గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 12 December 2014

హనుమదుపాసన ఎప్పటినుంచో ఉన్నది. అనేక మంత్రమూర్తులు, హనుమన్మంత్రములు ఉన్నాయి. అవన్నీ రాశీభూతమై ఆ రుద్రతేజము లోకరక్షణ కోసం అవతరించింది.

హనుమదుపాసన ఎప్పటినుంచో ఉన్నది. అనేక మంత్రమూర్తులు, హనుమన్మంత్రములు ఉన్నాయి. అవన్నీ రాశీభూతమై ఆ రుద్రతేజము లోకరక్షణ కోసం అవతరించింది. అవతరించి తన పని చేసినప్పుడు మంత్రమూర్తుల శక్తులన్నీ తన లీలలలో చూపించాడు ఆంజనేయస్వామి వారు. అందుకే అటు తర్వాత ఈ మూర్తిగా కనిపించినది చిరంజీవిగా ఉండిపోయాడాయన. ఆ ఉండిపోవడం చేతనే ఎంతవరకూ రామకథ ఉంటుందో అంతవరకూ ఉంటాను అని నెపం పెట్టి భూమియందున్నాడు. దివ్య క్షేత్రములయందు రాజిల్లుతున్నాడు. ఇప్పటికీ యోగులకు దర్శనమిస్తూనే ఉన్నాడు స్వామి. అందులో ఏం సందేహం లేదు. ఎన్ని క్షేత్రాలలో స్వామి ఏ మూర్తులతో ఉంటాడో మనకేం తెలుసు? అంతేకాదు ఆ క్షేత్రమునందు స్థిరంగా ఉంటాడు కానీ "కలౌ ప్రత్యక్ష దైవః" అన్నారు ఇక్కడ స్వామివారిని. ప్రత్యక్షమే అనుగ్రహించగలిగిన దైవం ఆంజనేయస్వామి వారు. అనేక చోట్ల అనేక విధములుగా ఋజువు చేయబడినటువంటి అంశం ఇది. అంతేకాదు రామాయణం తరువాత కూడా హనుమదుపాసన ఎన్ని రకాలుగా ఉండేదో! ముఖ్యంగా భారత కాలంలో హనుమదుపాసన ఎంత విశేషంగా ఉన్నది? అరణ్యవాసం చేసేటప్పుడు సాక్షాత్తూ కిరాత రూపంతో వచ్చి శివుడు అర్జునుడిలో తన దివ్య శక్తిని ప్రవేశింపజేస్తాడు. హనుమంతుడు భీముడిని ఆలింగనం చేసుకొని తన దివ్య శక్తులను ప్రవేశింపజేస్తాడు. ఈ రెండూ కూడా రుద్రతేజస్సు పాండవ మధ్యములైన భీమార్జునులలో ప్రవేశించింది. ఇదీ తెలుసుకోవలసింది. అక్కడ భీముడిని అనుగ్రహించిన వైనం చాలా అద్భుతమైన విషయం. భీముడిముందు హనుమంతుడు ప్రకటించిన రూపం ఎలా ఉన్నది? మామూలుగా ఒక కోతిలాగా కనపడతాడు. ఆ తోకని భీముడు ఎత్తలేకపోతే నువ్వు ఎవరివయ్యా? ముఖ్యంగా ఈ పర్వత ప్రాంతం హిమాలయ పర్వతములు, అందులో బదరీ మొదలైన భూములన్నీ సిద్ధ భూములు. అనేకమంది మహాత్ములు ప్రచ్ఛన్న రూపాలతో తిరుగుతూ ఉంటారు. అలా ప్రచ్ఛన్న రూపంలో ఉన్న ఎవరో మహాత్ముడవు అయివుంటావు. నా అపచారాన్ని మన్నించి నీ స్వస్వరూపాన్ని చూపించు అనగానే హనుమంతుడు తన రూపాన్ని ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత ఆనందభరితుడైపోతాడు భీముడు. అప్పుడు ఒక కోరిక కోరతాడు. నాకు ఒక చిన్న ముచ్చట ఉందయ్యా. ఎప్పటినుంచో రామాయణం వినడం మాకు అలవాటు. అంతేకాదు మానసికంగా వేదన కలిగితే రామాయణమే పెద్ద మందు. ఇదొకటి తెలుసుకోండి. మానసిక వేదనకి మందేమిటయ్యా అంటే రామాయణం. అది వింటూ వుంటే వేదన మరచిపోవచ్చు అని కాదు. వేదన తీరిపోతుంది కూడా అంత శక్తి ఉన్నది. అందుకే సీతమ్మ అంత దుఃఖంలో ఉన్నప్పుడు దొరికిన మందు ఏమిటంటే హనుమంతుడు, అశోక వృక్షం మీదనుంచి వినిపించిన రామకథే. ఆ ఔషధమే ఆవిడని కాపాడింది. అది మేము ఎప్పుడూ వింటూ ఉంటాం. నిన్నటికి నిన్న అరణ్యవాసం చేస్తున్నప్పుడు మ్కార్కండేయ స్వామి వారు వచ్చి మళ్ళీ రామాయణం అంతా మాకు చెప్పారు. పైగా రామాయణం అన్నీ వింటున్నప్పుడు ప్రతి ఘట్టం మాకు బాగుంటుంది కానీ నాకు నీ కథ వచ్చినప్పుడు ఉత్సాహం ఎక్కువైపోతుంది. ఎందుకంటే నువ్వు వాయుపుత్రుడివి కదా! నాకు అన్న వరస అవుతావు. రెండు - బలం ఈయన బాగా భీమునికి. ఈయన బలదైవం. బలవంతుడైన నాకు బలవంతుడవైన నువ్వే పెద్ద హీరోవి. అందుకు ఆనాటి యుగాలనాటి హనుమంతుడు ఎప్పుడైనా కనపడితే బాగుండు అనుకున్నాను. నా భాగ్యం పండి ఇవాళ కనపడ్డావు నువ్వు. ఒక్క కోరిక నాకున్నదయ్యా స్వామీ! సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు నీ స్వరూపం ఎలా పెరిగింది అనేది మార్కండేయుడు వర్ణించి చూపిస్తూ ఉంటే నాకు చూడాలని కుతూహలం కలిగింది. అప్పడు ఎలా పెరిగావో ఇప్పుడు చూపిస్తావా? అని అడిగాడు. ఏనాడు? త్రేతాయుగం నాడు కదా! అసలు యుగాలంటే ఏమిటో తెలుసా? కృతయుగం అంటే, త్రేతాయుగం అంటే యుగాలంటే lecture ఇవ్వడం మొదలుపెట్టాడు ఆంజనేయ స్వామి. ఎందుకంటే భీముడు ఏమి అడిగాడో ఆ మాట మరిపించేద్దామని ఆయన ఉద్దేశం. అప్పుడు ఆరూపాన్ని చూపించడం ఇష్టం లేదు ఆంజనేయ స్వామి వారికి. అందుకే మాటలలో పెట్టేశాడు. ఆయన చెప్పిందంతా విన్నాడు. నువ్వు ఉపన్యాసం ఇస్తుంటే భలే ఉందయ్యా. వినాలనిపిస్తోంది. చాలా సంతోషం. కానీ ఆరూపం చూపిస్తావా? అన్నాడుట. వీడింకా అక్కడే నిలబడ్డాడే అనుకున్నాడుట ఆంజనేయ స్వామి. సరే అని ఒక్కసారి తన రూపాన్ని పెంచాడు. భీముడు వణికి పోయాడుట ఆరూపం చూసి, ఆ తేజస్సు చూసి, దుర్నిరీక్షమైన తేజస్సు చూసి మూర్చితుడైపోయాడు. కొంతసేపటికి హనుమదనుగ్రహం వల్ల తెప్పరిల్లి తేరుకుని లేచి నిలబడ్డాడు. హనుమంతుడు అప్పుడు మామూలు వాడు అయ్యాడుట. ఏమిటయ్యా నీరూపం. ఇంత అద్భుతం రూపం ధరించావా? అంటే నువ్వు చూసిన రూపానికి పదింతలు ఉంది అప్పుడు రూపం అన్నాడుట. అయితే చూపించవయ్యా అన్నప్పుడు చూపించడం నా అంతట నేను ప్రకటించడానికి చాలా భేదం ఉంది. అప్పుడు నా అంతట నేను ప్రకటించాను, ఇప్పుడు చూపించమంటే చూపించాను. అప్పుడు అవసరం ఉంది. ఇప్పుడు నీమీద దయతో చూపించాను. అవసరం ఉన్నప్పుడు చూపించిన దానికి ఒకసారి అభినయించు అన్నదానికీ రెండింటికీ తేడా లేదూ? ఇదే చూసి తట్టుకోలేక పోయావు పదింతలు చూస్తే ఉండగలవా? అన్నాడు. అందుకే భగవంతుడు ఉన్న రూపం చూపించడట, మనం ఎలా చూడగలమో అలా కనపడతాడట. అది ఇక్కడ తెలుసుకోవలసింది. మన కళ్ళు తట్టుకోవద్దూ. పైగా గొప్ప అభయమిచ్చాడు రుద్రతేజస్సు పాశుపతాస్త్రం మొదలైన రూపములతో నీ సోదరుడికి సంక్రమించింది. నా రూపంతో నీకు రుద్రతేజస్సు సంక్రమించింది. అందుకు నేను నిన్ను అనుగ్రహిస్తాను. మొత్తం పాండవుల విజయానికి హేతువైనటువంటి కృష్ణుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నేను ఉంటాను. కృష్ణుడు అర్జునుడి రథాన్ని స్వీకరిస్తాడు కనుక అర్జున రథంపై కపిధ్వజం మీద ఉంటాను అన్నాడు. అంటే కోతి జెండా ఒక గుర్తు కాదు. సాక్షాత్ హనుమత్తత్వం ఆవేశించింది. అందుకే భారత వర్ణన జరిగినప్పుడు ఎలా ఉంటుంది అంటే భీష్మ ద్రోణాదులందరూ ఉంటూ ఉంటే అర్జున రథం ముందుకు వస్తుందిట. వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ మహా తేజోమూర్తిగా గోచరిస్తూ ఉంటే అప్రయత్నంగా భీష్మాదులు చేతులు ముకుళించి నమస్కరిస్తారు. ఎవరికీ అంటే అటు కృష్ణునికీ, కపి ధ్వజంపై ఉన్న హనుమంతునికీ అని వర్ణిస్తారు. ఎలా కనపడుతోంది అంటే ధ్వజం రెపరెప లాడుతూ ఉంటే అనేక రుద్రశక్తులు దివ్యనాదములు చేస్తూ ఆ ధ్వజం చుట్టూ తిరుగుతూంటాయిట. ఆమధ్యలో ఆంజనేయస్వామి వారు మహా రుద్రతేజంగా గోచరిస్తారు. ఈ రహస్య వర్ణన మనకి మహాభారతంలో కనపడుతున్నది. అందుకే రామాయణ కాలం నాడే కాదు. భారత కాలం నాడు కూడా అధర్మ రక్షణకి పరమేశ్వర తేజం హనుమద్రూపాన్ని ధరించింది. తోలుతూ కృష్ణ పరమాత్మ, ధ్వజంపై హనుమ శివకేశవులు ఉభయులూ కలిసి పాండవ విజయానికి హేతువయ్యారు. ఇదీ తెలుసుకోవలసిన అంశమిది. ఈవిధంగా నరనారాయణ రథమున విజయ ధ్వజ తేజమై ప్రకాశించిన ఆంజనేయస్వామి అనుగ్రహం మళ్ళీ హనుమదారాధనే. ఇలా సర్వ యుగములయందు ఆరాధింపబడుతున్నటువంటి హనుమన్మూర్తి గురించి చెప్తూ చారో జుగ్ పరతాప్ తుమ్హారా హై పరసిద్ధి జగత్ ఉజియారా" నాలుగు యుగాలలోనూ నీ ప్రతాపం ఉందయ్యా అని తులసీ దాసు చెప్పడంలో విశేషమేమిటి? ఒక్క రామాయణ కాలం నాడే కాదు. సర్వయుగాలలో హనుమదారాధన ఉంది అని ప్రకటిస్తున్నాడు మన్మన్మంత్ర సిద్ధుడైన తులసీదాసు.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML