గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 6 December 2014

లలిత అంటే లావణ్య స్వరూపిణి. సౌందర్య రూపిణి. సౌందర్యము అంటే ఆనందము

లలిత అంటే లావణ్య స్వరూపిణి. సౌందర్య రూపిణి. సౌందర్యము అంటే ఆనందము. అది స్వచ్ఛమైనది. సత్యమైనది. శివుడు అనేది ఒక రూపం కాదు తత్త్వం. ఆమె కూర్చున్న సింహాసనాన్ని శివ సింహాసనం అనవచ్చు. "శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయామ్" అన్నారు శంకర భగవత్పాదులు. ప్రపంచం చేసే సమయంలో పరమ శివుడు సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహ అను ఐదు కృత్యములు చేస్తాడు. సృష్టి సమయమున బ్రహ్మగాను, స్థితి చేసేటప్పుడు విష్ణువు గాను, సంహరించేటప్పుడు రుద్రుని గాను, తిరోధాన సమయంలో మహేశ్వరుని గాను, అనుగ్రహ(మోక్షం ఇచ్చే) సమయంలో సదాశివుని గాను చెప్పబడతాడు. బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర తత్త్వములు నాలుగు కోళ్ళు గాను, మధ్యలో బల్లగా ఉండేది సదాశివ రూపంలో అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఈశరుడు ఏశక్తితో ఈ ఐదు పనులు చేస్తున్నాడో ఆ శక్తి లలితాంబ. దీపాన్ని అధిష్టించి కాంతి ఉన్నట్లుగా ఈశ్వరుని అధిష్టించి శక్తి ఉన్నది. శివుని మీద కూర్చున్న శక్తిగా పిలవరు. శివుని యొక్క అవిభాజ్యమైన శక్తియే అమ్మవారు.
లలితాదేవి ఒకప్పుడు ఉద్భవించి ఒకప్పుడు అంతరించే మూర్తి కాదు. సృష్టి స్థితి లయలు చేస్తూ నిరంతరం విశ్వ నిర్వహణను ఆచరిస్తున్నటువంటి పరాశక్తి అమ్మవారు. కాకపోతే లోకరక్షణార్థం, భక్త రక్షణార్థం తాను ఒక దివ్య రూపం ధరించి ఆవిర్భవిస్తుంది. నిరాకారురాలైన తల్లి అనుగ్రహించడం కోసం ఒక ఆకారంలోకి వస్తుంది అదే లలితాదేవి. భండాసురుడు అందరినీ బాధిస్తుంటే అసుర సంహారం కోసం దేవతలందరూ పరమేశ్వరుని ప్రార్థిస్తే పరమశివుడు స్వయంగా పరశంభు అనే మహాయాగాన్ని ఆచరిస్తాడు. ఆ యాగాగ్ని నుంచి ఆవిర్భవించమని పరాశక్తిని ప్రార్థిస్తాడు. ఆ యాగాగ్నికి చిదగ్ని కుండము అని పేరు. దేవకార్యము కొరకు చిదగ్ని కుండ సంభూత అయిన లలితాదేవి ఆవిర్భవించింది.
లలిత - లోకాతీత లావణ్యాత్ లలితా తేన శోచ్యతే (మత్స్య పురాణం); లోకానికి అతీతమైన లావణ్యం కలది. లోకాలన్నింటికీ సౌందరాన్నిచ్చిన తల్లి లోకాలకు అతీతంగా కూడా ప్రకాశిస్తుంది.
యధార్థం చెప్పాలంటే లలితా సహస్రనామం గురుముఖతః ఉపదేశం పొంది మాత్రమే చదవాలి. లలితా సహస్రనామంలో నామాన్ని ఎక్కడా ఆపకుండా విరవకుండా చదవాలి. అలాకాకుండా ఇష్టం వచ్చినట్లు చదివితే అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతాము. లలితా సహస్రం గబగబా కూడా చదువకూడదు. "జపాపుష్ప నిభాకృతిః" మెల్లగా చేయాలి జపం. లలితా సహస్రనామం నిలబడి చదవడం నిషేధం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML