గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 25 December 2014

విద్య, ఉద్యోగం, పెళ్లి, సంతానం, ఇల్లు సమస్య ఏదైనా దానికి సత్వరం చక్కని పరిష్కారం దొరకాలంటేవిద్య, ఉద్యోగం, పెళ్లి, సంతానం, ఇల్లు సమస్య ఏదైనా దానికి సత్వరం చక్కని పరిష్కారం దొరకాలంటే మీరు నవగ్రహాలను శరణు వేడ వలసినదే. దానికి చక్కని మార్గం నవగ్రహ జపం. ఇది సాధారణంగా స్వయంగా చేసుకోవాలి. కానీ దానికి గట్టినమ్మకం, సంకల్పం కావాలి. సంఖ్య ఎక్కువ ఉంటుంది కనుక చాలా మంది పూర్తి చేయలేరు. అటువంటి వారు బ్రాహ్మణులను పెట్టుకుని జపం చేయించుకోవాలి. బ్రహ్మణులను పెట్టుకుని జపం చేయించుకుంటే వారు వేద ప్రోక్తమైన మంత్రాలను జపం చేస్తారు. స్వయంగా చేసుకునే జపమే ఉత్తమం. స్వయంగా చేసే వారు " నవగ్రహ శ్లోకాలను" జపం చేయాలి.


ఈ నవగ్రహ శ్లోకాలు మీ కష్టాలను/ ఈతిబాధలను తొలగించి, కోరిన కోరికలను తీర్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి. దారిద్ర్య దుఃఖ బాధలు, శారీరక మానసిక రోగ రుగ్మతలు తొలగుతాయి. సర్వ కార్య విజయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాది లాభాలు, మనోవాంఛలు తీరును. ప్రతీ గ్రహము ఒక్కో ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. అలాగే మీ జాతక చక్ర రీత్యా ఒక్కో ఫలితాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది.

నవగ్రహ శ్లోకాలు:
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

రవి: 6000 సార్లు
జపాకుసుమ సంకాశం, కాస్యపేయం మహాద్యుతిం,
తమోరిం సర్వ పాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం.

చంద్ర: 10,000 సార్లు
దధి శంఖ తుషారాభం, క్షీరో దార్ణవ సంభవం,
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం.

కుజ: 7,000 సార్లు
ధరణీ గర్భ సంభూతం, విద్యుత్ కాంతి సమప్రభం,
కుమారం శక్తి హస్తం, తం మంగళం ప్రణమామ్యహం.

బుధ: 17,000 సార్లు
ప్రియంగు కలికా శ్యామం, రూపేణా ప్రతిమం బుధం,
సౌమ్యం సత్వ గుణేపేతం, తం బుధం ప్రణమామ్యహం.

గురు: 16,000 సార్లు
దేవానాంచ ఋషీణాంచ, గురుం కాంచన సన్నిభం,
బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం.

శుక్ర: 20,000 సార్లు
హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం,
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం ప్రణమామ్యహం.

శని: 19,000 సార్లు
నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం,
ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం.

రాహు: 18,000 సార్లు
అర్థకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్ధనం,
సింహికా గర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహం.

కేతు: 7,000 సార్లు
ఫలాశ పుష్ప సంకాశం, తారకా గ్రహ మస్తకం,
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం, తం కేతుం ప్రణమామ్యహం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML