గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 10 December 2014

ఇక్కడ అక్కడ అని లేకుండా ప్రపంచమంతా బ్రహ్మముతో నిండిపోయి ఉన్నది అని వేదము మనకి చెపుతోంది

ఇక్కడ అక్కడ అని లేకుండా ప్రపంచమంతా బ్రహ్మముతో నిండిపోయి ఉన్నది అని వేదము మనకి చెపుతోంది. ఫలానాచోటనే బ్రహ్మము ఉంటాడని పరుగెత్తడం మొట్టమొదటి భక్తి స్థాయి. కాని అలా పరుగెత్తుతుంటే మీకు ఎప్పటికి బ్రహ్మదర్శనం అవుతుంది? నిజంగా బ్రహ్మదర్శనము చెయ్యాలని అనుకున్నవాడు, నీవు నిశ్శబ్దంగా కూర్చుండిపోయి ఏ అరమరిక లేకుండా ఎవరితో సంబంధం పెట్టుకోకుండా భగవత్ ప్రార్థన చెయ్యడం మొదలు పెట్టాలి. " అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ" బయట వెతికితే దొరుకుతుందా? ఎవరు లోపలికి వెడుతున్నారో, అందరిలా బయట ప్రపంచముతో తాదాత్మ్యము చెందడంలేదో అటువంటి మహాపురుషుని స్థితిని హనుమ ఈ రోజు పొంది ఉన్నాడు. అటువంటి స్వామి దర్శనము చేసినంత మాత్రంచేత, అటువంటి సాధకుడిగురించిన మాట విన్నంత మాత్రం చేత మన పాపములుకూడా ఎగిరిపోతాయి. అందుకనే " వ" బీజాక్షరమును అక్కడ ప్రయోగం చేశారు. అందుకే సుందరకాండ వింటే పాప దహనమైపోతుంది.
ఈ వేళ హనుమ సీతామాత దర్శనం చెయ్యాలి అని సంకల్పించాడు. అందుకని తాను వెడతానన్నాడు. మిగిలినవాళ్ళు అనలేదు. కాబట్టి వాళ్ళు వెనుక ఉండిపోయారు. హనుమ ముందుకు కొనసాగగలిగాడు. తన సంకల్పంవలన ఆయన చరితార్ధుడయ్యాడు.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML