గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 5 December 2014

సప్త మోక్ష పట్టణాలలో కాంచీనగరం ఒకటి.

సప్త మోక్ష పట్టణాలలో కాంచీనగరం ఒకటి.
అయోధ్యామధురా మాయా కాశీ కాంచీ అవంతికా!
పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయికాః!!
అని మనం చెప్పుకుంటున్నాం. అయితే క్షేత్రములు కొన్ని, అరణ్యములు కొన్ని, తీర్థాలు కొన్ని ఉన్నాయి. నగర జీవితం ఉంటూనే మోక్షహేతుమైన పవిత్రమైన నగరం ఇది. ఇవి భారతీయ చరిత్రలో యుగములనుంచీ ఉన్నవి. ఇంకా చెప్పాలంటే తొలి యుగాలనుంచీ ఉన్న మహానగరములివి అయోధ్య మొదలుకొని అన్నీ కూడా. అందుకు మొట్టమొదట అ.యోధ్యతో మొదలుకొని అయోధ్యామధురా మాయా(హరిద్వార్) కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారవతీ(ద్వారకా నగరం) – ఏడు నగరములు. ఇందులో కాంచీ దక్షిణాపథంలో ఉన్నటువంటి ఏకైక మోక్ష నగరం. మోక్ష పట్టణం అని ఎందుకు అన్నారు అంటే శాస్త్రం చెప్పిన కొన్ని అల్ప సాధనములతోనే మోక్షఫలాన్ని ఇక్కడ సాధన వల్ల పొందగలం. అందుకు వీటికి మోక్ష పట్టణములు అని పేర్లు. ఈ క్షేత్రయాత్రలు మోక్షాన్ని నేరుగా ఇవ్వవు. చిత్తశుద్ధినిస్తాయి. కానీ ఇలాంటి మహా నగరములలో మనం చేసే కొద్దిపాటి సాధనలు కూడా అతి త్వరగా మనకి చిత్తశుద్ధినీ, బ్రహ్మజ్ఞానాన్ని, మోక్షాన్ని కలిగించగలవు. అందుకు ఆయా క్షేత్రములు సంచరించేటప్పుడు ఇది మహిమాన్వితమైన స్థలము అని మాత్రమే కాకుండా వాటిగురించి మరింత తెలుసుకొని గానీ మనం చేస్తే ఆ క్షేత్రములలో సంచరించవలసిన పద్ధతులు, చేయవలసిన సాధనలు కానీ చేసినట్లయితే అతి త్వరగా మనకు ఆ దివ్యానుభవం లభిస్తున్నది. అలాంటి జగదంబా సాన్నిధ్యం కలిగినటువంటి ఒక మహా పవిత్రమైన క్షేత్రం ఈ తల్లియొక్క క్షేత్రం. పైగా కామాక్షీ నామంతో ఉన్న ప్రధానమైన క్షేత్రం ఇది. యుగాలనుంచీ ఉన్న క్షేత్రం. ఈ కామాక్షీ దేవి యే లలితా మహాత్రిపుర సుందరి, ఈవిడే మహా కామేశ్వరి, శ్రీమత్రాజరాజేశ్వరీ పరదేవత అని చెప్పబడుతున్నది. మణిద్వీప వాసిని, శ్రీపుర నివాసిని, అయినటువంటి తల్లి ఈవిడ.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML