
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Thursday, 11 December 2014
వైరాగ్య భావన
వైరాగ్య భావన
తినడానికి ఎంత ఉన్నా కడుపునిండేవరకే తినగలమని, లోకంలో సంపదలు ఎన్ని ఉన్నా మన అనుభవానికి తగినంత ఉంటే చాలును అనే వాస్తవాన్ని గుర్తిస్తే ఇతరుల పట్ల అసూయ కలుగదు. అన్నీ తనకు దక్కలేదు అనే అసంతృప్తి తొలుగుతుంది. తన దగ్గరున్న వనరులను చూసి సంతృప్తి పొందే గుణం అలవడుతుంది. నివృత్త రాగస్య గృహం తపోవనం అన్నట్లు విరాగులకు గృహమే తపోవనంగా భాసిస్తుంది.
మనిషి బతికినంతకాలం సుఖంగా బతికే అవకాశం లేకుండా మనోవ్యాధులు, అనేక రోగాలు పట్టిపీడిస్తూ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంటాయి.సంపదలు ఎక్కువ అవుతున్న కొద్దీ అనూహ్యంగా అడ్డు అదుపులేని ఆపదలు కుప్పలు తెప్పలుగా వచ్చి మీద పడుతుంటాయి. పుట్టిన ప్రతిప్రాణిని మాయదారి మృత్యువు తన పొట్టన పెట్టుకుంటూనే ఉన్నది. దైవాధీనమైన ఈ జగత్తులో ఏ ఒక్కటి కూడా సుస్థిరమని పేర్కొనుటకు అవకాశమే లేదు.
కాబట్టి మనిషి తన జీవితంలో ఆడంబరాలకు, అట్టహాసాలకు తావివ్వకుండా మితిమీరిన కోరికలకు అడ్డుకట్ట వేస్తూ వైరాగ్య భావ సంపున్నుడై జీవితాన్ని కొనసాగించినప్పుడే సుఖశాంతులు చేరువవుతాయి అనే భావాన్ని భర్తృహరి మహాకవి ఓ శ్లోకం ద్వారా వెల్లడించాడు.
ఆదివ్యాధి శతైర్జనస్య వివిధైరారోగ్యమున్మూల్యతే
లక్ష్మీర్యత్ర పతంతి తత్ర వివృతద్వారా ఇవ వ్యాపదః
జాతం జాతమవశ్యమాశు వివశం మృత్యుః కరోత్యాత్మసాత్
తత్కిం నామ నిరంకుశేన విధినా యన్నిర్మితం సుస్థిరమ్॥
భర్తృహరి ప్రబోధాన్ని, మహనీయుల మహితోక్తులను, గురూపదేశాలను శిరసావహిస్తూ భౌతిక సుఖాలకన్న ఆముష్మికమైన శాశ్వతానందాన్ని పొందాలనే తపనను అలవరచుకుందాం. క్షణికసుఖాల పట్ల భోగైశ్వర్యాల పట్ల ఉదాసీన వైఖరిని వైరాగ్యాన్ని కలిగి ఉందాం. వైరాగ్యభావ సంపన్నులమయ్యేందుకు ప్రయత్నిద్దాం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment