కుల విభాగం తప్పు
"చాతుర్వర్ణం మయా సృష్టం" (BG 4.13) అనే శ్లోకం భగవద్గీత నాలుగవ అధ్యాయము లో వున్నది చాలా మంది ఆ శ్లోకం తప్పుగా అర్ధం చేసుకుని, కులాల విభాగం పరమాత్మకు అంటగట్టుతున్నారు.
మన స్వామి మనల్ని ఎప్పుడు కులాలవారిగా విడదీయలేదు. చాలామంది ఈ శ్లోకానికి అర్ధం "బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య, శుద్ర," అనే విభాగాలుగా మనస్వామి చెసినట్లు వక్రభాష్యం చెప్పుతున్నారు.మనస్వామి చేసిన విభాగం "దేవ,మనుష్య,తిర్యక్,స్థావరల"నే నాలుగు విభాగాలు మాత్రమే.
దేవ అంటే దేవతలు, మనుష్య అంటే మనుష్యులు, తిర్యక్ అంటే అడ్డంగా నిలువుగా తిరిగే పశువులు పక్షులు, స్తావరాలు అంటే, వృక్షాలు, కొండలు ,కోనలు మొదలగునవి మాత్రమే. మొత్తం మనస్వామి సృష్టి యావత్తూ ఈ విభాగములోకే వస్తుంది.
--- శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి
No comments:
Post a comment