గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 19 December 2014

రుణత్రయమురుణత్రయము

పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి కుటుంబ పోషణకో, తన బాధ్యతలను సక్రమంగా నెర వేర్చుటకో అతడు రుణాలు (అప్పులు) చేయడం సహజం.ప్రతి వ్యక్తి మూడు రుణాలతోనే పుడతాడు అనేది సత్యమే, శాస్త్ర సమ్మతమే. అయినా లోకులందరికీ ఈ విషయంలో చాలా అవగాహన కలుగవలసియున్నది.దేవరుణం, పితృరుణం, రుషిరుణం అనేవి మూడు. ఈ మూడు రుణాలను ప్రతివ్యక్తి తన ఆయుర్దాయం ముగిసేలోపు తీర్చుకోవాలని, సంసారంపై వైరాగ్యం కలిగి సన్యాసాన్ని స్వీకరించాలన్నా మూడు రుణాలను తీర్చుకోవలసినదే.

రుణాని త్రీణ్యపాకృత్య మనో మోక్షే నివేశయేత్


అనపాకృత్య మోక్షంతు సేవమానో వ్రజత్యథః ॥

అని ధర్మశాన్త్రం పేర్కొంటున్నది.యజ్ఞయాగాదులను సక్రమంగా నిర్వహించడం వల్ల దేవరుణాన్ని మనిషి తీర్చుకోవడం సాధ్యమౌతుందని, అంతేగాక దేవతల అనుగ్రహంతో తనకు కావలసిన సంపదలను కూడా మనిషి సమకూర్చుకొనగలుగుతాడని, ఈ విధంగా దేవతలకు మానవులకు సమన్వయం అవసరము -

దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః

పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ॥

అని గీతాచార్యుడు భగవద్గీతలో ఉపదేశించెను.వంశపరంపరకు ఆటంకం లేకుండా సత్సంతానాన్ని కనడం ద్వారా, తల్లిదండ్రులు జీవించియున్నప్పుడు వారి మాటను ఆచరణలో పెట్టడం, వారు మరణించాక ప్రతి సంవత్సరం శ్రద్ధగా ఉత్తర క్రియలను నిర్వహించడం, గయలో శ్రాద్ధ కర్మను నిర్వహించడం ద్వారా పితృరుణాన్ని తీర్చుకొనవచ్చునని తెలిపారు.

సుదీర్ఘకాలం తపమాచరించి విశ్వ శ్రేయస్కరమైన విజ్ఞానాన్ని తాము సంపాదించి మనకు అందించినవారు మహర్షులు, మునులు. వారి వారసత్వంగా మనకు సంక్రమించిన వైదిక, పౌరాణిక విజ్ఞానాన్ని ఇతిహాస, ఆగమ, దర్శన, వాఙ్మయాన్ని అధ్యయనం చేయడం ద్వారా రుషి రుణం తీరుతుంది.మహర్షులందించిన ప్రాచీన విజ్ఞానాన్ని పూర్తిగా మనం అధ్యయనం చేయలేక పోయినా వారి వారి అభిమతానుసారం కొందరు కొందరు కొంతభాగాన్ని అధ్యయనం చేసినా రుషి రుణం తీరుతుంది. వాఙ్మయ సంపద సురక్షితమౌతుంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML