గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 25 December 2014

మరణ అనుభూతి ఎలా వుంటుంది?మరణ అనుభూతి ఎలా వుంటుంది?

నేను ఈ విషయాన్ని కొన్ని అనుష్టానాల ద్వారా తెలుసుకున్నాను. మనం మరణించగానే మన ప్రకృతి మనల్ని కోమాలొకి తీసుకువెడుతుంది. మనం చేసిన పాపపుణ్యాల నిష్పత్తి బట్టి ఆయా లోకాలలో జన్మిస్తాము. జన్మకి , కోమాకి మద్యలో ఒక సంఘటన జరుగుతుంది. అది ఏమిటంటే కోమా నుండి బయట్ట్ట పడిన ఆత్మకి ఇంకా తను బ్రతికే ఉన్నాను అని అనుకుంటుంది.చుట్టూ ఉన్న వారి రోదన చూచి తను చనిపోయాను అని భావిస్తుంది.అందరిని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుంది.కాని మధ్యమ ఆధారం లేక అది సాధ్యపడదు.తన దేహం మీద మమకారం పోతుంది.నలబై తొమ్మిది రోజులు ఆత్మ అక్కడే ఉంటుంది.ఆత్మకి కొన్ని భయంకర అనుబుతులు కలుగుతాయి.కొన్ని శక్తులు మనల్ని వెంటాడి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. వాళ్ళు చాలా భయంకరంగా , విచిత్రాయుదాలతో వుంటారు. వాళ్ళు మనలోని కోరికలు మాత్రమే. భగవంతుని అనుగ్రహం వుంటే వాటి నుండి తప్పించుకోవచ్చు.మొదట్లో ఏమి అర్ధం కాదు.తరువాత అంతా అర్ధం అవుతుంది.మళ్ళి తన కుటుంబంలో జన్మించడానికి ప్రయత్నం చేస్తుంది.అందుకే మరణం తరవాత ఆ కుటుంబంలో జననం జరుగుతుంది. అవకాసం లేకపోతె పెంపుడు జంతువుల రూపంలో ఆ కుటుంబంలోకి చేరుతుంది.అది కుదరకపోతే వేరే దేహం కోసం వెదుకుతుంది.ప్రపంచాని నిగుడంగా చూస్తుంది.అంతా అర్ధం చేసుకుంటుంది.అదే సమయంలో సృష్టి,లయ కారకుడు దారి చూపిస్తాడు.ఆత్మా పాప పుణ్యాల బట్టి దేహాన్ని ఏర్పాటుచేస్తాడు.రాగ బందాలు,కోరికలు లేని ఆధ్యాత్మక బావన ఉన్న ఆత్మలు దేవుని చెంతకు చేరుతాయి. అదే ద్యానం చేసినవాళ్ళకి మరణం తరవాత వాళ్ళు కోమాలోకి వెళ్ళరు. మేలువగానే వుండి తమకు ఎక్కడ జన్మించాలి అనుకుంటే అక్కడ జన్మిస్తారు. కాని మరణం తరవాత, సమయాలలో తేడా వుంటుంది. అంటే మరణించిన తరవాత జన్మించేవరకు భూమి మీద కాలము ఒక నెల అనుకోండి అక్కడ ఒక రోజుతో సమానం. రుద్రాక్ష ధరించినా , విబూది ధరించినా మధ్యమపాపాలు నశించి పుణ్యలోకాలకు వెడతారు. అందుకే మరణించిన వారికి విభూది పూస్తారు. అందువలనే చాలామంది బాబాలు విభూదిని భక్తులకు అందించేవారు. అధికపాపాలు చేసేవారికి ప్రాణము అపానరంద్రము నుండి పోతుంది. మధ్యమ పాపాలు చేసేవారికి ముక్కు , చెవి నుండి పోతుంది. అల్పపాపాలు చేసేవారికి కంటి నుండి , నోటినుండిపోతుంది. భగవనామ స్పరనతో , దైవ చింతనతో , పరులకు మేలు చేసి , ద్యానంలో వుండే వారి ప్రాణము బ్రహ్మ రంద్రము నుండి పోతుంది. భగవంతుడు మనకు ఏది చేసినా అదే న్యాయం. ఆయన ఇచ్చిందే మనకు భిక్ష. అన్నభావనతో గడపాలి. అహం భావము , కోపము, ద్వేషము, అసూయ, ఈర్ష వుండరాదు.ఈ విషయాలను టూకీగా వివరించాను.ఇంకా చాలా వివరాలు ఉన్నాయి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML