జ్యోతిషం అనగా ఏమిటి ?
జ్యోతిషం అనగా కాంతిని ఆధారంగా చేసుకొని కాలాన్ని అధ్యయనం చేసే సిద్ధాంత శాస్త్రం. దీంట్లో చాలా విధాల అధ్యయనాలున్నాయి .
హోరా (గ్రహస్థితుల ప్రాధాన్యం కలవి), సాముద్రిక (చేయి మొదలైనవాటి రేఖలు ఈందులో ముఖ్యమైనవి), ఆరూఢ ( గవ్వలతో ప్రశ్నకు సమాధానం తీయటం), ప్రశ్న (ఇందులో శకునాలు మొదలైనవి ప్రధానం) మొదలైనవి.
గోచారం అంటే ప్రస్తుత గ్రహస్తితిని బట్టి వ్యక్తి యొక్క రాశిఫలం. జాతకచక్రంలో వ్యక్తి పుట్టిన ప్రథమ భాగాన్ని లగ్నంగా తీసుకుంటారు. చంద్రుడున్న నక్షత్రాన్ని ఆ వ్యక్తి జన్మ నక్షత్రంగానూ మరియు ఆ చంద్రుడున్న రాశిని ఆ వ్యక్తి రాశిగానూ చెపుతారు.
No comments:
Post a comment