎదుర్కోవాలో, ఆ తెలివి పేరే భగవద్గీత. అందుకు స్వధర్మాన్ని ఆచరించటానికి ప్రేరేపించే వాక్యములన్నీ దేనియందు చెప్పబడ్డాయో అవి ధర్మ, మమ అనే రెండు మాటల మధ్య బంధింపబడి మనకి ఇవ్వబడింది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML